Acts - అపొ. కార్యములు 16 | View All

1. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.

2. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.

3. అతడు తనతోకూడ బయలుదేరి రావలెనని పౌలుకోరి, అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆ ప్రదేశములోని యూదుల కందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతి చేయించెను.

4. వారు ఆ యా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి.

5. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.

6. ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని

7. యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.

8. అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.

9. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచినీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను.

10. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితివి

11. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితివిు.

12. మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి.

13. విశ్రాంతి దినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడు చుంటిమి.

14. అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.

15. ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె-నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.

16. మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగావచ్చెను.

17. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను.

18. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగినీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.

19. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొని పోయిరి.

20. అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి ఈ మనుష్యులు యూదులై యుండి
1 రాజులు 18:17

21. రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి.

22. అప్పుడు జనసమూహము వారిమీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి.

23. వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి.

24. అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.

25. అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.

26. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను.

27. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.

28. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను.

29. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి

30. వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను.

31. అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి

32. అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి.

33. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.

34. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.

35. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదలచేయుమని చెప్పుటకు బంటులను పంపిరి.

36. చెరసాల నాయకుడీ మాటలు పౌలునకు తెలిపిమిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపి యున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను.

37. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలోవేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొని పోవలెనని చెప్పెను.

38. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి,

39. వారిని బతిమాలుకొని వెలుపలికి తీసికొనిపోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి.

40. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్లిరి; అక్కడి సహోదరులను చూచి, ఆదరించి బయలుదేరి పోయిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
16:1-3 గలతీయలోనికి తిరిగి ప్రవేశించి, పౌలు, సీలలు మొదటి మిషనరీ యాత్ర జరిగిన మార్గంలో తిరిగి ప్రయాణించారు. లుస్త దగ్గర పౌలు ఒక యూదురాలికి, (కీయునికి జన్మించిన, యువకుడైన తిమోతి అను ఒక శిష్యుని తనతో చేరమని ఆహ్వానించాడు. “పరిసయ్యుల తెగలో విశ్వాసులైన” వారి వత్తిడికి లొంగినందువల్ల కాదు గాని (15:5) తిమోతి తల్లి యూదురాలైనందున, యూదుల ధర్మశాస్త్రానికి గౌరవాన్ని, గుర్తింపును ఇవ్వడానికి, పౌలు తిమోతికి సున్నతి చేయించాడు. ఒకవేళ తిమోతి సున్నతి లేకుండా ఉండిపోతే, అతడు మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే కాక తన యూదు జాతిని కూడా విస్మరించాడని అనేకమంది యూదులకు అనిపించి వుండేది. తన పరిచర్య కాలమంతటిలో పౌలు తిమోతిని శిష్యునిగా మలచడంలో ఏర్పడిన అనేక ఫలితాలలో 1, 2 తిమోతి పత్రికలు కూడా ఒక భాగం.

16:4 సువార్తీకరణతోపాటు, పౌలు, అతని పరిచర్యా సహకారులు, యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలు సున్నతిని గురించి, అన్యజనులలో నుండి విశ్వాసులైన వారిని గురించి తీసుకున్న నిర్ణయాలను (15:19 నోట్సు చూడండి) తెలియజేస్తూ సాగారు. యూదుల పారంపర్యాచారాలను హత్తుకోకుండానే అన్యజనులు యేసునందు విశ్వాసముంచవచ్చని పౌలు స్పష్టంగా చెప్పాలని కోరుకున్నాడు. 

16:5 అన్యజనులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలోని సంఘములు, విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించడానికి కారణం, అన్యజనులలో నుండి వచ్చిన విశ్వాసులపై ఎక్కువ భారం మోపకూడదని యెరూషలేము సభ నిర్ణయించుకోవడమే అనడంలో సందేహం ఏమీ లేదు (15:19,20 నోట్సు చూడండి). 

16:6-8 పౌలు, అతని సహచరులు గలతీయ ప్రాంతం గుండా (బహుశా ఈకొనియ, అంతియొకయలను దర్శిస్తూ) వెళ్ళారు. కానీ ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్దాత్మ వారినాటంకపరచాడు. ఉత్తరంగా బితూనియకు కూడా వెళ్ళనీయకుండా యేసు యొక్క ఆత్మ (అంటే పరిశుద్దాత్మ) వారిని ఆటంకపరచాడు. కాబట్టి వారు ముసియ దాటి, ఆసియాలోని తీర పట్టణమైన త్రోయకు వచ్చారు. పౌలు ప్రణాళికలను ఆత్మ ఎందుకు నిర్బంధించాడో లేక ఆయా చోట్లకు వెళ్ళవద్దని ఏ విధంగా తెలియజెప్పాడో లూకా పేర్కొనలేదు. ఇవి పాఠకునికి ప్రశ్నలుగా మిగిలిపోతాయి. కానీ వ.9నోట్సు చూడండి; అలాగే 15:32 నోట్సు కూడా చూడండి. 

16:9 తన పరిచర్య ఏ దిశగా వెళ్ళాల్సివుందో పేతురుతో చెప్పినట్లుగానే (అధ్యా. 10), దేవుడు తన చిత్రాన్ని పౌలుకు ఒక దర్శనము ద్వారా తెలిపాడు. మాసిదోనియ దేశస్థుడొకడు ఏజియన్ సముద్రం దాటి, ఐరోపాకు వచ్చి తమకు సహాయము చేయమని వేడుకొంటున్నట్లు పౌలు చూశాడు. కాబట్టి పౌలు మాసిదోనియలో “సువార్త ప్రకటించా”లి (వ. 10) కాబట్టి మిగతా ప్రదేశాలలో ప్రకటించకుండా దేవుడు అతనిని ఆటంకపరచాడు అని అనిపిస్తుంది. 

16:10 అపొ.కా. గ్రంథంలో "మేము" అనే భాగాలు ఆరంభమయ్యే మొదటిస్లా నం ఇదే. ఇది వ.17 వరకు సాగుతుంది. “మేము” లేక “మమ్మును” అనే వాక్య భాగాలు : వ.10-17; 20:5-15; 21:1-18; 27:1-37; 28:1-16. మేము అనే పదం లూకా కూడా ఈ సందర్భాల్లో పౌలుతో ప్రయాణం చేశాడని సూచిస్తుంది. వాటన్నిటినీ కలిపితే, ఈ వాక్యభాగాలు ఒకే భౌగోళిక ప్రాంతంలోని వృత్తాంతాలను తెలుపుతాయి. ఇది ఈ వృత్తాంతాలన్నిటికీ లూకా జ్ఞాపకాలు లేక అతడు రాసుకున్న విషయాలు మాత్రమే ఆధారం అని సూచిస్తుంది. 

16:11-12 ఫిలిప్పీ అనేది మాసిదోనియలోని ఒక ముఖ్య పట్టణమే కానీ రాజధాని కాదు (రాజధాని థెస్సలోనిక). అది తమ సేవాకాలాన్ని ముగించుకున్న మాజీ సైనికోద్యోగులు అధికంగా ఉన్న రోమీయుల ప్రవాసస్థానము. అందువల్ల ఫిలిప్పీలో రోమా చట్టం అమలులో ఉంది. 

16:13 ప్రార్థనా స్థలము అనేది పట్టణంలోని యూదులు సమావేశమయ్యే స్థలాన్ని సూచిస్తుంది. బహుశా ఫిలిప్పీలో సమాజమందిరం ఉండకపోవచ్చు. ఎందుకంటే పురుషుల గురించి కాకుండా కేవలం స్త్రీల ప్రస్తావన మాత్రమే ఉంది. సమాజమందిరం స్థాపించాలంటే కనీసం పదిమంది యూదులైన పురుషులు పాల్గొనాల్సి ఉంది. విశ్రాంతి దినమున పౌలు, అతని సహచరులు ఈ స్త్రీల బృందాన్ని కలిసి, తన మొదటి సువార్త ప్రకటనా యాత్రలోని పద్ధతిని అనుసరిస్తూ సువార్తీకరణ చేశారు.

16:14 లూదియ అనేది వ్యక్తి పేరు అయివుండవచ్చు లేక ఈ స్త్రీ లూదియ అనే పట్టణం నుండి వచ్చింది అని మాత్రమే సూచిస్తుండవచ్చు. ఆమె ఈ వాక్యభాగంలో పేరు చెప్పబడిన ఒకే ఒక్క స్త్రీ (వ. 11-14). పౌలు సందేశానికి ఆమె స్పందించిన విధానాన్ని లూకా ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి ఆమె ప్రాముఖ్యమైన స్త్రీ అయివుంటుంది. ఆమె అమ్మే ఊదారంగు పొడికి రోమా సామ్రాజ్యంలో ప్రాముఖ్యమైన ఉపయోగాలున్నాయి. లూదియ స్పందనలో లూకా దైవిక ముందడుగు, మనుష్యుని స్పందనలు రెండింటినీ కలిపాడు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను, పౌలు చెప్పినదానికి ఆమె స్పందించింది. 

16:15 అపొ.కా. గ్రంథంలో అనేకసార్లు యింటివారు బాప్తిస్మం పొందడం గురించి పేర్కొనబడింది. (వ.31-34; 18:8; తో 11:14 పోల్చండి). అలాంటి బాప్తిస్మాలలో ఎవరెవరు పాల్గొన్నారో ఎన్నడూ వివరంగా చెప్పలేదు. ఇంటి యజమానుడు మారుమనసు పొందితే, బహుశా ఇంటిలోని మిగిలినవారు ( పిల్లలు, సేవకులు, భార్య మొ||వారు) అదేవిధంగా స్పందించాలని ఒప్పింపబడేవారు. లూదియ స్పందన (16:14), బాప్తిస్మం పొందిన తరువాత ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే అన్న ప్రశ్నను బట్టి, బాప్తిస్మం పొందడానికి ముందే ఆమె తన విశ్వాసాన్ని వెల్లడి చేసిందని ఊహించవచ్చు. సువార్త విషయంలో తమంతట తాముగా అనుకూల నిర్ణయాన్ని తీసుకోగలిగినంత పెద్దవారు మాత్రమే బాప్తిస్మం తీసుకునేవారని ఇది సూచిస్తుంది. 

16:16 ఒక చిన్నది, దయ్యము పట్టినదై, సోదె చెప్పుట అంటే అపవిత్రాత్మ పట్టినది అని సూచిస్తుంది. ఆ కాలంలో ప్రజలు దేవోక్తులు, ప్రవచనాల పట్ల బహు ఆసక్తి కలిగి వుండేవారు. అందువల్ల ఆ చిన్నది తన యజమానులకు బహు లాభం సంపాదించేది. 

16:17-18 పౌలు, అతని సహచరులను గురించి ఆ చిన్నది కేకలువేసి సత్యమే చెప్పినప్పటికీ, పౌలు వ్యాకులపడ్డాడు. ఎందుకో లూకా చెప్పలేదు కానీ ఆ చిన్నది వెడ్డిగా, దృష్టి మళ్ళించేటట్లు చేస్తూ వుండడం పౌలుకు కోపం తెప్పించి వుండవచ్చు. ఆమె ప్రవర్తన ప్రజలను ఆకర్షించడానికి బదులు వారిని బెదరగొట్టింది. 

16:19 ఆమె సోదె చెప్పడం బట్టి వచ్చే ఆదాయం పోయినందుకు పౌలు, సీలలు బంధించబడ్డారు గాని మత విరోధమైనదాన్ని బట్టి కాదు. 

16:20-21 రోమీయులు అంగీకరించుటకు కూడని ఆచారములు ప్రచురించుచు ప్రజలలో గలిబిలి రేపుతున్నారని పౌలు, సీలలపై అభియోగం
మోపారు. భిన్న మతాలను అనుసరించడం రోమా సామ్రాజ్యంలో చట్టవిరుద్ధం కాదు, కానీ పౌరుల శాంతికి భంగం కలిగించేది ఏదైనా (మతపరమైనది గాని లేక వేరేదైనా) సరే శిక్షారం . 

16:22-24 జనసమూహము దొమ్మిగా రావడం వలన న్యాయాధిపతులు కటువుగా ప్రవర్తించారు. పౌలు, సీలల మీద అభియోగాలు విచారణ చేయకముందే, వారి వస్త్రములు లాగివేసి... కొట్టించి, చెరసాలలో వేయించారు. 

16:25 కృంగిపోకుండా లేక తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా, దేవుడు తమకోసం దాచి వుంచినదానికై పౌలును, సీలయు ధైర్యంగా నిలబడ్డారు. ఇది మిగిలిన ఖయిదీలకు ఒక బలమైన సాక్ష్యం. 

16:26 లూకా చెప్పలేదు కానీ మహా భూకంపము పౌలు, సీలల ప్రార్థనలు, స్తుతులకు జవాబుగా దేవుడు చేసిన కార్యం. చెరసాల నాయకుడు దీన్ని అర్థం చేసుకున్నాడు (వ.29). 

16:27 ఖైదీలు తప్పించుకుని పారిపోతే, వారి శిక్షాకాలం రోమా కావలివారు లేక చెరసాల నాయకులు పూర్తిచేయాలి. ఖయిదీలు పారిపోయిరనుకొని ఫిలిప్పీ చెరసాల నాయకుడు జైలు జీవితం లేక మరణ శిక్షకన్నా త్వరగా చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. 

16:28 చెరసాల నాయకుడు ఏమి చేయబోయాడో పౌలుకు ఎలా తెలిసిందో మనకు చెప్పబడలేదు. అక్కడ తగినంత వెలుతురు ఉండి వుండవచ్చు, లేక పౌలుకు ప్రవచనాత్మకంగా తెలిసి వుండవచ్చు లేక ఏం జరుగబోతోందో ఊహించగలిగేటంత వినబడి ఉండవచ్చు.

16:29-30 భూకంపం అసాధారణమైనదని గుర్తించిన చెరసాల నాయకుడు పౌలుకును సీలలకును వణకుచు... సాగిలపడ్డాడు. ఇది అతన్ని అపొ.కా. గ్రంథంలో అతి ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేసింది: అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? భూకంపంలో మరణించకుండా తప్పించబడ్డాడు, ఖైదీలు పారిపోలేదని కనుగొనడం ద్వారా ఆత్మహత్య చేసుకోకుండా తప్పించబడ్డాడు, ఇప్పుడు రాబోతున్న దేవుని తీర్పు నుండి తప్పించుకోవాలని కోరుతున్నాడు.

16:31 అతడు నేరుగా అడిగిన ప్రశ్నకు పౌలు సీలల దగ్గర సూటియైన సమాధానం ఉంది: ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. యింటివారందరూ బాప్తిస్మం పొందడం గురించి, వ.15 నోట్సు చూడండి. 

16:32 చెరసాల నాయకుడు అడిగినదానికి పౌలు మొదటి జవాబు క్లుప్తంగా, సూటిగా ఉంది. తరువాత పౌలు సీలలు దేవుని వాక్యము బోధించిరి అనేది చెరసాల నాయకుని రక్షణ విశ్వాసంలోనికి తెచ్చేదిగా వారు ముందిచ్చిన జవాబుకు వెంబడింపుగా కొత్త విశ్వాసికి దేవుని పట్ల, క్రైస్తవ జీవితం పట్ల అవగాహనను పెంపొందించే విషయాలను మరింత వివరంగా చెప్పి వుంటారని సూచిస్తుంది.

16:33 చెరసాల నాయకుడు, అతని ఇంటివారందరును ప్రభువునందు విశ్వసించి, వెంటనే బాప్తిస్మం పొందారు. ఇంటివారందరూ బాప్తిస్మం పొందడం గురించి, వ. 15 నోట్సు చూడండి.

16:34 చెరసాల నాయకుని ఆనందం స్పష్టంగా చూడవచ్చు. ప్రాణాంతకమైన ప్రమాదం కాస్తా క్రీస్తులో అతని నూతన జీవితారంభపు ఆనందంగా మారిపోయింది. అతడు, అతని ఇంటివారు ఫిలిప్పీలో అభివృద్ధి చెందుతున్న సంఘంలో భాగమయ్యారు. ఈ సంఘం పౌలుకు ప్రియమైనది. తరువాత వారికి ఉత్తరం రాస్తూ, వారిని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతిసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని పౌలు అన్నపుడు, ఈ చెరసాల నాయకుడు, అతని ఇంటివారు పౌలుకు జ్ఞాపకం వచ్చివుంటారు (ఫిలిప్పీ 1:3). 

16:35-36 ఉదయం కాగానే న్యాయాధిపతులు పౌలు, సీలలను విడుదల చేయమని ఆజ్ఞాపించారు. దీనికి కారణం బహుశా తాము వారిని బంధించే విషయంలో అనవసరంగా తొందరపడ్డామని వారు గ్రహించి వుండవచ్చు. లేక వారు కూడా భూకంపాన్ని అనుభవించి, జైలులో జరిగిన సంఘటనలను గురించి వినడంవల్ల కూడా అయివుండవచ్చు. అందువల్ల వారు దేవుని తీర్పుకు భయపడి వుండవచ్చు. 

16:37 రోమా పౌరులకు శిక్షలు విధించే న్యాయవిధులను గురించి పౌలుకు తెలుసు. తనను అన్యాయంగా కొట్టి, న్యాయము విచారింపకపోవడంవల్ల ఇప్పుడు ఏమీ జరగలేదన్నట్లుగా విడుదల పొందడానికి పౌలు నిరాకరించాడు. అపొ.కా. లో పౌలు రోమా పౌరసత్వం గురించి ఇక్కడ మొదటిసారి ప్రస్తావించబడింది. (22:25-29; 23:27; 25:11 చూడండి). రోమా పౌరులకు కొన్ని శిక్షల నుండి మినహాయింపు ఉంది (ఉదా: సిలువ మరణం), శిక్ష పొందడానికి ముందు ఒక ప్రక్రియ కోరడానికి అర్హత ఉంది. పౌలు తన పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకుని వుంటాడు అనే ప్రశ్న వస్తుంది.
అతని పౌరసత్వం తార్సులో నమోదు అయివుంటుంది. కానీ రోమా పౌరులు తరచు చిన్న చెక్క పలకలు (వాటిలో కొన్ని దొరికాయి), ప్రస్తుత కాలంలోని పాస్పోర్టులాగా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి వీలుగా తమవెంట తీసుకువెళ్ళేవారు. పౌలు అలాంటి ఆధారాన్ని తీసుకెళ్ళి ఉంటాడు. 

16:38 న్యాయాధిపతుల భయాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఫిలిప్పీ రోమా చట్టాన్ని అనుసరించే ప్రవాసస్థలం. రోమా పౌరునికి ఉన్న హక్కులను గురించి పట్టణంలో బహుశా అనేకమందికి తెలిసి వుండవచ్చు. 

16:39-40 అలా చేయడానికి బద్దులు కాకపోయినా, తమకు జరిగిన అన్యాయానికి క్షమాపణను స్వీకరించడానికి పౌలు, సీలలు ఎంచుకున్నారు. చాలాసార్లు క్రైస్తవులుగా పూర్తి న్యాయాన్ని డిమాండు చేయకుండా విడిచిపెట్టడమే శ్రేష్ఠం. 


Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |