Psalms - కీర్తనల గ్రంథము 102 | View All

1. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము.

2. నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తర మిమ్ము.

3. పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.

4. ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.
యాకోబు 1:10-11

5. నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి.

6. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను.

7. రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను.

8. దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపింతురు.

9. నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.

10. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొను చున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు.

11. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను.
యాకోబు 1:10-11

12. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును.

13. నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను.

14. దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు

15. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు

16. ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను

17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.

18. యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు

19. మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు

20. చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడినవారిని విడిపించుటకును

21. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు

22. వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును

23. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను.

24. నేనీలాగు మనవిచేసితిని నా దేవా, నాదినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును.

25. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే.
హెబ్రీయులకు 1:10-12

26. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.
హెబ్రీయులకు 1:10-12

27. నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.

28. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-102. కీర్తనకారుని పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నప్పటికీ, అతడు అస్వస్థతతో చావసిద్ధమై ఉన్నప్పటికీ తన దేవుడు తనను విడిచి పెట్టడనీ, ఆయన ఎన్నటికీ మారని, విశ్వాసపాత్రుడైన దేవుడనీ గుర్తుచేసుకునే కీర్తన. 

102:2 దేవుడు తనను విడిచిపెట్టాడని తలంచిన కీర్తనకారుడు నాకు విముఖుడవై యుండకుము అని దేవునికి ప్రార్థిస్తున్నాడు. జీవితంలోని కష్ట సమయాలలో, ప్రతిదీ మనకు వ్యతిరేకంగా జరుగుతూ, ఆ పరిస్థితిని మనకై మనం మార్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టి మన జీవితాలను, పరిస్థితులను ఆయన చేతుల్లో పెట్టడమొక్కటే మనకున్న నిరీక్షణ (39:12; 54:2; 61:1; 64:1తో పోల్చండి). కీర్తనకారుడు అదే చేశాడు. దేవుని కటాక్షం కోసం మొర్రపెట్టి, ఆయనను జోక్యం చేసుకోమని వేడుకొంటున్నాడు. తన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడనీ, తనను విడిచిపెట్టడనీ నమ్మకంతో ప్రార్థిస్తున్నాడు. 

102:3 పొగ గాలిలో అతిత్వరగా కలిసిపోతుంది (37:20; 68:2; హోషేయ 13:3). కీర్తనకారుడు శరీరంలో బాధ ననుభవిస్తున్నాడు, పొగలాగా తన జీవితకాలం శీఘ్రంగా తరిగిపోతుందనుకుంటున్నాడు (69:18; యెషయా 33:14). ఇక్కడ చెప్పినది వంట వండుకొనే పొయ్యిని లేక ఒక కొలిమిని సూచిస్తుండవచ్చు (యిర్మీయా 36:23). 

102:4-5 కీర్తనకారునిలోని నిరుత్సాహాన్ని ఎండదెబ్బకు వాడిన గడ్డి అనే పదజాలం సూచిస్తుంది. ఒకని నిబ్బరానికి మూలస్థానం వాని హృదయము. కీర్తనకారుడు తన హృదయం వ్యాధితో వాడిపోయి యున్నదని చెబుతున్నాడు. కీర్తనకారుడు శ్రమతో, క్రుంగుదలతో, అణగారిపోతూ ఇక చావు ఒక్కటే తన అంతిమ విడుదల అనుకుంటున్నాడు (కీర్తనలు 39, 90). 

102:6 పాడైన స్థలములలోని పగిడికంటెవలె అనే మాటలు కీర్తనకారుడు అందరికి దూరమై ఒంటరితనాన్ని అనుభవించడాన్ని సూచిస్తున్నాయి.

102:7-8 కీర్తనకారునికి పగలు రాత్రి అనే భేదం లేకుండా దూషణలు, హేళనలు, అబద్దాలతో కూడిన నిందలు ఎదురయ్యాయి. కీర్తనకారున్ని అతని శత్రువులు నిర్దాక్షిణ్యంగా, నిర్దేతుకంగా నిందించుచున్నారు (79:4,12 నోట్సు చూడండి). 

102:9-10 నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను - 30:20 తో పోల్చండి; 80:5 నోట్సు చూడండి. దేవుడు ఆయన సన్నిధి నుండి తనను త్రోసివేశాడనీ, అందుకే తనకిలాంటి పరిస్థితులెదురయ్యాయనీ కీర్తనకారుడు భావిస్తున్నాడు (యోబు 27:21; 30:19,22; యెషయా 64:5).

102:11 సూర్యాస్తమయ సమయంలో నీడలు సాగిపోయి ఉంటాయి. ఇది మరణం దాపున ఉందని తెలియజేసే వర్ణన. గడ్డివలె... వాడియున్నాను గురించి వ.4-5 నోట్సు చూడండి. 

102:12 ఈ కీర్తనలో ఇప్పటివరకు మానవస్వభావంలోని దౌర్బల్యాన్ని, అస్థిరతను తెలియజేసిన కీర్తనకారుడు, ఇందుకు పూర్తి భిన్నంగా ఈ వచనంలో యెహోవా నిత్యత్వాన్ని, స్థిరత్వాన్ని తెలియజేస్తూ కీర్తనలో ఒక కొత్త భాగాన్ని ప్రారంభిస్తున్నాడు. యెహోవా నామస్మరణ తరతరములుండును, మనిషి మటుకు మరణం తర్వాత స్మరణకు రాడు (9:6; 103:16). 

102:13 యెహోవా లేచి నిలబడడం తీర్పును సూచిస్తుంది (7:6-8; 80:1 నోట్సు చూడండి). సీయోను సత్వరమే పునరుద్దరించ బడుతుందనీ, పరిశుద్ధ పట్టణంలో యెహోవా సన్నిధి మళ్లీ ఉంటుందనీ కీర్తనకారుడు ఎదురుచూశాడు. శత్రువు నుండి విడిపించిన యెహోవా శక్తిమంతమైన కార్యాల్లో నీతి, దయ, కనికరం అనే ఆయన గుణగణాలు వెల్లడయ్యాయి. 

102:14 ఐక్య సమాజంలోని సేవకులకు (79:2,10; 89:5, 90:13) యెరూషలేము ఎంత ఇష్టమంటే పట్టణం రాళ్లకుప్పగా మారినా, నేలమట్టమయినా గానీ, వారు దాని రాళ్లు దాని మంటిని... ప్రియములు గానే ఎంచారు. బబులోను దాడి తర్వాత సైతం, ఇశ్రాయేలీయుల దృష్టిలో
సీయోను ప్రాముఖ్యత ఏ మాత్రం తగ్గిపోలేదు (యెహె 26:12). 

102:15 దేవుని ప్రత్యక్షత ప్రపంచంలో తీవ్ర ప్రకంపనలు కలిగిస్తుంది. అన్యజనులు అందరూ, వారి నాయకులూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా గురించి తెలుసుకుంటారు, ఆయనకు భయపడి ఆయనను ఆరాధిస్తారు (యెషయా 2:1-5; 49:7-23; 60-62; జెకర్యా 14).

102:16-17 యెరూషలేము పునర్నిర్మాణం ద్వారా, యెహోవా సన్నిధి ఆయన ప్రజల మధ్య ఉండడం ద్వారా ఆయన మహిమ, సర్వశక్తి అందరికీ వెల్లడవుతాయి (51:18; 147:2; యెషయా 52:10; 60:1,10; మీకా 7:11). 102:18 యెహోవా సీయోనుకు మళ్లీ వచ్చినప్పుడు జనములును రాజ్యములును సమకూర్చబడి ఆయనకు విశ్వవ్యాప్త ఆరాధన జరుగుతుంది (యెషయా 2:1-5; 66:23-24; జెకర్యా 14:16-21). 

102:19 దేవుడు తన విశ్వాస్యతను బట్టి బబులోను నుండి శేషించిన జనాన్ని వారి స్వదేశానికి తీసుకొనిరావడం ఆయన నామఘనతకు నిరూపణగా ఉంది. ప్రాచీన పశ్చిమాసియాలో ఒక వ్యక్తి నామం అతని స్వభావాన్నీ, నైతికవర్తననూ ప్రతిబింబించేది. సీయోను గురించీ, యెరూషలేము గురించీ నొక్కి చెప్పడం వాటికి, దేవుని నామానికి మధ్య ఉన్న సంబంధాన్ని రూఢిగా తెలియజేస్తున్నది. 

102:20 మూల్గులనే మాట చెరసాలలో ఉన్నవారి నిట్టూర్పులను సూచిస్తుంది (79:11; మలాకీ 2:13). చావునకు విధింప బడినవారిని (మరణపుత్రులు అని అక్షరార్థం) అనే మాటలు బందీలుగా ఉన్నవారి నిస్సహాయతను వర్ణించేవిగా ఉన్నాయి(79:11; 146:7; యెషయా 49:9). 

102:21 యెహోవా తన కనుదృష్టిని క్రిందకు మరల్చి వంగి భూమిని చూచినప్పుడు (చూచెననియు), చెరలో ఉన్నవారి మూల్గులు విని, తన ప్రజల దుస్థితిని చూసి వారిని విడిపించాడు (ద్వితీ 26:15; యెషయా 63:15). ఈ కీర్తన రచనాకాలానికి కొన్ని వందల సంవత్సరాల పూర్వం దేవుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల మూల్గులు విన్నాడు (నిర్గమ 2:24).

102:22 వచ్చు తరము అంటే సృజింపబడబోవు జనము. భావి కాలంలో యెహోవా స్తుతి నొందడాన్ని కీర్తనకారుడు ముందుగానే వీక్షిస్తున్నాడు. 

102:23-24 కీర్తనకారుడు దేవుణ్ణి సృష్టికర్తగా పోషణకర్తగా ఒప్పుకొంటూ, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, అంటే తనకు అకాల మరణం సంభవింపనియ్యకుమని ఆయనను వేడుకొంటున్నాడు. దేవుని నిత్యత్వానికీ, మానవుని అశాశ్వతమైన ఐహికజీవితానికీ మధ్య తారతమ్యం చాలా గొప్పది. 

102:25 యెహోవా విశ్వాన్నంతా సృష్టించాడు కాబట్టి, సృష్టికరగా ఆయనకు విశ్వం మీద సర్వాధికారం ఉంది, విశ్వాన్ని పరిపాలించేవాడు. ఆయనే (24:1-2,7-10; 89:6-15; యోబు 38:4; యెషయా 40:21-23; 48:13; 51:13-16).

102:26-27 దేవుడు ఎన్నటికీ మార్పులేకుండా ఏకరీతిగానే ఉంటాడు, మానవ చరిత్ర మార్పు లేకుండా ఏకరీతిగా ఉండదు; దేవుడు మానవచరిత్రకు పైగా ఉన్నవాడు. భూమ్యాకాశాలు వస్త్రమువలె పాతగిలును (యెషయా 50:9; 51:6-8; హెబ్రీ 1:10-12 చూడండి). క్రీస్తు ఆగమనంలో అవి పరివర్తనచెంది నూతనమవుతాయి (ప్రక 21:1).


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |