Psalms - కీర్తనల గ్రంథము 135 | View All

1. యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా,
ప్రకటన గ్రంథం 19:5

2. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి.

3. యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.

4. యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు కొనెను.

5. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును.

6. ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు

7. భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.

8. ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలి చూలులను ఆయన హతముచేసెను.

9. ఐగుప్తూ, నీ మధ్యను ఫరోయెదుటను అతని ఉద్యోగస్థుల యెదుటను ఆయనే సూచకక్రియలను మహత్కార్యములను జరిగించెను.

10. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు.

11. అమోరీయుల రాజైన ఓగును హతముచేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను.

12. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను.

13. యెహోవా, నీ నామము నిత్యము నిలుచును యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము లుండును.

14. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.
హెబ్రీయులకు 10:30

15. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు.
ప్రకటన గ్రంథం 9:20

16. వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

17. చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.

18. వాటినిచేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు.

19. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి అహరోను వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి

20. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహోవాను సన్నుతించుడి.

21. యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులోనుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి.



బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-135. ఇశ్రాయేలీయుల్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకొన్నాడు కాబట్టి ఆ దేవదేవుణ్ని స్తుతించమని దేవాలయంలో సమకూడిన వారందరికీ ఈ కీర్తన ఒక పిలుపునిస్తున్నది. 

135:1-21 దాదాపుగా ఈ కీర్తనలోని ప్రతి వచనమూ లేఖనాల్లో ఇతరచోట్ల ఉదహరించబడింది. 

135:1-21 యెహోవాను స్తుతించుడి. దేవుని స్తుతించడానికైన ఈ పిలుపు  రెండు వాస్తవాల మీద ఆధారపడి ఉంది: (1) దేవుడు ఇశ్రాయేలీయులను తనతో రక్షణ నిబంధనా సంబంధం లోనికి తీసుకొని వచ్చాడు (వ.1-4; నిర్గమ 19:5). (2) ఆయన సజీవుడు. ప్రపంచ విషయాల్లో, ప్రత్యేకించి తన ప్రజల విషయాల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నాడు (వ.5-13). 135:2 దేవాలయంలో ఆరాధించేటప్పుడు (134:1; నెహెమ్యా 9:3), ప్రార్థించేటప్పుడు (2దిన 20:9), సేవించేటప్పుడు (ద్వితీ 10:8; యెహె 44:15) ప్రజలు నిలబడేవారు. 

135:3 యెహోవా నామము ఆయన నైతికస్వభావాన్ని, ఆయన ఘనతను సూచిస్తుంది (వ. 13 చూడండి; 20:1 నోట్సు చూడండి).

135:4 దేవునికి స్వకీయధనముగా ఉండడమనే (హెబ్రీ. సెగుల్లా) భావన ఎల్లప్పుడూ ఇశ్రాయేలుకే వర్తిస్తుంది. (నిర్గమ 19:5; ద్వితీ 7:6; 14:2; 26:18; మలాకీ 3:17).

135:5 సమస్తదేవతల కంటె గొప్పవాడనియు గురించి 29:1; 82:1 నోట్సు చూడండి.

135:6 ఈ వచనాన్ని 115:3 తో పోల్చి చూడండి. యెహోవా మాట ఆయన ఉద్దేశాల్ని సఫలం చేస్తుంది (యెషయా 55:11). సముద్రముల యందును (24:2; నిర్గమ 20:4), మహాసముద్రముల యందును (యెషయా 24:15-16; 42:10) అనే పదజాలం సర్వసృష్టి మీద యెహోవాకున్న సర్వాధికారాన్ని వర్ణిస్తున్నది.

135:7 ఇటువంటి వచనమే యిర్మీయా 10:13; 51:16 (యోబు 38:22 తో పోల్చండి) వచనాలలో కనబడుతుంది. దేవుడు వాతావరణాన్ని (భూమి, ఖగోళం - వీటిని ఆవరించి ఉన్న సమస్తాన్నీ) ఆదేశిస్తాడు, ఏలుతాడు, నియంత్రిస్తాడు. హెబ్రీ పదమైన ఓట్సెర్ ను దేవాలయ నిధులకు లేదా రాజ ధనాగారానికి ఉపయోగించారు. 

135:8-9 వ.8-12 కీర్తన 136 కు దగ్గరగా ఉన్నాయి. దేవుడు ఐగుప్తులో తొలిచూలులను హతం చేయడం వాస్తవానికి వారి దైవాల్ని హతం చేయడంతో సమానం, ఎందుకంటే ఫరో, అతని సంతానం తమను తాము దైవాలుగా పరిగణించుకొనేవారు. ఈ తెగుళ్లు ఐగుప్తులోని కల్పితదైవాల మీద యెహోవా చేసిన యుద్ధం

135:10-12 సీహోను... ఓగు అనే రాజులు తమ రాజ్యాలగుండా నడిచి వెళ్లడానికి , ఇశ్రాయేలీయుల్ని అనుమతించలేదు. (సంఖ్యా 21:33-35; కీర్తన 136:19-20 తో పోల్చండి). ఇశ్రాయేలీయులు కనానును స్వాధీనం చేసుకున్నప్పుడు యెహోవా ఈ రాజులు పాలించే రాజ్యాలను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాడు.

135:19-20 యెహోవాను తమ దేవునిగా అంగీకరించమనీ, ఆయనను సన్నుతించమనీ ఇశ్రాయేలీయుల్లోని ఒక్కొక్క విభాగాన్ని కీర్తనకారుడు పిలుస్తున్నాడు. ఈ పిలుపు మొదట ఇశ్రాయేలు జాతికీ (ఇశ్రాయేలు వంశీయులారా), తర్వాత ప్రధాన యాజకునికీ (అహరోను వంశీయులారా), ఆ తర్వాత యాజక సమూహానికి (లేవి వంశీయులారా), చివరకు సర్వసమాజానికీ (115:9-11 తో పోల్చండి) ఇవ్వబడింది.


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |