Mark - మార్కు సువార్త 3 | View All

1. సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను.

2. అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి.

3. ఆయననీవు లేచి న మధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి

4. వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి.

5. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచినీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.

6. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.

7. యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను,

8. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంత ములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.

9. జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధ పరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను.

10. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడు చుండిరి.

11. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలువేసిరి.

12. తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.

13. ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారా యన యొద్దకు వచ్చిరి.

14. వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు

15. అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను.

16. వారెవర నగాఆయన పేతురను పేరుపెట్టిన సీమోను

17. జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము.

18. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,

19. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు.

20. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను.

21. ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

22. యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.

23. అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును?

24. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు.

25. ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ యిల్లు నిలువనేరదు.

26. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువ లేక కడతేరును.

27. ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనవచ్చును.

28. సమస్త పాపములును మనుష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని

29. పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

30. ఎందు కనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి.

31. ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి.

32. వారుఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయ నతో చెప్పగా

33. ఆయననా తల్లి నా సహోదరులు ఎవరని

34. తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును;

35. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను.బైబిల్ అధ్యయనం - Study Bible
3:1-2 యేసు మరల ప్రవేశించిన సమాజమందిరము బహుశా కపెర్నహూములో ఉన్నదై ఉంటుంది. “నేరము" అనేది ఒక వ్యక్తిపై నేరము మోపవలెనని తెలియచేసే చట్టపరమైన పదం (15:3-4 తో పోల్చండి). ఆయనను కనిపెట్టుచుండిన వారిలో పరిసయ్యులు ఉన్నారు (వ. 6). ఆయన స్వస్థపరచునేమో అని చూడడం స్వస్థపరచడంలో యేసుకున్న సామర్థ్యం గురించి వాళ్లు ప్రశ్నించలేదని సూచిస్తుంది. విశ్రాంతిదినమున స్వస్థపరిచే సాహసం ఆయన చేస్తాడా లేదా అని మాత్రమే వాళ్లు తెలుసుకోవాలనుకున్నారు. ప్రాణాన్ని కాపాడే వైద్యం, ముందు జాగ్రత్తగా చేసే వైద్యపరమైన చర్యలు మాత్రమే విశ్రాంతి దినాన చట్టబద్ధంగా పరిగణించబడేవి.

3:3-4 లేచి మధ్యన నిలువుమని చెప్పిన మాటలు “యేసు ఆ వ్యక్తిని స్వస్థపరచబోతున్నాడని" సూచిస్తున్నాయి (1:31; 2:9, 11-12; 5:41; 10:49), ధర్మమా? అనే మాట ఇంతకు ముందు జరిగిన సంభాషణను గుర్తుచేస్తుంది (2:24,26). 

3:5 వారి హృదయకాఠిన్యము అనేది “దేవుని సత్యాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తృణీకరించడాన్ని” తెలియచేస్తుంది. వారి హృదయకాఠిన్యమే యేసును భావోద్వేగానికి గురిచేసింది. శిష్యుల హృదయకాఠిన్యం గురించి మార్కు రెండు సందర్భాల్లో ప్రస్తావించాడు (6:52; 8:17) 

3:6 ఇక్కడ హేరోదీయులున్నారని కేవలం మార్కు మాత్రమే ప్రస్తావిస్తున్నాడు (మత్తయి 12:14; లూకా 6:11తో పోల్చండి). మార్కు 12:13లోనూ మత్తయి 22:15-17లోనూ వీరి గురించిన ప్రస్తావన ఉంది, బహుశా మార్కు 8:15లో కూడా వీరి గురించిన సూచన కనబడుతుంది. మహా హేరోదుకూ, అతని కుటుంబానికి " ఇక్కడ మరిముఖ్యంగా గలిలయను పరిపాలిస్తున్న హేరోదు అంతిపకూ మద్దతిచ్చిన యూదులే హేరోదీయులు. హేరోదీయులు కొ.ని.లో పరిసయ్యులకు మిత్రబృందంగా ఉండేవారు. ఇది చాలా హాస్యాస్పదమైన, విచారకరమైన విషయం. ఎందుకంటే హేరోదీయులు (కీయవాదాన్ని (హెలెనిజమ్), గ్రీకు ప్రాబల్యాన్ని సమర్థించేవారు, పరిసయ్యులు గ్రీకు ప్రాబల్యాన్ని వ్యతిరేకించేవారు. ఈ రెండు విభిన్నమైన రాజకీయ, మత నేపథ్యాలున్న గుంపులు ఏకంకావడం యేసు ఎంత తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడో తెలియచేస్తుంది. 

3:7-8 గలిలయ... యూదయ... యెరూషలేములు యూదుల ప్రాంతాలు. ఇదూమయ అనే పా.ని. కాలంలో నెగెబులో యూదయకు దక్షిణంగా ఉన్న ఎదోమీయుల ప్రాంతం. యూదులతో అన్యులతో నిండిన ప్రాంతం ఇది. యొర్దాను అవతల అనేది యొర్దానుకు తూర్పు దిక్కులో, పెరయలో
యూదులుండే ప్రాంతాన్ని సూచిస్తుంది. తూరు సీదోనులు గలిలయకు ఉత్తర దిశలోని ప్రాచీన ఫేనీకయ ప్రాంతానికి చెందినవి, అందులో ఎక్కువశాతం అన్యజాతుల వాళ్లుండేవారు, అయితే అక్కడ యూదులు కూడా ఉన్నారు. గుంపులు గుంపులుగా అనేమాట యేసు కీర్తి ప్రతిష్టలు ఎంత విస్తారంగా వ్యాపించాయో తెలియచేస్తుంది.

3:9-10 యేసు అనేకులను స్వస్థపరిచెను. అందువలన రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ప్రయత్నించారు. అలాంటి సంఘటనల్లో ఒకదాన్ని మార్కు 5:24-34 లో వివరించాడు. 

3:11-12 నీవు దేవుని కుమారుడవు అనే మాట వివరణ కోసం 1:1,11,24 లతో పోల్చండి. మార్కు సువార్తలో ఇప్పటివరకు "యేసు ఎవరు?" అనే విషయాన్ని కేవలం తండ్రి, అపవిత్రాత్మలే పూర్తిగా అర్థం చేసుకున్నారు. తన్ను ప్రసిద్ది చేయవద్దనే మాట 1:25,34,43 లను గుర్తుచేస్తుంది. 

3:13-15 ఇక్కడ చెప్పిన ఈ కొండేదో స్పష్టత లేదు. ఆ రాత్రంతా యేసు ప్రార్థనలో గడిపాడు (లూకా 6:12). తనకిష్టమైన వారిని పిలువగా అనే మాట పన్నెండుమంది శిష్యుల కంటే ఎక్కువ మందిని పిలిచాడని తెలియచేస్తుంది. (లూకా 6:13 తో పోల్చండి), పండ్రెండు అనే సంఖ్య ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలను గుర్తుచేస్తుంది. (మత్తయి 19:28; లూకా 22:30లతో పోల్చండి). ఆయన ఉద్దేశాన్ని తెలియచేసే ఈ మాటలు అపొస్తలుల విధులను తెలియచేస్తున్నాయి. వారు తనతో కూడ ఉండునట్లు... ప్రకటించుటకు. శిష్యులు ఆయన సందేశాన్ని నేర్చుకోవాలి, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై ఉండాలి.

3:16-17 అపొస్తలులుగా యేసు నియమించిన పండ్రెండు మందిని వ.16-19 లు గుర్తిస్తున్నాయి. ఈ 12 మంది జాబితాను కొ.ని. మరి  మూడుసార్లు పొందుపరిచింది. (మత్తయి. 10:2-4; లూకా 6:14-16; అపొ.కా. 1:13), ఈ పేర్లూ, వాటి క్రమమూ కొన్నిచోట్ల భిన్నంగా ఉన్నాయి. అయితే ఈ మూడు జాబితాలలోనూ పేతురు మొదటిగా ప్రస్తావించబడ్డాడు. యాకోబు, యోహానుల కోపాన్ని బట్టి వాళ్లకు ఉరిమెడు వారని యేసు మారుపేరు పెట్టాడనే విషయాన్ని కేవలం మార్కు మాత్రమే చెబుతున్నాడు (లూకా 9:54). యేసు సన్నిహిత అనుచరుల బృందంగా పేతురు, యాకోబు, యోహానులున్నారు (మార్కు 5:37; 9:2; 14:33).

3:18-19 పేతురు సహోదరుడైన అంధ్య గురించి 1:16-18 నోట్సు చూడండి. ఫిలిప్పు మార్కు సువార్తలో మరెక్కడా ప్రస్తావించబడలేదు, బల్లొమయి అనే శిష్యుడు, నతనయేలు ఒక్కరే అయి ఉండవచ్చు (యోహాను 1:45-46). సువార్త గ్రంథాల్లో మరొకసారి అతడు ప్రస్తావించబడలేదు. మార్కు సువార్తలో మత్తయి ఇక్కడ మాత్రమే ప్రస్తావించబడ్డాడు. అయితే సుంకరియైన లేవి, ఇతడూ ఒక్కరే (2:14; మత్తయి 9:9; 10:3), తోమా యోహాను 11:16లో; 20:24లో కనబడతాడు. అల్పయి కుమారుడైన యాకోబు మరొకసారి ప్రస్తావించబడలేదు. జెబెదయి కుమారుడైన యాకోబు, ఈ యాకోబు వేరు వేరు వ్యక్తులు. తద్దయి. కొ.నిలో మరొకసారి ప్రస్తావించబడలేదు. లూకా రాసిన జాబితాలో తద్దయి అనే పేరు లేదు (లూకా 6:14-16; అపొ.కా.1:13). బహుశా ఇతడూ, “యాకోబు కుమారుడైన యూదా” ఒకరే అయ్యుంటారు (లూకా 6:16; అపొ.కా.1:13). కనానీయుడైన సీమోను (లూకా 6:15తో పోల్చండి) అంటే అక్షరానుసారంగా "జెలోతీయుడైన సీమోను” అని అర్థం. అరామిక్ భాషలో "జెలోతు” అనేమాట ఆసక్తిపరుడు... అని సూచిస్తుంది గానీ అతడు కనానీయుడు అనేదానికి సూచన కాదు. ఈ పదం మతపరమైన, రాజకీయ సంబంధమైన ఆసక్తిపరు(జెలోతు)లను తెలియచేయడానికి ఉపయోగించబడేది. అయితే ఇక్కడ బహుశా సీమోను భక్తిపరమైన ఆసక్తిని ఈ జెలోతు అనే పదం సూచిస్తుండవచ్చు. (అపొ.కా.21:20; 22:3; గలతీ 1:14తో పోల్చండి). సీమోను పేతురుకు ఇతడు భిన్నమైనవాడు. కొ.ని.లో ఇతని గురించి ఎలాంటి వివరణా లేదు. ఈ 12 మంది శిష్యుల జాబితాల్లో ప్రతీచోట ఇస్కరియోతు యూదా చివరిగానే కనబడతాడు. ఇస్కరియోతు అనే మాట అతడు కెరియోతు అనే ప్రాంతం నుంచి వచ్చాడని సూచిస్తుంది. అదే నిజమైతే 12 మంది అపొస్తలుల్లో ఇతడొక్కడే యూదయ ప్రాంతానికి చెందినవాడు.

3:20-21 ఇప్పటివరకు యేసు ఇంటివారు ఎవరనే వివరాలను మార్కు ప్రస్తావించలేదు. సుదీర్ఘమైన ఈ భాగం తర్వాత వాళ్లు కేవలం 6:3లోనే ప్రస్తావించబడ్డారు. మార్కు 3:21లో ప్రస్తావించబడిన తర్వాత వ.31-35 ల్లో వారి పునఃప్రస్తావన ఉంది. పట్టుకొనబోయిరి అనే పదమూ, 6:18; 12:12; 14:1,44ల్లో ఉపయోగించిన “బంధించడం” అనే క్రియాపదమూ ఒక్కటే. యూదు అధికారులు ఏమి చేయాలని చూసారో యేసు కుటుంబ సభ్యులు దానినే చేయ ప్రయత్నించారని మార్కు ఈ విధంగా సూచిస్తున్నాడు. యేసుకు మతి చలించియున్నదని ఆయన కుటుంబం భావించిన సంగతి మత్తయి, లూకాలు ప్రస్తావించలేదు. (కీర్తన 69:8తో పోల్చండి). 

3:22 యేసు కుటుంబాన్ని పరిచయం చేసిన తర్వాత (వ.21), వారి చర్యల గురించి చర్చించడానికి ముందు (వ.31-35), శాస్త్రులతో ఒక సంఘటననూ (వ.22) రెండు ఉపమానాలను (వ. 23-26, 27-30) మార్కు రాశాడు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు అనే విషయం వాళ్లు అధికార ప్రతినిధులని సూచిస్తుంది (7:1తో పోల్చండి). యేసు బయెఱ్ఱబూలు పట్టినవాడై ఉన్నాడనీ (మత్తయి 12:24; లూకా 11:14-16 నోట్సు చూడండి), దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని వాళ్లు చెబుతున్నారు (మత్తయి. 9:34 నోట్సు చూడండి). పరిసయ్యులూ శాస్త్రులూ యేసు శక్తిని తృణీకరించలేదు. దానికి బదులుగా ఆయన శక్తిని వాళ్లు సాతానుకు ఆపాదించారు. (మార్కు 1:13; మత్తయి 10:25; 12:24,27; లూకా 11:15,18-19లతో పోల్చండి).

3:23-27 యేసు - ఉపమానరీతిగా ఇంతకు ముందే మాట్లాడాడు (2:17,21-22). అయితే మార్కులో ఉపమానాల ప్రస్తావన తొలిసారి ఇక్కడే జరిగింది. ఉపమానం అంటే ఒక పోలిక, ఒక సాదృశ్యం. ఇందులో సామెతలు, అలంకారాలు, వివరణలు ఉంటాయి. 3:22లో శాస్త్రులు ఉపయోగించిన తర్కాన్ని తృణీకరించడానికి యేసు ఉపమానాలను ఉపయోగించాడు. ఒక రాజ్యము... ఇల్లు అంతరంగిక విభేదాల వలన బలపరచబడవు. సాతాను రాజ్యంపై దాడి దేవుని రాజ్యం నుండి జరుగుతుంది గాని అతడి స్వంత

రాజ్యంలో నుండి జరగదు. బలవంతుని ఇంట బయటి నుంచి జరిగే దాడి గురించి, బంధించడం గురించి యేసు చేసిన ప్రస్తావన సాతాను బలవంతుడు అని తెలియచేస్తుంది (వ.27; యెషయా 49:24-26; ప్రక 20:1-3 తో పోల్చండి). 

3:28-30 మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేమాట సత్యాన్ని ప్రకటించడంలో యేసుకున్న అధికారాన్ని తెలియజేస్తుంది. మార్కు సువార్తలో ఈ మాటలు ఇక్కడే తొలిసారి కనబడుతున్నాయి (8:12; 9:1,41; 10:15,30; 11:23; 13:30; 14:25,30), ప్రజలు చేసే సమస్త పాపములును, చివరికి దేవదూషణలైనా (2:6-7 నోట్సు చూడండి) క్షమించబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమించబడడు. ఈ వ్యక్తికి క్షమాపణ ఎన్నటికీ ఉండదు. అతడు నిత్యపాపము చేసినవాడై ఉంటాడు (నిత్యపాపం అంటే నిత్య పరిణామాలున్న పాపం అని అర్థం). యేసు చేసిన క్రియలను సాతానుకు ఆపాదిస్తూ, యేసు దురాత్మచేత బలపరచబడ్డాడు. అని చెప్పడమే పరిశుద్దాత్మకు వ్యతిరేకంగా దేవదూషణ చెయ్యడం. 

3:31-35 ఈ వాక్యభాగం వ.20-21 లో మొదలైన సన్నివేశాన్ని ముగిస్తుంది. యేసు తల్లి పేరునూ ఆయన సహోదరులు పేర్లనూ మార్కు రాయలేదు (6:3తో పోల్చండి). ఈ సమయానికే యోసేపు మరణించి ఉంటాడు. వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి అనే మాట యేసుకూ కుటుంబ సభ్యులకు నేరుగా సంభాషణ జరగలేదని కేవలం వేరే వారి ద్వారా సందేశాలు చేరవేయబడ్డాయని తెలియచేస్తుంది. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారే యేసుకు అత్యంత ముఖ్యమైన కుటుంబం. ఆయన ఆధ్యాత్మిక కుటుంబంలో భాగంగా ఉండే అవకాశం ప్రజలందరికీ ఉందని ఇది తెలియచేస్తుంది. 


Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |