Isaiah - యెషయా 8 | View All

1. మరియయెహోవా నీవు గొప్పపలక తీసికొని మహేరు షాలాల్‌, హాష్‌ బజ్‌1, అను మాటలు సామాన్య మైన అక్షరములతో దానిమీద వ్రాయుము.

2. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా

3. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌2 అను పేరు పెట్టుము.

4. ఈ బాలుడునాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరురాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను.

5. మరియయెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను

6. ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు.

7. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును.

8. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాప కము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.
మత్తయి 1:23

9. జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.

10. ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.
మత్తయి 1:23

11. ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను

12. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.
1 పేతురు 3:14-15

13. సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.
1 పేతురు 3:14-15

14. అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును
రోమీయులకు 9:32, మత్తయి 21:44, లూకా 2:34, 1 పేతురు 2:8

15. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.
మత్తయి 21:44, లూకా 2:34, 1 పేతురు 2:8

16. ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము.

17. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచు చున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.
హెబ్రీయులకు 2:13

18. ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
హెబ్రీయులకు 2:13

19. వారు మిమ్మును చూచికర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించు డని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్ల దగునా?
లూకా 24:5

20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచా రించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.

21. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు;

22. భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహ మైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.
ప్రకటన గ్రంథం 16:10బైబిల్ అధ్యయనం - Study Bible
8:1 ఈ వచనంలోని గొప్ప పలక... సామాన్యమైన అక్షరములతో అనే పదజాలంలో అసాధారణమైన ప్రాముఖ్యత ఏదీ కనబడడంలేదు. హెబ్రీ ప్రతి సూచించినట్టుగా ఇవి మట్టి పలక, ఘంటం అయినప్పటికీ అసాధారణమైన ప్రాముఖ్యత ఏదీ లేదు. గొప్ప అనే పదం బహుశా దాని మీద వ్రాయబడిన వ్రాత ప్రాముఖ్యతను, స్పష్టతను సూచిస్తుండవచ్చు. మహేరు షాలాల్ హాష్ బజ్ అనే పేరుకు “త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపెట్టబడును" అని అర్థం, ఇది అషూరు నుండి గొప్ప ప్రమాదం వెనువెంటనే రానున్నదని సూచిస్తుండవచ్చు. 

8:2 సాక్ష్యము పలుకుటకు మనుషులుండడం ఈ ప్రవచనానికి న్యాయబద్ధతను సూచిస్తుంది. ఈ ప్రవచనం నెరవేరనట్లయితే, ఈ ఇద్దరు సాక్షులు ఆ ప్రవచనం అసత్యమని సాక్ష్యం చెప్పవలసి ఉంటుంది. ప్రవచనం నెరవేరినట్లయితే, అది అంతక్రితమే వ్రాయబడి ఉందని సాక్ష్యం చెప్పవలసి ఉంటుంది. సంఘటన జరిగిన తర్వాత దాని గురించి వ్రాయడం కాదు గానీ, జరగక మునుపే దాని గురించి వ్రాయడం ఇక్కడ గమనార్హం. యాజకుడైన ఊరియా బహుశా 2రాజులు 16:10-18 వచనాల్లోని వ్యక్తి అయ్యుండవచ్చు. ఆహాజు రాజుగా ఉన్న కాలంలో ఊరియా ప్రధాన యాజకుడు, రాజు కోరిక మేరకు అతడు దమస్కులో ఉన్న ప్రకారం బలిపీఠానికి మార్పులు చేశాడు. 

8:3 ప్రవక్తి యొద్దకు పోతిని అనే పదజాలం గురించి 7:14 నోట్సు చూడండి. ఇమ్మానుయేలు ప్రవచనం నెరవేర్పు తొలిమెట్టు ఇక్కడ వ్రాయబడిన మహేరు షాలాల్ హాష్ బజ్ పుట్టుకకు సంబంధించినదై ఉండవచ్చు. యెషయా భార్య ఒక ప్రవక్తి (మిర్యాము - నిర్గమ 15:20; దెబోరా - న్యాయాధి 4:4; హుల్గా - 2రాజులు 22:14; అన్న - లూకా 2:36 లతో పోల్చండి). 

8:4 కొన్ని సంవత్సరాల లోపుననే అప్పూరు. సైనికులు రెజీను పరిపాలించే సిరియాకు ముఖ్యపట్టణమైన దమస్కు మీదకు దూసుకొని వచ్చి, ఆ పట్టణంతో పాటుగా షోమ్రోను పట్టణాన్ని దోచుకుంటారనేది ప్రవచనం లోని ముఖ్యాంశం. పెకహు పరిపాలించే ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు
ముఖ్యపట్టణం షోమ్రోను. 

8:5-8 అష్నూరు సిరియాను, ఇశ్రాయేలును ఓడించడం యూదాకు శుభవార్త అవుతుంది. ఈ రెండు దేశాలు యూదాకు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. ఈ నేపథ్యంలో రెజీనునుబట్టి... సంతోషించుచున్నారు అనే మాటలు చర్చనీయాంశంగా ఉన్నాయి, ఇది బహుశా రెజీను ఓటమిని చూచి యూదా సంతోషించడం అయ్యుండవచ్చు. అషూరు యూదా మీదకు సైతం రాబోతుంది కాబట్టి ఇది తొందరపాటు సంతోషమని ఈ ప్రకటన సూచిస్తుండవచ్చు. 

8:6 షిలోహు నీళ్లు అనే పదజాలం యెరూషలేము పట్టణం వెలుపల ఉన్న కోనేరుల నుండి నీటిని పట్టణం లోపలికి సరఫరా చేసే తూము వంటి కాలువను సూచిస్తుంది. తరువాతి వచనంలోని "పొర్లి" ప్రవహించే నీటికి భిన్నంగా, ఇక్కడ ఈ పదజాలం దేవుణ్ణి సూచిస్తుంది. యూదా షిలోహు నీళ్లు
వద్దనుకొనడం దేవుణ్ణి తృణీక రించడమేనని సూచిస్తుంది. 

8:7 యూఫ్రటీసు నది విస్తార జలములను అనే పదజాలం అష్నూరు రాజుకు, ఆ ప్రకారంగా అష్పూరు శక్తికి ప్రతీకగా ఉంది. ఆహాజు సిరియా-ఎఫ్రాయిము కూటమికి వ్యతిరేకంగా తనకు సహాయం చేయాలని తీగత్పి లేసేరును వేడుకొనడం ద్వారా దేవుణ్ణి తృణీకరించి అన్యజనుల సహాయాన్ని కోరుకున్నాడని తెలుస్తుంది. 

8:8 అష్నూరుకు సూచనగా ఉన్న నీళ్లు యూదా కుతికల వరకు వస్తాయి. యూదా పూర్తిగా మునిగిపోదు గానీ, ప్రతి సంవత్సరమూ భారీగా కప్పం చెల్లించవలసి ఉంటుంది. మరొకవైపు అష్నూరు సైతం యూదా ఉనికిని బెదిరించేదిగా తయారైంది. 

8:9-10 దేవుడు ఇంకా యూదాతోనే ఉన్నాడు కాబట్టి అష్నూరు యూదాను పూర్తిగా లోబర్చుకొనలేదు. 

8:11 ప్రజల నమ్మకాలకు అనుగుణంగా నడవకూడదని దేవుడు యెషయాతో చెప్పాడు (నాతో చెప్పియున్నాడు).

8:12 బందుకట్టు అనే పదం యూదాకు వ్యతిరేకంగా సిరియాకు, ఉత్తర రాజ్యానికి మధ్య ఉన్న కూటమిని సూచిస్తుండవచ్చు. లేదా ఆహాజు అష్కూరువైపు చూస్తున్నందు వలన అతనికి వ్యతిరేకంగా యూదాలోనే అంతర్గతంగా ఏర్పడిన కూటమిని సూచిస్తుండవచ్చు. కూటమి ఏదైనప్పటికీ, ప్రజలు భయపడుతున్నట్టుగా యెషయా భయపడకూడదనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. 

8:13 దేవుని పట్ల భయం అన్ని భయాలను దూరం చేస్తుంది (లూకా 12:5). బెదురు పుట్టిస్తున్న పొత్తులను చూచి యెషయా గానీ ఇతరులు గానీ భయపడకుండా ఉండడానికి ఏకైక కారణం నిజంగా భయపడవలసినది దేవునికి మాత్రమేనని తెలుసుకొనడం. ఈ వచనాల్లోని రెండు భయాల మధ్య వ్యత్యాసముంది. మనుషులకు భయపడడం దిగులు పుట్టిస్తుంది (వ.12), నిజంగా మనుషులు భయపడ వలసినది దేవునికే. ఈ దైవభయం ధైర్యాన్నిస్తుంది. పరిశుద్ధ స్థలము గురించిన వర్ణన దేవుని పరిశుద్ధతను ప్రధానంగా తెలియజేస్తూ, ఆయన తన ప్రజల్ని కాపాడతాడని సూచిస్తుంది. 

8:14-15 యూదా ప్రజలు యెహోవాను తృణీకరించారు కాబట్టి ఆయన వారికిప్పుడు అభ్యంతరము కలిగించు బండగా ఉన్నాడు. వ. 14ను పౌలు రోమా 9:33 లోను, పేతురు 1 పేతురు 2:7లోను ఉటంకించడం జరిగింది. 

8:16 బోధ అని కూడా పేర్కొనబడిన ప్రమాణవాక్యము దేవుడు యెషయాకు తెలియజేసిన మాటల్ని సూచిస్తుంది. వీటిని యెషయా భద్రం చేసి (కట్టుము... ముద్రించి) తన శిష్యుల కప్పగించాలి. ఈ సంఘటనలు జరిగి ఈ మాటలు నిజమయ్యేవరకు శిష్యులు దేవుని ప్రకటనల్ని భద్రపర్చాలి.

8:17 ప్రజల పాపాలను బట్టి దేవుడు తన ప్రజలైన యాకోబు వంశమునకు రక్షణకరమైన తన సన్నిధిని లేక ముఖమును మరుగుచేసికొన్నాడు. దేశంలో దేవునిపట్ల విశ్వాసం గల ప్రజలు ఆయన కోసం కనిపెట్టుచున్నారు, వీరికి
యెషయా ప్రతినిధిగా ఉన్నాడు. 

8:18 సూచనలుగాను, మహత్కార్యములుగాను ఉండడానికి దేవుడు యెషయాకిచ్చిన పిల్లలు షోయార్యాషూబు (7:3), మహేరు షాలాల్ హాష్ బజ్ (8:1). 

8:19-20. సౌలు ఎనోరు లోని కర్ణపిశాచి దగ్గర సంప్రదించినట్టుగా (1సమూ 28), యూదా ప్రజలు యెషయాను మంత్రజ్ఞుల దగ్గర సంప్రదించాలని కోరుకున్నారు. పాత నిబంధన ఇటువంటి చర్యల్ని చాలా స్పష్టంగా నిషేధిస్తుంది. (ద్వితీ 18:9-14). యూదా ప్రజలు దేవునిలో మాత్రమే నమ్మిక ఉంచి, ఆయన వాక్యప్రకారము నడవవలసి ఉంది. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |