Ezekiel - యెహెఙ్కేలు 29 | View All

1. పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశ మంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

3. ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;

4. నేను నీ దవుడలకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను.

5. నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తు వాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను.
ప్రకటన గ్రంథం 6:8

6. అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందరు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను;

7. వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి, వారు నీమీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి.

8. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీమీదికి ఖడ్గము రప్పించి, మనుష్యులను పశువులను నీలోనుండి నిర్మూలము చేసెదను,

9. ఐగుప్తుదేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొను చున్నాడు గనుక

10. నేను నీకును నీ నదికిని విరోధినైతిని, ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదను.

11. దానిలో మనుష్యులు సంచరించరు, పశువులు తిరుగవు; నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును.

12. నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తుదేశమును పాడగునట్టుగా చేసెదను, పాడై పోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనముల లోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్ల గొట్టుదును.

13. ప్రభువైన యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడు నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలోనుండి నేను వారిని సమకూర్చెదను.

14. చెరలోనుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించెదను, అక్కడ వారు హీనమైన యొక రాజ్యముగా ఉందురు,

15. వారికను జనములమీద అతిశయపడకుండు నట్లు రాజ్యము లన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు; వారు ఇక రాష్ట్రములమీద ప్రభుత్వము చేయ కుండునట్లు నేను వారిని తగ్గించెదను.

16. ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగినయెడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

17. ఇరువదియేడవ సంవత్సరము మొదటినెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

18. నరపుత్రుడా, తూరు పట్టణముమీద బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యముచేత బహు ఆయాసకరమైన పని చేయించెను, వారందరి తలలు బోడి వాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను; అయినను తూరుపట్టణముమీద అతడు చేసిన కష్టమునుబట్టి అతనికైనను, అతని సైన్యమునకైనను కూలి యెంత మాత్రమును దొరకకపోయెను.

19. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తుదేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించు చున్నాను, అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును, అది అతని సైన్యమునకు జీతమగును.

20. తూరుపట్టణముమీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

21. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింప జేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.



బైబిల్ అధ్యయనం - Study Bible
29:1-2 ఇశ్రాయేలు చరిత్ర ప్రారంభకాలంలో ఇశ్రాయేలీయుల్ని సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు దాసులుగా ఉంచిన ఐగుప్తు ఇశ్రాయేలుకు స్థిరమైన శత్రువుగా ఉంటూ వచ్చింది. ఐగుప్తు నుద్దేశించిన ఈ ప్రవచనం కొంతవరకు అసాధారణంగా కనబడుతుంది. నలభై సంవత్సరాల తర్వాత అన్యజనమైన ఐగుప్తును పునరుద్ధరిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. బబులోను రాజుల వృత్తాంతాలు సూచిస్తున్నట్టుగా క్రీ.పూ. 568లో ఐగుప్తు బబులోనీయుల చేతిలో పతనమైనట్లయితే, ఐగుప్తు నలభై సంవత్సరాల “చెర” పారసీకుల కాలంలో ముగుస్తుంది. పారసీకులు చెరలో ఉన్న జాతులన్నిటినీ వారి వారి స్వదేశాలకు పంపించివేశారు (2దిన 36:22-23). నలభై సంవత్సరాల తర్వాత ఐగుప్తు పునరుద్ధరణ జరిగినప్పటికీ, అంతర్జాతీయంగా ఐగుప్తు తన పూర్వవైభవాన్ని తిరిగి ఎన్నటికీ పొందలేదు. ఐగుప్తు “పునరుద్ధరణ” దేవుని కృపాకార్యం కాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఇశ్రాయేలీయులు తమ అవిధేయత కారణంగా అరణ్యంలో నలభై సంవత్సరాలు సంచరించడాన్ని గుర్తు చేస్తుంది. (సంఖ్యా 32:13). క్రీస్తు వచ్చినప్పుడు ఇశ్రాయేలు, ఐగుప్తు స్థానాలు మారిపోతాయి, ఇశ్రాయేలు ఐగుప్తును పరిపాలిస్తుంది, ఐగుప్తీయులు విగ్రహారాధికులుగా ఉండక, ఏకైక నిజదేవుణ్ణి ఆరాధిస్తారు (యెషయా 18-19). యెహెజ్కేలు ఐగుప్తు నుద్దేశించి పలికిన ఏడు ప్రవచనాల్లో మొదటి ప్రవచనం ఫరో హెఫ్ర ఐగుప్తు రాజుగా ఉన్న క్రీ.పూ. 587 జనవరి నెల నాటిది. ఐగుప్తు నుద్దేశించి ఉన్న ఇతర ప్రవచనాల కోసం యెషయా 19:1-20:6; యిర్మీయా 46:2-28 చూడండి.

29:3 ప్రాచీన పశ్చిమాసియా సాహిత్యంలో మొసలి (హెబ్రీ. టానిన్) భారీకాయం గల సముద్రజీవి, దీన్నే అల్లకల్లోలాన్ని సృష్టించే దేవత అనడం పరిపాటి, ఇతర చోట్ల దీన్ని రాహాబు అని సూచించడం జరిగింది. యెహెజ్కేలు ఫరోను మొసలితో (టానిన్) పోల్చుతున్నాడు. అధ్యా. 28 లోని తూరు అధిపతి లాగా ఫరో కూడా యెహోవాను తిరస్కరించాడు. యెషయా 30:7లో ఐగుప్తును రాహాబుతో (గప్పాలమారి) పోల్చడం జరిగింది (యోబు 9:13; 26:12-13; కీర్తన 89:9-10; యెషయా 51:9-10). 

29:4-5 ఫరో, ఫరోను ఆశ్రయించినవారు అవమానం పాలవుతారు. 

29:6 ఇశ్రాయేలు తరచుగా ఐగుప్తును ఆశ్రయించి ఏ మేలూ పొందలేక నిరుత్సాహపడింది, ఐగుప్తు సహాయాన్ని అర్థించడమంటే రెల్లును చేతికర్ర అనుకొని భ్రమపడడమే.. 

29:7 నెబుకద్నెజరు నెదిరించడంలో యూదా రాజైన సిద్కియాకు సహాయపడడానికి ఐగుప్తు చేసుకున్న సంధి దాని దోషానికి ప్రారంభం, ఎందుకంటే యూదా మీదకు రానున్న దేవుని శిక్షను అమలుపర్చే సాధనం బబులోను. నెబుకద్నెజరు నెదిరించడం ద్వారా, ఫరో హెఘ్ర దేవుని ప్రణాళిక అమలు కాకుండా అడ్డుకున్నాడు. శతాబ్దాలుగా ఇశ్రాయేలు దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా పదే పదే ఐగుప్తునుండి సైనిక సహాయాన్ని ఇతర సహాయాల్ని అర్థించింది. (ద్వితీ 17:16; 1రాజులు 10:28; యెషయా 30:1-4). ఫరోను ఆశ్రయించడం రెల్లు పుల్ల మీద ఆనుకొనడం వంటిదని యెషయా 36:6 మరియు 2రాజులు 18:21 వచనాలు తెలియజేస్తున్నాయి. రెల్లుపుల్ల విరిగిపోతుంది. అనుకున్న చేతికి గాయమవుతుంది. నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి, వారు నీమీద ఆనుకొనగా అనే పదజాలం యెరూషలేము ముట్టడి సమయంలో హెఫ్ర యూదాకు సైనికసహాయాన్ని అందించడానికి చేసిన విఫల ప్రయత్నాన్ని సూచిస్తుంది. క్రీ.పూ. 588 వసంతకాలంలో నెబుకద్నెజరుకు వ్యతిరేకంగా ఐగుప్తు రాజు హెఫ్ర యెరూషలేమును కాపాడడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు (యిర్మీయా 37:5-10). ఇది దేవుని ప్రజలు సహాయం కోసం దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులు మనుషుల్ని ఆశ్రయించిన మరొక సందర్భం (యెషయా 36:6-7). 

29:8-16 ఐగుప్తు ఇక ఎన్నటికీ ప్రపంచ శక్తిగా ఉండబోదు. 

29:12 బైబిల్లో నలువది సంవత్సరములు అనేది సంపూర్ణమైన, సుదీర్ఘమైన కాలాన్ని తెలియ జేయడం కోసం తరచుగా ఉపయోగించబడిన భావప్రకటన (సంఖ్యా 14:33; 1రాజులు 2:11). క్రీ.పూ. 568 లో ఐగుప్తు బబులోనీయుల వశమైందనుకున్నట్లయితే, ప్రాచీన పశ్చిమాసియాకు సంబంధించిన పలు చారిత్రక వృత్తాంతాల ప్రకారం, నలభై సంవత్సరాల ఐగుప్తు “చెర” పారసీకుల పాలనలో ముగిసింది.

29:16 బబులోను జయించబడిన తరువాత పారశీకుల ఆధిపత్యంలో ఐగుప్తు ఇక ఎన్నటికీ ఒక బలమైన శక్తిగా రూపొందలేకపోయింది. 

29:17-20 నెబుకద్నెజరు తూరు సంపదల కోసం ప్రయత్నించాడు గానీ, దోపుడుసొమ్మునేమీ పొందలేక పోయాడు. నెబుకద్నెజరు ప్రయత్నాలన్నిటికీ ప్రతిఫలంగా దేవుడతనికి ఐగుప్తు నిచ్చాడు.

29:21 కొమ్ము బలానికి లేదా శక్తికి ప్రతీక, ప్రాచీన కాలంలో యుద్ధాల్లో జంతువుల నుపయోగించేవారు కాబట్టి ఈ సాదృశ్యం వచ్చి ఉండవచ్చు (1సమూ 2:1; 1రాజులు 22:11; కీర్తన 92:10; యిర్మీయా 48:25). ఇక్కడ. ఈ సాదృశ్యం మెస్సీయ బలాన్ని, ఐగుప్తు పతనం తర్వాత దావీదు వంశ పునరుద్దరణను తెలియజేస్తుంది (కీర్తన 132:17; యెషయా 11:116). చిగురు (“చిగిరింపజేసి") మెస్సీయను సూచించే ప్రత్యేకమైన సాదృశ్యం. ఈ వచనం అంతిమంగా క్రీస్తులో నెరవేరుతుంది (17:22-24), ఆయన అంత్యదినాల్లో అన్యజనులకు వ్యతిరేకంగా ఇశ్రాయేలుకు సహాయం చేసి వారిని రక్షిస్తాడు (లూకా 1:69; ప్రక 5:6). 


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |