Esther - ఎస్తేరు 7 | View All

1. రాజును హామానును రాణియైన ఎస్తేరునొద్దకు విందునకు రాగా

2. రాజు ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకను గ్రహించెదనని రెండవనాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను.
మార్కు 6:23

3. అప్పుడు రాణియైన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనురాజా, నీ దృష్టికి నేను దయపొందిన దాననైన యెడల రాజవైన తమకు సమ్మతియైతే, నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవినిబట్టి నా జనులును, నా కనుగ్ర హింపబడుదురు గాక.

4. సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసు రాండ్రముగాను అమ్మబడిన యెడల నేను మౌనముగా నుందును; ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు.

5. అందుకు రాజైన అహష్వేరోషుఈ కార్యము చేయుటకు తన మనస్సు ధృఢపరచుకొన్నవాడెవడు? వాడేడి? అని రాణియగు ఎస్తేరు నడుగగా

6. ఎస్తేరుమా విరోధి యగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను.

7. రాజు ఆగ్రహమొంది ద్రాక్షా రసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హానిచేయ నుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణముకొరకు విన్నపము చేయుటకై నిలిచెను.

8. నగరువనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచివీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.

9. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడుఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తు గల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడియున్న దనగా రాజుదానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.

10. కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.బైబిల్ అధ్యయనం - Study Bible
7:1-10 ఇప్పటివరకు ఒకదానితో ఒకటి పెనవేసుకున్న రెండు సంఘర్షణలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. మొదటిది, హామాను చేయించిన రాజాజు ప్రకారం యూదులను నాశనం చేయాలనే ప్రమాదం. రెండవది, మొబైకై, హామానుల మధ్య ఉన్న వ్యక్తిగత ఘర్షణ.
జాతీయ విపత్తు అధ్యా. 9 వరకు పరిష్కారం కాలేదు. ఈ చిన్న అధ్యాయం, హామాను, మొంకైల మధ్య ముఖాముఖి కలహాన్ని తగిన న్యాయంతో క్లుప్తీకరిస్తుంది. 

7:1-2 రాజైన అహష్వేరోషు ఎస్తేరు - రాజ్యములో సగము మట్టుకు అక్షరార్థంగా అడగాలని ఆశించలేదు. కానీ జవాబు చెప్పడానికి ఆమె తడవు చేయడం, ఏదో బాగా ఆలోచించి, ముఖ్యమైన కోరిక కోరబోతున్నదని అతనికి నిర్ధారణ అయ్యింది. 

7:3-4 ఎస్తేరు కోరిక సూటిగా ఉంది. ఆమె ప్రాణమును - ఆమె జనులును...తప్పించుకొనుట. జాగ్రత్తగా, చిన్న తేడాతో, ఎస్తేరు. తన మాటలు కొనసాగించింది. నేనును నా జనులును కూడా అమ్మబడినవారము. ఆమె తన భర్త మీద నేరుగా నేరం మోపలేదు “నీవే నన్ను అమ్మేశావు”), కానీ ఆమె. అదే మాటలను నిరవధిక నిష్క్రియాత్మక స్వరంతో చెప్పింది (“అమ్మబడినవారము”, హెబ్రీ. నిమార్ను). ఎస్తేరు తాను యూదురాలనని రాజుతో చెప్పలేదు, ఆమె “తన జనులను” గురించి కూడా బయట పెట్టలేదు. ఆమె తన విన్నపాన్ని కొనసాగిస్తుండగానే రాజుకు ఒక జాడ దొరికింది: వారు సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును అమ్మబడినవారు (హామాను రాసి, తన భర్త ముద్రవేసిన రాజాజ్ఞలోని మాటలనే నేరుగా c పేర్కొంది, 3:13).

7:5-6 అహష్వేరోషు ప్రశ్నలు, ఎస్తేరు జవాబు రెండూ వారి భావోద్వేగాల తీవ్రతను ప్రతిబింబిస్తాయి. భయాక్రాంతుడాయెను (హెబ్రీ. "నివాట్") అనే పదం, రాజైన దావీదు అరౌనా కళ్ళెము వద్ద ఖడ్గమును చేత ధరించిన దేవదూతను ఎదుర్కొన్నపుడు భయపడడాన్ని (1దిన 21:30), గబ్రియేలు దూత దానియేలు వద్దకు వచ్చినపుడు అతడు తీవ్రమైన భయాన్ని చూపడాన్ని (దాని 8:17) వర్ణించడానికి ఉపయోగించిన పదం.

7:7 ఎస్తేరు గ్రంథంలో మొదటిసారి రాజు తన సలహాదారులు లేకుండా కీలకమైన నిర్ణయాలు చేయాల్సివచ్చింది. హఠాత్తుగా తన ప్రధానమంత్రి, భార్యలలో ఎవరైనా ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చింది. తన భార్యను, ఆమె జనులను బెదిరించినందుకు హామానును పదవి నుండి తప్పిస్తే, రాజు తానే ఆ ప్రణాళికను ఆమోదించాడనే విషయాన్ని హామాను బయలుపరుస్తాడు కదా! తోటలో రాజు ఆలోచనలలో తన నిర్ణయాలతో కుస్తీపడుతుండగా, తన ప్రాణము కొరకు విన్నపము (హెబ్రీ. లెబబ్జెష్) చేయుటకై హామాను ఎస్తేరుతో ఉండిపోయాడు. ఇంతకు ముందు ఎస్తేరు (వ.3) తప్పించబడాలని కోరింది (హెబ్రీ. బభాషా), కానీ ఇప్పుడు పరిస్థితి తలక్రిందులైంది.

7:8 తోటలో నుండి వస్తూ రాజు హామానును గూర్చి ఇంకా నిర్ణయించుకో కుండా వచ్చి ఉంటే, ఎస్తేరు వద్ద హామాను చూపుతున్న నక్క వినయంతో అది నిశ్చయమైపోయింది. అష్ఫూరీయుల కాలంలోని న్యాయపత్రాలలో, ఒక పురుషుడు అంత:పుర స్త్రీలకు ఏడు అడుగులకంటే దగ్గరగా ఉండకూడదని రాసి ఉంది. (డి.జె.ఎ. థైన్స్). ఎస్తేరు గ్రంథపు యూదా టార్గం (హెబ్రీ లేఖనాల అరామిక్ స్వేచ్చానువాదం)లో, గబ్రియేలు దూత ఒక తోపు తొయ్యగా, ఎస్తేరు శయ్య మీద హామాను పడి ఉన్నాడు అని రాశారు!
గ్రంథ రచయిత "పడడం " - (హెబ్రీ...... నఫాల్)- అనే భావనను నైపుణ్యంతో రాశాడు. మొరైకై తనకు వంగి నమస్కారం చేయనందుకు హామాను కోపోద్రేకుడయ్యాడు (3:1-4). ఇది పూరు (చీటి) వేయడానికి (హెబ్రీ.. నఫాల్), యూదులను సర్వనాశనం చేయడానికి ఒక రోజును నిర్ణయించడానికి కారణమైంది (3:7), అప్పుడు "మొరైకై యూదుడు కాబట్టి, నీవు అతని ముందు తప్పక పడతావు” (చెడిపోదువు, హెబ్రీ. నఫాల్) అని హామాను భార్య, స్నేహితులు అతనికి చెప్పారు. (6:13). కొద్ది గంటల్లోనే హామాను ఎస్తేరు శయ్యమీద పడుతున్నాడు (హెబ్రీ. నఫాల్). ఈ చివరిగా పడడంతో అతని పతనం పూర్తయ్యింది.

7:9-10 ఈ వచనాల్లో కనుపరచిన వ్యంగ్యం, సామె 26:27; మత్తయి 26:52లో సామెత రూపంలో వ్యక్తపరచబడింది. 


Shortcut Links
ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |