6:1 కొందరు కొరింథీ విశ్వాసులు తోటి విశ్వాసులపై సంఘంలో ఉన్న సమర్థులైన మధ్యవర్తులను సంప్రదించడానికి బదులు లోకసంబంధమైన న్యాయాధిపతుల సమక్షంలో వ్యాజ్యాలు వేస్తున్నారు. (వ. 5). అనీతిమంతుల యెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా? అనే మాటలు వారు చట్టపరమైన ఫిర్యాదును కొరింథులో ఉన్న అవిశ్వాసులైన - రోమా న్యాయాధిపతుల ముందుకు తెస్తున్నారు అనే భావమిస్తుంది.
6:2-3 ఒక న్యాయసంబంధమైన వ్యవస్థగా వ్యవహరించేందుకు సంఘానికి అధికారం ఉందనే అవగాహన కలిగి ఉండాలని పౌలు పిలుపునిస్తున్నాడు. వ్యాజ్యములను గూర్చి తీర్పు తీర్చడానికి తన వాదనను - అతడు రెండు విధాలుగా, ఒక గొప్ప విషయం నుండి తక్కువ విషయానికి అనే పోలికను
చెబుతున్నాడు: (1) యుగాంతాన లోకము (అంటే అవిశ్వాసులకు) నకు తీర్పు తీర్చడానికి వారు కలిగి ఉన్న యోగ్యత, ఈ యుగంలో సంఘ సభ్యులకు తీర్పు తీర్చడానికి వారిని యోగ్యులుగా చేస్తుంది. (2) యుగాంతాన దేవదూతలకు తీర్పు తీర్చే యోగ్యత, వారికి ఈ జీవన సంబంధమైన సంగతుల విషయంలో తీర్పు తీర్చడానికి యోగ్యులుగా చేస్తుంది.
6:4 వారి న్యాయసంబంధమైన పరిధిని గురించి పౌలు చెప్పాడు. తక్కువస్థాయిలో ఉన్న న్యాయాధిపతులు (అంటే, ఈ యుగపు. అవినీతి పరులైన న్యాయాధిపతులు) లోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతులతో కలిసి కూర్చోవడానికి యోగ్యులు - కారు. ఈ తక్కువస్థాయి న్యాయాధిపతులు నీతిమంతులుగా తీర్చబడలేదు, కడగబడలేదు, లేక పరిశుద్ధపరచ బడలేదు (వ.11).
6:5-6 తాము జ్ఞానులమని కొరింథీయులు చెప్పుకుంటున్నారు. కాబట్టి, అతడు వ. 5లో ఉన్న ప్రశ్నను ఉద్దేశపూర్వకంగా ఎగతాళిగా అడుగుతున్నాడు.
6:7-8 ఇతరులకు అన్యాయం చేసి ఒకని మీద ఒకడు వ్యాజ్యెమాడుట ఇప్పటికే.. లోపము, దానికంటే అన్యాయము సహించుట మేలు కదా. 3:3 లోని విశ్వాసులు “మనుష్యరీతిగా నడుచుకోవడం" అనే అంశాన్ని మరలా చూస్తున్నాము.
6:9-11 పెద్ద పాపాలను గురించి అవిశ్వాసులైన న్యాయాధిపతుల (అన్యాయస్థులు) తీర్పులు సంఘానికి న్యాయం చేస్తాయని విశ్వాసులు మోసపోకూడదు. వీరికి దేవుని రాజ్యములో స్వాస్థ్యం లేదు. కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడిన విశ్వాసులే పాపాలకు సరిగ్గా తీర్పు తీర్చగలరు (వ. 1). ఈ గద్దింపును కొరింథీ పాఠకులు తమ ప్రవర్తన "అన్యాయస్తుల"లా ఉందా లేక “కడుగబడి, “పరిశుద్ధపరచబడి" “నీతిమంతులుగా తీర్చబడిన" వారిలాగా ఉందా అని తమను తాము ప్రశ్నించుకోడానికి ఒక కారణంగా తీసుకోవాలి. మీలో కొందరు అట్టివారై యుంటిరి అంటూ వారిలో అనేకులు మారుమనసు పొందక ముందు అలాంటి పాపాలలో జీవించేవారు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే వారు రూపాంతరం చెందడం ద్వారా తాము ప్రకటించినదానికీ, తమ స్థాయికి తగినట్టుగా జీవిస్తారు.
6:12-20 ఆధ్యాత్మికంగా పరిణతి చెందని కొరింథీయులు కొందరు పుట్టించిన ఒక నినాదాన్ని అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు) పేర్కొంటూ ఒక విశ్వాసికున్న స్వేచ్ఛ దేవునికి ప్రయోజనకరంగా ఉన్నంతవరకు మాత్రమే పరిమితం చేయబడింది అనే ఒక ప్రధానమైన అంశాన్ని నొక్కి చెప్తూ వారికి కొన్ని వరుస హెచ్చరికలు చేశాడు.
6:12-14 ఆ నినాదానికి (వ.12) పౌలు - జవాబు ఏమిటంటే కొరింథీ క్రైస్తవులు తమ సొంత సొత్తుకారు. వారు ప్రభువుకు చెందిన “శరీరాలు" (వ. 13, 19-20; 1:2; 7:22-23; 10:26). ఒకని దేహము (గ్రీకు. సోమా) జారత్వం నిమిత్తం కాదు అంటున్నాడు పౌలు. నిజానికి అది ప్రభువు కోసం.
6:15-17 వారు క్రీస్తుతో ఐక్యం కావడం వలన వచ్చిన ఏకత్వం, పవిత్రతలను - జ్ఞాపకం చేసుకోమని పౌలు కొరింథీ విశ్వాసులకు పిలుపునిస్తున్నాడు. ఈ భాగంలోని ఏకశరీరము అనే మాటలు వేశ్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా ఆమెతో ఏక శరీరం కావడాన్ని సూచిస్తుంది. క్రైస్తవులు ప్రభువుతో కలిసికొనినవారు కాబట్టి వారు వేశ్యతో ఎన్నడూ కలవకూడదు అనేది వ.17 లోని భావన. “ఏకశరీరము" అనే మాట ఆది 24 అధ్యా.ని గుర్తు చేస్తూ సరైన వివాహ బంధానికి అక్రమ లైంగిక సంబంధానికి మధ్య వైరుధ్యాన్ని ఎత్తి చూపుతున్నది.
6:18-20 లైంగిక దుర్నీతి పాపాలన్నిటిలో ప్రత్యేకమైంది. ఎందుకంటే అది శరీరమునకు విరోధమైంది. అది ఒక విశ్వాసికి క్రీస్తుతో ఉన్న పవిత్రమైన ఏకత్వం పైనా (మీలో ఉన్న పరిశుద్దాత్మ చేత ముద్రించబడి), పరిశుద్ధ వివాహంలోని ఏకత్వంపైనా దాడిచేస్తుంది (7:2తో పోల్చండి). విశ్వాసి శరీరం ఒక పవిత్రమైన పాత్ర, అది దేవుని కుమారుడు విలువ పెట్టి కొన్నది. కాబట్టి ప్రభువును మహిమపరచని ఏ పనితోనూ విశ్వాసి శరీరం సంబంధం కలిగి ఉండకూడదు.