Psalms - కీర్తనల గ్రంథము 132 | View All

1. యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.

2. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి

3. యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.

4. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు

5. నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.
అపో. కార్యములు 7:46

6. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను.

7. ఆయన నివాసస్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి.

8. యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.

9. నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.

10. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.

11. నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించినయెడల వారి కుమారులుకూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని
లూకా 1:32, అపో. కార్యములు 2:30

12. యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.

13. యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.

14. ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను

15. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను

16. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప జేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు.

17. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను.
లూకా 1:69

18. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-132. దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన విధంగా అతని సంతానం శాశ్వతంగా యెరూషలేమును పరిపాలిస్తుండగా వారిని దీవించమని వేడుకొనే కిర్తన.

శీర్షిక: యాత్రకీర్తన గురించి, కీర్తన 120 శీర్షిక నోట్సు చూడండి.

132:1 ఇక్కడ దావీదు కెదురైన బాధలు బహుశా అతడు మందసాన్ని యెరూషలేముకు తీసుకొని రావాలని కోరుకున్నప్పుడు గానీ, ఉజ్జాకు జరిగిన ఉపద్రవం వలన గానీ అతనికి కలిగినవి (2సమూ 6:6-8) అయ్యుండవచ్చు. 

132:3-5 వ.3-5 లో దావీదుకివ్వబడిన వాగ్దానం , వ.6-8 లో దాని నెరవేర్పు కనబడుతున్నాయి. హెబ్రీలో ఈ - వచనాల్లోని వ్యాకరణం (వరకు), దావీదు నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకొని వచ్చి దాన్ని శాశ్వత స్థలంలో ఉంచేవరకు అతని పట్టుదలను అతని తీర్మానాన్ని సూచిస్తున్నది. 

132:6 యెరూషలేములో నిబంధన మందసాన్ని స్థాపించిన చరిత్రను కీర్తనకారుడు సంగ్రహంగా తెలియజేస్తున్నాడు (1సమూ. 5-6; 2సమూ 6-7). ఎఫ్రాతా - బేల్లెహేము సమీపాన ఉన్న ప్రాంతం. ఇక్కడే దావీదు మందసం గురించిన వార్తను విన్నాడు. యాయరు అంటే కిర్యత్యారీము (1సమూ 6:21-7:2). ఫిలిపీయుల నుండి మందసాన్ని ఇక్కడే తీసుకున్నారు. 

132:7 కీర్తనకారుడు మందసం - యెరూషలేముకు చేరుకున్న లాంఛనప్రాయమైన ఊరేగింపు -- ఉత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మందిరంలో ప్రవేశించాలని సమాజాన్ని పిలుస్తున్నాడు (1దిన 15-16 అధ్యా.). ఆయన పాదపీఠము మందసాన్ని సూచిస్తున్నది. (99:5 నోట్సు చూడండి; యెషయా 66; హెబ్రీ-1:13 తో పోల్చండి). 

132:8 కీర్తనకారుడు 2దిన 6:11 లోని సంఘటనల్ని 8-10 వచనాల్లో ప్రస్తావిస్తున్నాడు. మందసం యెహోవా విశ్రాంతి స్థలము (సంఖ్యా 10:33-35), దేవుని సామీప్యత సాక్షాత్కరించే పరిశుద్ధస్థలం (1సమూ 4:4; యెషయా 6:1). ఇశ్రాయేలీయులు సాధించిన యుద్ధ విజయాల్లో మందసం కీలకమైన పాత్ర పోషించింది (యెహో 6:6-7; 1సమూ 4:3-8).

132:9 యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురు అనే మాటలు వారు విధేయతను, నైతికవర్తనను కలిగి ఉండాలని సూచిస్తున్నాయి (వ.16; యెషయా 11:5; 61:10 తో పోల్చండి).

132:10 అభిషిక్తునికి అనే పదం రాజును సూచిస్తున్నది. విముఖుడవై అంటే “ముఖం తిప్పుకోవడం” అని అక్షరారం (యెహె 14:6). 

132:11-12 దావీదు ప్రమాణపూర్వకంగా యెహోవాకు మాట ఇచ్చినట్లే (వ.2), యెహోవా కూడా దావీదుతో సత్యప్రమాణము చేశాడు (89:35; 110:4). అయితే, ఈ వాగ్దానంలో ఒక షరతు ఉంది (నా నిబంధనను గైకొనిన యెడల). దేవునిచేత అభిషిక్తునిగా ఎన్నుకొనబడిన రాజు ఆయన ధర్మశాస్త్రానికి విధేయత చూపాలి. అతడు సమాజానికి ఆదర్శంగా జీవించాలి. దావీదు గర్భఫలమును అతని సింహాసనం మీద శాశ్వతంగా కూర్చోబెడతానని యెహోవా వాగ్దానం చేశాడు (89:3-4,28-29, 2సమూ 7) 

132:13-15 యెహోవా సీయోనును తనకు నిత్యమైన నివాసస్థలముగా ఏర్పరచుకొనడమనే భావన (68:16; 78:68; 87:2) ఒక విధంగా ఇశ్రాయేలులో కృత్రిమమైన భద్రతాభావాన్ని కల్పించింది. యెహోవా ఎన్నటికీ యెరూషలేమును శత్రువుల కప్పగించడనీ, దాన్ని నాశనం చేయడనీ వీరు నమ్మకం పెంచుకున్నారు (యిర్మీయా 7:3-12; మీకా 3:11).

132:16 యాజకులు నైతికంగా యథార్థవర్తన కలిగి ఉండడమెంత కోరుకొనదగినదో (వ.9), వారికి రక్షణను ధరింపజేయడం కూడా అంతే కోరుకొనదగినది. ఇది ఇశ్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక సంక్షేమానికి మధ్యవర్తులుగా దేవుని యెదుట వీరి బాధ్యతను వెల్లడిచేస్తున్నది (యెహె 3:18; మత్తయి 16:19 తో పోల్చండి; 2 కొరింథీ 5:18-20).

132:17 కొమ్ము విజయాన్ని, రక్షణను సూచిస్తుంది. మొలవ జేయడం (89:17; 148:14) అనే పదానికి హెబ్రీలో ఉన్న పదం కొన్ని చోట్ల రానున్న మెస్సీయకు సంబంధించిన పదంగా, అలంకారిక దృష్టాంతంగా (చిగురు" - యిర్మీయా 23:5; 33:15: “కొమ్ము " - యెహె 29:21; “చిగురు" - జెకర్యా 3:8; 6:12) కనబడుతుంది. దీపము సిద్ధపరచి అనే మాటల్లో వంశం శాశ్వతంగా నిలుస్తుందనీ, సింహాసనం మీద దైవసాక్షాత్కారం కనబడుతుందనీ, అలంకారిక దృష్టాంత వర్ణన కనబడుతుంది. (18:28; 2సమూ 21:17; 22:29; 1రాజులు 11:36; యోబు 18:6). అయితే ఈ ప్రార్థనలో అపేక్షించినవి ఇశ్రాయేలును గాని, యూదయనుగాని పరిపాలించిన దావీదు సంతానంలోని ఎవరి వలనా నెరవేరలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టారు (వ.12 తో పోల్చండి), క్రీ.పూ. 586లో దేవుడు యెరూషలేము దేవాలయాన్ని శత్రువు చేతికప్పగించి నాశనం చేశాడు. ఈ ప్రార్థనలోని విన్నపాలు దావీదు గొప్ప కుమారుడు, ఎవరి రాజ్యమైతే "అంతములేనిదై ఉంటుందో" ఆ యేసుక్రీస్తులో మాత్రమే నెరవేరుతాయి. (లూకా 1:32-33; మత్తయి 1:1తో పోల్చండి; లూకా 1:68-79తో పోల్చండి). 

132:18 దేవుని యాజకులు - నీతిని, రక్షణను వస్త్రాలుగా ధరిస్తారు (వ.9,16), అయితే శత్రువులు అవమానమును వస్త్రంగా ధరిస్తారు. దేవుడు ఎన్నుకున్న రాజు అన్యజనుల మధ్య యెహోవా అభిషిక్తునిగా కనబడతాడు.


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |