Corinthians II - 2 కొరింథీయులకు 9 | View All

1. పరిశుద్ధులకొరకైన యీ పరిచర్యనుగూర్చి మీ పేరు వ్రాయుటకు నా కగత్యములేదు.

2. మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.

3. అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని.

4. మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?

5. కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్య వలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగావచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.

6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
సామెతలు 11:24, సామెతలు 22:9

7. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
సామెతలు 22:8

8. మరియఅన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.

9. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.
కీర్తనల గ్రంథము 112:9

10. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.
యెషయా 55:10, హోషేయ 10:12

11. ఇట్టి, ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.

12. ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.

13. ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.

14. మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.

15. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.



బైబిల్ అధ్యయనం - Study Bible
9:1-5 కొరింథీయులు ఇచ్చిన మాట చొప్పున చేయలేక, అది ఇతరులకు తెలిసి వారు సిగ్గుపడవలసిన పరిస్థితి రాకుండా ఉండాలని పౌలు కోరడం ఈ భాగంలో వివరించబడింది.

9:1 పరిశుద్దుల కొరకైన యీ పరిచర్య గురించి 8:4 నోట్సు చూడండి. 

9:2 మాసిదోనియవారు కొరింథు ఉన్న ప్రాంతంలోనే అకయకు ఉత్తరంగా నివసించేవారు. (1:1 నోట్సు చూడండి). 1కొరింథీ 16:1-4లో పౌలు రాసినది కొరింథీయులను పురికొల్పి వారు అత్యుత్సాహంతో కానుక గురించి ప్రతిజ్ఞ చేసేలా చేసింది. అది పౌలుకు తెలిసి కొరింథీయుల ఆసక్తిని గురించి మాసిదోనియ సంఘాలలో గొప్పగా చెప్పాడు. మాసిదోనియ నుండి యెరూషలేము కోసం పౌలు పోగుచేసిన కానుకలపై ఇది ప్రభావం చూపింది. (8:1-4). 

9:4 వారు వాగ్దానం చేసిన దాతృత్వపూర్వక కానుక విషయంలో కొరింథీయులు నమ్మకంగా ఉండాలని పౌలు కోరాడు. 9:5 తీతు, అతనితో ఇద్దరు సహోదరులు కొరింథుకు వచ్చిన తర్వాత, పౌలు కూడా అక్కడికి రావాలనుకుంటున్నాడు. ఆ సరికి తాను యెరూషలేముకు తీసుకువెళ్ళడానికి కానుక సిద్ధంగా ఉంచాలని అతడు కోరాడు. రోమా 15:25-27లో రాసినట్టు (రోమా పత్రిక కొరింథు నుండి రాయబడింది) ఇది ఇలా జరగడం సత్యమే. ధర్మము... ధారాళముగా అనే మాటలు, ఇచ్చేదాని మూలంగా ఇతరులకు మేలు కలుగుతుందని ఇవ్వాలి గాని, దానికి బదులుగా తాము ఏదో పొందుతామని ఇవ్వకూడదు అని అర్థమిస్తుంది. 

9:6-15 ఈ వచనాలు కొ.ని.లో గృహనిర్వాహకత్వం గురించిన విస్పష్టమైన భాగం. ఎందుకంటే వ్యక్తులు, ప్రదేశాల పేర్లు లేకపోవడం వలన వాక్యభాగాన్ని విస్తృతమైన రీతిలో అన్వయించడం సులువు. 9:6 కొంచెముగా... కొంచెముగా... సమృద్ధిగా... సమృద్ధిగా అనే మాటలు సాధారణ వ్యవసాయ అనుభవం మీద ఆధారపడి, ఒక సామెతలాంటి సత్య సూత్రాన్ని చెబుతున్నాయి. ఇక్కడ ఇది ఆర్థిక సంబంధమైన విషయాలకు అన్వయిస్తున్నాడు. కానీ లూకా 6:38; గలతీ 6:7-9 చూడండి. 

9:7 ఇతర సృయల్లాగా క్రైస్తవ గృహనిర్వాహకత్వం కూడా దేవుని పట్లా, ఇతరుల పట్ల ప్రేమ ఉన్న హృదయం నుండి ఉద్భవిస్తుంది గాని చేయాలి కాబట్టి అనే భావం నుండి కాదు (మత్తయి 22:37-40). 

9:8 "అన్ని” అనే గ్రీకు పదరూపం ఇక్కడ నాలుగు విధాలుగా వాడారు: అన్నిటియందు... సర్వసమృద్ధి... ప్రతికార్యము... సమస్త విధములైన. ఎల్లప్పుడు అనేది దీనికి దగ్గరగా సంబంధించిన మరొక పదం. 9:9 ప్రభువుకు భయపడి, ఆయనకు విధేయులై నీతిగల జీవితాలు జీవిస్తూ దాతృత్వంతో దరిద్రులకు ఇచ్చినందుకు వారిని ప్రశంసిస్తూ రాసిన కీర్తన 112:9 నుండి ఈ వ్యాఖ్య తీసుకున్నాడు. 

9:10-11 ఈ వచనాలు మనల్ని మళ్ళీ వ.6 లోని వ్యవసాయ సాదృశ్యానికి తీసుకువెళతాయి. విశ్వాసుల భౌతిక అవసరాలు (విత్తనము), ఆత్మీయ అవసరాలు (నీతి) తీర్చడంలో దేవుడు సర్వాధికారిగా ఉన్నాడని నొక్కి చెప్పబడింది. 

9:12-13 యెరూషలేములోని పేద విశ్వాసులకు కొరింథీయులు ఇచ్చిన కానుక ప్రభావం యెరూషలేమును దాటిపోతుంది. ఇతర సంఘాలవారు దీని గురించి తెలుసుకొని, కొరింథీయుల ఔదార్యమును గురించి దేవుని స్తుతిస్తారు. ఇతరుల ముందు క్రీస్తు సువార్త సత్యమును గుర్తించడంలో క్రైస్తవ గృహనిర్వాహకత్వం ఒక ముఖ్యమైన విధానం. పౌలు “ఒప్పుకొను”లేక ఒప్పుకొనుట అని వాడిన ఇతర ప్రదేశాల కోసం రోమా 10:9-10; 1తిమోతి 6:12-13 చూడండి. 

9:14 ఇవ్వడంలో మనకు లభించే అదనపు ప్రేరణ ఏమిటంటే, దాతృత్వంతో ఇచ్చేవారి కోసం ఇతర విశ్వాసులు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఔదార్యంతో ఇవ్వడం అనేది వారిలో దేవుని కృప అప్పటికే పనిచేస్తుందని నిరూపించింది కాబట్టి. 

9:15 చెప్పశక్యము కానీ ఆయన వరము దేవుని కుమారుడైన యేసును సూచిస్తుంది. ఇవ్వడం అనేది యేసును పంపించినందుకు (యోహాను 3:16) దేవుని పట్ల కృతజ్ఞతాపూర్వకమైన ఒక స్పందన అయివుండాలి. 


Shortcut Links
2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |