Job - యోబు 32 | View All

1. యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.

2. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.

3. మరియయోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపి నందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.

4. వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.

5. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.

6. కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట లాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.

7. వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని;

8. అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును.

9. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.

10. కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.

11. ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై

12. మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.

13. కావునమాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు పలుకకూడదు.

14. అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి ప్రత్యుత్తర మియ్యను.

15. వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు.

16. కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పక యున్నారు వారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?

17. నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను.

18. నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.

19. నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది.

20. నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.

21. మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష పాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను

22. ముఖస్తుతి చేయుట నా చేత కాదు అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.బైబిల్ అధ్యయనం - Study Bible
32:1 ఇక్కడ యోబు ఆ ముగ్గురి గురించి "స్నేహితులు” అని చెప్పక (2:11; 19:21; 42:10), వారిని ఆ ముగ్గురు మనుష్యులు అని ప్రస్తావించడం గమనార్హం. 

32:2-3 బరకెయేలు (“దేవుడు దీవించాడు"), ఎలీహు (“ఆయనే నా దేవుడు") అనే పేర్లు విశ్వాసపు ఆయువుపట్టును (లేక స్వచ్ఛమైన విశ్వాసాన్ని) వెల్లడి చేస్తున్నాయి. రాము, ఎలీహు అనే పేర్లు తరువాతి కాలంలో దావీదు వంశావళిలో కనబడతాయి (రూతు 4:19; 1దిన 27:18). బూజు ఊజు సోదరుడు, అబ్రాహాము సోదరుడి (నాహోరు) కుమారుడు (ఆది 22:20-21). యోబు ఊజు దేశస్థుడు (1:1). యోబు తన నీతి గురించి తానే వాదించుకుంటున్నాడు కాబట్టి ఇది దేవుడు అన్యాయస్థుడని సూచిస్తుందనీ (40:8 చూడండి), యోబు స్నేహితులు అతని గురించి ప్రధానమైన విషయాన్ని చూడకుండా అతని మీద దోషము మోపారనీ ఎలీహు కోపగించాడు. 

32:4-5 ఎలీహు కోపము ప్రదర్శించడం ఇది నాల్గవసారి. 

32:6-10 యోబు గ్రంథంలో ఎలీహు చేసిన వరస ప్రసంగాలు అన్నిటికంటే సుదీర్ఘమైనవిగా కనబడుతున్నాయి. “వాస్తవానికి ఎలీహు ప్రసంగాలు పా.ని.లోని 12 పుస్తకాల కంటె, కొ.ని.లోని 17 పుస్తకాలకంటె ఎక్కువ నిడివి కలిగి ఉన్నాయి” (రాబర్ట్ ఆల్డెన్). ఎలీహుకు ఎవరూ స్పందించలేదు. తాను పిన్నవయస్సు గలవాడిననీ, అయితే వృద్ధులు మాత్రమే జ్ఞానం గలవారు కాదనీ, జ్ఞానం అందరికీ చెందుతుందనీ చెప్పాడు. దేవుడు నరుణ్ణి తన పోలికలో సృష్టించి (ఆది. 1:27), తన ఊపిరిని నరుడిలో ఊదాడు (ఆది 2:7). అందువలన నరుడు వివేచన గలవాడయ్యాడు (యోబు 38:36; సామె 16:9), విస్తారమైన జ్ఞానాన్ని ఆర్జించగలవాడయ్యాడు (1రాజులు 4:2934). నరుడు మాట్లాడడం కోసం దేవుడే నరుడికి వివేచన గల ఆత్మనిచ్చాడని ఎలీహు పరోక్షంగా సూచిస్తున్నాడు (యోబు 32:17-20). 

32:11-12 ఎలీహు తన ప్రసంగానికి ముందుమాటగా వృద్ధులైనవారిని తనకంటె ముందు మాట్లాడనిచ్చి వారికి తగిన గౌరవాన్ని తాను ఇచ్చానని చెబుతున్నాడు.

32:13-14 యోబు స్నేహితులు అతనికి దైవభక్తితో కూడిన ఉపదేశాన్ని గానీ (4:12-16), పారంపర్య జ్ఞానోపదేశం గానీ (15:17-19) ఇవ్వడంలో విఫలమయ్యారనీ, ఈ విషయంలో తాను యోబుతో ఏకీభవిస్తున్నాననీ ఎలీహు చెబుతున్నాడు (12:20; 13:12-19; 17:10; 21:34). తాను ముగ్గురు స్నేహితుల వాదనల ననుసరించి కాకుండా మరొకరీతిలో ఉపదేశిస్తున్నాడు కాబట్టి యోబుకు తాను తగిన ప్రత్యర్థినని ఎలీహు భావన. 

32:15-17- యోబు స్నేహితులు తమ వాదనల్ని యోబు అంగీకరించేలా చేయడంలోను, లేదా యోబు వాదనల్ని త్రిప్పికొట్టడంలోను సఫలీకృతులు కాకపోవడం వలన ఉద్వేగభరితులై తమ వాదనలు ముగించడం ఎలీహు గమనించాడు. ఇక వారు చెప్పడానికేమీ లేదు కాబట్టి, ఇక వాదించడం ఎలీహు వంతయ్యింది. 

32:18 ఎలీహు మనసు నిండుగా మాటలున్నాయి, అతడు మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. 

32:19-20 ఎలీహు మనస్సు “అంతరంగం”, అక్షరాలా “ఉదరం”) మాటలతో నిండిపోయి పగిలిపోవుటకు సిద్ధంగా ఉంది. పులిసే ప్రక్రియలో తిత్తులు సాగేలా కొత్త ద్రాక్షరసాన్ని సాధారణంగా క్రొత్త తిత్తులలోనే నింపుతారు (మత్తయి 9:17). తిత్తిలోని గాలి బయటికి పోకుండా తిత్తిని గట్టిగా బిగించినప్పుడు అది పగిలిపోతుంది. 

32:21-22 తన మనసులోని మాటల్ని నిష్పక్షపాతంగా బయటపెట్టడం దేవుడు తన కప్పగించిన విధిగా ఎలీహు భావిస్తున్నాడు. పక్షపాతినై అనే పదం అక్షరాలా “ముఖస్తుతి” చేయడమనే అర్థాన్నిస్తుంది. ఈ నుడికారాన్ని గౌరవం చూపించడం కోసం (ఆది 32:21), లేదా పక్షపాతం చూపించడం కోసం (సామె 18:5) ఉపయోగించారు. అయితే, బైబిల్ పక్షపాతం చూపించడాన్ని ఖండిస్తుంది. (సామె 28:21), మరీ ముఖ్యంగా న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో (లేవీ 19:15), లేక ప్రముఖ వ్యక్తులకు ప్రత్యేకమైన మర్యాద చేయడంలో (యాకోబు 2:1-4) పక్షపాతం చూపించడం గర్హనీయం. తానెవరినీ బిరుదులతో పిలవననీ, పొగడ్తలతో ముఖస్తుతి చేయననీ (కీర్తన 12:1-3; సామె 28:23) ఎలీహు చెబుతున్నాడు. 


Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |