Ecclesiastes - ప్రసంగి 10 | View All

1. బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుట చేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును.

2. జ్ఞానియొక్క హృదయము అతని కుడిచేతిని ఆడించును,బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును.

3. బుద్ధిహీనుడు తన ప్రవర్తననుగూర్చి అధైర్య పడితాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును.

4. ఏలువాడు నీమీద కోపపడినయెడల నీ ఉద్యోగమునుండి నీవు తొలగిపోకుము; ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును.

5. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని

6. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు

7. పనివారు గుఱ్ఱముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకులవలె నేలను నడుచుటయు నాకగపడెను.

8. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును; కంచె కొట్టువానిని పాము కరుచును.

9. రాళ్లు దొర్లించువాడు వాటిచేత గాయమునొందును; చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొనును.

10. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయనియెడల పనిలో ఎక్కువ బలము వినియోగింప వలెను; అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము.

11. మంత్రపు కట్టులేక పాము కరిచినయెడల మంత్రగానిచేత ఏమియు కాదు.

12. జ్ఞానునినోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును.

13. వాని నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలు కుల ముగింపు వెఱ్ఱితనము.

14. కలుగబోవునది ఏదో మను ష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు; నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో యెవరు తెలియజేతురు?

15. ఊరికి పోవు త్రోవ యెరుగనివారై బుద్ధిహీనులు తమ ప్రయాసచేత ఆయాస పడుదురు.

16. దేశమా, దాసుడు నీకు రాజై యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై యుండుటయు నీకు అశుభము.

17. దేశమా, నీ రాజు గొప్పయింటి వాడైయుండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై యుండుటకు నీకు శుభము.

18. సోమరితనముచేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకముచేత ఇల్లు కురియును.

19. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందుచేయుదురు, ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరము; ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చును.

20. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు; ఏలయనగా ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలుగలది సంగతి తెలుపును.బైబిల్ అధ్యయనం - Study Bible
10:1 లోని విషయం , సుగంధ భరితమైన అత్తరులో పడిన చచ్చిన ఈగలు అత్తరును పాడుచేసినట్లే ఒక్క బుద్దిహీనుడు చక్కని పరిపాలనను పాడుచేయగలడు, ఒక చిన్న తప్పు మొత్తం జీవిత గమనాన్ని పాడు చేయగలదు. 

10:2-3 బుద్దిహీనత దానంతట అదే బహిర్గతమవుతుంది. ప్రాచీనకాలంలో ఋజువర్తనతో కూడిన జీవిత నైపుణ్యాన్ని సూచించడానికి కుడిచేతిని పోలికగా ఉపయోగించేవారు, అనుచితమైనవాటిని, నేర్పు లోపించిన వికృతమైనవాటిని సూచించడానికి " ఎడమచేతిని పోలికగా ఉపయోగించేవారు. ప్రాచీన సమాజంలో ఎడమచేతి నిపుణత గలవారి గురించి ప్రత్యేకమైన ప్రస్తావన ఏదీ కనబడదు. ఉదాహరణకు యుద్దశూరులు వారి ఎడమచేతులతో డాలులు పట్టుకొని తమను కాపాడుకుంటూ కుడిచేతులతో ఖడ్గాలు పట్టుకొని యుద్ధం చేసేవారు. 

10:4 ఉద్యోగం చేసే వ్యక్తి మీద అతని పై అధికారి కోపపడినప్పుడు సదరు ఉద్యోగి సందర్భోచిత్యాన్ని ఆత్మనిగ్రహాన్ని కలిగి వివేకంతో వ్యవహరించాలి. 

10:5-7 బుద్దిహీనత దానంతట అదే బహిర్గతమయ్యేదే అయినా (వ.3), కొన్ని సార్లు రాజులు, పరిపాలకులు అప్రయోజకుల్ని ఉన్నత స్థానాల్లో నియమించడం జరుగుతుంది, అయితే పరిపాలనానుభవం గల సమర్థులు క్రింద కూర్చుండుటయు, అంటే ప్రాధాన్యత లేని స్థానాల్లోకి నెట్టివేయబడడం జరుగుతుంది. ఈ సందర్భంలో కనబడే సేవకులు అనే మాట జ్ఞానవివేకాలు నైపుణ్యాలు అతి తక్కువగా ఉండడంచేత సాధారణ కాయకష్టానికి పరిమితం చేయబడిన వారిని సూచిస్తుంది.

10:8-9 ఈ వచనాల్లో పక్కపక్కన కనబడే రెండు జతల సామెతలున్నాయి. వ.8 నేరపూరిత చర్యను వర్ణిస్తోంది: గొయ్యి తవ్వడం ఎవరినైనా దోచుకోడానికి లేదా చంపడానికి వల పన్నడాన్ని సూచిస్తుంది. కంచె కొట్టడం ఇంటిని దోచుకోడానికి లోపలికి వెళ్లే మార్గాన్ని తొలచడాన్ని సూచిస్తుంది. ఇటువంటి నేరపూరిత చర్యల్లో నిమగ్నమైనవారు. చివరకు తమకు తామే వినాశనం తెచ్చుకుంటారని సాంప్రదాయక జ్ఞానం బోధిస్తున్నది (కీర్తనలు 7:15; 9:15; సామెతలు 26:27). మరొకవైపు, రాళ్లు దొర్లించడం, చెట్లు నరకడం వంటి నిష్కపటమైన పనులు సైతం తీవ్రమైన గాయాల పాలుచేయగలవని  10:9 వచనం బోధిస్తుంది. అంటే, నేరపూరిత చర్య మనిషిని నాశనం చేయగలదు, అయితే నిజాయితీతో కూడిన పని సైతం ప్రమాదానికి గురిచేయగలదు. నిష్కపటంగా శ్రమించి పనిచేయడాన్ని నిరుత్సాహపర్చడం ప్రసంగి ఉద్దేశం కాదు గానీ ఈ జీవితంలో భద్రత అనేదానికి కచ్చితమైన భరోసా ఏమీ లేదని చెప్పడమే. వివేకవంతమైన నడవడిక సైతం విపత్తులో పడగలదు. చిట్టచివరగా, మనం మన జ్ఞానాన్ని గానీ, మన నైతికవర్తనను గానీ నమ్ముకోకుండా మన జీవితభద్రత కోసం దేవునిలోనే నమ్మిక కలిగి ఉండాలి. 

10:10-11 కార్యసిద్ధికి జ్ఞానమే ఈ సౌలభ్యమైన మార్గం, అయితే యుక్తసమయంలో యుక్తరీతిలో జ్ఞానాన్ని ఉపయోగించుకోకపోతే దానివలన ప్రయోజనమేమీ కలగదు. 

10:12-15 సలహాదారుడి ప్రధానసేవ రాజుకు సలహాలివ్వడం. అతని సలహాలోని నాణ్యత అతను ప్రాజ్ఞుడో లేదా బుద్దిహీనుడో తెలియజేస్తుంది. బుద్దిహీనుడైన సలహాదారుడికి గుర్తు అతను తనకు తెలిసినదానికంటె విస్తారంగా మాట్లాడడం. కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక పోదురు కాబట్టి జ్ఞానము గల సలహాదారుడు పరిమితంగానే తన సలహా చెప్తాడు. భవిష్యత్తు గురించి నిశ్చయతతో మాట్లాడడం అసాధ్యం. ఇందుకు భిన్నంగా, బుద్ధిహీనుడైన సలహాదారుడు తన అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకొనే ప్రయత్నంలో పదేపదే మాట్లాడుతుంటాడు. ఊరికి పోయే దారి ఏదో బుద్దిహీనులకు తెలియకపోయినా అడిగినవారికి తప్పుడు తోవ చూపించే ఆడంబరపు మాటలకు ఇది చక్కని వివరణ (వ.15 లోని “ఊరికి పోవు త్రోవ యెరుగనివారై బుద్దిహీనులు తమ ప్రయాసచేత ఆయాసపడుదురు" అంటే ఇదే). 

10:16-17 అంతిమంగా, రాజకీయ వ్యవస్థ లేక వ్యాపారంలో విజయం లేక వైఫల్యం దాని నాయకుల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఈ వచనాలు నాయకత్వానికి సంబంధించిన చిన్న విషయాలు సైతం ఎంతో ప్రాధాన్యత గలవనే వ్యాఖ్యతో 9:13-10:17 వచనాల్లో రాజకీయ రంగంలో జ్ఞానం గురించి ఉన్న సాధారణ చర్చను ముగిస్తున్నాయి. 

10:18-20 ఈ వచనాల్లో జీవితాన్ని సురక్షితం, సుఖప్రదం చేసేవాటిని తెలిపే మూడు సామెతలు వరుసగా ఉన్నాయి. మొదటిది, మనుష్యులందరూ కోరుకొనే మౌలిక సౌకర్యాలు మనమూ కలిగి ఉండేలా కష్టపడి పనిచేయాలి. రెండవది, మంచి జీవితాన్ని అనుభవించడం కోసం మనకు కొంత ధనం ఉండాలి. కొన్ని సుఖసౌఖ్యాలుండాలి. గ్రంథంలోని తక్కిన భాగానికి వేరుగా, ఇది భోగాసక్తిని, మితిమీరిన ఆశను ప్రబోధిస్తున్నట్టుగా కనబడుతున్నా ఈ వచన భావం వేరు. దాదాపుగా మనుషు లందరూ సాధారణంగా సంతోషించేవి ఉన్నాయి. ఉదాహరణకు మంచి భోజనం. డబ్బు మనకు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి సహాయకరంగా ఉంటుంది (ద్రవ్యము అక్షరాలా అన్నిటికీ పరిష్కారాన్నివ్వదు గానీ వాస్తవానికి మనకెదురయ్యే మామూలు సమస్యల్లో చాలా భాగం ఆర్థికమైనవే). మూడవది, మనం కష్టాల్లో పడకుండా అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. 


Shortcut Links
ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |