Psalms - కీర్తనల గ్రంథము 95 | View All

1. రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము

2. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.

3. యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు

4. భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే.

5. సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను.

6. ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.

7. రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
హెబ్రీయులకు 4:7, హెబ్రీయులకు 3:7-19

8. అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
హెబ్రీయులకు 4:7

9. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి

10. నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.

11. కావున నేను కోపించివీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.
హెబ్రీయులకు 4:1-11



బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-95. దేవుడు రక్షకుడు, సర్వజగత్తును చేసిన సృష్టికర్త, ఈ జగత్తును తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న మహా దేవుడు.

95:1: రక్షణదుర్గము భద్రతను క్షేమాన్ని సూచించే అలంకారిక దృష్టాంతం. “దుర్గము” అనే పదానికి హెబ్రీ పదం దేవుని అచంచలమైన నైతికస్వభావాన్ని తెలియజేస్తున్నది (18:1-2,31; 73:26; 92:15; 144:1; ద్వితీ 32:15; 2 సమూ 22:47; యెషయా 44:8).

95:3 యెహోవా మహా దేవుడు - యెహోవాయే రాజు, రాజ్యం ఆయనదే అంటూ ఆయనను ఘనపర్చే కీర్తనల్లో ఉండే భావప్రకటన ఇది (47:2,7-8; 48:2-3; 96:4; 97:9, 136:2; 149:2). దేవతలందరికి పైన - 29:1; 82:1 నోట్సు చూడండి. 

95:4 భూమి పునాదులు (భూమ్యగాధస్థలములు), సముద్రాల లోతులు (యోబు 38:16) దేవునికి మరుగైనవి కావు (యిర్మీయా 31:37), దేవుని సర్వాధికారం సముద్రాల లోతుల నుండి పర్వత శిఖరములు వరకు వ్యాపించి ఉంటుంది. 

95:5 దేవుడు సృష్టించిన సముద్రము, భూమి - ఆయనకు చెందినవే. యోనా 1:9 లో ప్రవక్త తన గురించి తాను తెలియజేసుకుంటూ పలికిన మాటల్లో ఇదే భావన గల పదాలున్నాయి.

95:6-7 ఆయన మేపు గొట్టెలము - 79:13 తో పోల్చి చూడండి. దేవుడు ఇశ్రాయేలుకు సృష్టికర్తగా మాత్రమే కాదు, కాపరిగా కూడా ఉన్నాడు (యెషయా 43:1,15). దేవుడు విశ్వాన్ని మనుషుల్ని సృష్టించాడు; విశ్వమూ, మనుషులూ తమ సృష్టికర్త యెదుట సాగిలపడవలసినదే. నిజమైన భక్తులు ఆయన స్వరం విని, ఆయన మాట నంగీకరిస్తారు. 

95:8-9 మెరీబా (వాదము), మస్సా (శోధించుట) - ఇశ్రాయేలీయులు నీళ్ల కోసం దేవుణ్ణి శోధించినప్పుడు ఆయన బండ నుండి నీళ్లు రప్పించాడు, ఆ సందర్భంలో ఆ చోట్లకు మోషే ఈ పేర్లు పెట్టాడు. (నిర్గమ 17:7; సంఖ్యా 20:13; ద్వితీ 6:16). యెహోవా అరణ్యంలో ఇశ్రాయేలీయుల విశ్వాస్యతను పరీక్షించాడు (ద్వితీ 8:2; 33:8). "శోధించి” అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదం ప్రశస్తమైన లోహాల్ని శుద్ధి చేయడాన్ని వర్ణిస్తుంది. (జెకర్యా 13:9). కఠినపరచుకొనకుడి - అరణ్యసంచారాల్లో తమ స్వంత ఆలోచనల్ని అనుసరిస్తూ తమ స్వీయసామర్థ్యాన్ని నమ్మిన ఇశ్రాయేలీయులు దేవుని మీద ఫిర్యాదు చేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ కీర్తనకారుడు చేసిన హెచ్చరిక. 

95:10 ఐగుప్తు నుండి బయలుదేరినవారు తమ పాపాలను బట్టి కనానులోకి ప్రవేశించలేకపోయినా, కాలేబు, యెహోషువలు తరువాతి తరాన్ని వాగ్దానదేశంలోకి నడిపించారు (సంఖ్యా 14:30). 

95:11 నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని - ద్వితీ 12:9 తో పోల్చి చూడండి. ఎవరైనా తమ గృహంలో విశ్రాంతి తీసుకుంటారు, లేదా శత్రువుల దాడి నుండి తప్పించుకున్నప్పుడు విశ్రాంతి (నెమ్మది) ననుభవిస్తారు. దేవుడు ఏడవ దినాన విశ్రమించాడు (ఆది 2:2), తన ప్రజల మధ్య ఆయనకు విశ్రాంతిస్థలం ఉంది (2దిన 6:41-42), విశ్రాంతి అనే భావన గురించి సంపూర్ణమైన అవగాహన హెబ్రీ 4:3-11 వచనాల్లో కనబడుతుంది.


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |