Jonah - యోనా 1 | View All

1. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

2. నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.

3. అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.

4. అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.

5. కాబట్టి నావికులు భయ పడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను

6. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించు నేమో అనెను.

7. అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.

8. కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా

9. అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులుగల వాడనై యున్నాను.

10. తాను యెహోవా సన్నిధిలోనుండి పారి పోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి యుండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయ పడినీవు చేసిన పని ఏమని అతని నడిగిరి.

11. అప్పుడు వారుసముద్రము పొంగుచున్నది, తుపాను అధికమౌచున్నది, సముద్రము మామీదికి రాకుండ నిమ్మళించునట్లు మేము నీ కేమి చేయవలెనని అతని నడుగగా యోనా

12. నన్నుబట్టియే యీ గొప్పతుపాను మీమీదికివచ్చెనని నాకు తెలిసియున్నది; నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించునని అతడు వారితో చెప్పినను

13. వారు ఓడను దరికి తెచ్చు టకు తెడ్లను బహు బలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుపాను బలముచేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను.

14. కాబట్టి వారు యెహోవా, నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి; ఈ మనుష్యునిబట్టి మమ్మును లయము చేయకుందువు గాక; నిర్దోషిని చంపితిరన్న నేరము మామీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసికొని

15. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను.

16. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.

17. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను.
మత్తయి 12:40, 1 కోరింథీయులకు 15:4బైబిల్ అధ్యయనం - Study Bible
1:1 హెబ్రీలో యోనా అంటే “గువ్వ" అని అర్థం. అతని తండ్రి పేరు అమిత్తయి. అంటే “(యెహోవా) నమ్మదగినవాడు”. 

1:2 టైగ్రిస్ నది తూర్పు తీరాన ఉన్న నీనెవె, యోనాకాలం తర్వాత, క్రీ.పూ. 705లో అష్నూరుకు రాజధానిగా మారింది. నేటి ఇరాక్ లోని ఉత్తర భాగంలో, బాగ్దాదుకు వాయువ్యంగా 220 మైళ్ళలో ఉన్న మోసుల్ పట్టణానికి ఎదురుగా నీనెవె శిధిలాలు కనుగొన్నారు. నీనెవె సమరయకు ఈశాన్యంగా 500 మైళ్ళు కఠినమైన ప్రయాణ దూరంలో ఉంది. యోనా ప్రయాణించాలంటే మొదట ఉత్తరంగా వెళ్ళి, ఆ తరువాత తూర్పుకు ప్రయాణించాలి, అంతా కలిపి సుమారు 600 మైళ్ళ దూరం అయ్యేది. పాపం దేవుని పరిశుద్ధతను ఉల్లంఘించింది. వారి దోషమును బట్టి, దేవుడు దూరస్తులైన ఈ అన్యజాతి ప్రజలను బాధ్యులుగా ఎంచి, తనను తాను లోకానికి న్యాయాధిపతిగా కనుపరచుకున్నాడు. అయితే తన ప్రవక్తను పంపి వారిని హెచ్చరించడం ద్వారా వారిపై తన కనికరాన్ని కూడా కనపరచాడు. 

1:3 యెహోవా సన్నిధిలోనుండి...పారిపోవలెనని చూడడం అసాధ్యాన్ని ప్రయత్నించడమే. ఎందుకంటే దేవుడు అన్నిచోట్లా ఉన్నాడు. కాని ప్రజలు ప్రయత్నించడం మానరు కదా! (అతడు ఎందుకు పారిపోయాడో 4:2లో చూడండి). మధ్యధరా సముద్రం తీరాన, నేటి టెల్ అవివకు దక్షిణంగా ఉన్న ఇశ్రాయేలు సహజ ఓడరేవుల్లో యొప్పె ఒకటి. తన్టీషు ఎక్కడుందో సరిగ్గా తెలియదు. తరీషుతోబాటు ఓడల ప్రస్తావన ఉండడం బట్టి (1రాజులు 10:22), అది సముద్రతీరాన ఉన్నదని తెలుస్తుంది. ఎర్రసము ద్రంపై యెహోషాపాతు రాజు ఉపయోగించిన "తర్లీషు ఓడలు" మధ్యధరా సముద్రంలో తర్లీషుకు వెళ్ళడానికి నావికులు ఉపయోగించిన ఓడలను పోలిన వ్యాపార ఓడలై వుండవచ్చు. తగ్లీషును కిలికియలోని పౌలు స్వంత పట్టణమైన తార్సు అనీ, లేక ఇటలీకి పశ్చిమాన ఉన్న స్ఫానియా ద్వీపంపై ఉన్న థర్రోస్ అని గుర్తిస్తారు. అయితే తరీషు అసలైన గుర్తింపు ఫెనికయ కాలనీ అయిన టార్టెస్సుస్. ఇది గ్వాడాల్ క్వివిర్ నదీ తీరాన, పాలస్తీనాకు పశ్చిమంగా 2000 మైళ్ళదూరంలో ఉన్న స్పెయిన్‌కు నైరుతిదిశలో సముద్రతీరంలో ఉంది. బహుశా యోనా నీనెవెనుండి వ్యతిరేక దిశలో ఇంతకంటే ఎక్కువ దూరం వెళ్ళి ఉండకపోవచ్చు. 

1:5-6 దేవుని పిలుపుకు అతని స్పందన వర్ణనలకు సమాంతరంగా యోనా ఆధ్యాత్మిక పతనం కనిపిస్తుంది. అతడు “లేచి” (వ.2) నీనెవెకు వెళ్ళమని చెబితే దాని దిగువన ఉండే యొప్పేకు "దిగి, ఓడలోకి "దిగి వెళ్ళాడు (వ.3 ఇంగ్లీషు తర్జుమా), చివరిగా ఓడలో దిగువ భాగానికి వెళ్ళాడు. చేప మింగిన తర్వాత అతడు సముద్రం అడుగున ఉన్న “పర్వతముల పునాదులలోనికి" మునిగిపోయాడు (2:6). అప్పుడు అట్టడుగుభాగం తగిలి, పైకి లేవడం ఆరంభించాడు. తుపాను మధ్యలో అతడు గాఢనిద్ర పోవడం అతని ఆధ్యాత్మిక స్థితికి సాదృశ్యంగా ఉంది. ఇష్టపూర్వకంగా అవిధేయత చూపినందువల్ల వచ్చిన కృంగుబాటుకు అది ఒక లక్షణం అయివుండవచ్చు. 

1:7-8 నావికుల లోకదృష్టి ప్రకారం, దేవతల కోపం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. అతని దేవునికి వచ్చిన కోపాన్ని పోగొట్టడానికి ఏమి చేయాలో చెప్పమని వారు యోనాను అడిగారు. 

1:9 భయభక్తులు. పా.ని.లో భయభక్తులు, ఒకడు. చెడునుండి మళ్ళుకొని దేవుని ఆజ్ఞలకు లోబడునంతగా దేవుని పట్ల చూపే గౌరవం (ఆది 22:12; యోబు 1:8; 28:28; సామె 8:13). చిత్రంగా దేవుని ప్రవక్త అయిన యోనా తన అవిధేయతలో అలాంటి భయమేమీ చూపలేదు. నీనెవె వెళ్ళి అక్కడి అన్యులకు సువార్త ప్రకటించడానికి నిరాకరించి పారిపోతున్న యోనా, ఓడలో ఉన్న అన్యులకు ప్రకటిస్తుండడం మరీ చిత్రం. “యెహోవా” అంటే “ఉన్నవాడు” అనే దేవుని పా.ని. వ్యక్తిగత నామం. హెబ్రీ భాషలో “యెహోవా” అనే వ్యక్తిగత నామాన్ని రాయకపోవడం అనేది దేవుని పరిశుద్ధమైన పేరును పలకడానికి అభ్యంతరంగా భావించిన చెర తరువాతి యూదుల కాలం నుండి కొనసాగింది. 

1:10-11 యోనా దేవుడు సముద్రానికి సృష్టికర్త అని చెప్పడం నావికులకు భయాన్ని కలిగించి వుంటుంది. ఏదైన బలి అర్పిస్తే సముద్రము శాంతిస్తుందని వారు ఆశించారు. 

1:12-15 దేవునికి లోబడకుండా, తనను ఓడ నుండి బయటికి సముద్రంలో పారవేసి చంపమని యోనా వారిని అడిగాడు. యోనా తన పాపాన్ని ఒప్పుకోవ డం వలన ఈ అన్యజాతి ప్రజలు అతణ్ణి చంపడానికి నైతికంగా ఇష్టపడక, ఓడను ఒడ్డుకు నడిపించడానికి ప్రయత్నించారు. చివరికి వేరే దారి కనబడక, అతని మరణానికి తమను బాధ్యులుగా ఎంచవద్దని యెహోవాను వేడుకుని, యోనాను సముద్రంలో పడవేశారు. ఈ అన్యుల యథార్థత, భయభక్తులు యూదేతరులు దేవుని దయకు పాత్రులు కారని ఎంచే ఇశ్రాయేలీయులు చదివినప్పుడు వారి విశ్వాసానికి ఆశ్చర్యపోయి వుంటారు. యోనాకు సహితం ఇలాంటి పాఠం అవసరం. 

1:16 సముద్రం నిమ్మళించగానే, అన్యులైన ఈ నావికులందరూ యెహోవాకు మిగుల భయపడిరి. వారు ఈ అనుభవం చేత ఎంతగా ఒప్పించబడ్డారంటే వారు యెహోవాను పూజించడం తప్ప మరేమీ చేయలేకపోయారు (1:9 నోట్సు చూడండి). అన్యులకు ప్రకటించకుండా ఉండడానికి పారిపోతున్న యోనా, అనుకోకుండానే అన్యులైన ఓడ సిబ్బందినంతటినీ మారుమనస్సుకు నడిపించాడు. 

1:17 యోనాను మింగిన గొప్ప మత్స్యము, తిమింగలమే అయి వుండనక్కర లేదు. తిమింగలం నోట్లో పడి బ్రతికిన యోనాలాంటి కథలు, ఈ మధ్య శతాబ్దాలలో అనేకం జరిగాయని నావికులు చెప్పారు. కాని ఏదీ రూఢిగా చెప్పలేం. మూడు దినములు, క్రీస్తు మూడవరోజున పునరుత్థానుడవ్వడానికి సమాంతరంగా ఉన్నాయి (మత్తయి 12:40). 


Shortcut Links
యోనా - Jonah : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |