Isaiah - యెషయా 64 | View All

1. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.

2. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక.

3. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక.

4. తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.
1 కోరింథీయులకు 2:9

5. నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతివిు బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా?

6. మేమందరము అపవిత్రులవంటివారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతివిు గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

7. నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

8. యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.
యోహాను 8:41, 1 పేతురు 1:17

9. యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా.

10. నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.

11. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.

12. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?



బైబిల్ అధ్యయనం - Study Bible
64:1-3 యెషయా ప్రార్ధిస్తూనే ఉన్నాడు, దేవునికి తన విన్నపాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడనే వర్ణన కనబడుతుంది (63:15 నోట్సు చూడండి). దేవుడు పైనుండి దిగి వచ్చి తమ అవసరతలో తమకు సహాయం చేయాలని యెషయా అడుగుతున్నాడు. దేవుడు యుద్దశూరునిగా వచ్చినప్పుడు పర్వతములు తత్తరిల్లుతాయి (నహూము 1:5 చూడండి), అన్యజనులు కలవరపడతారు.

64:4 ప్రవక్త విన్నపానికి ఆధారం గతంలో దేవుడు చేసిన కార్యాలు. గతంలో దేవుడు పర్వతాల్ని తత్తరిల్ల జేశాడు. వాస్తవంగా, తన ప్రజలపట్ల కార్యాలు జరిగించిన దేవుడు యెషయా ఆరాధించే దేవుడు మాత్రమే. అన్యదైవాలు అసలు దైవాలే కాదని ఇది సూచిస్తుంది. అయితే దేవుడు తనకొరకు కనిపెట్టువాని విషయమై కార్యం జరిగిస్తాడు. దేవుని రక్షణశక్తి ననుభవించడానికి ఆయనలో నమ్మిక, ఆయన మీద ఆధారపడడం ముందుగా ఉండవలసిన లక్షణాలు. పౌలు వ్రాసిన 1కొరింథీ 2:9 వచనానికి ఈ వచనమే ఆధారం. 

64:5-7 యెషయా తన సమాజం పక్షాన పాపాన్ని ఒప్పుకొంటున్నాడు, వారి మీదకు వచ్చే శిక్ష తగినదేనని చెబుతున్నాడు. తాము ఒకప్పుడు మురికిగుడ్డ లాగా ఉన్నప్పటికీ, ఇప్పుడు తాము దేవునికి విధేయులై ఆయన రక్షణననుభవిస్తామని యెషయా చెబుతున్నాడు. మురికి గుడ్డ రుతుస్రావ రక్తంవలన ఆచారరీత్యా అపవిత్రమైన వస్త్రాన్ని సూచిస్తుంది (లేవీ 15:19-33)

64:8 దేవుడు తమ తండ్రి అని చెబుతూ యెషయా ఆయనకు విన్నవించు కుంటున్నాడు (63:16 నోట్సు చూడండి). లోకంలో తండ్రి అపరాధులైన తన పిల్లల్ని వదిలిపెట్టడం అనేది అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. జిగట మన్ను... కుమ్మరి సాదృశ్యాల నుపయోగిస్తూ దేవుడు తమ సృష్టికర్త అని ప్రవక్త చెబుతున్నాడు (29:16; 45:9 నోట్సులు చూడండి).

64:9 మోషే లాగా, యెషయా కూడా ఇశ్రాయేలీయుల్ని వారి పాపాల్నిబట్టి నాశనం చేయవద్దనీ, వారు ఆయన ప్రజలేననీ (నీ ప్రజలమే) వేడుకుంటు న్నాడు.

64:10-12 బబులోనువారు యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసి దేవాలయాన్ని కాల్చివేయబోయే భవిష్య సంఘటనను (క్రీ.పూ. 586) యెషయా ముందుగానే దృష్టిస్తున్నాడు. దేవుడు ఈ పరిస్థితిని తారుమారు చేసి, పట్టణాన్ని దేవాలయాన్ని పునరుద్ధరించాలని యెషయా ఆయనకు విజ్ఞాపన చేస్తున్నాడు. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |