Ezra - ఎజ్రా 6 | View All

1. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజుకొట్టులో వెదకగా

2. మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా యను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను.

3. రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినదిబలులు అర్పింపతగిన స్థలముగామందిరము కట్టింపబడవలెను; దాని పునాదులు గట్టిగా వేయబడవలెను; దాని నిడివి అరువది మూరలును దాని వెడల్పు అరువది మూరలును ఉండవలెను;

4. మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను; దాని వ్యయమును రాజుయొక్క ఖజానాలోనుండి యియ్యవలెను.

5. మరియయెరూషలేములోనున్న ఆలయములోనుండి నెబుకద్నెజరు బబు లోనునకు తీసికొని వచ్చిన దేవుని మందిరముయొక్కవెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, యెరూష లేములోనున్న మందిరమునకు తేబడి, దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను.

6. కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెనునది యవతల అధికారియైన తత్తెనై అను నీవును, షెతర్బోజ్నయి అను నీవును నది యవతల మీతోకూడ నున్న అపర్సెకాయులును యూదులజోలికి పోక

7. దేవుని మందిరపు పని జరుగనిచ్చి, వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింప నియ్యుడి.

8. మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదులయొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయ మునుగూర్చి మేము నిర్ణయించినదేమనగారాజుయొక్క సొమ్ములోనుండి, అనగా నది యవతలనుండి వచ్చిన పన్నులోనుండి వారు చేయు పనినిమిత్తము తడవు ఏమాత్ర మును చేయక వారి వ్యయమునకు కావలసినదాని ఇయ్యవలెను.

9. మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలేగాని గొఱ్ఱపొట్టేళ్లేగాని గొఱ్ఱ పిల్లలేగాని గోధుమలే గాని ఉప్పే గాని ద్రాక్షారసమే గాని నూనెయేగాని, యెరూషలేములో నున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులును జీవించునట్లు ప్రార్థనచేయు నిమిత్తమై వారు చెప్పినదానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ

10. వారికి కావలసినదంతయు ఇయ్యవలెను.

11. ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచినయెడల వాని యింటివెన్నుగాడి ఊడ దీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింప బడును, ఆ తప్పునుబట్టి వాని యిల్లు పెంటరాశి చేయ బడును.

12. ఏ రాజులేగాని యే జనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యిచాపినయెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను.

13. అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.

14. యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చ రించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపురాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.

15. రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయ బడెను.

16. అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి.

17. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱపిల్లలను ఇశ్రా యేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీ యుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేక పోతులను అర్పించిరి.

18. మరియు వారు యెరూష లేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.

19. చెరలోనుండి విడుదలనొందినవారు మొదటి నెల పదునాలుగవ దినమున పస్కాపండుగ ఆచరించిరి.

20. యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచు కొని పవిత్రులైన తరువాత, చెరలోనుండి విడుదలనొందిన వారందరికొరకును తమ బంధువులైన యాజకులకొరకును తమకొరకును పస్కాపశువును వధించిరి.

21. కావున చెరలో నుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి, తిని పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనంద ముతో ఆచరించిరి.

22. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.బైబిల్ అధ్యయనం - Study Bible
6:1-5 కోరెషు రాయించిన శాసనపు తొలి ప్రతి (1:2-4) హెబ్రీ భాషలో ఉండి, ఒక బలమైన యూదు నేపథ్యాన్ని తెలియచేస్తోంది. ఇప్పుడు దొరికిన రెండవ ప్రతి అరమేయిలో ఉంది. దేవాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను అని ఎంతో స్పష్టంగా దానిలో ఆదేశించబడింది. యెరూషలేములో మందిరము పునర్నిర్మించడానికి ఏ పర్షియా రాజైనా ఆసక్తి చూపించడు అని భావించి చాలామంది పండితులు దీన్నొక కల్పిత రచన అని కొట్టిపారేశారు. అయితే పర్షియాకు బయట ఉన్న ప్రదేశాల్లో దేవాలయాల పునర్నిర్మాణానికి పర్షియా రాజులు, చివరి దర్యావేషుతో సహా ముందుకొచ్చారని పురావస్తుశాస్త్ర ఆధారాలు చెబుతున్నాయి. వారికి నచ్చిన విధంగా ఆరాధించుకోడానికి పాలితులకు అనుమతిస్తే వాళ్లను పరిపాలించడం సులభతరం అవుతుందని ఈ రాజుల ఆలోచనై ఉండవచ్చు. 

6:3 దాని పునాదులు గట్టిగా వేయబడవలెను అనే మాటలు అనువదించడానికి కష్టమైన అరామిక్ పదాల నుండి వచ్చాయి. ఇతర అనువాదాలు ఇక్కడి వాక్యభాగం అస్పష్టంగా మారిందని సూచిస్తున్నాయి. అందువల్ల .. ఇక్కడ పునాదులు (అరమేయిక్. ఉషోహె) అనే పదాన్ని దహనబలులుగా మార్చాయి (అరమేయిక్. ఎషోహె). అందువల్ల ఇక్కడ “దహనబలులు తీసుకురాబడే స్థలంగా” అనువదించబడింది.
ఇక్కడ ప్రస్తావించిన దేవాలయపు కొలతలు సమస్యాత్మకంగా ఉన్నాయి. సొలొమోను కట్టిన మహా దేవాలయం 90 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు (1రాజులు 6:2) ఉండేది. ఇక్కడ దాని నిడివి, వెడల్పుల గురించి ప్రస్తావించబడింది. అంటే ఇది సొలొమోను దేవాలయం కంటే పెద్దగా ఉండబోతుందని అర్థం. ఎజ్రా 6:3 ప్రాచీనకాలపు శాస్త్రులు చేసిన పొరపాటు మూలంగా వచ్చి ఉంటుంది. రెండవ దేవాలయం ఆర్థిక కొరత మూలంగా పరిమాణంలో సొలొమోను దేవాలయంలా లేదా దానికంటే చాలా చిన్నదిగా ఉండి ఉంటుంది. 

6:4- మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస కొత్తమానులను ఉపయోగించి నిర్మాణం చేపట్టడం సొలొమోను దేవాలయ నిర్మాణపు శైలిపై ఆధారపడి ఉంది (1 రాజులు 6:36). ఇక్కడ అనువాదంలో ఒక చిన్న మార్పు జరిగిందని సూచిస్తోంది. "కొత్త (అరమేయిక్. ఖదాత్) మ్రానులు" అనే దానికి బదులు "ఒక (అరమేయిక్. ఖాద్) వరుసముద్రలు" అని ఉండాలి. ఇంతటి ముఖ్యమైన నిర్మాణానికి సాదాసీదా కలప ఉపయోగించరు. 

6:6-7 దర్యావేషు నిర్ణయం కోసం దేవుని ప్రజలు ఎదురుచూసిన కాలంలో దేవుడు వారి మీద దృష్టి ఉంచిన విధంగానే (5:5), దేవాలయాన్ని కట్టించే పనిని - తత్తెనై, ఇతర పర్షియా అధికారులు అడ్డగించకుండా దర్యావేషు నిర్ణయం తీసుకోవడంలో కూడా తన ప్రజల పట్ల దేవుని శ్రద్ధ వెల్లడి అవుతున్నది.

6:8-10 కేవలం పునర్నిర్మాణానికి మాత్రమే కాక అనుదిన బలి అర్పణలకు ధనాన్ని సమకూర్చమని దర్యావేషు ఆజ్ఞాపించాడు.. దర్యావేషు యొక్క ఉద్దేశం పూర్తిగా నిస్వార్థపూరితమైంది. కాకపోవచ్చు. కానీ రాజును అతని కుమారులును జీవించునట్లు యూదు ప్రజలు ప్రార్ధన చేయాలని కోరుతూ ఆ సహాయం చేశాడు. దర్యావేషు అహురమజ్ఞా యొక్క భక్తుడైనప్పటికీ, ఎక్కడి నుంచైనా అతడు ఆధ్యాత్మిక మద్దతును స్వీకరించడానికి సిద్ధంగా ఉండేవాడు. 

6:11-12 పెద్దగా వాడుకలో లేని అరామిక్ మాటలు (నిలువనెత్తబడి, దాని మీద వాడు ఉరి తీయింపబడును) కొందరిని వీటిని “అతడు దానిపై (దూలంపై) ఉంచబడి, కొట్టబడతాడు" అంటే కొరడాలతో కొట్టబడతాడు అని అనువదించేలా చేశాయి. అయితే “ఉరితీయింపబడును" అనేదే సరైన అనువాదం. బబులోను నగరాన్ని తిరిగి చేజిక్కించుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన బబులోను ప్రజల్లో 3 వేల మందిని దర్యావేషు ఉరి తీయించాడని గ్రీకు చరిత్రకారుడు హెరడోటస్ తెలియచేశాడు. 

6:13-15 పర్షియా రాజుకు అవిధేయత చూపించడం ఎంత ప్రమాదకరమో తత్తెనైకీ పర్షియాకు చెందిన అతని సహోదరులకూ తెలుసు. పర్షియా రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల శాసనాల ప్రకారం దేవాలయ నిర్మాణం జరిగింది. దేవాలయ నిర్మాణం పూర్తయిన అర్ధశతాబ్దం తర్వాత రాజైన అర్తహషస్తను ప్రస్తావించడం విడ్డూరంగా ఉంది. 1-6 అధ్యాయాలు ఎజ్రా, నెహెమ్యా, గ్రంథాల్లో బహుశా చివరిగా రాయబడాల్సినవి. అర్తహషస్త యొక్క వ్యతిరేకత గురించీ (4:6-22) అతని మద్దతు గురించీ (7:11-26) ఈ భాగాన్ని గ్రంథస్థం చేసిన వ్యక్తికి అవగాహన ఉంది. అందుకే 6:13-15 లో వివరించబడిన సంఘటనలు జరిగిన చాలాకాలం తర్వాత అతని మద్దతు వచ్చినప్పటికీ దేవాలయ నిర్మాణం కోసం శాసనాలు జారీ చేసిన రాజుల జాబితాలో అతడు అర్తహషస్తను కూడా చేర్చాడు. దేవాలయ నిర్మాణం క్రీ.పూ. 515వ సంవత్సరంలో మార్చి 12న పూర్తయ్యుంటుంది.

6:16-18 పా.ని. ధర్మశాస్త్రం పండుగల సమయంలో ఆనందముతో ఆరాధించమనీ, వేడుక చేసుకొమ్మనీ ప్రజలను ఆదేశించింది (ద్వితీ 12:7, 12, 18; 16:11, 14). మొదటి దేవాలయ ప్రతిష్ఠ ప్రజల్ని ఆనందంతో నింపింది (1రాజులు. 8:66), హిజ్కియా రోజుల్లో దేవాలయ పునఃప్రతిష్ఠ పస్కా పునరుద్ధరణ ఆనందాన్ని తీసుకొచ్చింది. (2దిన 30:21), ఇప్పుడు రెండవ దేవాలయ ప్రతిష్ట సమయంలో ప్రజలు గొప్ప ఆనందంతో స్పందించారు.

6:19-20 గ్రంథకర్త పర్షియా అధికారితో కలిసి పనిచేస్తున్నందువల్ల 4:8 నుంచి 6:18 వరకు అరామిక్ భాషలో రాశాడు. ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు పూర్తయ్యాయి కాబట్టి అతడు తిరిగి హెబ్రీ భాషలో రాయడం కొనసాగించాడు. క్రీ.పూ.586 లో మొదటి.. దేవాలయం నాశనమవడానికి ముందు ఉన్న బలి అర్పణల పద్ధతిని పూర్తిగా అమలుచేయడానికి నూతన దేవాలయం అనుమతించింది. పస్కా పండుగ (హెబ్రీ. పెషాక్) క్రీ.పూ. 515 ఏప్రిల్ 21వ తేదీన జరిగి ఉంటుంది. ఐగుప్తు నుంచి తమ పూర్వీకులకు కలిగిన విడుదలనూ బబులోను చెర నుంచి తమకు కలిగిన విముక్తినీ జ్ఞాపకం చేసుకోడానికి దేవుని ప్రజలకు పస్కా పండుగ ఒక అద్భుతమైన సమయం.

6:21 ఇశ్రాయేలీయులతో నివసిస్తున్న అన్యజాతి ప్రజలు సున్నతి పొందితే వాళ్లు కూడా పస్కాను ఆచరించవచ్చని పా.ని. ధర్మశాస్త్రం అనుమతించింది (నిర్గమ 12:48-49), తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారిలో యూదుమతాన్ని స్వీకరించిన అన్యజనులు కూడా ఉన్నారు. బహుశా ఎన్నడూ చెరలోనికి వెళ్లకుండా దేశంలోనే ఉండి ఇశ్రాయేలు దేవుని ఆరాధించడం కొనసాగించిన వారిని కూడా ఇది సూచిస్తుంది. 

6:22 పస్కా పండుగ తర్వాతి రోజున పులియని రొట్టెల పండుగ మొదలవుతుంది. (నిర్గమ - 12:14-20). పర్షియా రాజైన దర్యావేషును అష్నూరు రాజు అని ప్రస్తావించడం అసంబద్దంగా ఉంది, ఎందుకంటే ఒక శతాబ్దానికి ముందే అష్నూరు సామ్రాజ్యం కుప్ప కూలిపోయింది. అయితే అష్బూరీయులకు వారసులుగా బబులోను రాజులు తమను తాము ఎలా పరిగణించుకున్నారో అదే విధంగా పర్షియా రాజులు కూడా అష్బూరీయులకూ బబులోనీయులకూ తమను వారసులుగా భావించుకునేవారు. 


Shortcut Links
ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |