3:1-3 కొరింథీయులలో అనేకులు. ప్రభువులో పసిబిడ్డలుగా ఉన్నారు. వారు అన్నము (లోతైన బోధను) స్వీకరించలేరు. ఎందుకంటే వారు అసూయ, కలహముతో (పోటీతత్వం)తో నిండివున్నారు. అందువల్ల వారు ఎదిగినవారుగా కాక క్రీస్తునందు పసిబిడ్డలుగా, పాలు (ప్రాథమిక క్రైస్తవ ఉపదేశం) మాత్రమే అవసరమైనవారుగా ఉన్నారు.
3:4 బానిసత్వం నుండి తీసుకున్న రెండవ సాదృశ్యంలో, కొరింథీ విశ్వాసులు శరీర సంబంధులైన మనుష్యులవలె (అక్షరార్థంగా (“మనిషి ప్రకారం ఈ నడుస్తున్నారు") నడుచుకొంటున్నారని పౌలు గమనిస్తున్నాడు. (వ.3). వారు , బానిసత్వంలో ఉన్నట్టు యజమానుల పట్ల పక్షపాతం చూపే విధానం : అనుసరిస్తున్నారు. ఇది ఒక విశ్వాసికి వినడానికి బాగా నొచ్చుకొనేలా చేసే నేరారోపణ. ఇక్కడ వాడిన పదజాలం బానిసలా జీవించడం గురించిన నుడికారానికి చెందినది. కొరింథీ విశ్వాసులు బానిసల్లా నేను పౌలు వాడను, నేను అపాల్లో వాడను అని పెడుతున్న కేకలు దీనిని సమర్థిస్తున్నాయి.
3:5-6 కొరింథీ సంఘానికి వ్యవస్థాపక సువార్తికులైన తాను, అపొల్లో ఇద్దరూ పంపబడిన పరిచారకులు (గ్రీకు. డియాకోనోయ్). వారి ద్వారా కొరింథీయులు సువార్త సందేశాన్ని విని విశ్వసించితిరి. నాటితిని అంటే పౌలు సంఘాన్ని స్థాపించాడనీ, నీళ్ళుపోసెను అంటే పౌలు కొరింథు నుండి వెళ్ళిన తర్వాత అపొల్లో అక్కడ పరిచర్య చేశాడని సూచిస్తుందని పండితులు అంగీకరించారు.
3:7 అభివృద్ధి మాత్రం పూర్తిగా ప్రభువు మీదే ఆధారపడింది. కాబట్టి పరిచారకుల గొప్పేమీ లేదు. గొప్పతనమంతా యజమానిదే. అంటే అభివృద్ధి చేసేవానిదే. ఎందుకంటే వృద్ధి కలుగజేసినవాడు దేవుడే.
3:8-9 సువార్తపనిలో పౌలు, అపొల్లో సమానమైన సేవకులే, ప్రభువు తిరిగివచ్చినపుడు (4:4-5) కొరింథీ విశ్వాసుల (వీరు “దేవుని పొలము"; వ.10తో పోల్చండి) మధ్య వారు చేసిన పనికి తగిన మెప్పు ఇద్దరూ పొందుతారు. పౌలు అపొల్లోలు ఆయన పొలము (కొరింథీ సంఘం)లో దేవుని జతపనివారు.
3:9-17 దేవుని గృహము అంటే కొరింథు సంఘమని పౌలు గుర్తిస్తున్నాడు (వ.17), కానీ ఈ అలంకారం సార్వత్రిక సంఘానికి ఆపాదించడం న్యాయమే (1 పేతురు 2:5). “గృహము” అని అనువదించిన పదం సాధారణంగా నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని సూచిస్తుంది. ఈ సరియైన రూపకాలంకారము సంఘాన్ని ఒక పూర్తయిన పనిగాను, కొనసాగుతున్న పనిగాను సూచిస్తుంది: స్థిరమైన, శాశ్వతమైన పునాది యేసు క్రీస్తు (1కొరింథి 3:11), కానీ వేర్వేరు పనివారు రాళ్ళు (విశ్వాసులు) పేర్చుతూ పని కొనసాగిస్తున్నారు.
3:10 నేర్పరియైన శిల్పకారునివలె పౌలు - సిలువవేయబడిన క్రీస్తు సందేశం అనే పునాది వేశాడు (వ.11; 2:2). ఇందులో ముఖ్యమైన మాట "నేర్పరియైన" అనేది. అది "సిలువ వేయబడిన యేసు క్రీస్తు” అనేదానితో కలిపి ఒక కట్టడంగా నిర్మించడంలో అతని ప్రావీణ్యాన్ని, జ్ఞానాన్ని సూచిస్తుంది. - సువార్త విస్తరించడానికి సహాయం చేయాలనుకునే విశ్వాసికి సరైన బోధన ఉండాలి (అపొ.కా.18:26). మరి యొకడు దానిమీద కట్టుచున్నాడు అనే మాటలు కొరింథులో క్రీస్తు శరీరాన్ని కట్టడంలో పాల్గొనబోయే పనివారిని పేర్కొంటున్నాయి (వ.5). వీరు పౌలు తర్వాత వచ్చిన అపొల్లో, మొదలైనవారు.
3:10-12. భవిష్యత్తులో పౌలు వేసిన పునాది మీద కట్టబోయేవారు ఎలా కట్టాలో పౌలు వివరిస్తున్నాడు. “నేర్పరియైన శిల్పకారునివలె" (వ. 10) పౌలు (కట్టడాల నిర్మాణపు ఒప్పందాలలో ఉన్నట్లు) తన తర్వాత కట్టే ప్రతి నాయకుడు లేక నిర్మాణకుడు ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను అని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. వారు దేవుని సంఘాన్ని కట్టేవారుగా దేవుడిచ్చిన పనిలో నమ్మకస్తులుగా ఉండడానికి సాదృశ్యంగా నాణ్యమైన వస్తువులు మాత్రమే ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలో అప్రమత్తంగా ఉండడానికి కారణం వ. 13-17లో పేర్కొన్నాడు.
3:13 ప్రాచీన ప్రపంచంలో కూడా , పెద్ద పెద్ద కట్టడాలు పరీక్షించబడి, ఆమోదం పొందడం తప్పనిసరి. కట్టడపు ఒప్పందంలో ఉన్న నియమాల్లో దానిని పరీక్షించే ఒక రోజును ముందుగానే రాసేవారు. ఈ పరీక్షా సమయానికి వాడే మాటలనే పౌలు ఇక్కడ ఉపయోగించాడు. -ఆ దినము దానిని తేటపరచును. "వెడ్డితనము" అనే సందేశపు పునాది మీద (1:18,23; 2:2,5), క్రీస్తు శరీరం అనే దేవుని కట్టడాన్ని కట్టేవారు ఎలా కట్టారో దేవుడు పరీక్షించబోయే అంత్యకాల పరీక్షా దినాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు.
3:14-17 ఈ భాగంలో దేవుని గృహాన్ని నిర్మిస్తున్న మూడు రకాల ఉప గుత్తేదారులను వర్ణిస్తూ, మూడు భిన్నమైన దృశ్యాలను పౌలు ఇస్తున్నాడు. ప్రతి దృశ్యాన్ని ఒకని... పని, ఎవడైనను అనే మాటలతో ఆరంభిస్తున్నాడు (వ, 14-15, 17; వ.12తో పోల్చండి).
3:14 ప్రాచీన ప్రపంచంలో జీతము (గ్రీకు. మిస్తాన్) అనేది సకాలంలో, అంచనా వ్యయం ప్రకారం, ఇచ్చిన వివరాలకు అనుగుణంగా కట్టడాన్ని పూర్తిచేసిన వారికి ఇచ్చేవారు.
3:15 అజాగ్రత్తగా కట్టేవారు నష్టపోతారు అని పౌలు హెచ్చరిస్తున్నాడు.
3:16 వారి సామూహిక సంఘపు సార్వత్రిక గుర్తింపును గురించిన స్వీయ అవగాహన ఉండాలని పౌలు కొరింథీయులకు పిలుపునిస్తున్నాడు. వారు దేవుడు కట్టిన ఆలయమై యున్నారు, దేవుని ఆత్మ వారిలో నివసిస్తున్నాడు.
3:17 సంఘాన్ని పాడుచేసే వారిని పౌలు తీవ్రంగా హెచ్చరించాడు (అధ్యా. 15; 2 కొరింథీ 11). పాడు అనే క్రియాపదంతో పదప్రయోగం చేస్తూ, ఎవడైనా దేవుని ఆలయాన్ని “పాడు” (గ్రీకు. థైరో, “నాశనం”, “చెరపడం”, “వంచించు" "కూల్చు”) చేస్తే, ప్రతిగా దేవుడు వాడిని పాడుచేస్తాడు. పాడు అనే మాట కట్టడపు ఒప్పందాలలో మోసం చేసే ఉద్దేశంతో ఒక కట్టడాన్ని నిర్మించడం గురించి వాడేవారు. కాబట్టి ఇక్కడ కనిపించేది కావాలని నిర్లక్ష్యంగా ఉన్న సంఘ నాయకుని (కట్టువాడు, వ.12) గురించినది.
3:18 తమను తాము మోసం చేసుకునేవారికి పౌలు సలహా: ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనువాడు, “వెర్రితనము” అనే సందేశాన్ని హత్తుకొని వెళివాడు కావాలి. వెర్రితనము అనే సందేశాన్ని నమ్మిన వెర్రివాడు దేవుని
3:19-20 వెట్టితనములో ఏముండాలో నిర్ణయించేవాడు. దేవుడు. ఈ వచనాలు పా. ని.. జ్ఞాన సాహిత్యం (ఉదా., యోబు 5:12-13) నుండి వాడిన న్యాయస్థానపు మాటలతో నిండివున్నాయి. ఈ సాక్ష్యాధారాలను బట్టి దేవుని యెదుట పెట్టబడిన ఎట్టి వివాదాలైనా (యోచనలు), మానవజ్ఞానం మీద ఆధారపడితే, అది వెర్రివిగా ఉంటాయని పౌలు దృఢపరిచాడు.
3:21-23 సంఘంలో విభజనలకు పరిష్కారం సువార్త సేవకులందరూ, అంటే పౌలు... అపొల్లో... కేఫా వంటి ప్రసిద్ధులైనవారు కూడా తమ సొంతం కాదు, వారు క్రీస్తువారు, ఆ విధంగా దేవునివారు అని గుర్తించడమే. ఈ వెలుగులో పరిచారకులు సంఘాన్ని దారితప్పించే వారు కాకూడదు, విశ్వాసులు వారిని యజమానులుగా భావించకూడదు.