Zephaniah - జెఫన్యా 2 | View All

1. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది.

“సిగ్గుమాలిన జనులారా”– అంటే యూదా (యిర్మియా 3:3, యిర్మియా 3:25; యిర్మియా 6:15). వారి ప్రవర్తన సిగ్గుకరంగా ఉంది. కానీ వారికి సిగ్గు లేదు.

2. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.

శిక్ష రాకముందే పశ్చాత్తాపపడవలసిందని పిలుపు.

3. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహో వాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.

“సాధువైన”– వినయవంతులు మాత్రమే ప్రవక్త మాటలు విని దేవుణ్ణి వెదకడానికి ఇష్టపడతారు. “వెదకండి”– హోషేయ 14:1-3; యోవేలు 2:12-14; ఆమోసు 5:4, ఆమోసు 5:6; యెషయా 55:6-7; యిర్మియా 29:13. “న్యాయవర్తన”– యెషయా 1:17; మత్తయి 6:33. “వినయం”– యెషయా 57:15; యెషయా 66:2; యాకోబు 4:6-10. “దొరుకుతుందేమో”– యోవేలు 2:2-14; ఆమోసు 5:15.

4. గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడై పోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్ట ణము దున్నబడును.

ఫిలిష్తీయవారిపై దేవుని తీర్పును గురించిన భవిష్యద్వాక్కు. ఆమోసు 1:6-8; యెహెఙ్కేలు 25:15-17 కూడా చూడండి. ఫిలిష్తీయ వారి గురించి నోట్ ఆదికాండము 10:14. గాజా, అష్కెలోన్, అష్డోదు, ఎక్రోను ఇవన్నీ వారి దేశంలోని ముఖ్య నగరాలు. “కెరేతు జనమా”– 1 సమూయేలు 30:14; 2 సమూయేలు 8:18.

5. సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా నీయందు ఒక కాపురస్థుడైనను లేకుండ నేను నిన్ను లయముచేతును.

6. సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.

7. తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.

8. మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణ మాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.

దేవుడు మోయాబు, అమ్మోనువాళ్ళపై ఒక్క సారే తీర్పును ప్రకటిస్తున్నాడు. ఈ రెండు జాతులకు మూల పురుషుడు ఒక్కడే (ఆదికాండము 19:36-38). రెండు జాతులూ ఒకే ప్రాంతంలో ఉన్నాయి. వీటి గురించిన ఇతర భవిష్యద్వాక్కులు యెషయా 11:14; యెషయా 15:1-13; యిర్మియా 9:26; 48వ అధ్యాయం; యిర్మియా 49:1-6; యెహెఙ్కేలు 21:28-32; యెహెఙ్కేలు 25:1-11; ఆమోసు 2:1-3. ఈ రెండు దేశాలు కూడా ఇస్రాయేల్‌కు చిరకాల శత్రువులే.

9. నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్య ములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.

“సొదొమ... గొమొర్రా”– ఆదికాండము 19:23-29. “స్వాధీనం చేసుకుంటారు”– ఇది ఇంతవరకు నెరవేరలేదు గనుక భవిష్యత్తులో దీని నెరవేర్పు ఉంటుంది. “సేనల ప్రభువు”– 1 సమూయేలు 1:3 దగ్గర నోట్.

10. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును.

“గర్వం”– యెషయా 16:6; యిర్మియా 49:16; ఓబద్యా 1:3. దేవునికి గర్వమంటే ఎంత అసహ్యమో చూడండి – సామెతలు 6:16-17; యెషయా 2:12-18.

11. జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవా వారికి భయంకరుడుగా ఉండును.

“ఆరాధిస్తాడు”– జెఫన్యా 3:9; కీర్తనల గ్రంథము 86:9; హబక్కూకు 2:14; జెకర్యా 14:9, జెకర్యా 14:16. ఏ దేశంలోనూ ఎలాంటి విగ్రహాలూ దేవుళ్ళూ ఉండని కాలం ఒకటి రాబోతున్నది. అంతటా అందరూ నిజ దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు.

12. కూషీయులారా,మీరును నా ఖడ్గముచేత హతులవుదురు.

మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. కూషు గురించి నోట్ యెషయా 18:1. “నా ఖడ్గం”– అంటే ఒక శత్రు జాతి. యెషయా 10:5 పోల్చి చూడండి.

13. ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును; నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.

అష్షూరును గురించీ దాని రాజధాని నీనెవె గురించీ ఇతర భవిష్యద్వాక్కులు యెషయా 10:12-19; యెషయా 19:23-25; నహూము 1—3 అధ్యాయాలు. అష్షూరు గురించి నోట్ 2 రాజులు 15:19.

14. దానిలో పసుల మందలు పండుకొనును; సకలజాతి జంతువులును గంపులుగా కూడును; గూడ బాతులును తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ములమీద నిలుచును; పక్షుల శబ్దములును కిటికీలలో వినబడును; గడపలమీద నాశనము కను పించును. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపనియంతటిని యెహోవా నాశనము చేయును.

15. నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచార ముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గ మున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు.Shortcut Links
జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |