Corinthians I - 1 కొరింథీయులకు 16 | View All

1. పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.

2. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.

3. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.

4. నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు.

5. అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను.

6. అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును.

7. ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను

8. గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు.
లేవీయకాండము 23:15-21, ద్వితీయోపదేశకాండము 16:9-11

9. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.

10. తిమోతి వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు

11. గనుక ఎవడైన అతనిని తృణీకరింప వద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతో కూడ వచ్చునని యెదురు చూచుచున్నాను.

12. సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతి ఏమనగా, అతడీ సహోదరులతో కూడ మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును.

13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి;
కీర్తనల గ్రంథము 31:24

14. మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.

15. స్తెఫను ఇంటివారు అకయయొక్క ప్రథమఫలమై యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును.

16. కాబట్టి సహోదరులారా, అట్టివారికిని, పనిలో సహాయముచేయుచు ప్రయాసపడుచు ఉండు వారికందరికిని మీరు విధేయులై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

17. స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను.

18. మీరులేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మానించుడి.

19. ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.

20. సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.

21. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయు చున్నాను.

22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు

23. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.

24. క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండును గాక. ఆమేన్‌.బైబిల్ అధ్యయనం - Study Bible
16:1-4 యెరూషలేము సంఘానికి ఉపకార ద్రవ్యము (2కొరింథీ 8-9) పంపే పనిని ఏ విధంగా జరిగించాలి అనే విషయం గురించి వారు అంతకు ముందు రాసిన ఉత్తరానికి (7:1 నోట్సు చూడండి) పౌలు జవాబిస్తున్నాడు. కొరింథీయులు ఆ కానుక ఇవ్వడంలో తాము కూడా పాల్గొనడానికి అవకాశమిమ్మని కోరారు (2కొరింథీ 8:4). దీనికై ప్రతివాడు తాను ఇవ్వగలిగిన కొద్దీ... కొంత సొమ్ము క్రమంగా దాచిపెట్టాలి. తరువాత ఆ సొమ్మంతా కలిపి చేర్చి, నిర్ణయించబడిన వారికి అప్పగించి పంపాలి. పరిస్థితులు అనుకూలంగా ఉండి, అందరూ సూచిస్తే పౌలు తానే వ్యక్తిగతంగా వారితో కలిసి ఆ కానుకను తీసుకువెళ్తాడు. 

16:5-9 మాసిదోనియ గుండా కొరింథుకు (తన మూడవ మిషనరీ యాత్రలో) వచ్చి, శీతాకాలమంతయు గడపాలని ప్రణాళిక వేసుకున్నాడు. తరువాత అతడు అక్కడినుండి వెళ్ళినపుడు తన ప్రయాణానికి అవసరమైన వనరులు కొరింథీయులు సమకూరుస్తారని అతడు ఆశించాడు. ఈ మధ్యలో సుమారు మే నెల వరకు (యూదుల పెంతెకొస్తు పండుగ) ఎఫెసులో ఉండాలని ఉద్దేశించాడు. ఎందుకంటే ఎఫెసు పట్టణంలో సువార్తకు అనుకూల స్పందన వచ్చింది. 

16:10-11 తిమోతిని కోరింథి విశ్వాసులు ఏ విధంగా చేర్చుకోవాలో పౌలుసూచనలిచ్చాడు. ఇక్కడ వాడిన “వచ్చిన యెడల" (గ్రీకు. యీన్) అనే మాటను "ఎప్పుడు వచ్చినా" అని చదువుకోవాలి. తిమోతి కొరింథుకు వెళ్లాడని పౌలు నిశ్చయంగా ఉన్నాడు. అతనిని సమాధానముతో సాగనంపుడి అనేది “అతని ప్రయాణానికి అవసరమైనవన్నీ ఇచ్చి పంపండి" అని చెప్పడానికి వాడిన ఒక నుడికారం.

16:12 కొరింథీ సంఘం అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించాడని పౌలు ముందే గుర్తించిన అపాల్లో (3:5-6 నోట్సు చూడండి), వేరొకచోట తనకున్న సువార్త పనిని బట్టి యిప్పుడు వచ్చుటకు... మనస్సులేక ఉన్నాడు. 

16:13-14 లోకజ్ఞానానికి చెందిన ఆచారాలతో పోటీ పడకుండా ఉండేలా విశ్వాసులు మెలకువగా ఉండాలి, ఒక్క శరీరముగా విశ్వాసమందు నిలుకడగా ఉండాలి. ఇక్కడ “విశ్వాసం" క్రీస్తు మరణ పునరుత్థానాలతో కూడిన సువార్త సారాంశాన్ని సూచిస్తుంది. (15:1-5, 14). ప్రేమ మనం ప్రభువు అధికారానికి, ఒకరితో ఒకరికీ లోబడి వున్నామని నిర్ధారిస్తుంది. 

16:15-16 స్తెఫను ఇంటివారికి లోబడి ఉండమని పౌలు కొరింథీయులను ప్రోత్సహించాడు (1:16). ప్రథమఫలము అనే మాట అకయలో సువార్తను మొదటిగా స్వీకరించినవారిని గౌరవిస్తూ వాడిన పదం.

16:17-18 స్తెఫను, ఫార్మూనాతు, అకాయికు అనేవారు పౌలును కలిసి, కొరింథీయుల కొరతను తీర్చారు (“కొరింథీయులు లేని లోటును పూడ్చారు" అని అక్షరార్ధం). వారి ఉన్నత వ్యక్తిత్వం, పరిచర్య కోసం వారికి ఉన్న వరములు ఎత్తి చూపుతూ, కొరింథులో ఉన్న విశ్వాసులు వారిని సన్మానించాలని పౌలు సూచించాడు.

16:20 పౌలు పత్రికల సందర్భంలో (రోమా 16:16; 2 కొరింథీ 13:12; 1థెస్స 5:26), ఆది సంఘంలో, పవిత్రమైన ముద్దు విశ్వాసుల కుటుంబంలోని పరస్పర సహవాసానికి గుర్తుగా ఉంది. 

16:21 పౌలు ఈ పత్రికను తన స్వంత చేతిరాతతో ముగించాడు. ఇది . ఆ పత్రిక అధికారాన్ని, ప్రామాణికతను నిరూపిస్తుంది. (గలతీ 6:11; కొలస్సీ 4:18; 2థెస్స 3:16-17; ఫిలే 19). సాధారణంగా పౌలు తాను రాయాలనుకున్నదాన్ని ఒక లేఖికునికి బిగ్గరగా చెపితే, అతడు వాటిని ఒక చర్మకాగితం లేదా పపైరస్ మీద రాసేవాడు (రోమా 16:22). పౌలు 1కొరింథీ 16:21-24 కూడా తన స్వదస్తూరితో సంతకంతో రాసివుంటాడు.

16:22 పత్రికను ముగించే ముందు ప్రభువుకు అపనమ్మకస్తులుగా ఉన్నవారిపై తీర్పును ప్రకటించడం అసాధారణంగా ఉంది. అరమేయిక్ భాషలో "మారనాత" అంటే వేర్వేరుగా అనువదించారు. "మా ప్రభువా, రమ్ము!” అనే విధాయక భావం శ్రేష్టమైన అనువాదం. 

16:23-24 పౌలు స్వంత విధానమైన “కృపా శుభముల"తో పత్రిక ముగుస్తుంది. దాని వెంటనే పౌలు రాసిన వ్యక్తిగతమైన మాటలు (క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండును గాక. ఆమేన్) ఈ పత్రికకు ప్రత్యేకతను ఆపాదించాయి.


Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |