Micah - మీకా 6 | View All

1. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము.

2. తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయులమీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునా దులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.

3. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి.

4. ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.

5. నా జనులారా, యెహోవా నీతి కార్య ములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించినదానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలువరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చు కొనుడి.

6. ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా?

7. వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?

8. మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
మత్తయి 23:23

9. ఆలకించుడి; యెహోవా పట్టణమునకు ప్రకటన చేయు చున్నాడు. జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్య పెట్టును, శిక్షనుగూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి

10. అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా.

11. తప్పుత్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?

12. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.

13. కాబట్టి నీవు బాగు పడకుండ నేను నీ పాపములనుబట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును.

14. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీ వెప్పుడు పస్తుగానే యుందువు, నీవేమైన తీసికొనిపోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసికొని కొనిపోవుదానిని దోపుడుకు నేనప్పగింతును.

15. నీవు విత్తనము విత్తుదువుగాని కొయ్యక యుందువు, ఒలీవపండ్లను ద్రాక్షపండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసికొన కయు ద్రాక్షారసము పానముచేయకయు ఉందువు.
యోహాను 4:37

16. ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచ రించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుస రించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదము గాను చేయబోవుచున్నాను.



బైబిల్ అధ్యయనం - Study Bible
6:1-16 మీకా ఈ అధ్యాయంలో దేవుని నేరారోపణను నిబంధన వ్యాజ్యెంతో ముద్రించి (వ.1-2), దేవుని ఔదార్యాన్ని సమర్ధించి (వ. 3-5), ప్రజల స్పందన విని (వ.6-7), దేవుని తీర్పుకు ఆధారమేమిటో చెప్పి (వ.8), నిర్దిష్టమైన నేరారోపణలు చేసి (వ.9-12), దేవుని తీర్పును, శిక్షను ప్రకటిస్తున్నాడు (వ.13-16). 

6:1-5 దేవుని నిబంధన పట్ల విశ్వాసఘాతకులయ్యా రని ప్రజలపై మీకా తీవ్రమైన నేరారోపణ చేస్తూ, పర్వతములను, కొండలను సాక్షులుగా పిలిచి, దేవుని వ్యాజ్యెమును వాదించబోతున్నాడు (వ.1). గతంలో వారిపట్ల జరిగించిన తన నీతికార్యాలను దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయన వారిని ఐగుప్తు నుండి విడిపించాడు, మోషే, యెహోషువ వంటి నమ్మకస్తులైన నాయకులను ఇచ్చాడు, శత్రువు తంత్రాలను కూల్చాడు, అద్భుతమైన రీతిలో యోర్డానునది గుండా వారిని నడిపించాడు. ఆయన నీతికార్యములను ప్రజలు మరచిపోకుండా మనస్సునకు తెచ్చుకోవాలి. వ.5 గురించి సంఖ్యా 24-25 అధ్యా. చూడండి. షిత్తీముకు (సంఖ్యా 25:1) గిల్గొలుకు (యెహో 4:19) మధ్య విజయారంభం ఉంది.

6:6-7 దేవుడు అడిగేవి అసంబద్దంగా ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. అర్పణలు, బలులు, వారి జేష్ఠపుత్రుని తీసుకురావడం దేవుని షరతులను తృప్తిపరచలేకపోతున్నాయి. 

6:8 దేవుడు కోరే ఉత్తమ విషయాలు ప్రజలకు ముందే తెలుసు (కీర్తన 14:1, 3; 37:3). దేవుని ఆసక్తి బలులమీద లేదు, వాటిని అర్పించేవాని మీద ఉంది. ఒక వ్యక్తి తెచ్చే అర్పణకంటే, దానిని అర్పించే ఆ వ్యక్తి వ్యక్తిత్వం, ప్రవర్తనే దేవునికి ముఖ్యం. . ప్రజలు దేవుని ప్రమాణాలకు తగ్గట్టుగా న్యాయముగా ఉండాలి. వారు ప్రేమించి, ఒకరిపట్ల ఒకరు కనికరమును ప్రేమ, కరుణ కలిగి ఉండాలి. వారు దేవునితో నిత్యము కలసి నడిచే దీనమనస్కులుగా (ఆది 6:9), ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించేవారుగా ఉండాలి. 

6:9-12 యెరూషలేములోని నాయకులు హింసను సామాజిక అన్యాయాన్ని అనుసరించారు. తమ వ్యాపారాల్లో ప్రజలను మోసం చేశారు (ఆమోసు 8:45). ఐశ్వర్యవంతులు, శక్తివంతులైనవారు బలహీనులను బలత్కారము చేసి, తిట్టి, అబద్ధాలు మోసాలతో వారికి ద్రోహం చేశారు.

6:13-16 పాపాలకు తీర్పు ఉంటుందనే దేవుని మాట నిశ్చయం. వారు చేసే అన్ని గట్టి ప్రయత్నాలను దేవుడు భంగం చేస్తాడు. విగ్రహారాధికులు, దుష్టులైన ఒట్రీ, అహాబు రాజులను అనుసరించారు కాబట్టి (1రాజుల 16:25-33 చూడండి), దేవుడు. యెరూషలేమును నిర్జనంగా చేసి, దాని నివాసులను అపహాస్యాస్పదముగా చేస్తాడు. అహాబు యెహోవా ప్రవక్తలను చంపాడు (1రాజులు 18:4), నాబోతు కుటుంబస్వాస్యాన్ని దురాశ, అబద్దం, నరహత్యతో లాక్కున్నాడు (1రాజులు 21:1-16). 


Shortcut Links
మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |