18:1 దేవుని నుంచి జవాబు పొందడానికి ముందే ప్రార్థనలో విసుగుదలతో విరమించుకునే సాధారణ ధోరణి గురించి ఈ ఉపమానం మాట్లాడుతుంది.
18:2-3 ఈ న్యాయాధిపతి అటు భక్తి విశ్వాసమైనా, ఇటు కనికరమైనా లేని వ్యక్తి. ఆ సంస్కృతిలో విధవరాలు అంటే దాదాపు నిస్సహాయురాలు. న్యాయము జరిగి తీరాలనే పట్టుదలతో కూడిన ఆమె విన్నపమొక్కటే ఆమెకున్న ఒకే ఒక్క నిరీక్షణ.
18:4-5 ఆ విధవరాలి మనవి విని ఆమెకు న్యాయం చేయాలనే నియమం గానీ ఇష్టం గానీ ఆ న్యాయాధిపతికి లేవు (ఒప్పకపోయెను; బహుశా అతడు ఆ విధవరాలి నుంచి లంచం కోసం ఎదురుచూస్తూ ఉండి ఉండవచ్చు). అయితే ఆమె పట్టువిడువకుండా మాటిమాటికి వచ్చి న్యాయం కోసం
మొరపెడుతున్నందువల్ల ఆమె త్వరలోనే తనను సొమ్మసిల్లిపోయేలా చేస్తుందని గ్రహించి అతడు చివరికి ఆమెకు న్యాయము జరిగేలా చేశాడు.
18:6-8 అన్యాయస్థుడైన న్యాయాధిపతికీ దేవునికీ మధ్యనున్న వ్యత్యాసాన్ని తెలియచేయాలన్నది యేసు ఉద్దేశం. స్థిరంగా ప్రార్థిస్తున్న తన బిడ్డలకు అన్యాయస్థుడైన న్యాయాధిపతిలా కాకుండా దేవుడు న్యాయము చేయడమే కాదు, చాలా త్వరగా దాన్ని చేస్తాడు. రెండవ రాకడకు ముందు భూమి పైన స్వచ్ఛమైన విశ్వాసం అరుదుగా కనబడుతుంది అనే వాస్తవాన్ని 8వ వచనం చివరి భాగం తెలియచేస్తుంది (మత్తయి 24:12-13).
18:9 ఈ కింది ఉపమానం ఒక పరిసయ్యునిపై దృష్టి సారిస్తుంది (వ. 10-11). తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని అనే మాట సగటు పరిసయ్యుని స్వనీతితో కూడిన వైఖరిని వర్ణిస్తుంది (వ.11-12, 14).
18:10-14 దేవాలయములో ఇతర సమయాల్లో వ్యక్తిగత ప్రార్ధన చేసుకోడానికి ప్రజలు అనుమతించబడినప్పటికీ ఉదయం సాయంత్రం వేళల్లో బలి అర్పణలు జరుగుతున్నప్పుడు కూడా ప్రజలు ప్రార్థించుకోవచ్చు. మోషే ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలనూ, వాటికి మించి కూడా (సంపాదించిన దాని అంతటిలోనూ దశమభాగము ఇవ్వడం) ఈ పరిసయ్యుడు ఆచరిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. తన చర్యలను బట్టి, సుంకరిలాంటి ప్రజల కంటే మతనిష్టలో ప్రావీణ్యతను బట్టి అతడు గర్వించాడు. దానికి భిన్నంగా, తనను తాను పాపిగా గుర్తించుకున్న సుంకరి తాను కేవలం దేవుని ఉగ్రతకు మాత్రమే పాత్రుణ్ణని గుర్తించాడు. తమను తాము హెచ్చించుకునే వారిని దేవుడు తగ్గిస్తూ ఉండగా, దీనులను దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడని
యేసు నొక్కి చెప్పాడు.
18:15-17 యేసుకున్న విలువైన సమయం పసిబిడ్డలతో గడిపేటంత సామాన్యమైంది కాదని యేసు శిష్యులు భావించారు. దేవుని రాజ్యములో ప్రవేశించడానికి చిన్నబిడ్డవలె విశ్వాసం అవసరం. తన దగ్గరకు వస్తున్న పిల్లలు అలాంటి విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నారని యేసు స్పందించాడు.
18:18-23 నిత్యజీవమును క్రియలతో సంపాదించుకోవచ్చు. (నేనేమి చేయవలెనని) అనే భావనలో ఆ అధికారి ఉన్నాడు. మంచితనం కేవలం దేవుని దగ్గర నుంచే వస్తుందని చెప్పడం ద్వారా యేసు అతని దృష్టిని వేరే అంశంపైకి మళ్ళించాడు. వ.20లో పేర్కొనబడిన ఆజ్ఞలన్నిటినీ ఆ అధికారి పాటించి ఉండాలి లేదా యేసు దాని గురించి వాదించకూడదని భావించి ఉండాలి. రెండవ ఆలోచనే వాస్తవమై ఉంటుంది, ఎందుకంటే తర్వాత యేసు జారీ చేసిన ఆజ్ఞ ఆ అధికారి (నిత్యజీవం పొందే) పరలోకమందు... ధనము సంపాదించడంలో కంటే భూమిపై ధనం సంపాదించడంలోనే ఆసక్తి కలిగి ఉన్నాడని బయలుపరచింది. బీదలకు తన సంపదను పంచి పెట్టడానికి అతడు చూపిన విముఖత అతణ్ణి యేసుకు శిష్యునిగా కాకుండా అడ్డుకుంది.
18:24-27 ఆస్తిగలవారిని దేవుడు దీవించాడనీ, వాళ్లు కచ్చితంగా ఆయన రాజ్యంలో ఉంటారనీ చెప్పే సాధారణ అభిప్రాయాన్ని యేసు కొట్టిపారేశాడు. సూది బెజ్జము గుండా వెళ్లడానికి ప్రయత్నిస్తున్న ఒంటె అనేది ఒక సామెత అనేది స్పష్టం. అసాధ్యమైన ఒక పనిని తెలియజేయడానికి ఈ సామెతను ఆ రోజుల్లో ఉపయోగించేవారు; యేసును - శ్రోతలు అడిగిన ప్రశ్నను ఇది వివరిస్తుంది. ప్రజలు తమ స్వప్రయత్నాల వలన కాక కేవలం దేవుని కృప మూలంగా మాత్రమే రక్షణ పొందుతారని ఆయన జవాబు చెప్పాడు.
18:28-30 ఇంతకుముందు చర్చలు విన్న తర్వాత వ.22లో ధనవంతుడైన అధికారికి యేసు ఉపదేశించిన దానినే కచ్చితంగా తాము చేశామని అపొస్తలులందరి పక్షంగా పేతురు మాట్లాడాడు. వాళ్లు సమస్తాన్ని విడిచి పెట్టి యేసును వెంబడించారు. వాళ్లు రాబోయే యుగంలో నిత్యజీవమును పొందడమే కాదు, ఈ జీవితంలో కూడా గొప్పగా దీవించబడతారని యేసు జవాబిచ్చాడు. భార్యనూ పిల్లలను విడిచిపెట్టడం అంటే విడాకులు తీసుకోవడమో, కుటుంబ బాధ్యతలనూ త్యజించడమో కాదు. కానీ, అది సంచార పరిచర్య అని అర్థం.
18:31-34 యేసు తన మరణం గురించి చెప్పిన మూడవ అతి పెద్ద ప్రవచనం ఇది. మొదటిది 9:21-22 లోనూ, రెండవది 9:44 లోనూ ఉంది. ఆ మూడింటిలో ఎక్కువ విపులంగా ఉన్న ప్రవచనం ఇదే. రెండవ ప్రవచనాన్ని శిష్యులు ఎలా గ్రహించలేదో దీన్ని కూడా వాళ్లు అదేవిధంగా అర్థం చేసుకోలేకపోయారు. లూకా సువార్త మధ్య భాగం నుంచే ఈ గ్రంథపు దృష్టి అంతా యెరూషలేము వైపునకు కేంద్రీకరించబడిందనేది సత్యం. పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లో మనుష్యకుమారుని గురించిన ఒకే ఒక్క వాక్యభాగం దానియేలు 7:13లో కనబడుతుంది. అయితే మెస్సీయ అనుభవించబోయే హింసల గురించి ప్రవచించిన పలు వాక్యభాగాలున్నాయి. అందులో ముఖ్యమైనవి కీర్తన 22, యెషయా 53. అప్పగించబడును... మూడవదినమున తిరిగిలేచును అనేవి లూకా 22:63 నుంచి 24:12 వరకు జరిగిన సంఘటనలకు ముందస్తు ప్రదర్శనాన్ని ఇస్తున్నాయి. యేసు పునరుత్థానం తర్వాతి వరకు ఆయన చెప్పిన ఈ మాటలను శిష్యులు అర్థం చేసుకోలేదు (24:25-27, 44-46).
18:35-43 లూకా 17:11లో గలిలయ సమరయల మధ్యనున్న సరిహద్దు దగ్గర యేసు యొర్దాను నదిని దాటి తూర్పు దిక్కుకు చేరుకున్నాడు. ఇప్పుడు ఆయన యెరికోకు చేరుకోవడానికి మరల నదిని దాటాడు. జనసమూహపు సందడి గురించి గ్రుడ్డివాడు వాకబు చేసినప్పుడు, నజరేయుడైన (గలిలయలో ఎలాంటి ప్రాముఖ్యతా లేని చిన్న గ్రామం నజరేతు) యేసు దగ్గర్లో ఉన్నాడని అతనికి తెలిసింది. అలాంటి గుర్తింపులో మెస్సీయకు సంబంధించిన అంశమేదీ లేదు. అయితే యేసును దావీదు కుమారుడా అని సంబోధించినప్పుడు (మత్తయి 1:1 చూడండి), అతడు యేసును మెస్సీయగా ఒప్పుకున్నట్టయ్యింది. అతని విశ్వాసమే అతని స్వస్థతకు ఆధారమయ్యింది. నన్ను కరుణించుమని అతడు పెట్టిన మొర అతని చూపును తిరిగి తెప్పించేందుకు యేసును పురికొల్పింది. ఒకప్పుడు గుడ్డివాడు ఇప్పుడు యేసుకు శిష్యుడై వెంటనే చూపు పొందగా,
యేసూ, ఆయన పరిచర్య ఎటుగా సాగుతుందో 12 మంది అపొస్తలులకు అర్ధం కాకపోవడం విచారకరం (వ,31-34 నోట్సు చూడండి)