Romans - రోమీయులకు 4 | View All

1. కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము.

2. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.
ఆదికాండము 15:6

3. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను
ఆదికాండము 15:6

4. పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు.

5. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

6. ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.

7. ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
కీర్తనల గ్రంథము 32:1-2

8. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,
కీర్తనల గ్రంథము 32:1-2

9. ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చికూడ చెప్ప బడినదా? అబ్రాహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెనను చున్నాము గదా?
ఆదికాండము 15:6

10. మంచిది; అది ఏ స్థితి యందు ఎంచ బడెను?సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే.

11. మరియు సున్నతి లేని వారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.
ఆదికాండము 17:11

12. మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.

13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.
ఆదికాండము 18:18, ఆదికాండము 22:17-18

14. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థక మగును.

15. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేక పోవును.

16. ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికికూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.

17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.
ఆదికాండము 17:15, యెషయా 48:13

18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
ఆదికాండము 15:5

19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,
ఆదికాండము 17:17

20. అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
ఆదికాండము 15:6

23. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని

24. మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను.

25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
యెషయా 53:5, యెషయా 53:12



బైబిల్ అధ్యయనం - Study Bible
4:1-25 హెబ్రీయుల జాతికి పితరుడు అబ్రాహాము (ఆది. 12:1-3). సీనాయి పర్వతం వద్ద ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే (ఆది 26: 5) అబ్రహాము దాన్ని ఆచరించాడని యూదులు సాధారణంగా నమ్ముతారు, కాబట్టి అతడు అతిశయించడానికి కారణం ఉంది. పౌలు దీనిని ఖండిస్తూ, అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కాబట్టి అతిశయించడానికి అతనికి ఆధారం లేదు అని చూపిస్తున్నాడు. 

4:3 లేఖనము స్పష్టంగా చెప్పేదానికి సాంప్రదాయం తలొంచాల్సిందే. పౌలు ఎత్తి చూపుతున్న లేఖనం ఆది 15:6. 

4:4-5 ఋణము, దానము అనేవి క్రియలు, విశ్వాసంవలె భిన్నమైనవి. పౌలు దేవున్ని కూడా లెక్కలు చూడడానికి ఖాతాపుస్తకాలతో ఉన్నవాడిలా అభివర్ణిస్తున్నాడు. అబ్రాహాము విశ్వాసాన్ని బట్టి దేవుడు అతనికి నీతిని ఖాతాలో వేశాడు లేక నీతిని ఆపాదించాడు. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచు వాడు అనే మాటలు ఆశ్చర్యకరమైనవి. సంఘ సంస్కరణోద్యమం ఈ వాక్యభాగంపై దృష్టి పెట్టింది. దేవుడు భక్తిహీనులను, పాపులను, తన శత్రువులను రక్షిస్తాడు (5:5,8,10). యూదులు అబ్రాహామును సద్గుణశీలిగా చూసినప్పటికీ, పౌలు అతన్ని కృపచేత రక్షింపబడిన పాపిగా ప్రకటించాడు. అతడు కూడా మిగిలిన క్రైస్తవుల్లాగా విశ్వాసమును బట్టియే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. 

4:6-8 ఇశ్రాయేలీయుల గొప్ప రాజైన దావీదు, ఉద్దేశపూర్వకంగా చేసిన పాపమునకు దేవుడు క్షమాపణనిచ్చిన ధన్యతను గూర్చి పాడాడు - ఇది క్రియల వలన కలిగిన నీతి కాదు. దేవుడు అతని ఖాతాలో పాపాలు తుడిచివేసి, వాటి స్థానంలో నీతిని లిఖించాడని దావీదు అర్థం చేసుకున్నాడు. కీర్తన 32:1-2ను పౌలు పేర్కొనడం, ఆది 15:6ను స్పష్టం చేసి, వివరిస్తుంది. అదేవిధంగా అపొ.కా. 13:38-39లో నమోదు చేసిన సమాజమందిరపు ప్రసంగంలో పౌలు నీతిమంతులుగా తీర్చబడడాన్ని, పాపక్షమాపణను ఇలాగే జతచేసి చెప్పాడు. 

4:9-10 దావీదు కీర్తన (కీర్తన 32) ఒక యూదునిచేత, యూదుల కోసం రాయబడింది కాబట్టి, దేవుని ధన్యవచనము సున్నతిగలవారిని గూర్చి మాత్రమే చెప్పినట్లు అనిపిస్తుంది. పౌలు ఆది 15:6లోని తన మూలవచనానికి తిరిగివచ్చి, సున్నతి లేనప్పుడే అబ్రాహాము నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అని చూపాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం విశ్వసించే అన్యజనులకు కూడా వర్తిస్తుంది. 

4:11 సున్నతి అనేది ఒక గురుతు... ముద్ర. అది ఒక వ్యక్తిని ఇశ్రాయేలు జాతిలో భాగంగా గుర్తించింది. అది ఒక వ్యక్తి తన విశ్వాసము ద్వారా పొందిన నీతికి ముద్ర కూడా. అబ్రాహాము సున్నతి పొందిన సమయం, అతడు విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడడానికి మాదిరిగా, సున్నతి పొందిన యూదులకు, సున్నతి పొందని అన్యజనులకు ఆధ్యాత్మిక తండ్రిగా ఉండేలా చేసింది. 

4:12 అబ్రాహాము హెబ్రీయుల జాతికి భౌతికంగా తండ్రి, కానీ అతని గొప్ప వారసత్వం అతని విశ్వాసపు మాదిరే. యూదులు, అన్యజనులు కూడా అబ్రాహాము విశ్వాసపు అడుగుజాడలను బట్టి ఒకేలా నడుచుకొనవచ్చు. 

4:13 ధర్మశాస్త్రము , విధేయతను, ఆచరణను కోరింది. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం వలన కలిగే ఫలితం ఉగ్రతే. ధర్మశాస్త్రం కృపా వ్యవస్థ కాదు. దేవుని వాగ్దానము కృప వలననైనది. అబ్రాహాముకు అతని సంతానానికి ఇచ్చిన వాగ్దానం (గలతీ 3:16-18) విశ్వాసమువలననైన నీతి మూలముగానే ఇచ్చాడు గానీ ధర్మశాస్త్రం వలన కాదు. 

4:14-15 వాగ్దానపు వారసత్వం ఆజ్ఞాపరమైన విధేయతవల్ల వచ్చినట్లయితే, విశ్వాస మార్గము వ్యర్థము. ఇంకా చెప్పాలంటే, ధర్మశాస్త్రాన్ని ఎవరూ పాటించలేరు కాబట్టి ఎవరూ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. 

4:16-17 దేవుని వాగ్దానము... విశ్వాసమూలమైనది కాబట్టి అది విశ్వసించే యూదులకు, అన్యజనులకు కూడా హామీగా ఉంది. అది ధర్మశాస్త్రం వలననైతే, అలాంటి హామీ సాధ్యం కాదు. దాన్ని నిశ్చయం చేయడానికి వాగ్దానం కృప ననుసరించినదై ఉంది. అనేక జనములకు తండ్రి అవుతాడని కూడా అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. శూన్యము నుండి సమస్తమును చేసి మృతులను సజీవులనుగా చేయగల దేవునిలో అబ్రాహాము విశ్వాసముంచాడు. 

4:18 అతడు - వృద్ధుడైనప్పుడు, తాను అనేక జనములకు తండ్రి కావడం మనుష్యరీతిగా అసాధ్యమని అబ్రాహాముకు అనిపించింది, కానీ అతడు దేవుని వాగ్దానంపై నిరీక్షణ ఉంచాడు.

4:19-20 తాను తండ్రి అయ్యే విషయంలో అబ్రాహాముకు ఒక వాస్తవిక నిర్ధారణ ఉంది. అతడు సుమారు నూరేండ్ల వయస్సుగలవాడు, శారా గొడ్రాలు, ఆమె పిల్లలను కనే వయస్సు దాటి చాలా కాలమైంది. అయినప్పటికీ అబ్రాహాము దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు, దేవుడు అతని విశ్వాసమును బలపరిచాడు.

4:21-22 "తాను వాగ్దానం చేసినదాన్ని నెరవేర్చడానికి దేవుడు సంపూర్ణంగా సమర్థుడు అని అబ్రాహాము ఒప్పుదల, తనకు - ఆటంకంగా కనబడే "వాస్తవాలను" జయించడానికి అతనికి విశ్వాసాన్ని ఇచ్చింది" (డగ్లస్ జె. మో). సరిగ్గా ఇలాంటి విశ్వాసమే నీతిని పొందుతుంది. 

4:23-24 లేఖనాలలో ఉన్నదంతా మన ప్రయోజనం కోసమే. అతని (అబ్రాహాము) అనుభవాలు, నాడు అతనికి ఎలా వర్తించాయో, నేడు మనకు కూడా అలాగే వర్తిస్తాయి. ఎందుకంటే, మానవులకు అసాధ్యమైన కార్యాలను చేసే అదే సృష్టికర్తయైన దేవున్ని మనం సేవిస్తున్నాం. అబ్రాహాములాగా మనం కూడా దేవుని యెదుట నీతిమంతులుగా ఎంచబడుతున్నాం: విశ్వాసం వలన. 

4:25 యెషయా 52:13-53:12లో వాగ్దానం చేయబడినట్లు యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడినాడు. యేసును అప్పగించింది. ఎవరు? యూదా ఇస్కరియోతా? పిలాతా? యూదుల మహాసభా? సాతానా? వీరంతా క్రీస్తు సిలువ వేయబడడంలో సాధారణ పాత్రధారులే కాని, తన విమోచన ప్రణాళికను నెరవేర్చడానికి దీనంతటినీ జరిగించినవాడు సర్వాధికారియైన దేవుడే (అపొ.కా.4:27-28). మన అతిక్రమముల కోసం యేసును అప్పగించి, తన నీతిగల సేవకుడు అనేకులను నీతిమంతులనుగా చేయుటకు ఆయనను లేపినవాడు కూడా తండ్రియే (యెషయా 53:11).


Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |