9:1 కథనం మరలా సౌలు లేక పౌలు దగ్గరకు వస్తుంది (8:3 చూడండి).. యేసు అనుచరుల పట్ల అతని కోపం ఏమాత్రం తగ్గలేదు. అది వారిని హత్యచేసేటట్లు బెదిరించే స్థాయికి పెరిగిపోయింది. తరువాతి కాలంలో పౌలు క్రైస్తవులను హింసించే విషయంలో తన ఆసక్తిని గూర్చి చెప్పాడు (ఫిలిప్పీ 3:6). ఇతరులకు అతడు ఈ విధంగానే తెలుసు (ఉదా. అననీయ; అపొ.కా. 9:13). సౌలు క్రైస్తవుల పట్ల ద్వేషంతో కంటే దేవుని పట్ల యథార్థమైన ఆసక్తితో వారిని హింసించాడని చెప్పవచ్చు. అతనికి దేవుని గురించిన విషయ పరిజ్ఞానం అధికంగా ఉన్నప్పటికీ ఆయనతో వ్యక్తిగత సంబంధం లేని కారణంగా దేవుని ప్రణాళికను అతడు అర్థం చేసుకోలేక క్రైస్తవులను దేవునిపై తిరుగుబాటు చేసిన శత్రువులుగా ఎంచి వారిని హింసించసాగాడు. సత్యంలో పాదుకొనని ఆసక్తి ఏదైనా అది (దేవుని) వాస్తవ ఉద్దేశాల నుండి ప్రక్కకు మళ్ళిస్తుంది.
9:2 సౌలు, యీ మార్గమందున్న (ఆది క్రైస్తవులకున్న సామాన్యమైన పేరు; 19:9,23; 22:4) ప్రజలను బంధించడానికి ప్రధాన యాజకుని నుండి పత్రికలు తీసుకుని దమస్కుకు వెళ్ళడానికి అనుమతి పొందాడంటే, యూదా మత నాయకుల మధ్య అతడు ఎంత ఆధిక్యత గలవాడో తెలుస్తుంది. అతడు వారిని బంధించి తిరిగి యెరూషలేముకు తీసుకురావడానికి ప్రణాళిక చేశాడు. ఎందుకంటే ఈ పట్టణం యూదు మతానికి కేంద్రం.
9:3-4 దమస్కు దగ్గరకు వచ్చినపుడు, తన చర్యలు అక్కడ విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని నిస్సందేహంగా నిలువరిస్తాయని సౌలు తలస్తున్న సమయంలో, దాని బదులుగా అతడు తన జీవితాన్ని, తద్వారా ప్రపంచ చరిత్రను మార్చివేసిన ఆకాశము నుండి యొక వెలుగును చూశాడు.
9.5 సౌలు వెంటనే యేసు స్వరాన్ని గుర్తుపట్టాడా అనేది సందేహమే. ప్రభువా అని అతడు పిలవడం దైవత్వాన్ని గుర్తించినట్లు కాక బహుశా గౌరవప్రదమైన పిలుపు కావచ్చు ("అయ్యా" అనే మాటకు సమానంగా). అందువల్లే ఆ స్వరం నేను... యేసును అని బదులిచ్చింది.
9:6 అతని పని లేక లక్ష్యం ఏమిటనేది సౌలుకు . ఈ సమయంలో చెప్పబడలేదు. దమస్కు పట్టణంలో అతడు అననీయను కలిసిన సమయం వరకు అది దాచబడింది. అతని భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంచెలంచెల పరిచయం, యేసు అతని జీవితంలో ఆరంభించిన మార్పులకు ఒకేసారి ఆశ్చర్యపోకుండా చేసి, దమస్కులో ఉన్న క్రైస్తవులకు వారు ఎవరికైతే భయపడుతున్నారో, అతనిని కలిసి, అంగీకరించే అవకాశం ఇచ్చింది.
9:7 అపొ.కా. గ్రంథంలో పౌలు మారుమనస్సును గురించి ఇచ్చిన వృత్తాంతాలలో ఇది మొదటిది (22:6-11; 26:12-18). ఇక్కడ సౌలుతో పాటు ప్రయాణించినవారు, శబ్దమును (స్వరము) విన్నారు గాని చెప్పబడిన మాటలను గుర్తించలేదు. ఆ మాటలు కేవలం సౌలు కోసం మాత్రమే ఉద్దేశించినవి అనిపిస్తుంది.
9:8-9 గర్విష్టి సౌలుకు ఇది చాలా అవమానకరమైన అనుభవమై ఉండి ఉంటుంది.
9:10 అననీయ ఎలా క్రైస్తవుడుగా మారాడో మనకు చెప్పబడలేదు. పెంతెకొస్తు దినాన్న అతడు గాని లేక అతనికి తెలిసిన వారు గాని యెరూషలేములో ఉండివుండవచ్చు. అక్కడ వారు దేవుడు పరిశుద్దాత్మను పంపినప్పుడు జరిగిన అద్భుతమైన సూచకక్రియలను చూచి, విని, బహుశా అపొస్తలులు ప్రకటించిన సందేశాన్ని స్వీకరించి వుండే అవకాశం ఉంది. ఈ యాత్రికులు తాము కనుగొన్న కొత్త విశ్వాసాన్ని దమస్కుకు కొనిపోయి, ఇప్పుడు సౌలు హింసించడానికి వస్తున్న సంఘాన్ని స్థాపించి వుండవచ్చు. పలు ప్రభువు ఒక సామాన్య శిష్యుడైన అననీయను పిలిచి పౌలు కోసం ప్రార్థించే పనిని అప్పగించడం ఆయన పనిచేయడానికి సామర్థ్యం కంటే అందుబాటు, సమర్పణ, విధేయతలు ఎక్కువ ప్రాముఖ్యమైనవని సూచిస్తుంది. భవిష్యత్తులో గొప్ప అపొస్తలునిగా అద్భుతమైన సేవ చేయబోతున్న పౌలు తలపైన చేతులుంచి, అభిషేకించడానికి ప్రభువు అననీయను వాడుకోవడం అభిషేకానికి అసలు వనరు ప్రభువే అని తెలియజేస్తుంది. దేవుడు సాధారణ వ్యక్తులను కూడా ఉపయోగించుకొని అసాధారణ కార్యాలు జరిగించగలడు.
9:11-14 సౌలు బసచేసిన ఇంటి చిరునామాతో సహా - మిగిలిన వివరాలను ప్రభువు అననీయకు తెలియజేయడం ఆయన వివరాలకు, స్పష్టతకు ప్రాముఖ్యతనిచ్చే దేవుడని గుర్తు చేస్తుంది. అననీయ సౌలు కోసం ప్రార్థించబోతున్నాడనే విషయాన్ని ముందుగానే సౌలుకు బయలుపరచడమే కాక తాను అప్పగించే పనిని అననీయ అడ్డుచెప్పకుండా చేయబోతున్నాడని భవిష్యత్తుకు కర్తయైన దేవుడు ముందే యెరిగియున్నాడు. సౌలుకు అననీయ ఎంత భయపడ్డాడంటే, దేవుని నిర్ణయాన్ని ప్రశ్నించడానికి కూడా సాహసించాడు. అనేకుల సాక్ష్యం వలన సంఘానికి శత్రువని సౌలుకు పేరొచ్చింది.
9:15-16 సౌలు కొరకైన తన ఉద్దేశాన్ని దేవుడు మొదట అననీయకు బయలు పరిచాడు. ఇది సౌలు తన జీవితానికి కొత్త లక్ష్యాన్ని గుర్తెరిగిన ప్రదేశంలో అతనికి సహాయపడే సంబంధాలు ఉండేటట్లు ఏర్పాటు చేసింది. లేకుంటే, సౌలు అననీయ దగ్గరకు వచ్చి, ఆ వార్తను అందించడాన్ని ఊహించండి! అననీయ సౌలు తన దగ్గరకు వచ్చి మాట్లాడడాన్ని ఊహించను కూడా ఊహించలేడు, ఎవరైనా చెప్పినా అపహాస్యం చేసేవాడేమో!
సౌలుకు తెలియజేయమని ప్రభువు అననీయకిచ్చిన సందేశం భవిష్యత్తులో అతడు చేయబోతున్న విస్తృత పరిచర్యతో పాటు అతడు చెల్లించబోతున్న వెలను సైతం వెల్లడి చేసింది. దేవుడు పౌలుకిచ్చిన పిలుపులో అతడు పొందిన శ్రమలు కూడా ఒక భాగమే. పౌలు వలె సేవ చేయాలనుకునేవారు, అతని అభిషేకాన్ని ఆశించేవారు. అతడు చెల్లించిన వెలలో కూడా భాగం పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి!
9:17-18 సౌలు మారుమనస్సు సంఘటనల... క్రమం, సామాన్యమైన విధానంలో కాక, పరిశుద్దాత్మ నింపుదలతో ముగియకుండా బాప్తిస్మంతో ముగిసింది. ఈ ప్రక్రియ ఒకేసారి కాకుండా కొన్ని రోజులపాటు జరిగి వుండవచ్చు. కానీ దాని ఫలితం మాత్రం ఒకటే: సౌలు యేసు క్రీస్తు అనుచరుడుగా మారిపోయాడు. సౌలు కన్నుల నుండి పొరలవంటివి రాలి అతనికి దృష్టి కలగడంలో అతని పాత దృక్పథం గతించిపోయి ఒక నూతన దృక్పథం, నూతన దర్శనంతో కూడిన ఒక సరికొత్త కనుదృష్టి అనుగ్రహింపబడింది.
9:19-20 సౌలు సమాజ మందిరములలో యేసును గురించి ప్రకటించుట ఆరంభిస్తూ, బహుశా ప్రాథమిక క్రైస్తవ్యాన్ని గురించి నేర్చుకుంటూ దమస్కులో... కొన్ని దినములుండెను. తన పరిచర్య అంతటిలో అతడు సమాజమందిరాలకే ప్రాధాన్యతనిచ్చి, వేరొకచోటికి సందేశాన్ని తీసుకుని వెళ్ళేటట్లు బలవంతం చేయబడే వరకు అక్కడే ఆరంభించేవాడు.
9:21-22 సౌలు పట్ల మొదటి స్పందన సందేహంతో కూడిన ఆశ్చర్యం కావడం అర్థం చేసుకోదగినది. కానీ అతడు మరి ఎక్కువగా బలపడుతుండగా అవిశ్వాసులైన యూదులను కలవరపెట్టగలిగి, ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచూ వచ్చాడు. దీన్నిబట్టి పా.ని.కు మెస్సీయగా యేసుకు ఉన్న సంబంధాలను దమస్కులో ఉన్న యూదులు ఎదురు చెప్పలేనంతగా వివరించగలిగాడని స్పష్టమౌతుంది.
9:23-25 అనేక దినములు గతించిన పిమ్మట అంటే దమస్కులో ఉన్న విశ్వసించని యూదుల శత్రువుల జాబితాలో సౌలు మొదటిస్థానానికి వచ్చాడంటే అతడు యేసును మెస్సీయగా ఎంత కర్తవ్య దీక్షతో ప్రకటించాడో అర్థం చేసుకోవచ్చు. అతడు వచ్చింది అభివృద్ధి చెందుతున్న క్రైస్తవ ఉద్యమాన్ని అణచడంలో సహాయం చేయడానికి, కానీ ఇప్పుడు దాని అభివృద్ధికి అతడు ముఖ్యకారణంగా మారాడు. అందువల్ల వారు అతనిని చంపనాలోచించారు. పట్టణ ద్వారాలగుండా వెళ్ళలేక, చాలా అగౌరవమైనదైనా ప్రభావవంతమైనదైన పద్ధతిలో - రాత్రివేళ, గంపలో ఉంచబడి, గోడగుండ క్రిందికి దింపడంతో సౌలు తప్పించుకున్నాడు.
9:26 యెరూషలేము విశ్వాసుల మధ్య మాత్రం, సంఘాన్ని హింసించేవాడుగా సౌలు పేరు ఇంకా మారలేదు. దమస్కు నుండి వారికి ఇంకా సమాచారం రాలేదో, లేక యెరూషలేములోని శిష్యులు “కనిపెట్టి చూద్దాం” అనే వైఖరితో ఉన్నారో తెలీదు. అతని మార్పు, అప్పుడే రూపుదిద్దుకుంటున్న క్రైస్తవ ఉద్యమాన్ని, లోపలి నుండి నాశనం చేయడానికి అతని కుతంత్రంగా వారు అనుమానించి వుండవచ్చు. 22:17-21 నోట్సు చూడండి.
9:27 సౌలు మారుమనస్సులోని యథార్థత బర్నబాను ఒప్పించింది.
9:28-30 గ్రీకు భాషను మాట్లాడు యూదులతో సౌలు మాటలాడుచు, తర్కించుచు వచ్చాడు. వారిలో కొందరు స్తెఫనును రాళ్ళతో కొట్టి చంపినప్పుడు అతనితోపాటు ఉన్నవారు కావచ్చు (7:57-60), గ్రీకు భాష మాట్లాడే యూదుడుగా, పౌలు తార్సులో జన్మించి, మాతృభాషగా గ్రీకు మాట్లాడేవాడు. తమలో ఒకడు, ఇంతకుముందు సంఘాన్ని హింసించినవాడు, క్రైస్తవ్యం తరుపున వాదించడం వారు సహించలేకపోయారు. వారు సౌలును చంప ప్రయత్నము చేసిరి, అందువల్ల అతడు తప్పించబడి, తన స్వంత పట్టణానికి పంపివేయబడ్డాడు.
9:31 ఆది సంఘ అభివృద్ధిలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈ వచనం గుర్తిస్తుంది (1:8 నోట్సు చూడండి). హింస కారణంగా యెరూషలేము నుండి బయటికి వెళ్ళడానికి బలవంతం చేయబడ్డ సంఘం, యూదయ, గలిలయ, సమరయలలో సమాధానము కలిగివుంది. -
ఇది క్రైస్తవ్యాన్ని ఇశ్రాయేలు నుండి బయటికి తీసుకువెళ్ళడం అనే రెండవ స్థాయి. ఎదుగుదలకు సంఘాన్ని సిద్ధపరచింది.
9:32 లుద్దలో ఉన్న పరిశుద్దులు, పెంతెకొస్తు పండుగ కాలం నుండి, విశ్వాసులను యూదయ అంతటా చెదరగొట్టిన హింస వచ్చిన కాలం నుండి అక్కడ ఉన్నవారు కావచ్చు (8:1). వారి ఆరంభాన్ని ఫిలిప్పు పరిచర్య నుండి (8:40) కనుగొనే అవకాశం కూడా ఉంది.
9:33-35 స్వస్థత కార్యాలకు కారణం యేసు క్రీస్తు అని చెప్పడానికి అపొస్తలులు ఎన్నడూ సంశయించలేదని మరలా మనం చూస్తాం (3:6). దీనికి పరోక్ష రుజువు, లుద్ద, షారోనులోని ప్రజలు ఐనెయ స్వస్థపడడం చూచినపుడు విశ్వాసంతో అపొస్తలిక సందేశకులవైపు. కాక ప్రభువుతట్టు తిరిగారు.
9:36 తబిత (గ్రీకు దొర్కా అక్షరార్ధంగా లేడి)ను శిష్యురాలు అని పిలిచారు. ఆమె పన్నెండుమంది అపొస్తలులలో ఒకరు కాదు. కానీ ఆమె చురుకుగా యేసును అనుసరించింది అనేది స్పష్టం.
9:37-38 దేవుడు పేతురు, ఇతర అపొస్తలుల ద్వారా అద్భుతాలను ఎంత బలంగా చేశాడంటే, చనిపోయి, ఆచారప్రకారం ఆమె శవమును కడిగి, అందరూ చూడడానికి మేడగదిలో పరుండబెట్టినప్పటికీ, యెప్పేలో ఉన్న క్రైస్తవులు నిరాశచెందక పేతురుకోసం కబురు పెట్టారు.
9:39-42 చనిపోయిన స్త్రీతో పేతురు చెప్పిన మాటలు, యాయీరు కుమార్తెతో యేసు చెప్పిన మాటలకు "తలి తాకుమీ") ఇంచుమించు సమానంగా ఉన్నాయి (మార్కు 5:41).
9:43 చర్మకారులు చచ్చిన జంతువులను ముట్టుకుంటారు కాబట్టి, వారిని తరచు అపవిత్రులుగా ఎంచేవారు. అంటే బహుశా ఈ కాలానికి ఈ విషయంలో యూదుల నియమం సడలించి వుండవచ్చు లేక క్రీస్తులో తనకున్న స్వేచ్ఛను బట్టి పేతురు అప్పటికే యూదుల ధర్మశాస్త్రము నుండి విడుదలను అనుభవిస్తూ ఉండివుండవచ్చు (10:6,32) అని ఇది సూచిస్తుంది.