10:1 ప్రార్ధనకు, ఎన్నికకు మధ్య భేదం ఉన్నట్లుగా పౌలు చూడలేదు.. మానవాళి వ్యవహారాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొనే హక్కులున్న సర్వాధికారియైన దేవుడు మాత్రమే ప్రార్థనకు జవాబివ్వగలడు. అవిశ్వాసులలో “ఎన్నిక" చేయబడినవారు ఎవరో, సువార్తను విన్నప్పుడు విశ్వాసంలోకి వచ్చేది ఎవరో ముందుగా మనకు తెలియదు. కానీ “మన రక్షకుడగు దేవుడు... మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు” (1తిమోతి 2:3-4) అని మనమెరుగుదుము. కాబట్టి పౌలు యూదుల రక్షణ కోసం ప్రార్థించాడు. అలాగే మనం కూడా యేసును గూర్చిన సువార్తను ప్రతి ఒక్కరితోను పంచుకోవడానికి తప్పక ఆసక్తిపరులంగా ఉండాలి. కొందరు “ఎన్నిక చేయబడనివారు" అని ఎవరిని విడిచిపెట్టకూడదు.
10:2-3 నిజంగా దేవుని ఎరిగి ఆయన సేవచేయాలనుకునేవాడికి ఆసక్తి, జ్ఞానము రెండూ అవసరమే. క్రైస్తవేతరుడైన పరిసయ్యునిలాగా తన ఆసక్తితో పౌలు (అప్పుడు సౌలు అని పిలువబడ్డాడు; అపొ.కా. 7:58 చూడండి) సంఘాన్ని హింసించాడు. (అపొ.కా. 22:3-5). అలాగే అవిశ్వాసులైన
యూదుల ఆసక్తి యేసుకు అన్యాయంగా మరణశిక్ష విధించేటట్లు నడిపిం చింది. ఆత్మీయ అంథత్వంతో వారు దేవుని నీతి మార్గం తప్పడమే కాక, దాన్ని ఎదిరించారు.
10:4 ధర్మశాస్త్రమును నెరవేర్చుటలోను, దాన్ని కొట్టివేయుటలోను క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు. క్రియలను బట్టి రక్షణ పొందే ఏ విధానమైనా మినహాయించబడింది.
10:5-7 పౌలు ఇక్కడ సమస్యకు రెండు వైపులా మోషేను పేర్కొన్నాడు. లేవీ 18:5లో (గలతీ 3:12తో పోల్చండి) ధర్మశాస్త్రాన్ని గైకొనువాడు బ్రతుకుతాడు, కానీ ఎవడూ. ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిని సంపాదించలేడు . (వ.6లో మోషేను పేర్కొనడం ద్వారా పౌలు చెబుతున్నదాని ప్రకారం). విశ్వాసం మీద ఆధారపడిన నీతి క్రీస్తునుండి వస్తుంది. ఆయనను సమీపించవచ్చు. ఆయన మనకోసం మరణించి, మృతులలో నుండి లేపబడ్డాడు. దేవుని ప్రత్యక్షతను సమీపించవచ్చు అని మోషే చూపించాడు. క్రీస్తును సమీపించవచ్చు అని • చూపడానికి పౌలు అతని మాటలను పేర్కొన్నాడు.
10:8 దేవుని ప్రత్యక్షత సమీపంగా ఉందని మోషే ప్రకటించినట్లే, విశ్వాస సందేశం జనుల హృదయమునకు, నోటికి సమీపంగా ఉంది.
10:9-10 యేసు ప్రభువు అనేది విశ్వాసపు ఒప్పుకోలు. “ప్రభువు" అనేది గ్రీకు మాట "కురియోస్"కు అనువాదం. ఇది దేవుడు (యెహోవా) అనే పేరును హెబ్రీ భాషనుండి గ్రీకు పా.ని.లోనికి (సెప్టువజింట్) తర్జుమా చేయడానికి సామాన్యంగా ఉపయోగించిన పదం. యేసు మెస్సీయ (గ్రీకులో క్రీస్తు అంటే హెబ్రీలో మెస్సీయ) మాత్రమే కాదుగాని ఆయన ప్రభువు కూడా (1కొరింథీ 8:6). యేసు అనే మనుష్యుడు మృతులలోనుండి లేచాడు అని మాత్రమే కాక ఆయన దేవుని స్వభావముతో పాలుపంచుకుంటున్నాడని కూడా మనం నమ్ముతాము. ఇది ఛాల్సెడాన్ సమావేశం వద్ద (క్రీ.శ. 451) QR నిర్దేశించబడిన క్రీస్తు రెండు స్వభావాలను అర్థం చేసుకోవడానికి ఆరంభం. యేసు పూర్తిగా మనుష్యుడు, పూర్తిగా దేవుడు. విశ్వాసులు ఈ సత్యాన్ని నమ్మి, అంగీకరిస్తారు.
10:11-19 రక్షణ సార్వత్రికంగా అనుగ్రహించబడుతుంది అనడానికి పౌలు లేఖన ఆధారాలను పేర్కొన్నాడు. రక్షణ యూదునికి, గ్రీసుదేశస్థునికి (అంటే అన్యజనులకు) కూడా ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఒక్క ప్రభువే (గ్రీకు. “కురియోస్", వ, 12) తనకు ప్రార్థన చేయువారందరియెడల కృపచూపుటకు ఐశ్వర్వవంతుడు. ఈ వాగ్దానం ప్రభువు ("కురియోస్", వ.13) నామమునుబట్టి ప్రార్థన చేసేవారందరికీ చెందుతుంది. యోవేలు ప్రవక్త చెప్పినట్లు “యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు” (యోవేలు 2:32). యేసే ప్రభువు!
10:14-15 ప్రభువు నామమును బట్టి ప్రార్థించాలంటే ఏమి జరగాలి? సువార్త సందేశాన్ని ప్రకటించడానికి ఎవరైనా మొదట పంపబడాలి, వినువారు ఆలకించి, విశ్వసించాలి. ఇవేవీ లేకుండా ఎవడూ ప్రభువు నామమున ప్రార్థించలేడు.
10:16-21 వ.14-15లో వివరించిన పరిస్థితులన్నీ ఇశ్రాయేలీయులకు జరిగాయని అనేక పా.ని. వాక్యభాగాలను పౌలు పేర్కొన్నాడు. సువార్త సందేశం రోమా సామ్రాజ్యమంతటా ప్రకటించబడింది. యూదులు విని, నమ్మలేదు. అన్యజనులు కూడా విన్నారు. అనేకులు దాన్ని హత్తుకున్నారు. అన్యజనులు మారుమనస్సు పొందడాన్ని గూర్చిన పా.ని. ప్రవచనాలున్నాయని పౌలు పేర్కొన్న వచనాలు చూపుతాయి. చివరికి అందరూ అవిధేయులై యెదురాడు ప్రజలుగా ఉన్నారు. దేవుని సందేశాన్ని, సందేశకులను తిరస్కరించడం కొనసాగించినందున, ఇశ్రాయేలీయులను ఇందులో ప్రత్యేకంగా చెప్పాడు (అపొ.కా. 7:51-60)