16:1-2 ఈ ఉత్తరాన్ని రోమాకు తీసుకెళ్ళినది బహుశా ఫీబే కావచ్చు. ఆమె పరిచర్యను బట్టి పౌలు ఆమెను అభినందించాడు.
16:3-4 ప్రిస్కిల్ల, అకులలు (అపొ.కా 18:1-3, 18,26; 2తిమోతి 4:19) పౌలు జతపనివారు. వారి ఇండ్లలో సంఘాలున్నాయి. వారు అపొల్లోకు బోధించారు. వారు పౌలును కాపాడటానికి తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి.
16:5 ఎపైనెటు అంటే “ప్రియమైనవాడు” అని అర్థం. అతడు ఆసియాలో క్రీస్తువైపు తిరిగిన మొదటి విశ్వాసి. ఆసియ రోమా ప్రాంతంలోని చిన్నాసియా (నేటి టర్కీ)ను సూచిస్తుంది.
16:6 అనేకమంది స్త్రీలకు పౌలు శుభములు చెప్పాడు: ప్రిస్కిల్ల, మరియ, యూనీయ, త్రుపైనా, త్రుఫోసా, పెర్సిసు, రూపు తల్లి, యూలియా.
16:7 అపొస్తలులలో ప్రసిద్ధికెక్కినవారు అనే మాటలు “అపొస్తలులకు బాగా తెలిసినవారు” లేక “అపొస్తలులలో గొప్పవారు” అని అనేక విధాలుగా తర్జుమా చేయబడతాయి. సాంకేతికంగా “అపొస్తలుడు" అనే మాట నియమించబడిన అపొస్తలుడు (ఉదా: పౌలు, పేతురు)ని మాత్రమే కాక, ఒక వార్తాహరుని కూడా సూచిస్తూ వాడవచ్చు.
16:8 పౌలు అనేకుల గురించి నాకు ప్రియుడగు అని రాశాడు: ఎ.నెటు, అంప్లీయతు, స్టాకు, పెర్సిసు.
16:9 జతపని వారుగా చెప్పబడినవారు ప్రిస్కిల్ల, అకుల, ఊర్భాను.
16:10 అపెల్లెను మాత్రమే క్రీస్తునందు యోగ్యుడైన వానిగా వర్ణించాడు.
16:11 వ.7లో ఆండ్రోనీకు, యూనియాలకు వలెనే, హెరోదియోనును నా బంధువుడు (నాతోటి యూదుడు) అని పిలిచాడు.
16:12 అనేకులు ప్రభువునందు (బహుగా) ప్రయాసపడు వారిగా చెప్పాడు: మరియ (వ.6), త్రుపైనా, త్రుఫోసా, పెర్సిసు.
16:13 రూపు తండ్రి బహుశా యేసు సిలువను గొల్తాకు మోయడంలో సహాయం చేసిన (కురేనీయుడైన సీమోను) అయివుండవచ్చు (మార్కు 15:2122), రూపు ఒక్కడే ప్రభువునందు ఏర్పరచబడినవానిగా వర్ణించబడ్డాడు.
16:16 పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకనికొకడు వందనములు చేయుడి అనే ప్రోత్సాహం 1కొరింథీ 16:20; 2 కొరింథీ 13:12; 1థెస్స 5:26లో కూడా ఉంది.
16:17-20 సాతాను, అబద్దబోధకులు సంఘంపై ఎల్లప్పుడూ దాడిచేస్తారు. ఈ (అపొ.కా. 20:28-29; 2 కొరింథీ 11:13-15; గలతి 5:10-12; ఫిలిప్పీ ం 3:2,18-20; కొలస్సీ 2:16-19) రోమాలోని విశ్వాసులు మెలకువగా ఉండి అబద్ధ బోధకులనుండి తొలగిపోవుడని పౌలు హెచ్చరించాడు.
దేవుని సార్వభౌమత్వం, మానవ బాధ్యతల మధ్య ఎంచుకోవడానికి ఉన్న సంబంధానికి మాదిరిగా, అంధకారంతో మన యుద్ధంలో మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ చివరికి విజయం మనదేననే నిశ్చయత ఇవ్వబడింది (సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళక్రింద శీఘ్రముగా చితుకతొక్కించును).
16:21 రెండవ సువార్త ప్రకటనా యాత్రకాలం నుండి తిమోతి పౌలుకు జతపనివాడు, సన్నిహిత స్నేహితుడు. లూకియ గురించి తెలియదు. యాసోను బహుశా థెస్సలోనికలో పౌలుకు ఆతిథ్యమిచ్చినవాడు కావచ్చు (అపొ.కా. 17:5-9). సోసిపత్రు బహుశా పౌలుకు కొంతకాలం తోడుగా వచ్చిన బెరయవాడైన సోపత్రు కావచ్చు (అపొ.కా.20:4).
16:22-23 ప్రాచీన రచనలలో లేఖికుల (ఈ పత్రిక విషయంలో తె యు) పాత్రను గూర్చి పండితులు వాదిస్తారు. వారు మాటకు మాట విని రాశారా, లేక వారు రాయాల్సింది క్లుప్తంగా రాసుకున్నారా? దైవప్రేరణను గూర్చిన బైబిల్ బోధ ప్రకారం బైబిలు రచయితలకు మొదటి సూచననే ఆపాదిస్తారు. పట్టణపు ఖజానాదారుడు అనే బాధ్యతగల స్థానంలో ఉన్న ఎరస్తు బహుశా అపొ.కా. 19:22; 2తిమోతి 4:20లో ఉన్నవాడే కావచ్చు.
16:24-27 నా సువార్త ప్రకారము అంటే పౌలు భావం తన ప్రకటన దేవుని నుండి నేరుగా వచ్చిన ప్రత్యక్షతను ప్రతిబింబించదని కాదు. (గలతీ 1:11-12 చూడండి). తాను నమ్మకంగా ప్రకటించిన సువార్త అని అతని భావం: అందరికీ చెందిన కృపా సువార్త. అనాదినుండి ఈ సువార్త దేవుడు నడిపించిన చరిత్రలో “కాలము సంపూర్ణమ"య్యేంత వరకు (గలతీ 4:4) రహస్యముగా ఉంచబడిన... మర్మము. క్రీస్తులో ఈ “మర్మము” లోకానికి బయలుపరచబడింది. విశ్వాసమునకు విధేయులు అని పేర్కొనడం ద్వారా, పౌలు తన పత్రిక ఎక్కడ మొదలు పెట్టాడో (1:5) అక్కడే ముగించాడు.