Acts - అపొ. కార్యములు 4 | View All

1. వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును

2. వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరు త్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి

3. వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.

4. వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదువేలు ఆయెను.

5. మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.

6. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి.

7. వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా

8. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా,

9. ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక

10. మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.

11. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.
కీర్తనల గ్రంథము 118:22-23, దానియేలు 2:34-35

12. మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.

14. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.

15. అప్పుడు సభ వెలుపలికి పొండని వారి కాజ్ఞాపించి తమలోతాము ఆలోచన చేసి

16. ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయ బడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజ

17. అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడ కూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి.

18. అప్పుడు వారిని పిలిపించిమీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి.

19. అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;

20. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;

21. ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.

22. స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.

23. వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి.

24. వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
నిర్గమకాండము 20:11, కీర్తనల గ్రంథము 146:6

25. అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?
కీర్తనల గ్రంథము 2:1-2

26. ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను3 భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.
కీర్తనల గ్రంథము 2:1-2

27. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,
కీర్తనల గ్రంథము 89:19, యెషయా 61:1

28. వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.

29. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి

30. రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయు టకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్ర హించుము.
కీర్తనల గ్రంథము 89:19

31. వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.

32. విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.

33. ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.

34. భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.

35. వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.

36. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి

37. దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
4:1-3 యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుట మతాధికారులు చూచి వారిమీదికి వచ్చి, చివరికి పేతురు, యోహానులను పట్టుకుని ఖైదు చేశారు. ముఖ్యంగా సదూకయ్యులు తాము అధికారపూర్వకంగా గుర్తించే హెబ్రీ లేఖనాలైన (మత్తయి 22:23) పంచకాండాలలో పునరుత్థానం గురించిన ఉపదేశము లేదని తలుస్తారు కాబట్టి వారు పునరుత్థానాన్ని నమ్మరు. అందువల్ల ఈ బోధను బట్టి వారు రేపబడ్డారు. సమాజ మందిరపు నేర విచారణలు రాత్రిపూట నిర్వహించేవారు కాదు కాబట్టి, ఆ రాత్రి అపొస్తలులు కావలిలో ఉంచబడ్డారు. దేవాలయ ప్రాంతంలో వచ్చే వివాదాలు సాధారణంగా పౌర సంబంధమైన సమస్యలు కాక మతసంబంధమైనవిగా ఉంటాయి. కాబట్టి రోమా సామ్రాజ్యం సమాజమందిరపు వారికి ఆ ప్రాంతంలో జరిగే వివాదాల పరిష్కారానికి వారికి అధికారాన్ని ఇచ్చింది. 

4:4 క్రైస్తవ సందేశాన్ని అణచివేయడానికి పదే పదే చేసిన ప్రయత్నాలు కేవలం దాన్ని మరింతగా విస్తరింపజేయడానికి కారణమయ్యాయి. పెంతెకొస్తు దినాన ఉదయం యెరూషలేములో ఉన్న విశ్వాసుల సంఖ్య కేవలం 120 (1:15). ఆ రోజు పేతురు సందేశానికి స్పందనగా మరొక 3000 మంది చేర్చబడ్డారు (2:41). ఇప్పుడు కుంటివాని స్వస్థతతోపాటు పేతురు ప్రసంగం, అపొస్తలులు చెరసాలలో పెట్టబడడంతో సంఘానికి చేర్చబడినవారు యించుమించు అయిదువేలు ఆయెను. 

4:5-7 వ.5-6లో చెప్పిన గుంపులు యూదుల మతవ్యవస్థలో అత్యంత శక్తివంతమైన పాత్రగలవారి ప్రతినిధులు. వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టిరి. ఇశ్రాయేలీయుల బలమంతటి ఎదురుగా ఇద్దరు సామాన్యమైన వ్యక్తులను నిలబెట్టి, ఏ బలముచేత వారు అద్భుతం చేశారో, సువార్తను ప్రకటించారో చెప్పమని వారు అపొస్తలులను అడగడం విచిత్రం. సాంప్రదాయ శక్తులను కుదించి, వేరే అధికారం చేత బలపరచబడినవారై, తాము జవాబుదారులమని అపొస్తలులు భావించారు అనేది స్పష్టం. అన్న, కయపలను గురించి మత్తయి 26:3; లూకా 3:2-6; యోహాను 18:13 నోట్సు చూడండి. 

4:8 యూదుల మత వ్యవస్థను విజయవంతంగా ఎదుర్కొనడానికి అవసరమైన సిద్ధపాటుగా, పేతురు పరిశుద్దాత్మతో నిండినవాడయ్యాడు.

4:9-10 మరొకసారి పేతురు యూదుల ముందు, వారు సిలువ వేసినట్టి నజరేయుడైన యేసు క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడని నొక్కి చెప్పాడు. ఇదే యేసు కుంటివాడైన మనుష్యుని స్వస్థపరచిన శక్తి!

4:11 పేతురు కీర్తన 118:22ను పేర్కొంటూ, పా.ని. సాక్ష్యంతో యేసును మరలా గుర్తించాడు. యేసు యూదా నాయకులు తృణీకరించిన రాయి అయినప్పటికీ, దేవుడు ఆయనను సంఘానికి తలరాయి (పునాది)గా చేశాడు. 

4:12 యేసునందు తప్ప మరి ఏ నామమున రక్షణ పొందలేము అనే
క్రైస్తవ్యంలోని ఖండితమైన ప్రకటనతో పేతురు ముగించాడు. ఈ సందేశం కొ.ని. అంతటా మార్మోగుతుంది. “నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” (యోహాను 14:6) అని యేసు స్వయంగా చెప్పాడు. 

4:13-15 ధైర్యము అనే పదానికి వాడిన మాట వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా సూచిస్తూ, వాక్చాతుర్యానికి సంబంధించినదిగా ఉంది. అలాంటి లక్షణాన్ని యూదులు యేసులో మాత్రమే చూశారు.

4:16-18 వారిచేత (అపొస్తలులు) ప్రసిద్ధమైన సూచకక్రియ జరిగిందని సభవారు ఒప్పుకోవడం గొప్ప సంగతే. అయినప్పటికీ వారు మారుమనస్సు పొంది విశ్వసించడానికి బదులు, ఇది ప్రజలలో వ్యాపించకుండా నష్టనియంత్రణ చర్యలపై దృష్టిపెట్టారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైస్తవ్యం వ్యాపించకుండుటకై యేసును గురించి ఇకపై మాటలాడకూడదు, బోధింపను కూడదని అపొస్తలులకు వారు ఆజ్ఞాపించిరి. స్పష్టమైన సత్యాన్ని ఫణంగా పెట్టి తమ మత అధికారాల స్థాయిని కాపాడుకోవాలని వారు తలంచినట్లు కనబడుతుంది. 

4:19-20 తాము కన్నవాటిని విన్నవాటిని పేతురు, యోహానులు ప్రస్తావించడం, యేసుతో వారి అనుభవాలతో పాటు, పెంతెకొస్తు దినాన సంఘం ఏర్పడినప్పటి నుండి వారు చూచిన విషయాలు, ఇలా దేవుని అనేక ప్రత్యక్ష కార్యాలకు వారు సజీవ సాక్షులు. 

4:21-23 స్వస్థపడిన వ్యక్తి నలుబది యేండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు అనే వాస్తవం, స్వస్థత జరుగలేదు అని కొట్టివేయడానికి అవకాశం లేనిదిగా యూదులకు అర్థమైంది. 

4:24-28 పేతురు, యోహానులు జరిగిన దానిని తమ సహవాసంలోని సభ్యులకు చెప్పినపుడు, వారందరూ ఈ శ్రమను కీర్తన 2:1-2 నెరవేర్పుగా గుర్తించారు. అన్యజనులు...ఇశ్రాయేలు ప్రజలతోను కలసి దేవుని పరిశుద్ధ సేవకుడైన యేసుకు ఆయన అనుచరులకు విరోధంగా ఏకమయ్యారు. అప్పుడు, ఇప్పుడు కూడా, యేసు శ్రమలు (అలాగే తమ శ్రమలు కూడా) అనుకోకుండా వచ్చినవి కావు గాని దేవునిచే ముందు నిర్ణయించబడినవని తెలుసుకోవడం ద్వారా విశ్వాసులు ఆదరణ పొందుతారు. దేవుని సర్వాధికారము, మానవుని బాధ్యత ఏక కాలమందు లేఖనాల్లో ధృవపరచబడిన సందర్భాల్లో ఇది ఒకటి (2:23 కూడా చూడండి),

4:29-30 - యేసుకు శ్రమలు వస్తాయని ప్రవచనం ఉన్నట్లుగానే, ఆయనను మెస్సీయగా ప్రకటిస్తున్నందుకు తాము కూడా శ్రమలు ఎదుర్కొనవలసి ఉన్నదని ఆది క్రైస్తవులు గుర్తించారు. శిక్ష వచ్చినప్పటికీ, ధైర్యముగా మాట్లాడడానికి కావలసిన శక్తికోసం వారు దేవునికి ప్రార్థించారు. సాక్ష్యమివ్వడంలో ధైర్యం మాత్రమే కాక, యేసు నామము ద్వారా స్వస్థపరచుట... సూచకక్రియలను మహత్కార్యములను చేయడానికి దేవుని నుండి శక్తిని పొందాలని ఆది క్రైస్తవులు ఆశించారు. 

4:31 వారి ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది.

 4:32-35 లక్ష్యం, ఉద్దేశాల విషయాల్లో వారి మధ్య సంపూర్ణ ఏకాభిప్రాయం ఉన్నంతవరకు, ఆది క్రైస్తవులు తమలో ఎవనికిని కొదువ లేకపోవునట్లుగా కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. వారు ఇలా చేయగలగడానికి కారణం వారి బలం కాదు గాని దైవకృప అందరియందు అధికముగా
ఉండడమే. కాబట్టి దాతృత్వం అనేది అన్నిటికంటే మించి దేవుని కార్యమైయున్నది. అయినప్పటికీ, సమస్య రాబోతుంది (5:1-11). 

4:36-37 యోసేపు (బర్నబా), తన పొలము అమ్మి, దాని వెల అంతా సంఘానికి ఇచ్చి ఒక మంచి మాదిరి చూపాడు. అలాంటి దాతృత్వ కార్యాలు ఇతరులను మంచి చేయడానికి ప్రేరేపిస్తాయి. అదే సమయంలో మరికొందరిని మెప్పు కోరి అలా చేసేలా కూడా ప్రేరేపిస్తాయి. 


Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |