Proverbs - సామెతలు 11 | View All

1. దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.

2. అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.

3. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.

4. ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును.

5. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.

6. యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.

7. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.

8. నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును

9. భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.

10. నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.

11. యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.

12. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.

13. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.

14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.

15. ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.

16. నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.

17. దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును

18. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.

19. యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును

20. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.

21. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.

22. వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.

23. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.

24. వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.
2 కోరింథీయులకు 9:6

25. ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును

26. ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.

27. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.

28. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు

29. తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.

30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు

31. నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా?
1 పేతురు 4:18బైబిల్ అధ్యయనం - Study Bible
11:1 దొంగత్రాసు గురించి ద్వితీ 25:13-16 చూడండి. 

11:2 అహంకారము మనిషిని మూర్ఖుడైన బుద్ధిహీనుడిగా, అపహాసకుడిగా చేస్తుంది (1:22 నోట్సు చూడండి), అహంకారులు చివరికి అవమానం పాలవు తారు (18:18). యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం (9:10). ఈ భయభక్తులు విశ్వాసం, వినయము ద్వారా కలుగుతాయి. ఇక్కడ వినయం అంటే అహంకారాన్ని, స్వావలంబనను విడిచిపెట్టడం. 

11:3 యథార్థత స్వచ్ఛతను, విశ్వసనీయతను సూచిస్తుంది. మూర్ఛస్వభావము వంచనను, ద్రోహాన్ని (2:20-22 నోట్సు చూడండి), నాశన కారక స్వభావాన్ని సూచిస్తుంది. 

11:4 ఇక్కడ పేర్కొన్న ఆస్తి దుష్టత్వం ద్వారా సంపాదించిన ఐశ్వర్యమని అర్థం చేసుకోవాలి. 

11:5 మార్గమును సరాళము చేయును అంటే నడక సాఫీగా, సుళువుగా సాగడం కోసం అక్షరార్థంగా “తిన్నగా” చేయడం. యథార్థవంతుడు విసుగు చెందడు, అలాంటి మార్గాల్లో పడిపోకుండా తన గమ్యాన్ని చేరుకుంటాడు. 

11:6 దుష్టులు వారి స్వంత దుష్టపన్నాగాల్లో వారే చిక్కుబడతారు. 

11:7-8 భక్తిహీనుడు చనిపోయినప్పుడు అతని ఆశ భంగమవుతుందని చెప్పడం ద్వారా, నీతిమంతుడు మరణించినప్పటికీ అతని నిరీక్షణ సమసిపోదని వ.7 పరోక్షంగా సూచిస్తుంది. ఇక్కడి వ.6, 8 లతో సహా “సామెతలు" గ్రంథం నిత్యత్వంలో ప్రతిఫలాలుంటాయనే భావనను సూచితార్థంగా బలపరుస్తుంది (3:22 నోట్సు చూడండి). 

11:9 భక్తిహీనుడు తన నోటిమాట చేత ఇతరుల మీద అపనిందలు మోపుతాడు. నీతిమంతులు తమ తెలివిచేత, తమ స్నేహితుల తెలివిచేత వాటి నుండి తప్పించుకుంటారు. నీతిమంతుల గురించి తెలిసినవారు వారి మీద పడిన నిందలు నిజం కావని గ్రహిస్తారు. 

11:10-11 పట్టణం యొక్క క్షేమం నీతిమంతులు వర్ధిల్లడం మీదా, భక్తిహీనులు నశించడం మీదా ఆధారపడి ఉంటుంది. యథార్థవంతుల దీవెన దేవుడు వారి కనుగ్రహించిన ఆశీర్వాదాన్ని సూచిస్తుండవచ్చు. 

11:12 బుద్దిలేనివాడు గురించి 6:30-33 నోట్సు చూడండి. 

11:13 కొండెగాడై తిరిగేవాడు. అపవాదులను ప్రచారం చేస్తాడు (లేవీ 19:16; యిర్మీయా 6:28; 9:4; యెహె 22:9).

11:14 ఆలోచనకర్తలు ఉన్నచోట అత్యంత జ్ఞానయుక్తమైన ప్రణాళికలు వస్తాయి. 

11:15 అపరిచితుడి అప్పుకు హామీగా ఉండడం దయ చూపడం అనిపించుకున్నా అది బుద్ధిహీనమైనది కూడా..

11:16 జీవితంలో ఐశ్వర్యము కంటే మరింత ప్రాముఖ్యమైనవి వున్నాయని ఈ వచనం తెలియజేస్తుంది. (వ.28; 22:1 తో పోల్చండి). అనేకమంది బలిష్టులు ఘనత పొందడం కంటే, ఒక్క నెనరుగల స్త్రీ ఘనత పొందడం ప్రధానమైంది. 

11:17 దయగలవాడు నమ్మకమైన ప్రేమతో కూడిన కార్యాలు చేస్తాడు (హెబ్రీ. ఫేసెద్; 19:22 నోట్సు చూడండి). అతడు ఇతరుల మేలును కూడా పట్టించుకుంటాడు. ఇందుకు భిన్నంగా, క్రూరుడు కరుణ లేకుండా, అపనమ్మకంగా ప్రవర్తిస్తాడు, ఇతరుల మేలు గురించి అసలే ఆలోచించడు. ! 

11:18 దుష్టుడి సంపాదన భ్రాంతి మాత్రమే, మోసముతో సంపాదించింది అశాశ్వతం. శాశ్వతమైన బహుమానము నమ్మదగినది. ఈ వచనంలో ఒక చమత్కార పదప్రయోగం కనబడుతున్నది. హెబ్రీ పదం షెకెర్ "మోసము" అనే అర్థాన్నిస్తుండగా, సెకెర్ అనే పదం “బహుమానము” అనే అర్థాన్నిస్తుంది. 

11:19 జీవదాయకము గురించి 3:22 నోట్సు చూడండి. 

11:20 ఈ సామెతకు 10:9; 19:1; 28:6 వచనాలతో సంబంధం ఉంది. పై వచనాల్లోని యథార్థత అనే పదం ఈ వచనంలోని "యథార్థముగా” అనే పదానికి సంబంధించినవే (2:7 నోట్సు చూడండి). 10:9 లోని *కుటిలవర్తనుడు" అనే పదానికీ, 19:1 లోని “మూరముగా - మాటలాడు” అనే పదానికీ, 28:6 లోని “వంచకుడై" అనే పదానికి సంబంధించిన పదమే మూర్ఖచిత్తులు (2:15 దగ్గర “వంకరవి" వివరణ చూడండి). ఈ వచనంలోని ప్రవర్తించువారు అన్నది 10:9 లోని "ప్రవర్తించు" అనే పదానికి, 28:6 లోని “వంచకుడై ... యథార్థముగా ప్రవర్తించు” అనే పదానికి సంబంధించినది. నిరుపేదలైనప్పటికీ యథార్థంగా ప్రవర్తించేవారు. (19:1; 28:6) సమృద్ధిని కలిగి ఉంటారు, ఎందుకంటే వారు దేవునికి ఇష్టులుగా ఉంటారు. ఇందుకు భిన్నంగా, బుద్ధిహీనుడై పెదవులతో మూర్ఖంగా మాట్లాడేవారు. (19:1), కుటిల ప్రవర్తన కలిగినవారు (10:9), వంచనతో మంచిని వక్రీకరించేవారు (28:6) నాశనానికి దగ్గరగా ఉన్నారు. వారు ఎంత ధనవంతులైనప్పటికీ వారి కుటిలత్వం బయటపడుతుంది (10:9), వారు యెహోవాకు హేయులు. " అతడు ఇంకా మూర్ఖత్వంలోనే కొనసాగుతుంటే అతడు బుద్దిహీనుడు (హెబ్రీ. కేసిల్, 19:1). 

11:21 నిశ్చయముగా అంటే కరచాలనంతో ఒప్పందాన్ని ఖరారు చేసుకు న్నంత నిర్ణయాత్మకంగా అని అర్థం (6:1). శిక్ష తప్పదు అనే మాట గురించి 6:27-29 నోట్సు చూడండి. నీతికలిగి ఉండడం చాలా శక్తిమంతమైంది, ఎంతగానంటే నీతిమంతుల తరువాతి తరం సైతం తమపై తమ తలిదండ్రుల నీతి ఫలం ప్రభావం ద్వారా శాశ్వతమరణం నుండి విడిపింప బడే మార్గాన్ని ఎరిగి ఉంటారు (నిర్గమ 20:6; యెహె 18 తో పోల్చండి)... 

11:22 పంది అపవిత్రమైన జంతువు. పందినెంతగా అలంకరించినప్పటికీ అది దాని సహజ స్వభావాన్ని కప్పి ఉంచలేదు. 

11:23 నీతిమంతుల కోరిక ఎల్లప్పుడూ ఇతరులకు మంచిచేయాలనేదే. దానికి ప్రతిఫలంగా వారికి ఉత్తమమైనది. తిరిగి వస్తుంది. భక్తిహీనులు
ఇతరులకు హాని చేయడానికి చూస్తుంటారు. కాని వారి ఆశ భవిష్యత్తులో వారి మీదకు ఉగ్రతను తెస్తుంది. 

11:24 వెదజల్లి అంటే మనకు తిరిగి దీవెనలు వస్తున్నాయా లేదా అని ఆలోచించకుండా ఉదారంగా ఇవ్వడం... 

11:25 అవసరతలో ఉన్నవారికి ఔదార్యంతో ఇచ్చే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు.

11:26 మోయాబు రాజు తన రాజ్యం గుండా నడిచి వెళ్తున్న ఇశ్రాయేలీయు లకు ధాన్యాన్ని అమ్మడానికి నిరాకరించినందు వలన దేవునిచేత శపించబడ్డాడు (ద్వితీ 2:26-31). యోసేపు ఒక కరవు కాలంలో ధాన్యాన్ని అమ్మడం ద్వారా దీవెన పొందాడు (ఆది 41:56; 47:13-20). 

11:27 మేలు చేయగోరువారు అంటే ఇక్కడ పొరుగువాడి క్షేమం కోరుకొనే వారిని సూచిస్తుంది. కీడు చేయ గోరువారు అంటే ఇతరులకు హానిచేయాలని చూసేవారు (బ్రూస్ వాల్డ్క). 

11:28 దేవునిపై నమ్మకముంచి నీతిమంతులు మంచిదేదో దానిని జరిగిస్తారు. దుష్టులు తమ సంపదపై నమ్మకముంచి నాశనాన్ని కొని తెచ్చుకుంటారు.. 

11:29 గాలిని స్వతంత్రించుకొనును అంటే చివరికి మిగిలేది శూన్యం అని అర్థం .

11:30 ఈ వచనంలోని రెండవ పంక్తి (“జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు”) భావం వివరణకు కష్టంగా ఉంది. హెబ్రీలోని పంక్తి అక్షరార్ధంగా "ప్రాణాలు తీసేవాడు జ్ఞానం గలవాడు” అనే అర్థాన్నిస్తుంది. బైబిల్లో ఇతరచోట్ల “ప్రాణం తీయడం” అనేది నిషేధార్థంలో కనబడుతుంది (1:19; 1సమూ 24:11; 1రాజులు 19:10, 14; కీర్తన 31:13; యెహె 33:6). ఇది “ఆత్మను సంపాదించడం” అనే అర్థాన్ని ఇవ్వనే ఇవ్వదు. అయితే ప్రజల్ని చంపేవాడు జ్ఞానం గలవాడు అనేది లేఖనసారాంశానికి విరుద్ధమైనది. కాబట్టి దీనికి మరొక అర్థం ఉండి ఉండవచ్చు. ఒక తర్జుమాలో "తీయడం" అనే పదానికి బదులుగా "కట్టిపడేయడం" అనే అర్థాన్ని ఉపయోగించారు. బహుశా జ్ఞానం గలవారు తమ ఆకర్షణతో ఇతరులను ఇట్టే కట్టి పడేయగలరని అనే అర్ధం అయ్యుండవచ్చు. అయితే సెప్టువజింట్(LXX)లో మట్టుకు "జ్ఞానం” గల (హెబ్రీ. ఖఖిమ్) అనే పదానికి బదులుగా “హింస" (హెబ్రీ. ఖమాస్) అనే పదం కనబడుతుంది. అంటే “హింస ప్రాణాల్ని తీస్తుంది” అని భావం. 

11:31 మరి నిశ్చయముగా అనేది తక్కువనుండి ఎక్కువకు అనే వాదనను సూచిస్తుంది. (15:11; 17:7; 19:7,10; 21:27). అంటే భక్తిహీనులు శిక్షింపబడడం నీతిమంతులు దీవెనలు పొందడం కంటే మరింత నిశ్చయమని చెప్పడం కాదు గానీ, పక్షపాతం లేని దేవుని న్యాయవిమర్శ నీతిమంతులతో మొదలైతే, పాపులు వారి శిక్షను తప్పించుకొనరని దీని భావం (1 పేతురు 4:18). 


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |