Revelation - ప్రకటన గ్రంథము 16 | View All

1. మరియుమీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.
కీర్తనల గ్రంథము 69:24, కీర్తనల గ్రంథము 79:6, యెషయా 66:6, యిర్మియా 10:25, యెహెఙ్కేలు 22:31, జెఫన్యా 3:8

2. అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండుపుట్టెను.
ద్వితీయోపదేశకాండము 28:35

3. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందు వలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను.
నిర్గమకాండము 7:20-21

4. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను.
కీర్తనల గ్రంథము 78:44

5. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి;
నిర్గమకాండము 3:14, ద్వితీయోపదేశకాండము 32:4, కీర్తనల గ్రంథము 119:137, కీర్తనల గ్రంథము 145:17, యెషయా 41:4

6. దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.
కీర్తనల గ్రంథము 79:3, యెషయా 49:26

7. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.
కీర్తనల గ్రంథము 19:9, కీర్తనల గ్రంథము 119:137, ఆమోసు 4:13

8. నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.

9. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.

10. అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి.
నిర్గమకాండము 10:22, యెషయా 8:22

11. తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు.
దానియేలు 2:19

12. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను.
ఆదికాండము 15:18, ద్వితీయోపదేశకాండము 1:7, యెషయా 11:15, యెషయా 41:2, యెషయా 41:25, యెషయా 44:27, యిర్మియా 50:38, యిర్మియా 51:36

13. మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.
నిర్గమకాండము 8:3

14. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి
ఆమోసు 4:13

15. హెబ్రీభాషలో హార్‌ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.

16. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.
న్యాయాధిపతులు 5:19, 2 రాజులు 9:27, 2 రాజులు 23:29, జెకర్యా 12:11

17. ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.
కీర్తనల గ్రంథము 69:24, కీర్తనల గ్రంథము 79:6, యెషయా 66:6

18. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.
నిర్గమకాండము 19:16, దానియేలు 12:1

19. ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి.
కీర్తనల గ్రంథము 75:8, యెషయా 51:17, యిర్మియా 25:15, దానియేలు 4:30

20. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను.

21. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.



బైబిల్ అధ్యయనం - Study Bible
16:1 భూమిమీద కుమ్మరింపబడేది దేవుని కోపము కాబట్టి, ఆలయములో నుండి వచ్చిన గొప్ప స్వరము బహుశా ప్రభువుడై ఉండవచ్చు.

16:2 "6:9-11 నుండి 8:13 వరకు (అక్కడి నోట్సు చూడండి), ఏదోక సమయంలో దేవుని తీర్పు బాధ "భూనివాసుల" మీదకి వస్తుందని ఎదురుచూడబడింది. కానీ చివరి తీర్పుల వరుస ఆరంభమౌతుండగా (15:1), మొదటి... పాత్ర క్రూరమృగము యొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారి మీద కుమ్మరించబడింది. వారు బాధకరమైన చెడ్డపుండ్లతో మొత్తబడ్డారు. ఇది ఐగుప్తుమీది ఆరవ తెగులును జ్ఞాపకం చేస్తుంది (నిర్గమ 9:8-11). 

16:3 రెండవ... పాత్ర ప్రభావాలు రెండవ బూర తీర్పు వలె ఉన్నాయి (8:8-9). అప్పుడు సముద్రంలో మూడవభాగం రక్తముగా మారి, సముద్రప్రాణులలో మూడవ భాగం మాత్రమే చచ్చిపోయాయి, కానీ ఈ దేవుని కోపపు పాత్రవల్ల సముద్రము అంతా, సముద్రములో ఉన్న జీవ జంతువులన్నియు చచ్చాయి. ఇది ఐగుప్తుమీదికి వచ్చిన మొదటి తెగులును ప్రతిధ్వనిస్తుంది (నిర్గమ 7:14-21). 

16:4-7 మూడవ... పాత్ర మూడవ బూర తీర్పువలె ఉంది (8:10-11). ఎందుకంటే ఇది మంచినీటి వనరులపై ప్రభావం చూపింది. వర్తమాన భూతకాలములో ఉన్న దేవుని వర్ణనకోసం, 11:16-18 నోట్సు చూడండి. నీళ్ళను రక్తముగా మార్చుటలోని ప్రాముఖ్యత ఇప్పుడు స్పష్టమైంది. క్రూరమృగమును ఆరాధించేవారు (16:2) పరిశుద్దుల (5:8నోట్సు చూడండి) రక్తము (6:10)ను, ప్రవక్తల (10:5-7 నోట్సు చూడండి) రక్తమును కార్చినందుకు, సత్యవంతుడు. న్యాయవంతుడైన దేవుడు హతసాక్షులైన వారిపక్షంగా తీర్పుతీర్చాడు. “భూనివాసుల" పై అలాంటి ప్రతీకారం ప్రవచింపబడినందున 16:10-11), మృగమును ఆరాధించేవారు, “భూనివాసులు" ఒకే గుంపుకు చెందినవారు కావచ్చు. 

16:8-9 నాల్గవ బూర తీర్పు (8:12-13) సూర్యుడు, చంద్ర నక్షత్రాదుల కాంతిని బాగా తగ్గించివేయగా, నాలుగవ... పాత్ర ప్రజలను అగ్నితో తీవ్రమైన వేడిమితో కాల్చడానికి కారణమైంది. దేవుని కరుణకోసం మొఱ్ఱ పెట్టడానికి బదులుగా, క్రూరమృగాన్ని ఆరాధించేవారు (వ.2), క్రూరమృగము వలెనే (13:5) ప్రభువును దూషించి, మారుమనస్సు పొందడానికి నిరాకరించారు (9:20-21 నోట్సు చూడండి). వారు దేవుని మహిమపరచలేదు అనడం వారు 14:6-7లోని సువార్త ప్రకటనను తిరస్కరించారని సూచిస్తుంది.

16:10-11 అయిదవ... పాత్ర సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు “మూడవ” - భాగం మట్టుకే చీకటిగా మార్చబడిన నాల్గవ బూరవంటిదే (8:12-13) కానీ ఈ సారి అది పూర్తిగా చీకటి కమ్మింది. ప్రజలు తమ నాలుకలు కరచుకొనుటకు కారణమైన బాధకు కారణం: (1) చీకటివల్ల కలిగిన విపరీతమైన చలినిబట్టి, (2) మొదటి పాత్ర తీర్పునుండి వచ్చిన పుండ్లనుబట్టి (వ.2), (3) నాలుగవ పాత్ర తీర్పులో తీవ్రంగా కాలిన గాయాలవల్ల (వ.8-9), లేక (4) ఈ నాలుగు కారణాలవల్ల, ఈ పాత్ర క్రూరమృగము యొక్క సింహాసనము, దాని రాజ్యము మీద కుమ్మరించబడడం దాని ప్రపంచవ్యాప్త అధికారం (13:7) ముగియబోతుందని చూపుతుంది. ప్రజలు దేవుని దూషించి, మారుమనస్సు పొందడానికి నిరాకరించడం గురించి, 9:20-21 నోట్సు చూడండి. ఈ తీర్పు ఐగుప్తుపై తొమ్మిదవ తెగులును జ్ఞాపకం చేస్తుంది (నిర్గమ 10:21-23).

16:12-14 ఆరవ ఉగ్రత పాత్ర హర్మె గిర్దాను. యుద్ధానికి సిద్ధపాటు (వ. 16). ఆరవ బూర తీర్పు కూడా యూఫ్రటీసు అను మహానదిని పేర్కొంది. (9:14-16 నోట్సు చూడండి). దాని నీళ్ళు యెండిపోయెను అనే మాటలు ఎర్రసముద్రాన్ని పాయలు చేసినదాన్ని జ్ఞాపకం చేయడానికి ఉద్దేశించబడి వుంటాయి. ఎందుకంటే అవి రెండూ సైన్యాలను గూర్చినవే (ఇక్కడ యూఫ్రటీసుకు తూర్పునుంది. వచ్చు రాజులు). కప్పలు ఐగుప్తుపై వచ్చిన రెండవ తెగులును జ్ఞాపకం చేస్తాయి. (నిర్గమ 8:2-13). ఈ సైన్యాలు , లోకమంతట ఉన్న రాజులను కలుసుకుని, సర్వాధికారియైన దేవుని మహాదినమున (యెహోవా దినము; 6:12-17 నోట్సు. చూడండి) జరుగు యుద్ధంలో దేవుని విరోధంగా యుద్ధం చేయడానికి (16:16 నోట్సు చూడండి) కదలివెళ్తున్నారు. దయ్యపు ఆత్మలు ఈ రాజులను ప్రభావితం చేసి, సాతాను (ఘటసర్పము, 12:7-10 నోట్సు చూడండి) చిత్రాన్ని చేయడానికి మోసపరచే సూచనలు చేస్తాయి (దాని 10:13,20 చూడండి).


16:15-16 హర్, మెగిద్దీనుకు నడిపించే వర్ణన - మధ్యలో, ప్రకటన గ్రంథంలోని మూడవ “ధన్య" వ్యాఖ్య ఉంది (1:3; 14:13; 19:9; 20:6; 22:7,14). ఇది పాఠకులు ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా మెలకువగా వుండాలని హెచ్చరిస్తుంది. దొంగవలె రావడం మత్తయి 24:43-44 లోని యేసు ఉపమానాన్ని, సాఫ్టస్ సంఘానికి మొదటగా ఇచ్చిన హెచ్చరికను (ప్రక 3:3) ప్రతిధ్వనిస్తుంది. లవొదికయ సంఘంపై క్రీస్తు మోపిన నేరారోపణలలో ఆత్మీయ దిగంబరత్వం కూడా ఒకటి (3:17-18). హర్ మెగిద్దినను చోటు గురించి అనేక వివరణలు ఇవ్వబడ్డాయి. హెబ్రీ భాషలో "మెగిదో కొండ లేక పర్వతం” అని అర్థముంది. ఇది మెగిదొకు 15 మైళ్ళ దూరంలో ఉన్న కర్మలు కొండను సూచిస్తుందని కొందరు అంటారు. నెపోలియన్ బోనపార్టె మెగిద్దాను, యెఱ్ఱయేలు లోయను చూచినప్పుడు, అది ప్రపంచంలోని అత్యంత సహజసిద్ధమైన యుద్ధభూమి అని వర్ణించాడు. ఈ వ్యూహాత్మక ప్రదేశంపై స్వాధీనం కోసం చారిత్రాత్మకంగా 34 కంటే ఎక్కువ యుద్ధాలు జరిగాయి. మూడవ టుట్మోస్ అనే ఐగుప్తు ఫరో (క్రీ.పూ. 1479-1425), మెగిట్టోనును పట్టుకోవడం అంటే వెయ్యి పట్టణాలను పట్టుకున్నట్టే అన్నాడు. హార్మెగిద్దాను నిజమైన ప్రదేశం కాదుగాని మంచికి చెడుకి జరిగే ముగింపు యుద్ధం జరిగే స్థలానికి సాదృశ్యం అని మరి కొందరు వ్యాఖ్యాతలు భావిస్తారు. 

16:17-21 ఏడవ.... క్రోధ పాత్ర 14:8 లో పరిచయం చేసిన మహా బబులోనుపై దృష్టిపెడుతుంది. తీర్పుగా కుమ్మరించబడిన మెరుపులును, ధ్వనులును, ఉరుములును... భూకంపము... వడగండ్లు అనేవి పరలోకంలో 11:19లో కనిపించినప్పటి నుండి ఉగ్గబట్టుకుని ఉన్నాయి. ఇక్కడున్న మహా పట్టణము 11:8లో ఉన్నట్లు యెరూషలేము కాదు, అది బబులోను. రిఫరెన్సులు ఒకదానితో ఒకటి కలిసిపోవడం రెండు పట్టణాలలోని భక్తిహీనమైన వైఖరులను దగ్గరగా కలుపుతుంది. 14:10లో “దేవుని ఉగ్రత పాత్రలో... దేవుని కోపమను మద్యమును" ... క్రూరమృగమును ఆరాధించేవారు. తాగుతారని చెప్పబడింది. ఇప్పుడు బబులోను ఆయన తీక్షణమైన ఉగ్రతయను మద్యముతో నిండిన పాత్రను పొందింది. ఆ విధంగా రెండూ సమానంగానే శిక్ష పొందాయి. ఇది “భూనివాసుల" పైకి (6:9-11; 8:13 నోట్సు చూడండి) వస్తుందని ఎదురుచూస్తున్న శిక్ష. “మహా బబులోను” అనే మాటలు దాని 4:30 లోని నెబుకద్నెజరు అతిశయపు మాటలలోనుండి తీసుకున్నాడు. అది అంత్యకాలంలో పునర్నిర్మింపబడిన పట్టణాన్ని గురించి చెబుతుంది. అయితే యిర్మీయా 51:26 దాన్ని అసంబద్ధం చేస్తుంది. అది రోమాకు మారు పేరు కావచ్చు లేదా అది బాబేలు గోపురం (ఆది 11:1-9), నెబుకద్నెజరు కాలంలోని బబులోనుల వంటి అహంకారంతో అతిశయించే ఏ సమాజాన్నైనా సూచిస్తుండవచ్చు. 


Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |