James - యాకోబు 2 | View All

1. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి.
యోబు 34:19, కీర్తనల గ్రంథము 24:7-10

2. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు,మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల

3. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల

4. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?

5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?

6. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్న వారు వీరే గదా?

7. మీకు పెట్టబడిన శ్రేష్ఠమైన నామమును దూషించువారు వీరే గదా?

8. మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.
లేవీయకాండము 19:18

9. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.
ద్వితీయోపదేశకాండము 1:17

10. ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును;

11. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధి వైతివి.
నిర్గమకాండము 20:13-16, ద్వితీయోపదేశకాండము 5:17, ద్వితీయోపదేశకాండము 5:18

12. స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి.

13. కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.

14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయో జనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?

15. సహోదరు డైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు.

16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యకసమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

17. ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.

18. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.

19. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.

20. వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా?

21. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించి నప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా?
ఆదికాండము 22:2, ఆదికాండము 22:9

22. విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?

23. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.
ఆదికాండము 15:6, 2 దినవృత్తాంతములు 20:7, యెషయా 41:8

24. మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతి మంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.

25. అటువలెనే రాహాబను వేశ్యకూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?
యెహోషువ 2:4, యెహోషువ 2:15, యెహోషువ 6:17

26. ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.బైబిల్ అధ్యయనం - Study Bible
2:1-26 ఈ అధ్యాయంలో సమాజ మందిరంలో (సునగోగు) జరిగే ఆరాధనను యాకోబు చర్చిస్తున్నాడు. ధనవంతులను పేదలను భిన్నంగా చూడడం  1:9-11ని స్ఫురింపజేస్తుంది. నిజమైన ఆత్మీయతకు సంబంధించిన నైతిక విలువలపై దృష్టిపెట్టడం 1 అధ్యా. కి దగ్గరగా సంబంధించి వుంది. 

2:1 కొ.ని.లో మోమాటము గలవారై యుండకుడి అనే మాటలు నాలుగు చోట్ల చూస్తాం (రోమా 2:11-12; ఎఫెసీ 6:9; కొలస్సీ. 3:25 - లతో పోల్చండి). ప్రతిసారి, దేవునికి పక్షపాతం లేదని చెప్పే సందర్భంలోనే వీటిని వాడారు. “పక్షపాతం" చూపడం ద్వారా మనం పాపం చేసినపుడల్లా, దేవుడు
స్త్రీపురుషులందరినీ సమానంగా చేయలేదు అని సూచిస్తున్నట్లే. కాబట్టి పక్షపాతం చూపే ఎవరైనా సరే, “దురాలోచనలు"గల అపరాధులౌతారు (2:4). 

2:2-3 ఒక ధనవంతుడు, ఒక పేదవాడు సమాజమందిరము లోనికి వచ్చినపుడు వారిపట్ల చూపే వైఖరిలో భిన్నత్వాన్ని యాకోబు పక్షపాతానికి ఉదాహరణగా చెప్పాడు. దశమభాగాలు, కానుకలు ఎక్కువ మొత్తంలో ఇవ్వడం బట్టి ఒక ధనవంతుడు రావడం ఆర్థికపరమైన ప్రయోజనానికి భరోసా ఇస్తుంది, కాబట్టి సమాజం అతనిని సన్మానిస్తుంది. సన్మానించడం వ.1 లోని "మోమాటము” (పక్షపాతం) చూపడంతో సంబంధం కలిగి ఉంది. 

2:4 తన శ్రోతలు “అవును” అని మాత్రమే జవాబిచ్చే విధంగా ఒక ప్రశ్నను (మీ మనస్సులలో భేదము పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసిన వారగుదురు కదా?) పదే పదే అడగడం ద్వారా యాకోబు పక్షపాత ధోరణిని ఖండించాడు. “భేదములు పెట్టుకొని” అనే మాట సమాజ మందిరపు
సహవాసంలో ఇట్టి దుర్బుద్ధి విభేదాలు సృష్టించిందని సూచిస్తుంది. ఆ ధనవంతుడు గాని, పేదవాడు గాని బహుశా సమాజ మందిరంలో సభ్యులై ఉండకపోవచ్చు. 

2:5 దరిద్రులను దేవుడు ఎంచుకోవడం ఇక్కడ పక్షపాతం కాదు, ఎందుకంటే ఆ ఎంపిక దురభిమానం మీద ఆధారపడింది కాదు. “స్వాతంత్రమునిచ్చే నియమము" అందరికీ అన్వయించి, మనం అందర్నీ సమానంగా చూసేలా చేస్తుంది అనే సత్యాన్ని ఒకడు నిర్లక్ష్యం చేసినపుడు ఈ భేదభావం కలుగుతుంది. 

2:7 శ్రేష్టమైన నామము యేసు క్రీస్తును సూచిస్తుంది. దూషణ అంటే ధనవంతులు క్రీస్తుకు విరోధంగా మాట్లాడటం ద్వారానో లేక సమాజంలో ఉన్న సభ్యులకు విరోధంగా వారు చేసే పనుల ద్వారానో దూషిస్తున్నారు అని అర్థం.

2:8-11 క్రైస్తవుల్లో ఒకరిపట్ల ఒకరి వైఖరి, నీవలె నీ పొరుగువాని ప్రేమించు అని చెప్పే ప్రాముఖ్య మైన ఆజ్ఞ పై ఆధారపడి వుండాలి. (లేవీ. 19:18; మత్తయి 19:19; 22:39; మార్కు 12:31; రోమా 13:9; గలతీ 5:14). పక్షపాతధోరణి ఈ ఆజ్ఞను అతిక్రమించి, అలా చేసినవారిని ధర్మశాస్త్రం ప్రకారం అపరాధులని తీర్చుతుంది. 

2:12-13 తన పాఠకులు సరైన వైఖరులు కలిగి వుండాలని యాకోబు హెచ్చరించాడు. మాటలాడుడి... ప్రవర్తించుడి అనే మాటలు “వినుట, ప్రవర్తించుట"ను అంటే, 1:19-27 లో చెప్పినట్లు మాటలను అదుపు చేసుకోవడాన్ని సూచిస్తాయి. స్వాతంత్ర్యమునిచ్చు నియమము, లేక సువార్త, అంతిమ తీర్పుకు ఆధారంగా పనిచేస్తుంది (1:2-12). 2:14-26 ఈ భాగంలో విశ్వాసానికి, క్రియలకు మధ్య ఉన్న సంబంధం మీద దృష్టిపెడుతూ, “వాక్యమును వినువారు, వాక్యప్రకారం ప్రవర్తించువారు"గా ఉండడం (1:19-27) అనే అంశాన్ని యాకోబు కొనసాగిస్తున్నాడు. 

2:14 అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? అనే మాటలను “సత్రియల ద్వారా వ్యక్తపరచని విశ్వాసం రక్షించే విశ్వాసమౌతుందా?” అని ప్రశ్నించినట్లుగా అర్థం చేసుకోవాలి. కాదు అన్నదే దానికి జవాబు..

2:15-17 అవసరతలో ఉన్నవారికి ప్రత్యక్ష సహాయం చేయకుండా ఇచ్చే ఆశీర్వచనం వ్యర్థం. క్రియలతో కూడినది కానీ విశ్వాసం, ఒంటిగా ఉండి మృతమైనదగును. 

2:18 ఈ వాదన విశ్వాసం, క్రియలకు మధ్య ఉన్న సంబంధం వైపుకు తిరిగింది. ఈ వచనంతో ఆరంభించి అయితే ఒకడు... చెప్పును అంటున్న ఒక ఊహాజనిత వ్యక్తితో క్రియలు లేని విశ్వాసం మృతము అని వాదిస్తూ జవాబిస్తున్నాడు. 

2:19-20 దయ్యములును నమ్మి వణకుచున్నవి అనే మాటలు రక్షణకు దేవునిలో నమ్మకముంటే చాలనే తప్పు ఆలోచనకు జవాబు. దయ్యములు నమ్ముతున్నాయి కానీ అవి రక్షణ పొందడం అసాధ్యం. రక్షించే విశ్వాసానికి, జ్ఞానం కంటే ఎక్కువ కావాలి. దానిలో నమ్మిక, విధేయత కూడా ఉన్నాయి, ఎందుకంటే క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనది. 

2:21-23 అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించడం అనే ఉదాహరణ (ఆది 22:1-19), విశ్వాసాన్ని గూర్చి యాకోబు బోధను సమర్ధిస్తుంది. బైబిల్ రచయిత నీతిగా ఎంచెను అనడంలో అతని భావం, దాన్ని అతడు ఉపయోగించిన నేపథ్యం మీద ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు “ధర్మశాస్త్ర సంబంధ క్రియలు” ఒకని “నీతిమంతునిగా తీర్చలేవు" అని పౌలు వాదించాడు (గలతీ 3:6-14), ఎందుకంటే రక్షణ అనేది కేవలం విశ్వాసం వల్ల మాత్రమే దొరికే వరం అని అతడు స్పష్టం చేయదలిచాడు. అబ్రాహాము దేవుని నమ్మాడు, అతడు దేవునిలో ఉంచిన నమ్మకం అతనికి నీతిగా ఎంచబడింది (ఆది 15:6; గలతీ 3:6). విశ్వాసం యథార్థమైనదని నిరూపించే విషయంలో సర్రియలు పోషించే పాత్రపై యాకోబు మరింత దృష్టిపెట్టాడు. అబ్రాహాము దేవుని ఆజ్ఞకు లోబడడం వల్ల అతని విశ్వాసం యథార్థమైనదని నిరూపితమైంది. అతని విశ్వాసమే అతని సతియలను సాధ్యపరిచింది.

2:24-26 యాకోబు చెప్పిన మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడును అనే మాటలు రోమా 3:28తో విభేదిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ పౌలు “ధర్మశాస్త్ర సంబంధ క్రియల"ను గూర్చి మాట్లాడుతున్నాడు, యాకోబు కేవలం సత్రియలను దృష్టిలో పెట్టుకుని, “క్రియల"ను గూర్చి మాత్రమే మాట్లాడుతున్నాడు. యాకోబు ఉదహరించే ధర్మశాస్త్రము “స్వాతంత్ర్యమునిచ్చు నియమము" (సువార్త; 2:12 చూడండి), “ప్రాముఖ్య మైన ఆజ్ఞ” (వ. 8; లేవీ 19:18), ఈ రెండూ నిజమైన విశ్వాసం సర్రియల ద్వారా బయల్పరచబడుతుందనే అతని వ్యాఖ్యను సమర్ధిస్తాయి. 3:1-12. ఈ భాగంలో అజాగ్రత్తగా మాట్లాడే అంశాన్ని (2:16-18) గూర్చి కొనసాగిస్తున్నాడు. దుర్బోధ సంఘంపై ఎంత చెడ్డప్రభావం చూపుతుందో అనేదానిపై యాకోబు దృష్టిపెట్టాడు.


Shortcut Links
యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |