Chronicles II - 2 దినవృత్తాంతములు 1 | View All

1. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడ ఉండి అతనిని బహు ఘనుడైన రాజునుగా చేసెను.

2. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక

3. సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల యిండ్లకు పెద్దలైనవారి కందరికిని, అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును

4. సొలొమోనుతో కూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి; దావీదు దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తెప్పించి యెరూషలేమునందు దానికొరకు గుడారమువేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను.

5. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి.

6. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను.

7. ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమైనేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవియ్యగా

8. సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెనునీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి యున్నావు గనుక

9. దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైన జనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు

10. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.

11. అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెనునీవు ఈ ప్రకారము యోచించు కొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు.

12. కాబట్టి జ్ఞానమును తెలివియు నీ కియ్య బడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను.

13. పిమ్మట సొలొమోను గిబియోనులోనుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీ యులను ఏలుచుండెను.

14. సొలొమోను రథములను గుఱ్ఱపు రౌతులను సమ కూర్చెను, వెయ్యిన్ని నాలుగువందలు రథములును పండ్రెండు వేల గుఱ్ఱపు రౌతులును అతనికి ఉండెను; వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను.

15. రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేల ప్రదేశముననున్న మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను.

16. సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర నిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి.

17. వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
1:1 ఒకానొక కాలంలో 1, 2 దినవృత్తాంతములు గ్రంథములు కలిపి ఒకే గ్రంథపు చుట్టగా ఉండేవి. అయితే ఒక అర్థవంతమైన సందర్భంలో ఇది విభాగించబడటం మనం ఇక్కడ గమనించగలం. ఈ క్రమంలో అనేక వివరాలను సమీక్షించిన వృత్తాంతకారుడు తన కథనం సరికొత్తగా ప్రారంభించాడు.
వృత్తాంతాలను మనం “ఎజ్రా రాసిన సువార్త"గా భావిస్తే, సొలొమోను పాలనలో జరిగేదంతా దేవుని కృపా వ్యక్తీకరణ అని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడైన యెహోవా అతనితో కూడ ఉండి అతడిని బహు ఘనుడైన రాజుగా చేశాడు. ఇది కేవలం ఒక సమర్థుడైన రాజు గురించిన కథనం కాదు, అతనికి మద్దతుగా నిలిచిన దేవుని గురించిన వృత్తాంతం. ఫలితంగా సొలొమోను రాజ్యంపై తన పట్టు పెంచుకున్నాడు, రాజ్యమును స్థిరపరచబడేలా చేసుకున్నాడు. సైనిక సిద్ధపాటు అవసరమని తెలిసినా, సొలొమోను యుద్ధాశక్తి కలవాడు కాడు. అయితే అతడు ప్రజలను ఇతర విధానాలలో ఐక్యపరచాడు. ప్రధానంగా రాజ్యాన్ని పటిష్టపరచాడు, అనేక , కట్టడాలు నిర్మాణానికి రూపకల్పన చేశాడు. వీటిలో మందిర నిర్మాణ కార్యక్రమం అసాధారణమైంది.

1:2 సొలొమోను ప్రారంభ ప్రసంగ పాఠం మనకు ఇవ్వబడలేదు గానీ, అతడు ప్రసంగం చేశాడనే వాస్తవం నాయకునిగా అతని చాతుర్యాన్ని చూపిస్తుంది. తన కొత్త పరిపాలన ఆవిష్కరణ ఉత్సవంలో రాజ్యమంతటి నుంచి ప్రతినిధులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశాడు. 

1:3-5 ఇశ్రాయేలు దేశంలో పవిత్ర స్థలాల గురించి నెలకొన్న సందిగ్ధ పరిస్థితిని వృత్తాంతకారుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేశాడు. కేంద్రీయ ఆరాధనా స్థలమైన ప్రత్యక్ష గుడారం ఇంకా గిబియోనులోనే ఉంది. మోషే కాలంలో బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము కూడా అక్కడే ఉంది (నిర్గమ 38:1-3). ఈ యిత్తడి బలిపీఠము నిజానికి యిత్తడి చట్రంతో కప్పిన చెక్క బలిపీఠం. 

1:6 దావీదు ఏర్పాటు చేసిన విధానాన్ని అనుసరించి (1దిన 29:21) సొలొమోను వెయ్యి దహన బలులు అర్పించాడు. సొలొమోను అర్పించినవన్నీ దహనబలులు, అంటే ఆ బలిపశువులన్నీ అగ్నిచేత దహించబడ్డాయని అర్థం.
ఈ బల్యర్పణలన్నీ ఒక్కరోజులోనే అర్పించాలంటే, ఆ యాజకులు ఒకేసారి డజన్ల సంఖ్యలో దహనబలి పశువులను అర్పించి వుంటారు.

1:7-10 దేవుడు ఇచ్చిన ఆహ్వానానికి స్పందించిన సొలొమోను (వ.7) తనకు జ్ఞానము కావాలని అడిగాడు. అప్పటికే అతనికి గుర్తించదగిన జ్ఞానం ఉందని దీనిని బట్టి కనపరుచుకున్నాడు. అప్పటికి సొలొమోనుకు రమారమి ఇరవై సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది. తన శత్రువైన అదోనియాను తొలగించుకోవడం, యాజకత్వాన్ని సాదోకు నాయకత్వంలో ఐక్యపరచడం (1రాజులు 1-2) వంటి చర్యలతో నాయకత్వం వహించడానికి తాను సమర్థుడనని సొలొమోను నిరూపించుకున్నాడు.
ఈ దృశ్యంలో సొలొమోను అర్పించిన , అసాధారణ దహనబలుల పరిమాణంతో పాటు అతని అసాధారణ విన్నపం కూడా కనిపిస్తుంది (1 రాజులు 3:7-11 నోట్సు చూడండి), దీనికి స్పందనగా “మనము అడుగు వాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తి గల" దేవుడు (ఎఫెసి 3:20-21) అంతకంటే అసాధారణ రీతిలో సొలొమోనుకు జ్ఞాన వివేకాలతో పాటు సమస్త సంపదలను అనుగ్రహించాడు. 

1:11-12 సొలొమోను విన్నపానికి దేవుడు సంతోషించాడు. బహుమానంగా ఐశ్వర్యమును సొమ్మును ఘనతను కూడా అతనికి అనుగ్రహించాడు. ఈనాటికీ సొలొమోను పేరు జ్ఞాన సంపదలకు ఒక పర్యాయపదంగా నిలిచింది.

1:13 తాను తొలగించబోతున్న పరిశుద్ధ స్థలాన్ని సొలొమోను ఘనపరచాడు. ఇక్కడ సమాజపు గుడారము గురించి పేర్కొనడం అతడు ప్రారంభించబోయే నూతన విధానానికి, గుడారానికి గల వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతుంది (2:1). 

1:14 సొలొమోను సంపద గురించి తెలియజేసిన రెండు జాబితాల్లో ఇది మొదటిది (9:13-28). మొత్తం వెయ్యిన్ని నాలుగువందలు రథములును, పండ్రెండు వేల గుఱ్ఱపు రౌతులు అంటే అతి పెద్ద సైనికబలం. ఐగుప్తునుంచి బయటకు వస్తున్న ఇశ్రాయేలీయులను తరమడానికి ఫరో దగ్గర కేవలం 600 రథాలు (నిర్గమ 14:7), హాసోరు వాడైన సీసెరాకు 900 రథాలు మాత్రమే ఉన్నాయి (న్యాయాధి 4:3). సొలొమోను సహజంగా యుద్ధ ప్రియుడు కాదు కాబట్టి అతని సైన్యం ప్రత్యేకంగా గమనించదగినది. 

1:15 సొలొమోను సొంత సంపద ప్రాచీన కాలంలో అతి ప్రశస్తమైన కొన్ని వనరులను కూడా తక్కువగా కనిపించేలా చేసింది. అయితే ఈ సంస్కరణలు సొలొమోను పాలనా - కాలమంతటిలో కొనసాగలేదు. దీర్ఘకాలంలో అతని సంపద సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. 

1:16-17 తన సొంత సంపద పెంచుకోడానికి సొలొమోను గుఱ్ఱములు రథాలలో ధనం అధికంగా పెట్టుబడి పెట్టాడు. అతడు ఐగుప్తు నుంచి, తురుష్కులకు చెందిన కుయి నుంచి గుజ్జాలను కొనుగోలు చేసి వాటిని హితీయులకు, సిరియనులకు అమ్మాడు. సొలొమోనుకు , ధనసమృద్ధి కలుగజేసిన సాధనాలుగా వీటి గురించి ఇక్కడ పేర్కొన్నా, వీటివలన అతడు దేవుని కట్టడలను అతిక్రమించాడు. భవిష్యత్తులో రాజు కాబోయేవాడు ఐగుప్తు నుంచి గుర్రాలు సమకూర్చుకోకూడదని, అధిక మొత్తంలో వెండి కూర్చుకోకూడదని ధర్మశాస్త్రం స్పష్టంగా తెలియజేసింది (ద్వితీ 17:16-17). 


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |