John - యోహాను సువార్త 11 | View All

1. మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.

2. ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.

3. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.

4. యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.

5. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.

6. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.

7. అటుపిమ్మట ఆయనమనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా

8. ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.

9. అందుకు యేసు పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.

10. అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.

11. ఆయన యీ మాటలు చెప్పిన తరువాతమన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా

12. శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.

13. యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.

14. కావున యేసు లాజరు చనిపోయెను,

15. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.

16. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.

17. యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.

18. బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము

19. గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.

20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.

21. మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.

22. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.

23. యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా

24. మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.
దానియేలు 12:2

25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;

26. బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

27. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.

28. ఆమె ఈ మాట చెప్పి వెళ్లిబోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్య ముగా పిలిచెను.

29. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.

30. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను

31. గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.

32. అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడిప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను.

33. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా,

34. వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.

35. యేసు కన్నీళ్లు విడిచెను.

36. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.

37. వారిలో కొందరుఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.

38. యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.

39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.

40. అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;

41. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

42. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.

43. ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా

44. చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.

45. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని

46. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి.

47. కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.

48. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.

49. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు.

50. మన జనమంతయు నశింప కుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.

51. తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక

52. యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.
ఆదికాండము 49:10

53. కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.

54. కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగ ముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను.

55. మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లె టూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి.
2 దినవృత్తాంతములు 30:17

56. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

57. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
11:1-57 లాజరును మృతులలోనుండి లేపడం, యోహాను సువార్తలో యేసు చేసిన ఏడవ, చివరి మెస్సీయ సూచకక్రియ (2:11 నోట్సు చూడండి). యోహాను మాత్రమే నమోదు చేసిన ఈ అద్భుతం యేసు పునరుత్థానాన్ని సూచిస్తూ, ఆయనను “పునరుత్థానము... జీవము"గా బయల్పరచింది. పా.ని.లోను (1 రాజులు 17:17-24; - 2రాజులు 4:32-37; 13:21), సువార్తలలోను (యేసు యాయీరు కుమార్తెను బ్రదికించడం, మార్కు 5:22-24,38-42; నాయీను వద్ద విధవరాలి కుమారుని బ్రదికించడం, లూకా 7:11-15) మృతులు తిరిగి లేచిన సంఘటనలు అరుదు. యూదుల నాయకులు యేసును బంధించడానికి నిర్ణయించుకుని, దేవదూషణ నేరం కింద విచారణ చేయడానికి ప్రేరేపించిన చివరి సంఘటన లాజరును మృతులలోనుండి లేపడం (యోహాను 11:45-57). 11:1 లాజరును పరిచయం చేయడం, 5:5 లాగా ఉంది. లాజరు (“దేవుని సహాయం పొందేవాడు”) ఒక సాధారణమైన పేరు. బేల్లెహేము (7:42) వలెనే బేతనియ కూడా గ్రామ(గ్రీకు కోమె)మని పిలవబడింది. ఈ బేతనియ, 1:28లో, 10:40-42లో సూచించినది కాదు. లాజరు నివసించిన బేతనియ, ఒలీవల కొండకు తూర్పున, యెరూషలేముకు రెండు మైళ్ళలోపు దూరంలో ఉంది (11:18ను మత్తయి 21:17; 26:6తో పోల్చండి). మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమనడం, మరియ యేసును అభిషేకించడం అధ్యా, 12ను ముందుగా చెబుతున్నట్లుండడమే కాక, బహుశా లూకా సువార్త నుండి (లూకా 10:38-42) ఈ స్త్రీలు పాఠకులకు తెలుసు అని ఊహిస్తున్నట్లుంది. 

11:2-5 లాజరు అంటే యేసుకు ఎంత ఇష్టమో పాఠకులు అర్థం చేసుకునేటట్లు కథకుడు వివరిస్తున్నాడు. 

11:6 యేసు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను. ఇలా ఆలస్యం చేయడం ప్రశ్నార్థకంగా అనిపించినా, ఇది దేవుని మహిమను బయల్పరచడానికి ఉపయోగపడింది. (వ.4), దానివల్ల మరింత “కఠిన" పరిస్థితుల్లో యేసు అద్భుతం చేయడానికి ఉపకరించింది (వ.17)

11:7-8 అతడు బతికి వుండాలని యేసు కోరుకుంటాడని ఆయన శిష్యులు ఊహించారు. 

11:9-10 వెలుగు ఉన్నంతవరకు అధికశాతం ప్రజలు పనిచేసేవారు; ఒకసారి చీకటిపడితే, పని ముగించేయడమే.


11:11 నిద్రించుచున్నాడు. అంటే దాని తర్వాత ఉన్న సంభాషణను బట్టి “మరణించాడు” అని స్పష్టంగా అర్థమిస్తుంది. (వ. 12-14). “పితరులతో చేర్చబడ్డాడు” అనేది దానికి పా.ని. సమానార్థకం. అప్పుడప్పుడూ మరణం అనేది, మనం మేల్కొనే అవకాశం ఉన్న గాఢమైన నిద్రగా చూపించబడింది (దాని 12:2). 

11:12-15 లాజరు, అతని కుటుంబంతో యేసుకున్న అనుబంధాన్ని బట్టి, నేనక్కడ ఉండలేదని... సంతోషించు చున్నాను అనే వ్యాఖ్య, శిష్యుల విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో చూపుతుంది.

11:16 దిదుమ (కవలలు) అనే తోమా పేరును గురించి 1:38 నోట్సు చూడండి. 

11:17 లాజరు మరణం తర్వాత మార్త, మరియలను ఆదరించడం ద్వారా యేసు, ఏడ్చువారితో ఏడ్వడం అనే నాటి యూదు సాంప్రదాయంలోని ముఖ్య మైన ఒక బాధ్యతలలో ఒకటి నెరవేర్చాడు. సాధారణంగా మరణించిన వెంటనే సమాధి చేసేవారు. లాజరు మరణించి అప్పటికి నాలుగు దినములు అయింది. 

11:18 బేతనియ గురించి వ.1 నోట్సు చూడండి.

11:19 మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిన యూదులలో అనేకులు యెరూషలేము నుండి వచ్చి వుంటే, వారి కుటుంబానికి సామాజికంగా మంచి స్థాయి ఉన్నదని అది సూచిస్తుంది.

11:20 యింటిలో కూర్చుండివుండడం అనేది తమకు ప్రియమైన వారి మరణాన్ని బట్టి దుఃఖిస్తున్న వారి ఆచారపరమైన భంగిమ (యోబు 2:8,13;యెహె 8:14). 

11:21-22 నీవు దేవుని ఏమడిగినను అని మార్త అనడం, యేసు లాజరును మృతులలోనుండి లేపమని ఆమె యేసుకు సూచిస్తున్నట్లు తీసుకోవచ్చు. కానీ ఆమె పలికిన మిగిలిన మాటలు ఆ భావాన్ని సూచించడం లేదు. 

11:23-24 అంత్యకాల పునరుత్థాన విషయంలో మార్త నమ్మకం పరిసయ్యుల నమ్మకాలతో (అపొ.కా. 23:8), ప్రసిద్ది చెందిన యూదుల అభిప్రాయంతో, యేసు బోధనతో (యోహాను 5:21,25-29; 6:39-44,54) ఏకీభవిస్తుంది. 

11:25 పునరుత్థానమును జీవమును నేనే అనే మాటలను గురించి, 5:26; 6:35,48 నోట్సు చూడండి.

11:26 ఒకడు యేసునందు విశ్వాసముంచిన వెంటనే నిత్యజీవం ఆరంభమౌతుంది (3:36 నోట్సు చూడండి). 

11:27 లోకమునకు రావలసిన అని మార్త చెప్పడం, కీర్తన 118:26 (యోహాను 12:13తో పోల్చండి) నుండి నిర్వచించిన మెస్సీయకు చెందిన వ్యక్తీకరణకు అనుబంధంగా ఉంది.

11:28 యేసు పునరుత్థానానికి ముందు, శిష్యులు సామాన్యంగా ఆయనను బోధకుడు అని పిలిచేవారు (వ.8; 1:38,49; 3:2; 4:31; 6:25; 9:2; 20:16), 

11:29-32 మార్తకంటే మరియ తక్కువ మాట్లాడినా, యేసులో ఆమె విశ్వాసం ఏమాత్రం బలహీనంగా లేదు. 

11:33 మానవాళి శ్రమ, దుఃఖాన్ని బట్టి యేసు కలవరపడి ఆత్మలో మూలుగుచున్నాడు (12:27; 13:21). 

11:34-35 యేసు కన్నీళ్ళు విడిచెను లేక బైబిలేతర సాహిత్యంలో తరచుగా అనువదించబడినట్లు, బహుశా “కన్నీటి పర్యంతమయ్యాడు" అనవచ్చు.

11:36-37 ఈ పవిత్రమైన దృశ్యంలో, త్వరలోనే తీవ్ర దిగ్ర్భాంతికి గురి కాబోతున్న కొందరు సంశయ వాదులు కూడా వున్నారు. 

11:38-39 యూదులు తమవారి మృతదేహాలను పాతిపెట్టినపుడు సుగంధద్రవ్యాలు ఉపయోగించినా, మార్త అన్నట్లు, ఇవి మృతదేహం పాడవ్వకుండా ఆపలేకపోయేవి. 

11:40-42 యేసు ప్రార్ధన పా.ని.లోని ఏలీయా ప్రార్ధనను జ్ఞాపకం చేస్తుంది (1రాజులు 18:37). యోహాను 6:11తో పోల్చండి.

11:43 యేసు లాజరును మంత్రం ద్వారానో, మాయతోనో, లేక ఇంద్రజాలంతోనో లేపలేదు గాని తన మాటలోని శక్తి చేత లేపాడు.

11:44 లాజరు ఎలా స్పందించాడో లేక అతడు మరల బ్రదికిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటో యోహాను నమోదు చేయలేదు. కానీ అతడు వెంటనే (వ.45) యేసుకు విరోధంగా చేసిన కుట్ర మీద దృష్టి సారించాడు. 

11:45-46 ఆశ్చర్యం ఏమిటంటే, లాజరును మృతిలో నుండి లేపినప్పుడు అక్కడున్న వారందరూ యేసులో విశ్వాసముంచలేదు! (లూకా 16:30-31). 

11:47 మహాసభ గురించి, 3:1; 7:45-52 నోట్సు చూడండి.

11:48 మన స్థలము బహుశా దేవాలయాన్నే సూచిస్తుండవచ్చు. “ఈ పరిశుద్ధ స్థలము”, “ఈ స్థలము” అని దేవాలయాన్ని గురించి సూచించిన సందర్భాలలో, ఇలాంటి విషయాలే అపొ.కా. 6:13-14; 21:28లో మరలా పైకి వస్తాయి. మన జనమును ఆక్రమించుకొందురు అనే మాటలు, యూదులకున్న పాక్షిక స్వయం ప్రతిపత్తిని కూడా రోమీయులు తీసివేస్తారనే భయాన్ని సూచిస్తుండవచ్చు. చిత్రంగా, రోమీయులు క్రీ.శ. 70లో దేవాలయాన్ని కూలదోసి, యెరూషలేమును తుడిచిపెట్టినపుడు, యేసును చంపడం ద్వారా ఏ పని జరగకుండా ఆపుచేయడానికి మహాసభ ఆశించిందో, దాన్ని ఆపలేకపోయింది (2:13-22 నోట్సు చూడండి). 

11:49 ఆ సంవత్సరము అనే మాటలు ప్రధాన యాజకుని పదవి ఏటేటా మారిందని సూచిస్తుండనవసరం లేదు. ఇది యేసును విచారించి, సిలువవేసిన సంవత్సరంలో కయప ఆ పాత్రను పోషించాడని మాత్రమే సూచిస్తుంది. నిజానికి మొదటి శతాబ్దంలోని ఏ ప్రధాన యాజకునికన్నా ఎక్కువగా కయప 18 సంవత్సరాలు (క్రీ.శ. 18-36) ఆ పదవిలో ఉన్నాడు.

11:50-51 ప్రజల కోసము చనిపోవుట మక్కాబీయులను జ్ఞాపకం చేయడానికి సహాయం చేస్తుంది. యోహాను సువార్తలో ఉపయోగించిన ద్వంద్వార్థ విధానంలో కయప ప్రకటన, యేసు చేయబోయే ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తాన్ని ప్రవచనాత్మకంగా ఊహించింది. యూదుల ప్రధాన యాజకునిగా తనకు తెలిసిన దాన్ని చెప్పడంకంటే కయప ప్రవచించెను అని చెప్పడం సరైనది. 

11:52 చెదరిపోయిన దేవుని పిల్లలు అన్యజనులను సూచిస్తున్నారు (3:3-8 నోట్సు చూడండి)


11:53-54 ఇప్పటినుండి, “యేసును విచారించడం కోసం బంధించడం కాదు; (మార్కు 14:1-2 ఊహించినట్టు) ఆయన అప్పటికే అపరాధిగా ఎంచబడ్డాడు కాబట్టి ఆయనను విచారించాలి” (డి.ఎ. కార్సన్).

11:55 ఇది యోహాను పేర్కొన్న మూడవ, చివరి పస్కా పండుగ. 2:13 నోట్సు చూడండి. జనులు పస్కా పండుగ. ఆచరించడానికి తమకు ఎలాంటి ఆచారపరమైన అపవిత్రతైనా ఉంటే దాన్ని శుద్ధి చేసుకొనుటకై... యెరూషలేమునకు వచ్చిరి (సంఖ్యా 9:4-14; 19:11-12). 

11:56-57 యేసును బంధించిన సమయాన్ని గురించి, 24 నోట్సు చూడండి. 


Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |