10:1-42 ఈ చర్చలో ఇశ్రాయేలీయులకు సరైన ఆత్మీయ నిర్దేశం చేయడంలో విఫలమైన యూదా నాయకులను యేసు విమర్శించాడు. దానికి విరుద్ధంగా యేసు మంచి కాపరిలాగా తన గొట్టెలకోసం ప్రాణాన్ని ఇస్తున్నాడు. అధ్యా. 10 దీనికి ముందున్న అధ్యాయంలోని యూదా నాయకుల చట్టపరమైన సంకుచితత్వం, మొండితనం, దేవునిపట్ల ఉన్న కఠినత్వంపై వాఖ్యానాన్ని ఇస్తుంది. యేసు మంచి కాపరి మాత్రమే కాదు గాని విశ్వాసి సమృద్ధియైన, నిత్యజీవాన్ని కనుగొనే ద్వారం కూడా (వ.9-10). దీని తర్వాత ఉన్న చర్చ, ఆలయ ప్రతిష్ఠిత పండుగలో (వ.22-39) యేసును దేవదూషణ పేరుమీద రాళ్ళురువ్వి చంపడానికి చేసిన ప్రయత్నంతో ముగిసింది. దీని తర్వాత, బాప్తిస్మమిచ్చు యోహాను గురించిన చివరి ప్రస్తావనతో, అధ్యా. 5-10లో ఉన్న ఈ "పండుగల చక్రం", అలాగే బాప్తిస్మమిచ్చు యోహాను యేసును గురించి సాక్ష్యమిచ్చే పరిచర్యతో ఆరంభమైన ఈ భాగమంతా (1:19-10:42) ముగుస్తుంది.
10:1 గొట్టెలదొడ్డి ఒక ఇంటి దగ్గర, చుట్టూ రాతిగోడ కట్టి, అనేక కుటుంబాలు తమ గొట్టెలను ఉంచిన, ఒక ఆవరణ అయి వుంటుంది (18:15), ద్వారము ను జీతానికి పనిచేసే ఒక కావలివాడు కాస్తుండవచ్చు (10:3). దొడ్డిలో ప్రవేశించడానికి దాని ద్వారపు రహస్య స్వభావంపై దొంగ దృష్టిపెట్టి ఉండవచ్చు, దోచుకొనువాడు హింసించడం మీద (లూకా 10:30,36) దృష్టి పెడతాడు.
10:2 గొట్టెలకాపరి అధికార పూర్వకంగా గొట్టెలను కాచేవాడు.
10:3-4 ద్వారపాలకుడు గురించి వ.1 నోట్సు చూడండి. గొట్టెల కాపరి తన సొంత గొట్టెలను పేరు పెట్టి పిలవడం, వాటిని వెలుపలికి నడిపించడం అనేవి మెస్సీయకు సంబంధించి సంఖ్యా 27:16-18 (ముఖ్యంగా వ.17)ను లేక యెహె 34:13ను సూచిస్తుండవచ్చు. ఐగుప్తునుండి ఇశ్రాయేలీయుల నిర్గమం కొన్నిసార్లు కాపరిని అనుసరిస్తున్న మందలాగా వర్ణించబడింది (కీర్తన 77:20; యెషయా 63:11,14ను కీర్తన 78:52తో పోల్చండి). పాత నిబంధన ప్రవచనాత్మక సాహిత్యం , అంత్యకాలంలో ఇలాంటి దేవుని ప్రజల విమోచనను ముందుగానే ఊహించింది (మీకా 2:12-13).
10:5-6 సాదృశ్యములోని అన్యులు యూదా నాయకులే.
10:8,9 యేసు తనను తాను ద్వారము అని సూచించడం, కీర్తన 118:20 వంటి వాక్యభాగాలలోని మెస్సీయకు సంబంధించిన భాగాలను సూచిస్తుండవచ్చు (యోహాను 6:35,48; 10:1 నోట్సు చూడండి). నాకు ముందు వచ్చిన వారందరు అనే మాటలు, మెస్సీయలమని చెప్పుకొని, తమ అనుచరులకు స్వాతంత్ర్యాన్ని వాగ్దానం చేసి, దానికి బదులుగా వారిని సాయుధ పోరాటాలకు/ఉద్యమాలకు నడిపించిన వారిని సూచిస్తుండవచ్చు (అపొ.కా.5:36-37; 21:38). దొంగలు... దోచుకొనువారు, "తమను తాము పోషించుకుంటున్న" ఇశ్రాయేలు కాపరులను జ్ఞాపకం చేస్తుంది (యెహె 34:2-4; యోహాను 10:1 నోట్సు చూడండి).
10:9 రక్షణకు యేసే ద్వారము (14:6తో పోల్చండి). పరలోకానికి ఒక ద్వారం నుండి ప్రవేశించడాన్ని గురించి కొ.ని. మరొక చోట చెబుతుంది (మత్తయి 7:7,13; 25:10; అపొ.కా. 14:22). లోపలికి పోవుచు బయటికి వచ్చుచు అనే మాటలు నిబంధనా పరిభాషను ప్రతిధ్వనిస్తూ, ముఖ్యంగా విధేయ తకు లభించే ఆశీర్వాదాన్ని సూచిస్తున్నాయి (ద్వితీ 28:6ను కీర్తన 121:8తో పోల్చండి). ఇది ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపించిన యెహోషు వను గూర్చి మోషే వర్ణించడాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది (సంఖ్యా 27:1617). మేతను కనుగొనడం అనేది దేవుని పోషణకు నిశ్చయతను చూపుతుంది (1దిన 4:40: కీరన 23:2; యెషయా 49:9-10; యెహె 34:12-15).
10:10 ఇప్పుడే, ఇక్కడే సమృద్ధి జీవమిస్తాననే యేసు వాగ్దానం, యెహె 34:12-15, 25-31 వంటి పా.ని. వాక్యభాగాలను స్మరణకు తెస్తుంది. యోహాను 5:26 నోట్సు చూడండి.
10:11 మంచికాపరి యేసే (6:35,48 నోట్సు చూడండి), తీర్పుకు గురయ్యే విశ్వాసఘాతకులైన కాపరులకు భిన్నంగా దేవుడు నిజమైన కాపరిగా ఉన్నాడని పా.ని. చూపిస్తుంది (యిర్మీయా 23:1-4; యెహె 34; జెకర్యా 11:4-17). దావీదు (లేక దావీదు సంతతివాడైన మెస్సీయ) కూడా మంచి కాపరిగా చూపబడ్డాడు (2 సమూ 5:2; కీర్తన 78:70-72; యెహె 37:24; మీకా 5:4). అలాగే మోషే కూడా (యెషయా 63:11ను కీర్తన 77:20తో పోల్చండి). గొట్టెల కొరకు తన ప్రాణము పెట్టు మంచి కాపరిగా యవ్వనుడైన దావీదు గుర్తుకొస్తాడు (1సమూ 17:34-37). ,
10:12-13 జీతగాడు గొట్టెలపట్ల శ్రద్ధ చూపకుండా, ప్రమాదంలో వాటిని విడిచి పారిపోతాడు. ఇశ్రాయేలు జీతగాళ్ళకు (యెహె 22:27), దేవుడు, ఆయన మెస్సీయకు మధ్య వ్యత్యాసం ఇక్కడ చెప్పబడింది. ఒక “మంచికాపరి"గా రాజైన దావీదు. తనకన్నా చాలా గొప్పవాడైన మెస్సీయకు ముంగుర్తుగా ఉన్నాడు (1సమూ 17:34-36). 10:14 గొట్టెల మంచి కాపరియైన యేసును గురించి వ.11 నోట్సు చూడండి.
10:15 "యేసును ఎవరు ఎరుగుతారో వారు తండ్రిని కూడా ఎరుగుతారు, ఎవరు యేసును ప్రేమించి ఆయనను విశ్వసిస్తారో వారిని తండ్రి ప్రేమిస్తాడు” (హెర్మాన్ రిడ్డర్ బాస్).
10:16 ఈ దొడ్డివి కాని వేరే గొట్టెలు అనే మాటలు అన్యజనులను సూచిస్తున్నాయి (యెషయా 56:8). తన సిలువ మరణం ద్వారా అన్యజనుల మధ్య తన పనిని యేసు ముందుగా దృష్టిస్తున్నాడు. మంద ఒక్కటియు గొట్టెలకాపరి ఒక్కడును అనే మాటలు యెహె 34:23; 37:24ను సూచిస్తున్నాయి. విశ్వాసులైన యూదులు, అన్యజనులు కలిసి ఒకే ఒక్క మెస్సీయ సమాజంగా ఐక్యపరచబడతారు.
10:17 తన ప్రాణాన్ని బలిగా అర్పించడాన్ని బట్టి యేసు తండ్రి ఆమోదాన్ని పొందడం కాదు, తండ్రికి విధేయత చూపడాన్ని బట్టి ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు.
10:18 ఈ ఆజ్ఞ పొందితిననే మాటలు పా.ని.లో ఇశ్రాయేలుతో దేవుని అనుబంధాన్ని చూపించే, యేసుకు తండ్రితో ఉన్న సంబంధపు నిబంధనా పరిభాషను సూచిస్తున్నాయి. ఈ మాటలు, పరిస్థితులు చేజారిపోవడం వల్ల యేసు మరణించ లేదని పాఠకులకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన రావడానికి కారణం అదే (12:27 చూడండి). -
10:19-21 ప్రాచీన కాలంలో వెళ్లితనం/పిచ్చి, దయ్యపు పీడనలు తరచూ ఒకదానికి ఒకటి సంబంధించినదిగా భావించేవారు. గ్రుడ్డివారి కన్నులు తెరవడం అనే మాటలు, మంచికాపరి ఉపదేశాన్ని అధ్యా. 9 లోని గుడ్డివాన్ని స్వస్థపరచే సంభవంతో కలుపుతున్నాయి. దయ్యం పట్టినవాడు (ఇవి ఇంతకు ముందు చేసిన ఆరోపణలను జ్ఞాపకం చేస్తున్నాయి, 7:20 నోట్సు చూడండి), వెళ్లివాడు అనే ఆరోపణలు, యెహోవాయే గుడ్డివారికి చూపునిస్తాడు. (కీర్తన 146:8ను నిర్గమ 4:11తో పోల్చండి) అనే పా.ని. బోధతో విభేదిస్తున్నాయి.
10:22 ఏడు రోజులుండే ఆలయ ప్రతిష్ఠిత పండుగ (దీనినే హనుక్కా అనీ దీపాల పండుగ అని పిలుస్తారు), క్రీ.పూ.167లో అంతియోకస్ ఎపిఫనెస్ అనే పాలకుడు యూదుల దేవాలయాన్ని అపవిత్రపరచిన కారణంగా క్రీ.పూ. 164 డిసెంబరులో అది తిరిగి పున:ప్రతిష్టించబడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ సంతోషాన్నిస్తుంది.
10:23 అది శీతకాలము అనే మాటలు డిసెంబరు నెలను సూచిస్తున్నాయి. 2:13 నోట్సు చూడండి. బహుశా శీతాకాలపు వాతావరణాన్ని బట్టి, యేసు బహిరంగ ప్రదేశంలో కాక, సొలొమోను మంటపము దగ్గర బోధించాడు. ఈ కట్టడం సొలొమోను సమయంలో కట్టబడిందని సాధారణంగా భావించేవారు (కానీ అది పొరపాటు). తరువాత ఇది ఆది సంఘం సమావేశమయ్యే స్థలంగా మారింది (అపొ.కా. 3:11; 5:12).
10:24-25 నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమని అడగడం, తెలివిలేని ప్రశ్న అనిపిస్తుంది (లూకా 22:67). యేసు తాను మెస్సీయను అని చెప్తున్నాడని అర్థం చేసుకోకుంటే, ఆయన్ని చంపడానికి వారు మరలా మరలా ప్రయత్నించడం ఎందుకు? (యోహాను 5:18; 7:25; 8:59). నిజానికి తాను అలాగే చెప్పానని యేసు జవాబిచ్చాడు. యేసును గూర్చి సాక్ష్యమిస్తున్న ఆయన క్రియలు గురించి, 5:31-47 నోట్సు చూడండి.
10:26-29 అపహరించడం (వ. 28-29) అంటే బలవంతంగా లాక్కోవడం (వ.1 నోట్సు చూడండి). ఈ మాట, వ.12-13 లోని ప్రమాద సమయాలలో మందను విడిచి పారిపోయిన జీతగాని దృశ్యానికి భిన్నంగా ఉంది. దేవుని చేతిలో నుండి ఎవరూ దోచుకోలేరు అనే పా.ని. వ్యాఖ్యలను ఇది జ్ఞాపకం చేస్తుంది (యెషయా 43:13).
10:30 తాను, తండ్రి ఏకమై యున్నామనే యేసు ప్రకటన (వ. 33-38; 5:17-18తో పోల్చండి), షేమా అని పిలవబడే యూదుల ప్రాథమిక ఒప్పుకోలు (ద్వితీ 6:4)ను ప్రతిధ్వనిస్తూ, తాను దేవుడనని చెప్పినట్లయ్యింది. యేసు తండ్రితో ఏకంగా ఉండడం అనేది యేసు అనుచరులు ఐక్యంగా ఉండడానికి ఆధారం అని తరువాత చెప్పబడింది (యోహాను 17:22).
10:31 దేవదూషణ చేశాడని యేసును రాళ్ళతో కొట్టడానికి చేసిన ప్రయత్నాన్ని గురించి, 5:18; 8:59 నోట్సు చూడండి.
10:32 యేసు క్రియలు ఆయనను గూర్చి సాక్ష్యమివ్వడాన్ని గురించి 5:31-47 నోట్సు చూడండి.
10:33 యేసుపై చేసిన ఆరోపణ, లేవీ 24:16పై ఆధారపడినట్లుగా కనిపిస్తుంది. (సంఖ్యా 15:30-31; మార్కు 14:61-64 తో పోల్చండి; యోహాను 8:59 నోట్సు చూడండి).
10:34 మానవ న్యాయాధిపతులు ఒకవిధంగా "దైవములు" అని లేఖనాల్లో పిలవబడడానికి అవకాశం ఉంటే, అలాంటి బిరుదు ఆయనకు మరింత ఎక్కువగా తగినది అనేది కీర్తన 82:6 ఎత్తి చెప్పడంలో యేసు ఉద్దేశం.
10:35 లేఖనము నిరర్థకము కానేరదు అనడంలో రాయబడిన దేవుని మాటలను (ఈ సందర్భంలో హెబ్రీ. లేఖనాలు; మత్తయి 5:18తో పోల్చండి) మీరకూడదనే ఆయన విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. యేసు, ఆయన విరోధులలో అనేకులు (యూదులు) దేవుని వాక్య అధికారాన్ని ఎత్తిపట్టుకున్నారు.
10:36 యేసు తన పనికోసం ప్రతిష్ఠ చేయబడినవాడు అనే మాట, ధర్మశాస్త్రమిచ్చిన మోషే, ప్రవక్తయైన యిర్మీయా, అహరోను సంతతివారైన యాజకులు నియమించబడినప్పటి భాషను ధ్వనిస్తుంది.
10:37-38 యేసు క్రియలు ఆయనను గూర్చి సాక్ష్యమివ్వడం గురించి, 5:31-47 నోట్సు చూడండి.
10:39 యేసును పట్టుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం మొదటిదేమీ కాదు. 7:30 చూడండి.
10:40-41 యోహాను... బాప్తిస్మమిచ్చు చుండిన స్థలము గురించి 1:28 నోట్సు చూడండి.