Revelation - ప్రకటన గ్రంథము 12 | View All

1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను.

2. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.
యెషయా 66:7, మీకా 4:10

3. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.
దానియేలు 7:7

4. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.
దానియేలు 8:10

5. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.
కీర్తనల గ్రంథము 2:9, యెషయా 7:14, యెషయా 66:7

6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.

7. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా
దానియేలు 10:13, దానియేలు 10:20, దానియేలు 10:21, దానియేలు 12:1

8. ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.

9. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.
ఆదికాండము 3:1, జెకర్యా 3:1-2

10. మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.
యోబు 1:9-11

11. వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.

12. అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగి
యెషయా 44:23, యెషయా 49:13

13. ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసిం చెను;

14. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడ కుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.
దానియేలు 7:25, దానియేలు 12:7

15. కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని

16. భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.

17. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.
దానియేలు 7:21, దానియేలు 7:7బైబిల్ అధ్యయనం - Study Bible
12:1-14:20 ఉగ్రత పాత్రల వరుసకు (15:1-19:5) ముందస్తు విరామంగా ఈ భాగం పనిచేస్తుంది. కథనంలో “విరామ సమయం”గా, ప్రకటనలోని రెండవ సగాన్ని అర్థం చేసుకోవడానికి, ఇది కొన్ని విషయాలను, వ్యక్తులను పరిచయం చేస్తుంది. 

12:1-2 యోహాను తాను నాల్గవ సువార్తలో వాడిన ఒక ముఖ్యమైన పదాన్ని వాడాడు (యోహాను 20:30)- సూచన లేక సూచకక్రియ. ఇది మొదటిగా ఆది 37:9 లో యోసేపు దర్శనాన్ని ప్రతిధ్వనించే ఊహగా, ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ఉపయోగించబడింది. ఈ సూచన, ఎక్కువగా ఇశ్రాయేలు జాతిని లేదా విశ్వసించే శేషమైన యూదులను సూచిస్తుంది. స్త్రీ గర్భిణియై ప్రసవవేదన పడుచు ఉండడం, ఆది 3:15-16ను జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు కన్యకకు పుడతాడనే యెషయా 7:14 ప్రవచనం కూడా ఇక్కడ దృష్టిలోకి వస్తుంది.

12:3 మహా ఘటసర్పము అనే రెండవ సూచన (వ.1-2 నోట్సు చూడండి) వ.9లో అపవాది, సాతాను అని వ్యాఖ్యానించబడింది. ఈ ఘటసర్పమునకు ఏడు తలలు, పది కొమ్ములు ఉండడం, 13:1 లోని క్రూరమృగములాగా ఉంది, కానీ ఇవి రెండూ వేర్వేరు వ్యక్తులని చెప్పడానికి తగినంత తేడా ఉంది (“ఏడు తలలు, పది కొమ్ములు"). 

12:4 ఆకాశ నక్షత్రములలో మూడవభాగము నీర్చి పడవేయడం అనేది, బూరల తీర్పులలో మూడవ భాగాన్ని నాశనం చేయడానికి సంబంధించింది (8:7-10,12; 9:15,18), కానీ ఘటసర్పము సాతానుకు సూచన కాబట్టి, ఈ “నక్షత్రములు" సాతాను తిరుగుబాటులో వానిని వెంబడించిన పతనమైన దూతలు కావచ్చు (మత్తయి. 25:41). ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము నీయెదుట నిలుచుండెను అనే మాటలు, రాజైన మహా హేరోదు శిశువైన యేసును చంపడానికి చేసిన ప్రయత్నం (మత్తయి. 2:1-16) సాతాను ప్రేరణ వలన జరిగింది అని సూచిస్తున్నాయి.

12:5 మగశిశువు... సమస్త జనములను ఇనుపదండముతో అనే మాటలు, మెస్సీయ ప్రవచనాలతో నిండి ఉన్న కీర్తన 2ను ప్రస్తావిస్తున్నాయి. ఇక కథనం ఒక్కసారే క్రీస్తు పుట్టుకనుండి ఆయన ఆరోహణానికి మారిపోయింది (అపొ.కా. 1:9-11 నోట్సు చూడండి).

12:6 కుమారుడు ఆరోహణమైన కొంతకాలం తర్వాత, ఆ స్త్రీ ప్రభువుచేతవెయ్యిన్ని రెండువందల అరువది దినములు (మూడున్నర సంవత్సరాలుఇద్దరు సాక్షులు సంరక్షించబడిన కాలానికి వాడిన అవే పదాలు వాడబడ్డాయి, 11:3) ఆశ్చర్యకరముగా పోషించబడింది. బహుశా ఇద్దరు సాక్షులు ఆరోహణమైన కొంతకాలానికే, ఏడు ఆ సంవత్సరాల శ్రమకాలంలోని రెండవ సగభాగం ఆరంభంలో ఇది జరిగివుండొచ్చు. పారిపోతున్న ఆ స్త్రీ, సాక్షులు పునరుత్థానులై, ఆరోహణమైన తర్వాత (11:11-13) దేవునికి భయపడి (11:18), ఆయనను మహిమపరచిన (11:13) మారుమనస్సు పొందిన యూదులను సూచిస్తుండవచ్చు. ఆ స్త్రీ ఊహాచిత్రం, నమ్మకస్తులైన ఇశ్రాయేలీయుల శేషముతో పాటు, యేసు తల్లియైన మరియకు కూడా కొనసాగింపుగా ఉంది. అరణ్యము ఇశ్రాయేలు దేశం ఫరో సైన్యం నుండి ప్రభువుచే సంరక్షించబడి, మన్నా, పూరేళ్ళతో అద్భుతంగా పోషించబడిన (నిర్గమ 16) స్థలాన్ని సూచిస్తుంది.

12:7-10 స్త్రీ అరణ్యంలోకి పారిపోగానే ఇది చెప్పబడింది. (వ. 6) కాబట్టి, దీని ఫలితం యుగాంతమున భూమిపై వెంటనే ప్రభావం చూపుతున్నందున (వ. 12-13), పరలోకమందు యుద్ధము కూడా బహుశా శ్రమకాలం మధ్యలో జరిగివుంటుంది. ప్రక 12:6 లోని “స్త్రీ” ఇశ్రాయేలులో విశ్వసించే వారి శేషం అనే భావన (11:13; 12:6 నోట్సు చూడండి), ఇశ్రాయేలును కాపాడడానికి నియమించబడిన (దాని 12:1) ప్రధాన దూతయైన మిఖాయేలుతో (యూదా వ.9) ఘటసర్పము (దీన్ని అపవాది - అని సాతానని గుర్తించాం) పోరాటం చేయడంతో బలపరచబడుతుంది.

12:11 విశ్వాసులు తమ విశ్వాసం కోసం మరణించినపుడు, కొన్నిసార్లు విజయం ఓటమిగా కనిపిస్తుంది. సాతాను వారిని చంపాడు, కానీ గొట్టెపిల్ల రక్తముబట్టి (సిలువపై క్రీస్తు మరణం), తామిచ్చిన సాక్ష్యమును బట్టి, అంతిమ విజేతలు వారే. 

12:12 సాతాను పరలోకం నుండి తోసివేయబడ్డాడు. (వ.7-9) కాబట్టి, పరలోకము, పరలోక నివాసులు ఉత్సహించవచ్చు. ప్రకటన గ్రంథంలో “పరలోక నివాసులు", "భూనివాసుల"కు వ్యతిరేకపదం (3:10; 6:9-11; 8:13, 11:8-10; 13:8). భూమిమీదకు పడద్రోయబడిన అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని క్రోధంతో, తన కోపమంతటినీ భూమీ, సముద్రముమీద కుమ్మరిస్తున్నాడు. 

12:13-14 పరలోకంనుండి త్రోయబడి, భూమిమీద పడద్రోయబడిన (వ.7-9), నిరాశతో ఘటసర్పం (సాతాను) ఆ స్త్రీని (విశ్వాసులైన ఇశ్రాయేలీయులను) మూడున్నర సంవత్సరాలపాటు హింసించాడు. కాలము, కాలములు, అర్థకాలము అనే మాటలు -సంవత్సరం, రెండు సంవత్సరాలు, సగం సంవత్సరం- అంటే మొత్తం మూడున్నర సంవత్సరాలని అర్థం. ఈ మాటలు అంత్యకాలములో "పరిశుద్ధులు" హింసింపబడే కాలముగూర్చి దాని 7:25; 12:7. నుండి తీసుకోబడ్డాయి. ఆ స్త్రీకి గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఇవ్వబడడం, అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల సైన్యంనుండి తప్పించుకొన్న ఊహా చిత్రాన్ని ఉపయోగించాడు (నిర్గమ 19:4) 

12:15-16 స్త్రీపై (విశ్వసిస్తున్న ఇశ్రాయేలు; వ.6, 11:13 నోట్సు చూడండి) దాడిచేయడానికి సర్పము... ఘటసర్పము (సాతాను, వ.7-10 నోట్సు చూడండి) వెంటాడడం, అలాగే ప్రభువు సంరక్షణకు సంబంధిం చిన వివరణ (భూమి... ప్రవాహమును మింగివేయడం)లను అక్షరార్థంగా తీసుకోవాల్సివుంటుందా అనేది ఆ తెలుసుకోవడం కష్టం. బహుశా రూపకాలంకారంగా దాన్ని వ్యాఖ్యానించాలి.

12:17 ఆ స్త్రీని ఏమీ చేయలేక, అన్యజనులలోని “పరిశుద్దుల"తో (18:7) యుద్ధము చేయుటకై (అంటే చంపడానికి, 11:7) సాతాను (ఘటసర్పము) దృష్టినిలిపాడు. అన్యజనులు ఆమె సంతానములో శేషించినవారు అని ఎందుకు చెప్పబడ్డారంటే, వారు “ఈ దొడ్డివి (యూదులు) కానీ వేరే గొట్టెలు” (యోహాను 10:16), యోహాను (ప్రక 1:9), పరలోకంలో బలిపీఠము కింద కనిపించే ఇతర హతసాక్షుల (6:9) వంటి వేరే సంతానం దేవుని ఆజ్ఞలు గైకొనుచు, యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నారు. 


Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |