Proverbs - సామెతలు 5 | View All

1. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము

2. అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.

3. జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి

4. దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది,

5. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును

6. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును.

7. కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.

8. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.

9. వెళ్లినయెడల పరులకు నీ ¸యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు

10. నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును.

11. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు

12. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?

13. నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు

14. నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు.

15. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.

16. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?

17. అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.

18. నీ ఊట దీవెన నొందును. నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.

19. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.

20. నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?

21. నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.

22. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

23. శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.బైబిల్ అధ్యయనం - Study Bible
5:1 "4:1-2 నోట్సు చూడండి... 

5:2 బుద్ధికలిగి నడచుకోవడంలో, దానిని గురించి మాట్లాడుతూ ఇతరులకు అందించడం అనేది ఒక ముఖ్యమైన బాధ్యత (మలాకీ 2:7). 

5:3-6 జార స్త్రీ నోటి నుండి వచ్చే మృదువైన మాటలు ఆకర్షణీయంగా ఉండవచ్చు (2:16-17 నోట్సు చూడండి), కానీ ఆమె ప్రాణాంతకమైన విషంతో సమానం. దాని వలన కలుగు ఫలము అంటే దాని పర్యవసానం గురించి వ.11 నోట్సు చూడండి. ముసిడిపండు చేదు కాయలు కాచే ఒక ముండ్ల పొద (విలాప 3:15,19). రెండంచులు గల అంటే హెబ్రీ మూలంలో రెండు నోళ్లు గల అని అక్షరార్ధం. ఇది జార స్త్రీ ఎలా నాశనం చేస్తుందో (రెండు నోళ్లతో మ్రింగివేసినట్టుగా) తెలిపే వర్ణన (యెషయా 1:20). జార స్త్రీ జీవమార్గము మీద (4:25) తన దృష్టిని ఏ మాత్రం నిలపదు. కాబట్టి ఆమెకూ, ఆమె ఆకర్షణలో పడినవారికీ చివరకు నిత్యమరణము సంభవిస్తుంది (1:12,13 నోట్సు చూడండి).జార స్త్రీ ఇటు అటు తిరుగుచూ అస్థిరంగా నడుస్తుందని (ఆది 4:12; సంఖ్యా 32:13; 2 సమూ 15:20; కీర్తన 59:11; 109:10; విలాప 4:15), తిన్నగా నడవక అటూ ఇటూ తూలిపడుతుందని (కీర్తన 107:27; యెషయా 24:20; ఆమోసు 4:8), ఎటు పడుతుందో ఆమెకే తెలియదని (4:10-19 నోట్సు చూడండి) తెలిపే వర్ణన. 

5:7-8 ఛాయకు పోక అనే మాటలకు హెబ్రీలో “దరిదాపుల్లోకి వెళ్లకూడదు” (ఆమె నీడ పడే చోటుకు సైతం వెళ్లకూడదు) అని అక్షరార్థం, అంటే జార స్త్రీతో సహవాసం గానీ సాహచర్యం గానీ ఉండకూడదని ఇది సూచిస్తుంది.

5:9-10 బుద్ధిలేని కుమారుడు ఎవరూ అతడిని బలవంతం చేయకుండా దోచుకోకుండానే తనకు తానుగా తన యౌవనబలమును అంతటినీ ధారపోస్తున్నాడు (1:11), క్రూరులకు అనే మాట దయాదాక్షిణ్యాలు లేని మనుషుల్ని సూచిస్తుంది. (యిర్మీయా 6:23). ఆస్తివలన పరులు అనే మాటలు బుద్ధిలేని కుమారుడి ఆస్తిపాస్తుల్ని జార స్త్రీ, ఆమె కుటుంబీకులు అనుభవించడాన్ని తెలియజేస్తున్నాయి. (6:29-35). యౌవనబలం అనే పదాన్ని “ఘనత” (సంఖ్యా 27:20), "సౌందర్యం” (హోషేయ 14:6) అని కూడా అనువదించవచ్చు. అంటే జీవితంలో అత్యంత ముఖ్యమైన యౌవనప్రాయం దుర్వినియోగమవుతోందని ఈ భావన తెలియజేస్తున్నది. 

5:11 తుదకు అనే మాట ఒకని దుశ్చర్యల పర్యవసానంగా చివరికి కలిగే ఫలితాన్ని వర్ణిస్తున్నది (వ.4; 14:12; 19:20; 20:21; 23:32; 29:21). 

5:12-14 నేనెట్లు అనే ప్రశ్నార్థకం విచారాన్ని తెలియజేసే ఒక భావప్రకటన (ఆది 44:34). ఉపదేశమును త్రోసివేయడం, గద్దింపును నిరాకరించడం, మంచి మాటల్ని వినకపోవడం లేదా చెవియొగ్గడానికి తృణీకరించడం అనేవి బుద్దిహీనుని లక్షణాలు (1:7,22 నోట్సు చూడండి). తండ్రి హితోపదేశాల్ని లేదా హెచ్చరికల్ని 1:30-31; 3:11 చూడండి; 12:1; 15:10 తో పోల్చండి) ఖాతరు చేయకుండా బుద్ది లేని కుమారుడు దుష్టత్వంలో పడిపోడానికి కొంచెమే యెడమాయెను వీరు బడిలో పాఠాలు బోధించే ఉపదేశకులు కాదు, తల్లిదండ్రులు (1:8), లేక పితృసమానులైన అనుభవజ్ఞులు (1:6; 30:1;
31:1; ప్రసంగి 12:9). బుద్దిహీనుడి చివరి గతి అన్ని విధాలా నాశనమే (“కీడు" 1:16 నోట్సు చూడండి) అని అతడు తాను చేసిన తప్పులకు గాను న్యాయవిమర్శ కోసం సమాజ సంఘముల మధ్య నిలబడడం సూచిస్తుంది (26:26 చూడండి; యిర్మీయా 26:7-11 తో పోల్చండి). 

5:15-19 నీటిని సూచించే- కుండలోని నీళ్లు, బావిలో ఉబుకు జలము, ఊటలు, - నీటికాలువ మొదలైన వర్ణనాత్మక పదాలు ఒకని భార్యను వర్ణించే సాదృశ్యాలు. ఈ వర్ణన ఒకని లైంగిక వాంఛను తీర్చుకోవడాన్ని సూచిస్తున్నది. (9:17; పరమ 5:1). అప్పటి కాలంలో ప్రతి ఇంట్లో వర్షపు నీటిని నిల్వజేసుకోడానికి తొట్లు ఉండేవి. బావులు, ఊటలు, కాలువలు సేదదీర్చే మంచినీటిని అందించేవి. దీవెనకరమైన - ప్రతిదీ తృప్తినిస్తుంది కాబట్టి కుమారుడు భార్యతో ఎల్లప్పుడూ సంతోషిస్తూ జీవితం గడిపేలాగా దేవుడు దీవించాలని తండ్రి తన కుమారుడి కోసం ప్రార్థిస్తున్నాడు (3:33; 22:9). యౌవనకాలపు భార్య అంటే ఒకని మొదటి భార్య (2:17; యెషయా 54:6; మలాకీ 2:14-15), ఒక పురుషుడు వేరొక భార్యను లేదా పర స్త్రీని కోరుకోకూడదు. అతిప్రియమైన అనే మాటలు దాంపత్య ప్రేమను సూచిస్తాయి (7:18; హోషేయ 8:9), తృప్తినొందు (యిర్మీయా 31:25) అనే పదం “నీటిలో తడిచి” లేదా “నీళ్లు పారజేసి" అనే అర్థాన్ని సైతం ఇస్తుంది (యెషయా 16:9; 58:11 చూడండి; 7:18 తో పోల్చండి). ఈ సందర్భంలో బద్దుడవై యుండుము అనే వర్ణన భార్య ప్రేమలో మైమరచిపోవడాన్ని తెలియజేస్తుంది. ఇతర సందర్భాల్లో ఈ వర్ణన మత్తిల్లి ఉండడాన్నీ (20:1; పరమ 5:1) లేదా నీతి నుండి తొలగిపోవడాన్ని (19:27; వ.23తో పోల్చండి) సూచిస్తుంది.

5:20 నీవేల అనే ప్రశ్న సంజాయిషీ చెప్పడానికి వీల్లేని చర్యను సూచిస్తుంది. జార స్త్రీ యందు నీవేల బద్దుడవై యుందువు అంటే “దారి తప్పిపోవడం" (19:27; కీర్తన 119:118; యెహె 34:6), లేదా “తప్పు చేయడం, పాపం చేయడం” (లేవీ 4:13; యోబు 19:4) అని అక్షరార్థం . వ.19, 23 లో ఇది "త్రోవతప్పి" అనే అర్థాన్నిస్తుంది. జార వీ... పర స్త్రీ వివరణ కోసం 2:16-17 నోట్సు చూడండి. ఒకని ఒడిలో కూర్చుండబెట్టుకోవడం లేక చేతుల్లోకి తీసుకోడాన్ని కౌగలించుకొందువు అనే మాట తెలియజేస్తుంది (6:27; 2 సమూ 12:8; మీకా 7:5 తో పోల్చండి). 

5:21-22 వ.21 కు సమాంతరమైన వాక్యం యోబు 34:21 లో చూడండి. వ.22 సాధారణాంశాన్నే తెలియజేస్తుంది. 1:18; 28:10; యోబు 18:7; కీర్తన 7:16 చూడండి. 

5:23 దుష్టుడు (వ. 22) త్రోవతప్పి (వ. 19-20) నిత్యమరణంతో నశిస్తాడు, కారణం అతడు అతిమూర్ఖుడై తన దుష్టత్వాన్ని విడిచి పెట్టవలసి వస్తుందని జ్ఞానాన్నిచ్చే శిక్షను (హితోపదేశం) త్రోసిపుచ్చాడు (6:23; 15:10). హెబ్రీ. ఏవిల్ అనే పదానికి మూర్ఖత్వం అని అర్థం (1:7 నోట్సు చూడండి; 12:23; 13:16; 14:8 తో పోల్చండి).


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |