Luke - లూకా సువార్త 23 | View All

1. అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి

2. ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.

3. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయననీ వన్నట్టే అని అతనితో చెప్పెను.

4. పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను.

5. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.

6. పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి

7. ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.

8. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగో రెను.

9. ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు.

10. ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి.

11. హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను.

12. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.

13. అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి

14. ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు;

15. హేరోదునకు కూడ కనబడలేదు.హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణ మునకు తగినదేదియు ఇతడు చేయలేదు.

16. కాబట్టి నేనితనిని

17. శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా

18. వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి.

19. వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.

20. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.

21. వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.

22. మూడవ మారు అతడుఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.

23. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.

24. కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి

25. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.

26. వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.

27. గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టు కొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.

28. యేసు వారివైపు తిరిగియెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.

29. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.

30. అప్పుడు మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.
హోషేయ 10:8

31. వారు పచ్చి మ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను.

32. మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.

33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.
యెషయా 53:12

34. యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
కీర్తనల గ్రంథము 22:18, యెషయా 53:12

35. ప్రజలు నిలువబడి చూచు చుండిరి; అధికారులునువీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి.
కీర్తనల గ్రంథము 22:7

36. అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి
కీర్తనల గ్రంథము 69:21

37. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి.

38. ఇతడు యూదుల రాజని పైవిలాసముకూడ ఆయనకు పైగా వ్రాయబడెను.

39. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను.

40. అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?

41. మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి

42. ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.

43. అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.

44. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను;
ఆమోసు 8:9

45. సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భా లయపు తెర నడిమికి చినిగెను.
నిర్గమకాండము 26:31-33, నిర్గమకాండము 36:35, ఆమోసు 8:9

46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి -తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
కీర్తనల గ్రంథము 31:5

47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.

48. చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టు కొనుచు తిరిగి వెళ్లిరి.

49. ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబ డించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
కీర్తనల గ్రంథము 38:11, కీర్తనల గ్రంథము 88:8

50. అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను.

51. అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండినవాడు.

52. అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని

53. దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.

54. ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.

55. అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి

56. తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.
నిర్గమకాండము 12:16, నిర్గమకాండము 20:10, ద్వితీయోపదేశకాండము 5:14బైబిల్ అధ్యయనం - Study Bible
23:1 పొంతి పిలాతు గురించి 3:1 నోట్సు చూడండి. పిలాతు సాధారణ నివాసం కైసరయ మారిటైమాలో ఉండేది. అయితే యూదుల పండుగ వేడుకలు జరిగే రోజుల్లో పరిస్థితులను అదుపులో ఉంచడానికి అతడు యెరూషలేముకు వచ్చేవాడు. యేసు ఇద్దరు నేరస్తులతో సిలువ వేయబడ్డాడు (వ.32-33). సిలువ శిక్ష వేయడమనేది కేవలం రోమీయులు మాత్రమే విధించగలరు. అందువల్ల యేసుకు సిలువశిక్షను ప్రకటించక ముందే ఈ ఇద్దరికీ సిలువశిక్ష ప్రకటించి ఉంటారు. ఆ విధంగా, నేరస్థులను శిక్షించే పని మీద యెరూషలేముకు వచ్చిన పిలాతు నిర్దోషిని శిక్షించి పట్టణాన్ని విడిచివెళ్ళాడు! 

23:2-4 పిలాతు సమక్షంలో యేసుకు వ్యతిరేకంగా యూదులు మోపిన మూడు నేరాలూ కల్పితాలే. యేసు మాట్లాడుతున్న వాటిని వినడానికి తండోపతండాలుగా ప్రజలు సమకూడేవారు అన్నమాట నిజమే కానీ ఆయన బోధలు ఇశ్రాయేలును తప్పుదారి పట్టించడానికి గురిపెట్టబడి తిరుగబడ
ప్రేరేపించు)నవి కావు. కైసరుకు పన్నియ్యవద్దని ఆయన చెప్పాడనడం దారుణమైన అబద్ధం (20:22-26 నోట్సు చూడండి). యేసే మెస్సీయ (క్రీస్తు), అయితే రోమా సామ్రాజ్యాన్ని కూలదోసి, ఇశ్రాయేలు రాజుగా సింహాసనాన్ని అధిష్టించాలనే ఆలోచన ఆయనకు ఎన్నడూ లేదు. అలాంటి వైఖరి ప్రజల్లో కలిగినప్పుడు కూడా జాగ్రత్తగా ఆయన దాన్ని తప్పించుకున్నాడు. పిలాతు యేసు గురించి విన్నాడన్నది నిస్సందేహమైన విషయం. యూదుల మహాసభ తన తీర్పు కోసం తొందర పెట్టడంలోని ఆంతర్యం అతనికి తెలుసు. 

23:5-7. యేసు గలిలయ ప్రాంతానికి చెందినవాడని పిలాతు విన్నప్పుడు, మహాసభ సభ్యులు కోరుతున్న దాన్ని చేయకుండా తప్పించుకోడానికి అతనికొక సౌకర్యవంతమైన మార్గం కనబడింది. గలిలయ హేరోదు అంతిప అధికారము క్రింద ఉన్న ప్రదేశము. కాబట్టి, తీర్పు తీర్చమని యేసును అతని దగ్గరకు పంపాడు (3:1 నోట్సు చూడండి). పిలాతు లాగానే పస్కా పులియని రొట్టెల పండుగలకు హేరోదు కూడా యెరూషలేములో ఉన్నాడు.

23:8-11 బహుకాలము నుండి యేసును కలుసుకోవాలని హేరోదు అంతిప చాలా ఆత్రుతగా ఉన్నాడు (9:7-9), ఇంతకు ముందు పరిసయ్యులు హేరోదు యేసును చంపాలనుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. (13:31). హేరోదు. ముందు యేసు మౌనం యెషయా 53:7-8 ప్రవచనానికి నెరవేర్పు. మహాసభ యేసుపై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ హేరోదు అంతిప మాత్రం యేసును అపహసించి అంతిమతీర్పు కోసం పిలాతునొద్దకు మరల ఆయనను పంపించాడు. ఆయన తనను తాను రాజుగా చెప్పుకున్నాడని మహాసభ హేరోదుకు చెప్పినందువల్ల వాళ్లను విసిగించడానికి యేసును ఎగతాళి చేయడానికి అతడు ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించాడు (వ.2-4 నోట్సు చూడండి) 

23:12-15 యూదులు యేసుపై మోపిన నేరములలో ఒక్కటైనను తమకు కనబడలేదని హేరోదు అంతిప, పిలాతులిద్దరూ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆ సమయంలో శత్రువులుగా ఉన్న వారిద్దరూ స్నేహితులుగా మారిపోయారు (వ.14-15). యేసుకు మరణశిక్ష విధించాలని మహాసభ సభ్యులు కోరుతున్న విషయాన్ని ఆ ఇద్దరూ గ్రహించి, వారిని చాలా చులకనగా చూశారు.

23:16-19 పిలాతు మహాసభను శాంతింపచేయడానికి, యేసును శిక్షించి (కొరడాలతో కొట్టించి) విడుదల చేయాలనుకున్నాడు. పస్కా పండుగ సమయంలో ఒక ఖైదీని విడుదల చేయడం అతనికి అలవాటు (యోహాను 18:39), అయితే ఇంతకు ముందు యెరూషలేములో జరిగిన అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన బరబ్బ అనే నేరస్థుణ్ణి విడుదల చేయమని జనసమూహాలు కేకలు వేశారు. 

23:20-25 మరణమునకు తగిన నేరమేమియు యేసులో కనబడనందువల్ల ఆయనను విడుదల చేయడానికి పిలాతు మరి రెండుసార్లు ప్రయత్నించాడు. వీనిని సిలువవేయుము, సిలువవేయుము అని పదేపదే జనసమూహం కేకలు వేశారు. చివరికి పిలాతు జనసమూహపు ఒత్తిడికి తలొగ్గి బరబ్బను విడుదల చేసి, యేసును సిలువకు అప్పగించాడు. 

23:26 మరణశిక్ష విధింపబడిన నేరస్తులు శిక్ష అమలుచేయబడే ప్రదేశానికి సిలువలో అడ్డ దూలాన్ని (లాటిన్. పాటిబులం) మోసుకెళ్లడం వాడుక. శిక్షా స్థలంలో దానికి నిలువు దూలాన్ని అతికించేవారు. కొరడా దెబ్బలు తిని ఉండడం(22:63) వల్ల యేసు. ఆ అడ్డ దూలాన్ని మోయలేకపోయాడు. అందువల్ల కురేనీయుడైన సీమోనుచేత దానిని మోయించారు. సీమోను యెరూషలేముకు బయట ఉన్న ఒక పల్లెటూరినుండి పులియని రొట్టెల పండుగ సమయంలో ప్రతిరోజూ ఆరాధించడానికి వస్తూ ఉండేవాడు. అపొ.కా.6:9 లో ప్రస్తావించబడిన కురేనీయుల సమాజములో ఇతడొక సభ్యుడై ఉండవచ్చు. మార్కు 15:21 సీమోను కుమారుల పేర్లను ప్రస్తావించింది (రోమా 16:13 కూడా అతని కుమారుల్లో ఒకరిని ప్రస్తావిస్తూ ఉండవచ్చు.

23:27-31 అన్యాయంగా తనను సిలువవేస్తున్నందుకు దుఃఖించుచున్న జనసమూహాలను చూచి తమ కుటుంబాల నిమిత్తం దుఃఖించమని యేసు

చెప్పాడు. ఎందుకంటే యెరూషలేము భవిష్యత్తులో నాశనం కాబోతుంది. అలాంటి భయంకరమైన రోజుల్లో పిల్లలు లేకపోవడమే మంచిది. హోషేయ 10:8 ని యేసు ఎత్తిచెప్పాడు- సైన్యసమూహాల నుంచి తప్పించుకోడానికి పర్వతాలను తమపైన పడి తమను దాచమని ప్రజలు అంటారు. వాళ్లు సమాధానంగా ఉన్న కాలంలోనే నిర్దోషమైన మనిషికే (పచ్చి మ్రానుకే) ఇలా చేస్తే, యుద్ధ సమయంలో తీర్పుకు అర్హులైన వారి (ఎండిన దాని) పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అని లూకా 23:31లో యేసు చెప్పిన సామెతకు అర్థం. 

23:32-33 యిద్దరు... నేరము చేసినవారి మధ్య సిలువ వేయబడడం అనేది యెషయా 53:12 ప్రవచనాన్నీ 22:37 లోని యేసు మాటలనూ నెరవేర్చింది. యేసు సిలువ వేయబడిన స్థలాన్ని కపాలము అని అంటారు. అరామిక్ భాషలో దానికి గొల్గొతా అని పేరు. దానికి సమానార్థకమైన లాటిన్ పేరు “కల్వరి”. 

29:34 తానెవరో పూర్తిగా తెలియకపోవడం వలన తనకు మరణశిక్ష విధిస్తున్న వారిని యేసు క్షమించాడు. కొన్ని ప్రాచీన రాత ప్రతుల్లో ఈ వచనంలోని మొదటి భాగం కనబడదు. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి అనే మాట కీర్తన 22:18ని నెరవేర్చింది. 

23:35-39 నిన్ను నీవు రక్షించుకోమని సవాలు చేస్తూ యేసును అపహాస్యం చేసిన నాలుగు గుంపులు -సామాన్య ప్రజలు... అధికారులు... సైనికులు, సిలువ వేయబడిన ఇద్దరు నేరస్థులలో ఒకడు. సిలువ మీద యేసు తలకు పైభాగంలో యూదుల రాజు అనే అధికారపూర్వకమైన పై విలాసాన్ని రాసినప్పటికీ, అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ ఆయనను యూదుల రాజని నమ్మలేదు. 

23:40-43 అవిశ్వాసం, అపహాస్యం కనబరుస్తున్న వారి మధ్యలో రెండవ నేరస్థుడు తన దోషానికీ యేసు నిర్దోషత్వానికీ (యీయన ఏ తప్పిదమును చేయలేదు) మధ్యనున్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నాడు. యేసే మెస్సీయ అని గ్రహించి, రానున్న ఆయన రాజ్యములో తనకు ప్రవేశం కల్పించమని అతడు అడిగాడు. మరణం తర్వాత పరదైసులో (సమాధి ఆవల నిత్యజీవం; 2 కొరింథీ 12:3-4 చూడండి) వెంటనే తనతో అతడు తిరిగి కలుసుకుంటాడని యేసు అతనికి అభయాన్నిచ్చాడు.

23:44-45 సిలువపై పాపంగా మారిన యేసు పైన, అన్యాయంగా దేవుని కుమారుణ్ణి చంపిన పాపులపైన దేవుని తీర్పుకు సూచనగా (మధ్యాహ్నం నుంచి మూడుగంటల వరకు) చీకటి కమ్ముకుంది. పెద్ద భూకంపం వలన పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యనున్న గర్భాలయపు తెర మధ్యకు చిరిగిపోయిందని మత్తయి 27:51 వివరించింది. క్రీస్తు మరణం ద్వారా దేవుని సన్నిధిలోకి ప్రజలకు నేరుగా ప్రవేశం కలిగిందని మధ్యకు చిరిగిపోయిన తెర సూచిస్తుంది (22:20 నోట్సు చూడండి). 

23:46 కీర్తన 31:5 పలుకుతూ, దేవునిలో విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ యేసు ప్రాణము విడిచెను. యేసును ఉదయం 9 గంటలకు సిలువ వేయగా (మార్కు 15:25), కేవలం ఆరు గంటల తర్వాత ఆయన మరణించాడు. సిలువపై 6 గంటల్లో మరణించడం అనేది అత్యంత తక్కువ సమయం కాబట్టి ఇది అసాధారణం. సిలువ శిక్షను భరించే వ్యక్తులు రెండు, మూడు రోజుల తర్వాత కానీ చనిపోయేవారు కాదు.

23:47 మత్తయి, మార్కుల్లోని సమాంతర వాక్యభాగాలతో పోలిస్తే, లూకా శతాధిపతి ఒప్పుకోలును సంక్షిప్తంగానే చెప్పాడు. యేసు నిజంగా నీతిమంతుడని (ఏ విషయంలోనూ నేరస్థుడు కాడని) మాత్రమే శతాధిపతి గమనించాడు. అయితే మత్తయి 27:54; మార్కు 15:39లో, అతడు
యేసును దేవుని కుమారుడని గుర్తించినట్లు పేర్కొనబడింది.

23:48-49 రొమ్ము కొట్టుకొనడం అనేది దుఃఖానికి గుర్తుకావచ్చు, కానీ లూకా 18:13లో అది ప్రభువు ముందు విరిగినలిగిన మనస్సును సూచిస్తుంది. యేసు పరిచర్యకు ధనాన్ని ధారాళంగా ఇచ్చి సహాయపడి (8:1-3 నోట్సు చూడండి), ఇప్పుడు సిలువపై యేసు మరణిస్తున్న సందర్భంలో చూచుచుండిన గలిలయ... స్త్రీలు ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తున్నారు. పురుషులైన శిష్యులు - ఆయనను విడిచి పెట్టినప్పటికీ వీళ్లు మాత్రం ఆయనను అంటిపెట్టుకునే ఉన్నారు. మత్తయి 27:56, మార్కు 15:40 వచనాలు ఈ స్త్రీల పేర్లను ప్రస్తావించాయి.

23:50-53 అరిమతయియ యోసేపు... యూదుల పట్టణపు సభ్యుడైనప్పటికీ, యేసుకు మరణశిక్ష విధించాలనే వారి నిర్ణయంతో అతడు విభేదించాడు (22:71-23:1). అతడు సజ్జనుడు... నీతిమంతుడు. అంతేకాదు, యేసుకు రహస్య శిష్యుడు కూడా (యోహాను 19:38). నేరస్థులకు సర్వసాధారణంగా కేటాయించబడే ఇరుకైన సాధారణ సమాధిలో కాకుండా ధనవంతుడైన యోసేపు సమాధిలో యేసును ఉంచారు. యెషయా 53:9 లోని ప్రవచనం ఇలా నెరవేరింది. యేసు సమాధిని కాపలా కాయడానికి సైనికులు నియమించబడ్డారనీ, ఆ సమాధికి ముందు రాయి దొర్లించబడిందనీ, దానిపై రోమా అధికారాన్ని సూచించే ముద్రవేయబడిందనీ మత్తయి 27:65-66 తెలియజేస్తుంది. 

23:54-56 సిద్ధపరచు దినము (గురువారం సూర్యాస్తమయం నుంచి శుక్రవారం సూర్యాస్తమయం వరకు) అనేది విశ్రాంతి దినానికి అవసరమైన వాటిని ముందే సిద్ధం చేసుకునే రోజు. యేసు దేహాన్ని సమాధి చేయడానికి అరిమతయియ యోసేపు, నీకొదేములిద్దరూ చాలా చేశారు (యోహాను 19:39-40). అయితే గలిలయకు చెందిన స్త్రీలైన శిష్యులు ఆ కార్యాన్ని పూర్తిచేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధం చేసుకున్నారు. వారు తమ ప్రణాళికను అమలుచేయడానికి విశ్రాంతి దినం గడిచే వరకు వేచియుండాల్సి వచ్చింది.


Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |