Psalms - కీర్తనల గ్రంథము 150 | View All

1. యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి.

2. ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి.

3. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.

4. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.

5. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.

6. సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.



బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-150. కీర్తనలు గ్రంథంలోని అయిదు స్కంధాలు స్తుతితో ముగిసినట్లే గ్రంథంలోని చివరిదైన ఈ కీర్తన ఆద్యంతం స్తుతితోనే ఉంది. 

150:1 యెహోవాను స్తుతించుడి. నిజమైన దేవుని స్తుతి దేవాలయానికే పరిమితమై ఉండదు. (వ.1-2,6). మనం ఆయన గొప్పతనాన్ని, మంచితనాన్ని చూసి, సృష్టిలో, విమోచనలో, మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన చేసిన దాన్నంతటినీ జ్ఞాపకం చేసుకొని దానిని ధ్యానించినప్పుడు మాత్రమే మనం ఆయనను నిజంగా స్తుతించగలం. ఈ విధంగా మన కృతజ్ఞతను, ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలనే కోర్కెను వ్యక్తం చేసే హృదయమే స్తుతికి శక్తివంతమైన స్పందన. దేవాలయంలో మన పాటలతో, వాద్యాలతో దేవున్ని స్తుతించడంతో బాటు, ప్రేమ, ఆనందం నిండిన జీవితాలతో (1యోహాను 4:19), క్రీస్తులో విశ్వాసంతో (యోహాను 1:7), సాతాను శక్తులపై విజయంతో (ఎఫెసీ 6:10-18), ఆయన రాజ్యం , ఆయన నీతి కోసమైన ఆధ్యాత్మిక ఆకలితో (మత్తయి 6:33), ఆయన వాక్యం యెడల భక్తితో (కీర్తన 119), పరిశుద్దాత్మ వలన మన హృదయాల్లో కుమ్మరింపబడిన దేవుని ప్రేమతో ( రోమా 5:5), ఆయన సువార్త ప్రకటనతో (రోమా 1:16), సమీపిస్తున్న ఆయన రాకడ కోసం ఎదురుచూస్తూ (2తిమోతి 4:8; తీతు 2:13) మనం ఆయనను స్తుతించగలం. 

150:2 ఈ వచనంలోని మొదటి సగం దేవుడు చేసిన పరాక్రమక్రియల్ని బట్టి ఆయనను స్తుతించాలనీ, రెండవ సగం దేవుడు ఏమై ఉన్నాడనేదాన్ని బట్టి ఆయనను స్తుతించాలని తెలియజేస్తుంది. 

150:3-5 ఈ వచనాల్లో ప్రాచీన కాలంలో దేవాలయంలో భక్తి గీతాలాపనలో ఉపయోగించిన పలురకాల వాద్య పరికరాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. బూరలు, తంత్రీవాద్యాలు, ఘటాలు - మూడు రకాల వాద్యపరికరాలు కనబడుతున్నాయి. 

150:6 సృష్టిలో సకల ప్రాణులకు జీవం దేవుని నుండి కలిగినదే కాబట్టి, సకల ప్రాణులు సృష్టికర్తను స్తుతించడం ఎంతైనా సమంజసం (149:2).

Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |