Ecclesiastes - ప్రసంగి 12 | View All

1. దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,

2. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.

3. ఆ దినమున ఇంటి కావలివారు వణకు దురు బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు, కిటికీలలోగుండ చూచువారు కానలేకయుందురు.

4. తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టయొక్క కూతకు ఒకడు లేచును; సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్చబ్దముగా ఉంచబడుదురు.

5. ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలా పించువారు వీధులలో తిరుగుదురు.

6. వెండి త్రాడు విడి పోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయొద్ద కుండ పగిలిపోవును, బావియొద్ద చక్రము పడిపోవును.

7. మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.

8. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్వర్థము.

9. ప్రసంగి జ్ఞానియై యుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.

10. ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.

11. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి.

12. ఇదియు గాక నా కుమారుడా, హితోపదేశములు వినుము; పుస్తక ములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.

13. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.

14. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.
2 కోరింథీయులకు 5:10బైబిల్ అధ్యయనం - Study Bible
12:1-7 ఈ వాక్యభాగాన్ని అర్థం చేసుకొనే విధానాలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే ఒకదాని తర్వాత ఒకటి వరసగా వచ్చే రూపకాలంకార పదాలు (వర్ణనాత్మక పదాలు) చాలా వరకు మరణానికి దారితీసే వృద్ధ్యాప్యంలోని ఇబ్బందులను గురించి వర్ణిస్తున్నాయి. ఈ వర్ణనాత్మక పదాల్లోని సూక్ష్మవివరణలు వృద్ధాప్యం యొక్క వాస్తవికతను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి, యౌవనకాలంలోనే జీవితాన్ని సంతుష్టిగా అనుభవించాలని 11:10 లో కనబడే ఉపదేశం కూడా దీన్నే సూచిస్తున్నది. ఈ వాక్యభాగం యౌవనప్రాయంలో ఉన్నవారికి “మీకు భవిష్యత్తులో జరగబోయేది ఇదే, కాబట్టి మీకు యౌవనం ఉన్నప్పుడే దాన్ని అనుభవించండి" అని ఉపదేశిస్తున్నది.. 

12:1 దేవుణ్ణి సృష్టికర్త అని పేర్కొనడానికి రెండు కారణాలిక్కడ ఉన్నాయి. మొదటిది, భూమ్యాకాశాల సృష్టికర్తగా దేవుడు మనకు న్యాయాధిపతి. మన చర్యల్ని బట్టి మనం ఆయనకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నామనే విషయాన్ని మర్చిపోకుండా, ఆయనకు భయపడుతూ ఉండాలనే స్పృహతో మనం ఆయన్ని స్మరణకు తెచ్చుకోవాలి. రెండవది, సృష్టికర్తగా దేవుడు మనం జీవితాన్ని సంతోషంగా అనుభవించాలని కోరుకుంటున్నాడు- ఆదికాండము ఒకటవ అధ్యాయంలో ఆయన ఏవి “మంచివి” అని చెప్పాడో, వాటిననుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సృష్టించిన వెలుగు, భూమి, ఆకాశం, అన్నపానాలు, పురుషుడు, స్త్రీ, ఇంకా ఆయన సృష్టిలోని అన్నీ మంచివే. తరవాతి వచనాల్లో వర్ణించిన దుర్దినములు అంటే వయసు ఉడిగిపోయి శరీరపటుత్వం తగ్గి దౌర్బల్యం కలిగే రోజులు. 

12:2 తేజస్సునకును సూర్య... చీకటి కమ్మక ముందే అనే మాటలు ఆదికాండం 1:3-8 లో ఉన్న సృష్టిలోని ప్రముఖమైనవాటిని సూచిస్తున్నాయివెలుగు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం మొదలైనవాటి సృష్టి, యుగాంతాన్ని వివరించే యిర్మీయా 4:23-28, యోవేలు 2:10-11 వాక్యభాగాల్లోని “యెహోవా దినము" సూర్యచంద్రులు మసకబారడంతోబాటు సృష్టియొక్క అంతం (ముగింపు) గురించి వర్ణిస్తున్నది. మరణం ప్రతి మనిషికీ వ్యక్తిగత అంతం, మరణం మనిషికి ఈ లోకంలో ముగింపు పలుకుతుంది.
ఈ వచనంలోని ముఖ్యాంశం బహుశా ఇదే గానీ, మసకబారుతున్న కనుదృష్టి కాదు (మసకబారుతున్న కనుదృష్టి గురించి తరవాతి వచనంలో ఉంది.

12:3 ఇంటి కావలివారు వణకుడురు అనే మాటలు బహుశా చేతుల్ని సూచిస్తుండవచ్చు. ఎవరైనా తనను తాను కాపాడుకొనేది చేతులతోనే గదా, వృద్ధుల చేతులు కొన్నిసార్లు వణకడం కద్దు. బలిష్ఠులు వంగుదురు అనే మాటలు వంగిపోయిన కాళ్లను వీపును సూచిస్తాయి. మనిషి శరీరంలో బలిష్టమైన కండరాలతో కూడిన గాలివే. ఇవి వృద్ధాప్యంలో సడలిపోయినప్పుడు వంగిన ఆకారంలో కనబడతాయి. విసరువారు అంటే దంతాలు, ఇవే ఆహారాన్ని నములుతాయి. ప్రాచీన కాలంలో దంత సంరక్షణా విధానాలు లేనప్పుడు ఐగుప్తును పరిపాలించిన ఫరోలకు సైతం వృద్ధాప్యంలో దంతాలు ఊడిపోయేవి. విసరేవారు సాధారణంగా స్త్రీలు, ఇంటిలో రొట్టెల తయారీ కోసం పిండి విసరడం స్త్రీలు చేసే పని. కిటికీలగుండ చూచువారు కానలేకయుందురు అనే మాటలు కళ్లను సూచిస్తున్నాయి. ఏదేమైనా, ఇక్కడ ఇది మసకబారుతున్న కనుదృష్టికి వర్ణనాత్మక పదబంధం. వ. 2 లో ఉన్నట్టుగా, ఇందులో యుగాంతానికి సంబంధించిన సూచనాత్మక పదాల్లేవు. 

12:4 ఈ వచనం వినికిడి శక్తి మీద వృద్ధాప్యం చూపించే రెండు ప్రభావాల్ని వర్ణిస్తుంది. ఒకవైపు, మనుషులు వృద్ధాప్యంలో సరిగ్గా వినలేరు, తలుపులు మూయబడినట్టుగా శబ్దాల్ని వినడం మందమై, నిశ్శబ్దము ఆవరిస్తుంది. మరొకవైపు, వృద్ధుల్లో అనేకులు సరిగ్గా నిద్రపోలేరు, సన్నటి శబ్దానికి సైతం
మేలుకుంటారు. 12:5 ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును అనే మాటల్లో సొలొమోను ఎటువంటి అలంకారపద ప్రయోగాన్ని చేయలేదు. వృద్ధులకు క్రిందపడిపోతామనే భయం ఉంటుంది, నేరం చేసేవారికి తేలిగ్గా దొరుకుతారు. బాదము వృక్షము పువ్వులు పూయును అనే మాటలు కచ్చితంగా నెరసిన వెండ్రుకల్ని సూచిస్తున్నాయి. మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును అనే మాటలు బహుశా పుంసత్వం తగ్గిపోవడాన్ని సూచిస్తుండవచ్చు, బుడ్డబుడుసర కాయను వీర్యవర్గక ఔషధంగా పరిగణించేవారు. ప్రలాపించువారు వీధులలో నడుస్తుండగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోతున్నాడు అనే మాటలు చాలా స్పష్టంగా అంత్యక్రియల్ని సూచిస్తున్నాయి.

12:6 త్రాడు... గిన్నె... ధారయొద్ద కుండ పగిలిపోవును, బావియొద్ద చక్రము పడిపోవును - ఇవన్నీ బావి దగ్గర, నీటి ఊట దగ్గర, లేదా తొట్టి దగ్గర నీళ్లు చేరడాన్ని సూచిస్తున్నాయి. బైబిల్ లో పలుచోట్ల నీరు జీవానికి సంబంధించిన పదంగా కనబడుతుంది (ప్రాచీన ఇశ్రాయేలులో ఎడారిని పోలిన వాతావరణ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దీనిని బాగా అర్థం చేసుకోవచ్చు). ఈ విధంగా అన్ని పగుళ్లు వారినప్పుడు మరణం సంభవించినట్టే. ఇవి వెండితో, బంగారుతో చేసిన వస్తువులుగా వర్ణించడం జీవితం ప్రశస్తమైందనే భావనను స్ఫురింపజేస్తుంది. 

12:7 ఈ వచనం ఆదికాండము 2:7; 3:19 వచనాల్ని ఉదాహరిస్తున్నది. 

12:8 ఈ వచనం 1:2 లో ప్రకటితమైన గ్రంథ ప్రధానాంశాన్నే మళ్లీ చెప్తున్నది. గ్రంథం ప్రారంభంలో, చివరిలో ఉన్న ఈ రెండు వచనాలు- 1:2; 12:8 - గ్రంథసారాంశమంతటికీ కుండలీకరణాల్లాగా ఉన్నాయి. గ్రంథం సరిగ్గా ఈ వచనంతోనే ముగుస్తుంది. తరవాత ఉన్న 9-14 వచనాలు ఉపసంహారంగా ఉన్నాయి. 

12:9-14 ఈ వచనాలు గ్రంథకర్త జీవితం గురించి మరికొన్ని వివరాలను వెల్లడి చేయడంతో బాటు, పాఠకులకు కొన్ని వీడ్కోలు హెచ్చరికలిస్తున్నాయి. 

12:9 ఈ వచనం “ప్రసంగి” గ్రంథాన్ని సొలొమోను రచించాడనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నది (1రాజులు 4:30-32). 

12:10 ప్రసంగి హితకరమైన బోధ నుపదేశించాలని కోరుకోవడం మాత్రమే కాక, దాన్ని అభ్యర్థనా పూర్వకమైనదిగా, యుక్తమైనదిగా చెప్పాలనుకున్నాడని ఈ వచనం సూచిస్తున్నది. “సామెతలు” గ్రంథం లాగా, చూడగానే మన కళ్ల నాకర్షించడంతోబాటు మిన్నయైన ప్రయోజనం చేకూర్చడానికి పదాల ఎంపిక, వాటి అమరిక విషయంలో గ్రంథకర్త మిక్కిలి శ్రద్ధ తీసుకున్నాడని ఇది సూచిస్తుంది. 

12:11 ఈ వచనంలో అత్యావశ్యకమైన ఉపదేశం - మన జీవితాన్ని సన్మార్గంగా నడిపించే మార్గదర్శిగా దేవుడు మనకు జ్ఞానాన్నిచ్చాడు - ఇది సుస్పష్టం. ఈ వచనంలో కొంతమట్టుకైన పశువుల యాజమాన్యానికి సంబంధించిన పదాల్ని వర్ణనాత్మకంగా ఉపయోగించడం జరిగింది. పశువుల కాపరులు పశువుల్ని మునుకోలలతో తట్టుతూ నడిపించినట్టుగా దేవుడు (ఒక్క కాపరి) మనల్ని నడిపిస్తున్నాడు (అపొ.కా. 26:14). బిగగొట్టబడిన మేకుల వలెను అనే మాటలు మునుకోలల చివరన ఉండే మేకుల్ని సూచిస్తున్నాయో (1సమూ 13:21), లేదా సామెతలు (లోకోక్తులు) గోడలోకి బిగగొట్టబడిన మేకుల్లాగా స్థిరమైనవి, ఆధారపడదగినవి అని చెప్పే మరొక వర్ణనాత్మక పదబంధమో నిర్దిష్టంగా తెలియడం లేదు. రెండవదే అయినట్లయితే, మన జీవితాల్ని ఈ స్థిరమైన సత్యాలకు గట్టిగా హత్తుకోవాలని ఇది సూచిస్తున్నది. 

12:12 సామెతలు ప్రాముఖ్యమైనవి. అయితే, విద్య కేవలం విద్య కోసం (విషయపరిజ్ఞానం) మాత్రమే కాదని ప్రసంగి హెచ్చరిస్తున్నాడు. విస్తారమైన విద్యాభ్యాసము ప్రసంగి గ్రంథం ఉపదేశించే సంతోషాల్ని కోల్పోయేలా చేయగలదు. ఈ వచనం విద్యను లేదా పాండిత్యాన్ని వ్యతిరేకించడం లేదు గానీ, విద్యనభ్యసించినవారు తమ కార్యసాధనలో వినయాన్ని, జీవితంలో సమన్వయాన్ని కలిగి ఉండాలని అభ్యర్థిస్తున్నది. 

12:13-14 మానవకోటికి ఇదియే విధి అనే పదబంధానికి అర్థం గురించి పలు చర్చలున్నాయి. హెబ్రీ మూలం అక్షరాలా ఇది “నరుడి ఉనికి కంతటికీ" అంటే మనుషులందరికీ అనే అర్థాన్నిస్తుంది. దేవునిపట్ల భయభక్తులు కలిగి ఉండాలనే నియమం ప్రతి మనిషికీ వర్తిస్తుందని అర్థం. మరొక విధంగా, ఈ భావన ప్రపంచంలోని ప్రతి మనిషీ తప్పనిసరిగా దేవునిపట్ల విధేయత కలిగి ఉండాలని ఇదే అతని విద్యుక్తధర్మమని అర్థాన్నిస్తుంది, అంటే దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నవాడే నిజమైన మనిషి. దీనికి విరుద్ధంగా చేయడం మనిషి తన మానవత్వసారాన్ని కోల్పోవడమే.
మనం మర్త్యులం, అశక్తులం. దేవుడొక్కడే సర్వశక్తిమంతుడనే ప్రసంగి గ్రంథ సందేశానుసారం -గ్రంథ పరిసమాప్తి ఏమిటంటే దేవునియందు భయభక్తులు కలిగి జీవించడం. ఇతర విషయాలతో బాటు, సూర్యుడి క్రింద మన క్లుప్త కాలాన్ని మనం సంతోషంగా అనుభవించాలని గ్రంథం ప్రతిపాదిస్తున్నప్పటికీ, దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలనే యోచన అన్నిటికంటె ప్రధానమైందిగా కనబడుతుంది. ప్రసంగి గ్రంథం యావత్తూ భూమ్మీద మానవ జీవితం యొక్క క్లుప్తత మీద, ఈ వాస్తవం నేపథ్యంలో మనమెలా జీవించాలనే దానిమీద ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది. అయితే ముగింపులో ఈ గ్రంథం, ఈ జీవితానికి ఆవల అంత్య తీర్పు వైపు చూస్తుంది.

Shortcut Links
ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |