Psalms - కీర్తనల గ్రంథము 69 | View All

1. దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.

2. నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి.

3. నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను.

4. నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను.
యోహాను 15:25

5. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు.

6. ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగ నియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన అవమానము నొంద నియ్యకుము.

7. నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.

8. నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని.

9. నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.
యోహాను 2:17, రోమీయులకు 15:3, హెబ్రీయులకు 11:26

10. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను.

11. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని.

12. గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాట లాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.

13. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము.

14. నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము.

15. నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మింగనియ్యకుము గుంట నన్ను మింగనియ్యకుము.

16. యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.

17. నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.

18. నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము.

19. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెననినీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.

20. నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి.

21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.
మత్తయి 27:34-38, మార్కు 15:23-36, లూకా 23:36, యోహాను 19:28-29

22. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక.
రోమీయులకు 11:9-10

23. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము.
రోమీయులకు 11:9-10

24. వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక
ప్రకటన గ్రంథం 16:1

25. వారి పాళెము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక
అపో. కార్యములు 1:20

26. నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
మత్తయి 27:34, మార్కు 15:23, యోహాను 19:29

27. దోషముమీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము.

28. జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.
ఫిలిప్పీయులకు 4:3, ప్రకటన గ్రంథం 3:5, ప్రకటన గ్రంథం 13:8, ప్రకటన గ్రంథం 17:8, ప్రకటన గ్రంథం 20:12-15, ప్రకటన గ్రంథం 21:27

29. నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక.

30. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను

31. ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము

32. బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక.

33. యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు.

34. భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక.

35. దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.

36. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు కొనును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు.బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-69. తాను ఏ పాపమూ చేయలేదని ఎరిగి ఉండి కూడా అనవసరంగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న వరదలో మునిగిపోతున్న వ్యక్తిలా తన శ్రమల్లో తాను మునిగిపోయానని భయపడుతూ ఆ పరిస్థితినుండి తనను కాపాడే దేవుని ఎడతెగని ప్రేమను గుర్తించి ఆయనకు చేసిన విజ్ఞాపన.
శీర్షిక: షోషన్నీయులను రాగము గురించి కీర్తన 45 శీర్షిక నోట్సు చూడండి. 

69:1-36 నన్ను రక్షించుము. కీర్తన 22 తర్వాత కొత్త నిబంధనలో అతి తరచుగా ప్రస్తావించిన కీర్తనలలో ఇది ఒకటి. వ.4- యోహాను 15:25; వ. 9- యోహాను 2:17; రోమా 15:3; వ.22-24 రోమా 11:9-10; వ.25- అపొ.కా.1:20. ఈ కీర్తనను ఈ క్రింది విధంగా వివరించవచ్చు: (1) దేవునికి, ఆయన నీతి మార్గాలకు నమ్మకంగా జీవిస్తున్న కారణంగా అనేక విధాల శ్రమలనుభవిస్తూ నిరాశా నిస్పృహలలో మునిగిపోయిన ఒక వ్యక్తి వర్ణన దీనిలో చూస్తాం (వ.7-12). దేవుడు ఆజ్ఞాపించిన విధానంలో ఆయనను ఆరాధించాలని ఆ వ్యక్తి కోరుకుంటున్నాడు (వ.9-12). సంప్రదాయం ఈ కీర్తనను దావీదుకు ఆపాదిస్తున్నప్పటికీ దీనిని హిజ్కియా గానీ (2రాజులు 18-20; 2దిన 29-32తో పోల్చండి), యిర్మీయా.గానీ (యిర్మీయా 11:19; 12:1తో పోల్చండి), లేక ప్రవాసానంతరం దేవాలయాన్ని పునర్నిర్మించాలని కోరుకొనే పేరు తెలియని ఒక యూదుడు గానీ రాసి ఉండొచ్చు. (వ.9తో పోల్చండి). (2) ఈ కీర్తనలోని కొన్ని భాగాలు యేసు శ్రమలను ముందుగా తెలియజేస్తున్నాయి. అయితే వ.5 లోని ఒప్పుకోలు, వ.22-28 లోని శాపాలు క్రీస్తుకు అన్వయించలేము. 

69:1-2 లోతైన బావిలాంటి అగాధజలాల్లో మునిగిపోవడం, బురద ఊబిలో దిగబడిపోవడం అనే సాదృశ్యం ప్రాణానికి ముప్పు తెచ్చే అపాయాల్ని వర్ణిస్తుంది (40:2 నోట్సు చూడండి). వరదలు అనే పదం కూడా ప్రమాదాన్ని సూచిస్తుంది (18:4-5; 32:6-7).

69:3 మనోవేదన వలన, శ్రమపడడం వలన తరచూ శరీరం అలసట చెందుతుంది (6:2 నోట్సు చూడండి).

69:4 నీతిమంతులకంటె దుష్టులు అధికసంఖ్యలో ఉండడం వారు దేవుని సంకల్పాన్ని వ్యతిరేకించేలా చేస్తుంది. ఈ వచనం యోహాను 15:25 లో యేసుకు వర్తింపజేయబడింది.

69.5 నీకు మరుగైనవి కావు - ఈ వచనం పాపపుచొప్పుకోలును సూచిస్తున్నది. కీర్తనకారున్ని దేవునితో సహవాసానికి దూరం చేసేవి ఏవీ లేవు (17:1; 26:1; 66:18-20 చూడండి). 

69:6-7 సిగ్గు కలుగనియ్యకుము... నా వలన అవమానము నొంద నియ్యకుము - ఈ మాటలు కీర్తనకారుడు తన పాపాలవలన సిగ్గు, అవమానం పొందడాన్ని సూచించడం లేదు. ఎందుకంటే అవి దేవునికి “మరుగైనవి కావు” (వ.5). వ.7 లోని సిగ్గు అనే పదం కీర్తనకారుడు దేవుని కోసం నింద భరించడాన్ని సూచిస్తున్నది. ఇక్కడ విషయమేమిటంటే కీర్తనకారుని శ్రమల్ని యెహోవా తొలగించకపోయినట్లయితే ఇతరులు యెహోవాలో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.

69:8 అన్యుడనైతిని అనే మాట బయటి వ్యక్తిని సూచిస్తుంది. (54:2-3 నోట్సు చూడండి), శ్రమల్లో బాధల్లో ఉన్నవారికి స్నేహితులు కుటుంబసభ్యులు దూరం కావడం ఎప్పటినుంచో ఉన్న అనుభవమే (31:11-12 నోట్సు చూడండి).

69:9 నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి యున్నది. దేవుని మందిరం, ఆయన రాజ్యం గూర్చిన నైతిక ఆసక్తి కారణంగా కీర్తనకారుడు తిరస్కారాన్ని, అవమానాన్ని, పరాధీనతను భరిస్తున్నాడు (వ.6-9). అతడు పాపానికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని ప్రజలలో పునరుద్ధరణ, శుద్ధీకరణ, ఉజ్జీవం కోసం వాదించాడు. ఇలా చేసినందుకు ఆధ్యాత్మికంగా సుఖంగా ఉన్న వారినుండి శ్రమలనెదుర్కొన్నాడు. (వ.9-11). యెహోవాకు, కీర్తనకారునికి మధ్య ఉన్న లోతైన సహవాసాన్ని బట్టి యెహోవాను నిందించాలనుకున్నవారు కీర్తనకారునిపై నిందలు మోపారు. కీర్తనకారున్ని యెహోవాకు చెందిన వ్యక్తిగా చూశారు కాబట్టి యెహోవాను వ్యతిరేకించేవారు కీర్తనకారున్ని వ్యతిరేకించారు. ఇది దేవుని శత్రువులు, ఆయన ప్రజల శత్రువులు ఒకరేననే వాస్తవాన్ని తెలియజేస్తున్నది (139:21). కొత్త నిబంధనలో, ఈ వచనంలోని రెండు పంక్తులు యేసుకు వర్తిస్తాయి. నాటి ప్రజలు యేసును వ్యతిరేకించారు, ఆయన మీద నిందలు మోపారు (యోహాను 2:17; రోమా 15:3).

69:10-12 నిందాస్పదమాయెను... హాస్యాస్పదుడనైతిని (హెబ్రీ. మాషాల్) - 44:13-16 నోట్సు చూడండి. పాటలు పాడుదురు గురించి యోబు 30:9; విలాప 3:13-14 చూడండి. 

69:13 కీర్తనకారుడు దీనుడై యెహోవాను ప్రార్థించుచున్నాడు. ఇది వ.12 లో శత్రువులు. కీర్తనకారున్ని చూచి హేళనగా పాటలు పాడడానికి పూర్తిగా భిన్నంగా కనబడుతుంది.

69:14-15 ఈ వచనాల్లోని వర్ణన కోసం వ. 1-2 నోట్సు చూడండి. అగాధజలము... అగాధ సముద్రము అనేవి మృత్యువుకు సాదృశ్యాలు, వీటిలో పడినవారిని ఇవి “మ్రింగి" వేస్తాయనే వ్యక్తిత్వారోపణ ఇక్కడ కనబడుతుంది (28:1 నోట్సు చూడండి).

69:16 దేవుడు కృప... వాత్సల్యబాహుళ్యత గలవాడు కాబట్టి తన ప్రార్ధనకు జవాబిస్తాడని కీర్తనకారునికి తెలుసు. 

69:17-18 దేవుడు. విముఖుడుగా ఉండడం తిరస్కారాన్ని సూచిస్తున్నది (10:1-2; 13:1 నోట్సు చూడండి).

69:19-20 కీర్తనకారుడు తనను. ఓదార్చువారి కొరకు చూస్తున్నాడనే ప్రస్తావన యోబు పరిస్థితికి దగ్గరగా ఉంది, యోబుకు అతని స్నేహితుల నుండి సరైన ఓదార్పు అందలేదు (యోబు 16:2).

69:21 చేదు... చిరక దప్పి తీర్చలేవు. ఈ వచనంలో ఇవి అలంకారిక దృష్టాంతంగా కనబడుతున్నా, యేసు శ్రమపడుతున్నప్పుడు వీటినివ్వడం అక్షరాలా నిజమే (మత్తయి 27:34, 48; యోహాను 19:28-29).

69:22 ఇక్కడ చెప్పింది విందు భోజనము కాక బల్యర్పణకు సంబంధించిన భోజనం కావచ్చు. 
ఇదే నిజమైతే యెహోవా సన్నిధిలో భోజనం చేయడం “దోషం” అవుతుంది. (వ.27), దేవునికి అవమానం కలిగించినట్లవుతుంది. ఆయన ఉగ్రతకు కారణమవుతుంది. (వ.23-25). 

69:23-25 ఈ మనవులు శపథాల్లాగా కనబడుతున్నాయి. తన శత్రువుల మీద దేవుని తీర్పు రావాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు (109:1-31). శత్రువుల గుడారములలో ఎవడును ఉండక అవి ఖాళీ అయిపోవాలని కోరుకోవడం వారు పూర్తిగా నిర్మూలమైపోవాలనే కీర్తనకారుని విన్నపాన్ని తెలియజేస్తున్నది. 

69:26 యెహోవా కీర్తనకారున్ని బాగుచేసి, సంపూర్ణుని చేయడం చూసిన దుష్టులు అతన్నింకా ఎక్కువగా బాధించారు. అతని మనసు గాయపడేలా అవమానిస్తూ మాట్లాడారు.

69:27 దోషము అంటే శిక్షారమైన తప్పిదం (32:5). కీర్తనకారుని శత్రువులు దేవుని శిక్షకు తగినవారే..

69:28 జీవగ్రంథము వేరు, శ్రమననుభవిస్తున్నవారి పేర్లు, వారి ప్రార్ధనలు ఉన్న “కవిలె” వేరు (56:8 నోట్సు చూడండి), ప్రతి ఒక్కరి క్రియలున్న “పుస్తకపు చుట్ట" వేరు. జీవగ్రంథం బహుశా నీతిమంతుల పేర్లుండే గ్రంథం కావచ్చు. (నిర్గమ 32:32; దాని 12:1; ప్రకటన 3:5; 13:8; 17:8; 20:12,15; 21:27)... 

69:29-30 విన్నపం చేసేటప్పుడు మ్రొక్కుబడులు పరిపాటి. వీటిని కృతజ్ఞతాస్తుతులతో చెల్లించడం జరుగుతుంది (22:25-26; 50:14-15). 

69:31 దేవుడు బలులకంటె ఎక్కువగా విధేయతను చూచి సంతోషిస్తాడు (40:6-8; 50:7-13 నోట్సు చూడండి). కొమ్ములు ఉన్న ఎద్దు మంచి వయసులో ఉన్న జంతువు. డెక్కలు గలవి బలి ఇవ్వడానికి పనికి వచ్చే జంతువులు. 

69:32-33 బాధపడువారు... దరిద్రుల గురించి 34:6; 35:9-10 నోట్సు చూడండి.

69:34-35 ఈ వచనాల్లో సృష్టికి వ్యక్తిత్వారోపణ కనబడుతుంది. దేవుడు తన ప్రజల కోసం చేసిన కార్యాలకు భూమ్యాకాశాలు సాక్షులు (19:1; 50:4-6 నోట్సు చూడండి). సృష్టి దేవుని రక్షణకార్యాలు చూచి ఆయనను స్తుతించుచున్నది.


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |