Zephaniah - జెఫన్యా 2 | View All

1. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది.

2. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.

3. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహో వాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.

4. గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడై పోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్ట ణము దున్నబడును.

5. సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా నీయందు ఒక కాపురస్థుడైనను లేకుండ నేను నిన్ను లయముచేతును.

6. సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.

7. తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.

8. మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణ మాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.

9. నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్య ములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.

10. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును.

11. జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవా వారికి భయంకరుడుగా ఉండును.

12. కూషీయులారా,మీరును నా ఖడ్గముచేత హతులవుదురు.

13. ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును; నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.

14. దానిలో పసుల మందలు పండుకొనును; సకలజాతి జంతువులును గంపులుగా కూడును; గూడ బాతులును తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ములమీద నిలుచును; పక్షుల శబ్దములును కిటికీలలో వినబడును; గడపలమీద నాశనము కను పించును. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపనియంతటిని యెహోవా నాశనము చేయును.

15. నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచార ముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గ మున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు.బైబిల్ అధ్యయనం - Study Bible
2:1-2 కూడి రండి అనే మాట “గడ్డి, చెత్త” అనే వాటికి సంబంధించిన పదం. ఇప్పుడు యూదా సిగ్గుమాలిన (అవాంఛిత) జనాంగమయ్యింది. “ఇప్పుడు వారు ఆయన కనుపాపలా కనిపించడం లేదు, పారవేయ వలసిన విలువలేని చెత్తలా ఉన్నారు” అందుచేత, కరుణ కలిగిన దేవుని ముందు తమను తాము తగ్గించుకోవాలనే హెచ్చరిక వారికి ఇవ్వబడింది. 

2:3 వెదకుడి అని చెప్పిన మాట, విగ్రహారాధనకు, స్వార్థపరత్వానికి ఒక విరుగుడును సూచిస్తుంది. ఆయన స్పందన కోసం కనిపెట్టికొని (జెఫన్యా 3:8), వినయము గలవారై నీతిని, యెహోవాను వెదకాలి (1:6; ఆమోసు 5:4-15 పోల్చిచూడండి). దేవుని ప్రజలు పాపం చేసిన తరవాత ఆయనను కనుగొనాలంటే తప్పనిసరిగా ఆయనను వెదకాలి (ద్వితీ 4:28-30; హోషేయ 3:5; 10:12; జెకర్యా 8:21-22 పోల్చి చూడండి). 

2:4 ఈ వచనంలో హెబ్రీ భాషలో, ఒకే విధంగా ధ్వనించే పదాలు (“గాజా", “నిర్జనమగును") ద్వంద్వార్థాలు గల మాటలు (“ఎక్రోను”, “దున్నబడును") ఉన్నాయి. ఇవి అయిదు ఫిలిప్తీయ పట్టణాలలో నాలుగింటి పైన జరగబోయే తీర్పును అనర్గళంగా వ్యక్తపరుస్తాయి (ఆమోసు 1:6-9; జెఫన్యా 2:5 పోల్చి చూడండి).

2:5-6 కెరేతీయులకు, ఫిలిపీయులకు మధ్యగల సంబంధం మనకు తెలి యదు, కానీ ఇక్కడ జాతి, ప్రాంతాల మధ్య సారూప్యం ఉంది. యెహె 25:16 కూడా చూడండి. 

2:7 పాత నిబంధనలో "వారి సంపదను వారికి సమకూర్చడం" (సాంకేతికంగా “చెరలోనుండి రప్పించడం”) అనే పదబంధం, భౌతికంగా సంపూర్ణమైన విడుదలను (యిర్మీయా 33:10-12 పోల్చండి), లేదా ఆధ్యాత్మిక విడుదలను (కీర్తన 85:1-4; యిర్మీయా 32:44; జెఫన్యా 3:20 పోల్చండి) సూచిస్తుంది. 

2:8-11 ఇంతకు ముందు ఫిలిప్తీయులపై పలికిన ప్రవచనాత్మక తీర్పుకు భిన్నంగా, తీర్పు తీర్చడానికి గల కారణాలు కూడా ఈ ప్రవచనం వివరిస్తుంది. మోయాబు, అమ్మోను గురించి చెప్పిన ప్రవచనంలో రెండు భాగాలున్నాయి. 8-9 వచనాలు దేవుడు మాట్లాడుతున్నాడు, 10-11 వచనాలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రతి భాగంలో ఒక నేరారోపణతో పాటు (వ.8,10), ఆ కారణంగా దేవుడు ఏంచేస్తాడు అనే విషయం ఉంది (వ.9,11). దేవునికి వారి నిందలు దూషణ మాటలును వినబడెను కాబట్టి 8 వచనంలో ఆయనే వారి గురించి సాక్ష్యమిస్తున్నాడు. 

2:9 దేవుని సార్వత్రిక తీర్పు (1:2-3; 17-18) దైవభక్తి కలిగి శేషించిన ప్రజలు, అంటే నా జనులలో శేషించినవారు లేదా నా జనులు (ఆమోసు 5:14-15; 9:8) అని దేవుడు చెప్పిన వారికి మినహాయింపునిస్తుంది. ఈ శేషం ముఖ్యంగా యూదా ప్రజలలో (జెఫన్యా 2:7), అంతిమంగా ఇశ్రాయేలీయు లందరిలో మిగిలిన వారిని సూచిస్తుంది. (3:12-13) తమ శత్రువులను దోచుకోడానికి దేవుని అనుమతి పొందిన ఈ జనశేషానికి సాత్వికత, దీనత్వం అనే రెండు ప్రాముఖ్యమైన గుణలక్షణాలున్నాయి (3:12). ఇది గమనించవలసిన విషయం . దైవభక్తి కలిగి శేషించిన ప్రజలకు దేవుడు ద్వితీ 28: 62-66లో పేర్కొన్న శాపాలు తొలగించి, ఇతర దేశాల భూభాగాలను వారికి అనుగ్రహిస్తాడు (2:7,9). అంతేకాక, కుంటుతూ నడిచేవారు, తృణీకరించబడిన వారితో సహా (3:18-19; మీకా 4:6-7) అంత్యకాల శేషమంతటినీ దీవిస్తానని ఆయన వాగ్దానం చేశాడు (జెఫన్యా 3:14-17). 

2:11 భూమిలో నున్న దేవతలను (ఆకలితో అలమటించేలా చేసి) నిర్మూలము చేయును అనే మాట, వాటిని పూజించేవారిని మార్పు చెందించడం (జెఫన్యా 3:9), లేదా నాశనం చేయడం ద్వారా (1:4 పోల్చండి; యిర్మీయా 50:2-3; 51:43-44, 52-53) “దేవతలకు” లేదా విగ్రహాలకు, బలులు (ఆహార పానీయార్పణలు) తీసివేస్తానని దేవుడు అక్షరార్థంగా చెపుతున్నట్లు సూచిస్తుంది. 

2:12-15 దేవుని తీర్పు దక్షిణ (వ.12), ఉత్తర దిశలకు (వ.13-15) చేరుతుంది.

2:13 ఇక్కడ పేర్కొన్న మాటలకు 1:4లోని మాటలతో సంబంధం ఉన్నట్టు చూస్తాం, అక్కడ దేవుడు యూదా, యెరూషలేములకు వ్యతిరేకంగా తన హస్తము చాపినట్లు కనబడుతుంది. 

2:15 నా వంటి పట్టణము మరియొకటి లేదు అంటూ దేవుడు మాత్రమే పలకగలిగే రీతిలో (యెషయా 45:5-6, 19,21), హెచ్చించుకొంటూ నిర్విచారముగా ఉండే ప్రతి పట్టణానికి (అష్పూరు, వ.15; బబులోను, యెషయా 47:8-10) దేవుడు తీర్పు తీరుస్తాడు. . 


Shortcut Links
జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |