Ephesians - ఎఫెసీయులకు 1 | View All

1. దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి వ్రాయునది

2. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

3. మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు,

5. తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

7. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

9. మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.

10. ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.

11. మరియక్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తికలుగజేయవలెనని,

12. దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.

13. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

15. ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు, నేను వినినప్పటినుండి

16. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

17. మరియు మీ మనో నేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో,
యెషయా 11:2

18. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,
ద్వితీయోపదేశకాండము 33:3, ద్వితీయోపదేశకాండము 33:27-29

19. మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

20. ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే
కీర్తనల గ్రంథము 110:1

21. గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు.

22. మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
కీర్తనల గ్రంథము 8:6

23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది.బైబిల్ అధ్యయనం - Study Bible
1:1 ఎఫెసీ. పత్రికను అన్యజనులకు అపొస్తలుడైన పౌలు రాశాడు. ఇది అతడు కొలస్సీ, ఫిలేమోను పత్రికలను రాసిన సమయంలోనే బహుశా రోమా చెరసాల నుండి రాసి ఉంటాడు. పౌలు తనను తాను అపొస్తలుడుగా గుర్తించుకుంటున్నాడు. అపొస్తలుడు అంటే, పునరుత్థానుడైన క్రీస్తు ఆదేశంతో ఒక ప్రత్యేకమైన పనిమీద పంపబడి ఆ పరిచర్య నిమిత్తం పరిశుద్ధాత్మను వరముగా పొందినవాడు. పౌలు తన అపొస్తలిక నియామకాన్ని దేవుని చిత్తము వలన పొందాడు. ఈ పత్రిక చిన్న ఆసియా అంతటా ఉన్న సంఘాలను ఉద్దేశించి రాయబడి ఉంటుంది. అయితే వారిలో ముఖ్యమైనవారు ఎఫెసులోనున్న పరిశుద్ధులు (విశ్వాసులు) అన్నది స్పష్టం. ఎఫెసు (ప్రస్తుత టర్కీ) చిన్న ఆసియా పశ్చిమభాగంలోని అతి ప్రాముఖ్యమైన పట్టణం. అది ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంలో అతి పెద్ద వ్యాపార రహదారులు కలిసే చోట ఉంది. ఏజియన్ సముద్రంలోకి ప్రవహించే కేస్టర్ నదిలో దీనికి ఒక ఓడరేవు కూడ ఉంది. అర్జెమి (డయానా) అనే ఒక రోమీయుల దేవతకు ప్రతిష్టించిన దేవాలయం బట్టి ఎఫెసు అతిశయించేది (అపొ.కా. 19:23-41). ఇక్కడున్న సంఘం కొంతకాలం బాగా అభివృద్ధి చెందింది. అయితే దానికి ఎప్పుడూ ప్రోత్సాహం అవసరం అవుతూ ఉండేది (ప్రక 2:1-7). 

1:2 క్లుప్తంగా ఉన్నప్పటికీ, పౌలు శుభాకాంక్షలు వేదాంతపరంగా ప్రాధాన్యత కలిగినవి. కృప, సమాధానము అర్హత లేకపోయినా దేవుడు మనకిచ్చే వరములు. పౌలు ఈ పత్రికలో “కృప" అనే మాటను 12 సార్లు, “సమాధానము" అనే మాటను 8 సార్లు వాడాడు. “కృప" గురించి 2:4 నోట్సు చూడండి. 1:3-14 వ.1-2లో శుభాకాంక్షల తరువాత, యేసు క్రీస్తులో సంఘానికి చెందిన అద్భుతమైన ఆత్మసంబంధమైన... ఆశీర్వాదములను గూర్చిన వరుస పదజాలం ఉంది. అవి దేవుని కృప, జ్ఞానము, ఆయన నిత్య సంకల్పం నుండి ప్రవహిస్తాయి కాబట్టి ఇవన్నీ ప్రతి విశ్వాసికీ నిశ్చయంగా దొరికే ఆశీర్వాదాలే. ఈ 12 వచనాలు గ్రీకు భాషలో ఒకే సుదీర్ఘ వాక్యంగా ఉన్నాయి. 

1:3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక: ఈ భాగం తరచు ఒక “మంగళాశాసనం"గా పిలవబడుతుంది. ఎందుకంటే ఇది . దేవుడేమి చేశాడో చెబుతూ ఆయనకు ఆరాధన, స్తుతి, ఘనతలను

ఆపాదిస్తుంది. ఇలాంటి ఆశీర్వాదాలు 2కొరింథీ 1:3; 1 పేతురు. 1:3లో కూడా కనిపిస్తాయి. ఈ అద్భుతమైన భాగంలో తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ ద్వారా సంఘానికి కలిగే ఆశీర్వాదాలను పౌలు రాస్తున్నాడు. దేవుడు మనల్ని పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదాలలో క్రీస్తుతో మన ఏకత్వం, పరలోక స్థలాలలో ఆయనతో పాటు కూర్చుండడం, మన దత్తపుత్రత్వం, విమోచన, ఎన్నిక, ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. ఆత్మవరములు, మన సేవా సామర్థ్యాలన్నీ కూడా రక్షణ సమయంలో ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చే ఈ ఆత్మీయ ఆశీర్వాదాల నుండే ఉద్భవిస్తాయి. 

1:4-6 ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను: ఎన్నిక “క్రీస్తులో ఉన్నది కాబట్టి ఆత్మీయ సమ్మేళన అనే ముఖ్యమైన అంశం నుండే దైవిక ఎన్నిక అనే ఆలోచన ప్రవహిస్తుంది. ఎన్నికను గురించిన సిద్ధాంతం బైబిల్ బోధ అంతటిలో ముఖ్యమైనదీ, చాలా ఎక్కువగా అపార్థం చేసుకోబడింది. ప్రాథమిక స్థాయిలో ఈ ఎన్నిక దేవుని ప్రణాళికను సూచించి, ఆయన తన చిత్రాన్ని నెరవేర్చడాన్ని తెలుపుతుంది. ఎన్నిక అంటే దేవుడు తన సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రజలను క్రీస్తులో విశ్వాసానికి తెచ్చి, తనతో ప్రత్యేకమైన నిబంధనా సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు అని అర్థం చేసుకోవాలి. ఈ అంశం ఎఫెసీయుల పత్రిక ఆరంభానికి పునాదిగా ఉంది. దీనిలో “ఆయన... ఏర్పరచుకొనెను” (వ.6), “ముందుగా... నిర్ణయించుకొని (వ.6), "తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి... ముందుగా నిర్ణయించి” (వ. 12) అనే మాటలు ఉన్నాయి. ఆ ఎన్నిక క్రీస్తును కేంద్రంగా చేసుకుని చేయబడింది అనే పౌలు దృష్టికోణం ఇక్కడ చాలా ముఖ్యమైంది. దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు మనలను ఏర్పరచుకున్నాడు. ఇది చరిత్ర పట్ల దేవుని ప్రణాళికలో సువార్త యొక్క ప్రముఖస్థానాన్ని సూచిస్తుంది. మనము పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండడానికి ఏర్పరచబడ్డాం. పరిశుద్ధత, నిర్దోషత్వములు దేవుని ఎన్నిక ఫలితాలే గానీ, ఆ ఎన్నికకు ఆధారాలు కాదు.
ముందుగా తనకోసము నిర్ణయించుకొని: దేవుని ఆశీర్వాదాలన్నీ ఆయన సార్వభౌమాధికార మున్నిర్ణయాన్ని బట్టి ఉంటాయి. అది ఉద్దేశపూర్వకమైనదిగా, ప్రేమలో స్థాపించబడి వుంటుంది. మున్నిర్ణయం అనేది దేవుని చిత్తం యొక్క ఒక స్థిరమైన, సమన్వయంతో కూడిన సంకల్పానికి సంబంధించింది. అదిభవిష్యత్తులో జరగబోయే దానిని స్థిరపరిచే దేవుని నిత్యనిర్ణయం. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై: దేవుని ఉద్దేశపూర్వకమైన ప్రేమ ద్వారా విశ్వాసులు దేవుని కుటుంబంలోకి దత్తత తీసుకోబడ్డారు. దత్తత అనేది విశ్వాసులకు చెందవలసిన అన్ని హక్కులు, విశేషాధికారాలు, బాధ్యతలతో సహా మనం దేవుని కుమారులమని చేసే చట్టబద్ధమైన ప్రకటన.
తన కృపా మహిమకు కీర్తి కలుగుట అనేది దేవుని విమోచనా ప్రణాళిక అంతిమ లక్ష్యం. కృప అంటే అయోగ్యులకు సహితం దేవుడు ఉచితంగా కనపరచే దయ. దేవుడు. కృపగలవాడు కాబట్టి విశ్వాసులకు కృప దొరుకుతుంది. తన ప్రియుని యందు అనేది క్రీస్తును సూచిస్తూ యేసు బాప్తిస్మం, రూపాంతరం సమయాల్లో తండ్రియైన దేవుడు చేసిన ప్రకటనను గుర్తు చేస్తున్నది (మత్తయి 3:17; 17:5).

1:7 విమోచనము అంటే విశ్వాసులు క్రీస్తు రక్తం అనే వెలతో కొనబడ్డారని అర్థం (1కొరింథీ 6:20; 1తిమోతి 2:6; 1 పేతురు 1:18-19). వారు పాపం నుండీ, సాతాను నుండీ, తమ స్వంత పాపజీవిత వేదన నుండి విమోచన పొందారు. ఆ విమోచన ఫలితంగా మన పాప ఋణం కొట్టివేయబడి సంపూర్ణ క్షమాపణ కలిగింది.

1:8 తన చిత్తమును గూర్చిన మర్మము ప్రకారం దేవుని కృప విశ్వాసులపై కుమ్మరించబడింది. ఆ చిన్నాసియాలోని మార్మిక మతాలు చెప్పే విధంగా దేవుని చిత్తం మర్మమైనదని పౌలు భావం కాదు. మార్మిక మతాల ప్రకారం దైవికమైన ఉద్దేశాలు ప్రాథమికంగా అందరికీ కాక, వెలిగింపబడిన కొద్దిమందికి మాత్రమే బయల్పరచబడతాయి. కానీ పౌలు దృష్టిలో “మర్మము” అంటే అందరికీ అర్థమయ్యేలా బయల్పరచబడిన దేవుని ప్రణాళికలోని ఒక విషయం (3:2-13). ఈ మర్మంలో ప్రత్యేకంగా మెస్సీయలో సమస్తాన్నీ ఏకం చేయడానికి దేవుని ప్రణాళిక నెరవేర్పు ఇమిడి ఉంది.
కాలము సంపూర్ణమైనప్పుడు: సిలువ వేయబడిన విమోచకుడు, మెస్సీయ అయిన యేసు విషయంలో దేవుని సంకల్పం మీద చరిత్ర లక్ష్యం ఆధారపడి ఉంది. సమస్తమూ ఆయన కోసం, ఆయన ద్వారా, ఆయనలోనే ఉన్నాయి. యేసు క్రీస్తును శిరస్సుగా గుర్తించే ఒక కొత్త లోకక్రమాన్ని స్థాపించాలన్నదే ఆ లక్ష్యం (వ.22).

1:9 జ్ఞాన వివేచనలు దేవుని కృపా వరములను సూచిస్తుండవచ్చు. 

1:10 తిరిగి ఐక్యమైన విశ్వానికి ఆయనే శిరస్సు. ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఉండి పరిపాలిస్తున్నాడు; ఒక రోజు ఆయన తన రాజ్యాన్ని స్థాపించి, కొత్త ఆకాశాలను, కొత్త భూమిని తెచ్చి, చివరిగా దేవుని విమోచనా ఉద్దేశాన్ని సంపూర్ణం చేస్తాడు. పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చడం అంటే అదే. 

1:11 క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము లో పౌలు, విశ్వాసులైన యూదులందరూ ఉన్నారు. 

1:12 దేవుని... సంకల్పమును బట్టి క్రైస్తవులు ముందుగా నిర్ణయించబడ్డారు. వారు. కాకతాళీయంగానో, బలవంతంగానో, నిస్సహాయమైన తప్పనిసరి ఎంపికగానో కాక దేవుని ఆత్మ ప్రేరేపణ వల్లనే క్రీస్తులో విశ్వాసముంచారు.

1:13-14 వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి: ప్రవక్తలు, యేసు పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేశారు. (యోవేలు 2:28-29; యోహాను 14:15-26; 16:5-16). సొంతదారుతనాన్ని సూచించే ముద్రగా, భవిష్యత్తులో విమోచనను సూచించే వాగ్దానంగా ఆత్మ వర్ణించబడ్డాడు. విశ్వాసులు విమోచనను ఇంకా సంపూర్ణంగా అనుభవించక పోయినా, ఆత్మను పొందిన వారందరికీ దేవుడు అంత్య విమోచనను (ఆయన సన్నిధిలో జీవించడం) తీసుకొస్తాడు. (ఎఫెసీ. 1:14). పరిశుద్ధాత్మ ముద్ర గురించి, 4:30; 2 కొరింథీ 1:21-22 చూడండి. 

1:15 మీ... విశ్వాసమును... నేను వినినప్పటినుండి బహుశా పౌలు ఎఫెసీయులకు, కొలస్సీయులకు, ఫిలేమోనుకు ఒకే సమయంలో ఉత్తరాలు రాసి పంపి వుంటాడు. చిన్నాసియా ప్రాంతంలోని పరిశుద్ధుల విశ్వాసం గురించి పౌలుకు ఈ మధ్యనే తెలిసిందని ఫిలేమోను వ.5 సూచిస్తుంది.

1:16 మానక దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. నిర్దిష్టంగా తన పాఠకుల విశ్వాసం, ప్రేమపట్ల పౌలు కృతజ్ఞతగా ఉన్నాడు. విశ్వాసం క్రీస్తువైపు దృష్టి నిలిపి, ఇతరుల పట్ల చూపే ప్రేమ ద్వారా వ్యక్తమౌతుంది. అలాంటి ప్రేమ యథార్ధమైన విశ్వాసానికి ఋజువు (గలతీ 5:6). 

1:17-19 జ్ఞానమును ప్రత్యక్షతయు: క్రీస్తులో వారికున్న గొప్ప ఆధ్యాత్మిక వనరులు ఏమిటో ఎఫెసీ విశ్వాసులు అర్థం చేసుకోవాలని పౌలుకోరుతున్నాడు. దైవిక సత్యం యొక్క మర్మాల విషయంలో పరిశుద్ధాత్మ కలిగించే వివేచనను, అంతర్దృష్టిని “ప్రత్యక్షత" అనే మాట సూచిస్తుంది. తన పాఠకులు జ్ఞానాత్మను కలిగి, దేవుణ్ణి మరింత సంపూర్ణంగా ఎరగాలని పౌలు కోరుతున్నాడు. దేవుడు విశ్వాసులకు జ్ఞానమిచ్చాడు (వ. 8-9), కానీ సంఘం ఆ ఆశీర్వాదాలను అర్థం చేసుకోవడమే కాక వాటిని అనుభవించాలని కూడా " పౌలు ప్రార్థించాడు. " పిలుపువల్లనైన నిరీక్షణ పరిశుద్ధాత్మను పొందడం ద్వారా నిత్యజీవానికి కలిగే నిశ్చయత గురించిన భరోసాను సూచిస్తుంది. ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో: విశ్వాసులు దేవుని ఆశీర్వాదాలన్నిటినీ స్వతంత్రించుకుంటారు (వ.3,11,14; రోమా 8:32). ఆ మాటకు అర్థం దేవుని స్వాస్థ్యం లేక మన స్వాస్థ్యం అని కావచ్చు, అంటే దేవుడు పొందే స్వాస్థ్యం లేక ఆయన అనుగ్రహించే స్వాస్యం. దేవుని ప్రజలు ఆయన స్వాస్థ్యమని పా.ని. బోధిస్తూ వచ్చింది. అలాగే తన పరిశుద్ధులలో దేవుడు మహిమపరచబడడాన్ని సూచిస్తూ, పౌలు మాటలు అలాంటి అవగాహననే ప్రతిబింబిస్తున్నాయి.
తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో: దేవుని శక్తి మాత్రమే పరలోకంలో విశ్వాసులకు అందుబాటులోకి వచ్చే అంతిమ మహిమైశ్వర్యాన్ని తీసుకురాగలదు. క్రీస్తును మృతుల్లో నుండి లేపిన ఈ అసాధారణమైన దేవుని శక్తి ఇప్పుడు విశ్వాసుల్లో, వారి ద్వారా పనిచేస్తున్నది. 

1:20-23 పౌలు జీవితాన్ని నడిపిస్తున్న శక్తి క్రీస్తు పునరుత్థానమే. యేసును మృతులలో నుండి లేపడం ద్వారా, క్షయత అనే దాని సాధారణ ప్రక్రియను తిప్పివేయడం మాత్రమే కాకుండా, దానిని పూర్తిగా అధిగమించాడు. ఆయన యేసుకు పునరుత్థాన శరీరం ఇవ్వడం ద్వారా ఆయనను ఒక విభిన్నమైన నూతన జీవంతో లేపాడు. యేసు పునరుత్థానం కావడమే కాక, ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి. ఇప్పుడు ఆ అధికార స్థానం నుండి ఏలుతున్నాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని సూచించే విధంగా క్రీస్తు సమస్తానికి పైగా ఉన్నాడు. క్రీస్తు యొక్క ఆరోహణం, హెచ్చింపు పునరుత్థాన సంఘటనను సంపూర్తి చేసి, తద్వారా యేసు తన ప్రజలలో ప్రథమఫలంగా మారడం ద్వారా విశ్వాసులకు నిరీక్షణను కలుగజేశాడు (1 కొరింథీ 15:20). ఆ సంఘం క్రీస్తు యేసు అనే తన శిరస్సుతో కీలకమైన అనుబంధంలో ఉండడం ద్వారా మాత్రమే ఉనికి కలిగి, పని చేస్తుందని పౌలు అన్నాడు. పునరుత్థానుడై, హెచ్చించబడిన క్రీస్తు ఎవరి అవసరమూ లేనివాడుగా, ప్రతి విషయంలోనూ పూర్తి స్వాతంత్ర్యం కలిగి ఉన్నాడు. అయినప్పటికీ శిరస్సుగా ఆయన శరీరం లేకపోతే అసంపూర్ణుడు. అంటే శరీరమై ఉన్న సంఘము శిరస్పైన క్రీస్తును పూరిస్తుంది. కాబట్టి శరీరం, శిరస్సు నిజమైన భావంలో ఒక్కటిగా ఉన్నాయి. 


Shortcut Links
ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |