Jeremiah - యిర్మియా 3 | View All

1. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతనియొద్దనుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమెయొద్దకు తిరిగిచేరునా? ఆలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా; అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నాయొద్దకు తిరిగిరమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

2. చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభిచారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు.

3. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి యున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యము గలదు, సిగ్గు పడనొల్ల కున్నావు.

4. అయినను ఇప్పుడు నీవునా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?

5. ఆయన నిత్యము కోపించునా? నిరంతరము కోపము చూపునా? అని నీవనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే యున్నావు.

6. మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెనుద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.

7. ఆమె యీ క్రియలన్నిటిని చేసినను, ఆమెను నాయొద్దకు తిరిగి రమ్మని నేను సెలవియ్యగా ఆమె తిరిగిరాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా దాని చూచెను.

8. ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభి చారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకు రాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చు చున్నది.

9. రాళ్లతోను మొద్దులతోను వ్యభిచారము చేసెను; ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను.

10. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకు రాలగు ఆమె సహోదరియైన యూదా పైవేషమునకే గాని తన పూర్ణహృదయముతో నాయొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

11. కాగా విశ్వాసఘాతకురాలగు యూదాకంటె ద్రోహినియగు ఇశ్రాయేలు తాను నిర్దోషినియని ఋజువుపరచుకొని యున్నది.

12. నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రక టింపుముద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.

13. నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.

14. భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.

15. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.

16. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులుయెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సు లోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయి నందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు.

17. ఆ కాలమునయెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనము లన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.

18. ఆ దినములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై, మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు.

19. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని, రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చెదననుకొని యుంటిని. నీవునా తండ్రీ అని నాకు మొఱ్ఱపెట్టి నన్ను మానవనుకొంటిని గదా?
1 పేతురు 1:17

20. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాస ఘాతకులైతిరి; ఇదే యెహోవా వాక్కు.

21. ఆలకించుడి, చెట్లులేని మెట్టలమీద ఒక స్వరము వినబడుచున్నది; ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచినదానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి.

22. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి;మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మాదేవుడవైనయెహోవావు, నీయొద్దకే మేము వచ్చు చున్నాము,

23. నిశ్చయముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును.

24. అయినను మా బాల్యమునుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొఱ్ఱెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మింగివేయుచున్నది.

25. సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యమునుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.బైబిల్ అధ్యయనం - Study Bible
3:1 ఆలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా అనే పదజాలం ద్వితీ 24:1-4 లోని విడాకులకు సంబంధించిన కట్టడను ప్రస్తావిస్తుంది. ఏ పురుషుడూ తన భార్య తనను వదిలి వెళ్లిపోయి మరొక పురుషుడిని పెళ్లి చేసుకొని అతనిని కూడా విడిచిపెట్టి తిరిగి వచ్చినట్లయితే ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. అదే విధంగా, యూదా తన నమ్మకద్రోహంతో కల్పిత దైవాలను చేరి దేశాన్ని అపవిత్రపరిచిన తర్వాత తిరిగి యెహోవా దగ్గరకు రాగలదా? (నాయొద్దకు తిరిగి రమ్మని... సెలవిచ్చుచున్నాడు). 

3:2 బాటసారులను దోచుకోడానికి అరబిదేశస్థుడు కాపు కాచినట్టుగా అపవిత్రమైన దుష్కార్యాలు చేయడానికి యూదాదేశం మాటువేసి కాపు కాస్తుంది, ఈ దుశ్చర్యలు దేశమును అపవిత్రపరచాయి.

3:3 ఆదాము హవ్వల పాపాన్ని బట్టి నేల శాపానికి గురైనట్టుగా (లేవీ 26:18-19; ద్వితీ 11:13-17; ఆమోసు 4:7-8), నైతిక క్రమంలోని పాపం పర్యావరణం మీద నాశనకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. యూదా పూజించిన బయలు అనే కల్పితదైవం వర్షము, మంచు, ఉరుములు, సంతానం, పాడిపంటలు మొదలైనవి ఇస్తుందని నమ్మేవారు. నిజమైన దేవుడు వీటన్నింటిని నిలుపు చేసి అబద్ద మతము వ్యర్ధమైనదని చూపించాడు. దేవునితో నిబంధనలో ఉన్న యూదాప్రజలు తమ పాపాల్ని బట్టి సిగ్గుపడడం లేదు. యిర్మీయా ఇతర ప్రవక్తలందరికంటె ఎక్కువగా ఈ “సిగ్గు” పదజాలాన్ని ఉపయోగించాడు (వ.24-25; 2:26,36; 6:15; 8:12; 9:19; 10:14). 

3:4-5 ప్రాచీన పశ్చిమాసియా సంస్కృతుల్లో భార్యలు తమ భర్తలను వారి అధికారాన్ని బట్టి నా తండ్రీ అనడం పరిపాటి. చెలికాడవు (హెబ్రీ. అలూఫ్) అనే అర్థాన్నిచ్చే పదం అసాధారణం. అది బహుశా “బోధకుడు” అనే అర్థాన్ని సూచిస్తుండవచ్చు. గుండు కాదు.

3:6-7 యిర్మీయా 2-20 అధ్యాయాలు రాజైన యోషీయా కాలానికి సంబంధించినవి. కాబట్టి ఇవి యిర్మీయా రాసిన తొలి రచనలు. ఇదే నిజమైతే క్రీ.పూ. 621 లో ధర్మశాస్త్ర గ్రంథం దొరకడం గురించి గానీ, తరువాత జరిగిన సంస్కరణల గురించి గానీ యిర్మీయా ప్రవక్త ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మతభ్రష్టమైన ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు సంతానదేవతను పూజించడానికి ఉన్నతమైన ప్రతి కొండమీదికిని ఎక్కింది. “ఇశ్రాయేలు మతభ్రష్టత, విశ్వాసఘాతుకం" గురించి వ.6,8,11,12,22; 2:19; 5:6; 8:5; 14:7 చూడండి. సహోదరీలైన ఇశ్రాయేలు, యూదా దేశాల నిర్లక్ష్యవైఖరి ఎలా ఉందంటే వారు పశ్చాత్తాపపడి యెహోవా వైపు తిరగనే తిరగలేదు (హెబ్రీ. షవ్).

3:8 పరిత్యాగపత్రిక ద్వితీ 24:1 లో సూచించబడింది. 

3:9 నిర్భయముగా వ్యభిచారము చేసి అనే మాటలకు వ్యభిచారాన్ని తేలికగా తీసుకోవడం” అని అక్షరార్థం. క్రీ.పూ. 722 లో రాజధాని పట్టణమైన షోమోను అష్బూరీయుల చేతిలో పతనమైనప్పుడు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు పదిగోత్రాల వారికి ఏం జరిగిందో చూసినప్పటికీ, యూదా తన పాపాల విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. 

3:10 యూదా యెహోవా వైపు తిరగాలనుకున్నప్పటికీ అది పైవేషమునకే గానీ తన పూర్ణహృదయముతో కాదు. 

3:11 యూదాకుండినట్లుగా, చూచి హెచ్చరిక పొందే అవకాశం ఇశ్రాయే లుకు ముందుగా లేదు. కాబట్టి యూదాతో పోల్చినప్పుడు ఇశ్రాయేలు నిర్దోషినిగా, (అంటే తక్కువ పాపం గలదిగా) కనబడుతుంది. 

3:12 నేను కృపగలవాడను అనే మాటలు దేవుని విశ్వాస్యతను, కరుణను, కృపను సూచిస్తున్నాయి. హెబ్రీ పదం భౌద్, లేక “కృప" గురించి 2:2 నోట్సు చూడండి. 

3:13 ప్రతి పచ్చని చెట్టు క్రింద అనే పదజాలం ద్వితీ 12:2 లో కూడా కనబడుతుంది (1 రాజులు 14:23 తో పోల్చండి, 2రాజులు 16:4; 17:10; 2దిన 28:4; యెషయా 57:5; యిర్మీయా 2:20; 3:6; యెహె. 6:13). 

3:14 దేవుడు మతభ్రష్టులైన తన పిల్లలు తనను అనుసరించడానికి ఎంత మొండిగా తృణీకరిస్తున్నాగానీ వారిని సీయోనుకు రప్పించెదను అని చెబుతూ, భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. 

3:15 ఇక్కడున్న కాపరులను అనే పదం రాజ్యపరిపాలన చేసేవారిని కాక మతసంబంధంగా వారిని నడిపించే నాయకులను లేదా కాపరులను సూచి స్తుంది (17:16 లో యిర్మీయా కూడా వారిలో ఒకడుగా పరిగణించబడ్డాడు). 

3:16 ఆ దినములలో అనే పదజాలం భావికాలంలోని మెస్సీయ యుగాన్ని సూచిస్తుంది (30:24 లోని “అంత్యదినములలో", 31:27,31,38 వచనాలు సూచించే “రాబోవు దినములు", 31:33 లోని “ఈ దినములైన తరువాత” కూడా చూడండి). ఇశ్రాయేలు, యూదా ప్రజలు ఈ మెస్సీయ యుగంలో
దేశములో అభివృద్ధి పొంది విస్తరించుతారు. ఇశ్రాయేలు దైవారాధనలో ప్రముఖమైనది, ప్రశస్తమైనది అయిన నిబంధన మందసాన్ని ఇక జాపకం చేసుకోరు. ఎందుకంటే అంతకంటె శ్రేష్ఠమైనది దాని స్థానం తీసుకోబోతున్నది. 

3:17 అప్పుడు యెహోవా సన్నిధిని సూచించే నిబంధన మందసం స్థానంలో యెరూషలేము యెహోవాయొక్క సింహాసనమని చెప్పబడుతుంది (లేవీ 16:2,13; కీర్తన 80:1). అప్పుడు జనములన్నియు... యెరూషలేమునకు గుంపులుగా కూడి రావడం జరుగుతుంది. ఇక వారు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనరు.

3:18 ఇది సీయోనుకు తిరిగి రావడం గురించి మరొక ప్రవచనం. అయితే ఇది చెర నుండి తిరిగి రావడాన్ని సూచిస్తున్నట్టుగా కనబడదు. దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన దేశానికి ఇశ్రాయేలు, యూదా ప్రజలు కలిసి రావడం జరుగుతుంది. 

3:19 రమ్యదేశమును అనే పదం వాగ్దానదేశాన్ని సూచిస్తుంది. (కీర్తన 106:24; జెకర్యా 7:14). నా తండ్రి అని నాకు మొట్ట పెట్టి నన్ను మానవనుకొంటినిగదా? అని దేవుడు దుఃఖంగా చెప్పడం హృదయవిదారకంగా ఉంది. ఇశ్రాయేలు యెహోవాను తన భర్తగా తృణీకరించిన తర్వాత, ఇప్పుడు యూదా ప్రజలు ఆయనను తమ తండ్రిగా తృణీకరిస్తున్నారు. 

3:20 విశ్వాసఘాతకులైతిరి అనే క్రియావాచకానికి (హెబ్రీ. - బగాద్) ద్రోహపూరితంగా ప్రవర్తించడమనే అర్థం కూడా ఉంది. 5:11 చూడండి. . 

3:21-22. జాతి యావత్తూ పశ్చాత్తాపపడుతుంది. ప్రజలు అట్టి యథార్థతతో తమ పాపాలను ఒప్పుకొన్నప్పుడు యెహోవా వారి విశ్వాసభ్రష్టత్వాన్ని, తిరుగుబాటుతనాన్ని క్షమిస్తాడు.

3:23 కొండల మీద అపవిత్రతతో కూడిన అన్యమతాచారాల్లోని మోసము, ఘోష రక్షణ నివ్వవు. దేవుడైన యెహోవా వలన రక్షణ కలుగును. 

3:24-25 బయలును తరచుగా పరిహాసపూర్వకమైన పేరుతో సూచించడం జరిగింది: లక్షాకరమైన దేవత (హెబ్రీ. బోషెతు, ఇష్బోషెతు, ఎషయలు అనే పేర్లలోలాగా, 2సమూ 2:8-10; 1దిన 8:33). 

4:1 ప్రజలు పశ్చాత్తాపంతో మొఱపెట్టినప్పుడు (3:21-25), యథార్థ హృద యంతో యెహోవా దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు ఆయన వారి భవిష్యత్తులో నిశ్చయంగా ఏం జరగనున్నదో తెలియజేస్తూ వారి మొబైలకు జవాబిస్తాడు. ఇప్పటివరకు వారు నిజంగా పశ్చాత్తాపపడలేదు. 


Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |