8:1 మాసిదోనియ సంఘములు అంటే ఫిలిప్పీ, థెస్సలోనిక, బెరయలోని సంఘాలు (అపొ.కా.16-17).
8:2 ఈ సంఘాలు శ్రమలలో నుండి పుట్టాయి . (అపొ.కా. 16-17). అంతేకాక అవి ఆర్థిక వనరుల విషయంలో పరిమితుల్లో ఉన్నవి. అయినప్పటికీ ఇవేవీ వారి దాతృత్వాన్ని అడ్డుకోలేకపోయాయి.
8:3-4 అదే మాట (పరిచర్య) ఇంతకు ముందు క్రైస్తవ పరిచర్యను గురించి వాడబడింది. (4:1; 5:18; 6:3), ఇప్పుడు క్రైస్తవ దాతృత్వం (ఇచ్చుట) గురించి వర్ణిస్తుంది. ఆర్థిక గృహనిర్వాహకత్వం కూడా పరిచర్యలో భాగమే.
8:5 దాతృత్వాన్ని పరిచర్యగా అర్థం చేసుకోడానికి ఇది కీలకం. విశ్వాసులు తమ్మును తాము... ప్రభువుకు పూర్తిగా అప్పగించుకున్నపుడు, తమ సొమ్మును ఆయనకు ఇవ్వడం కష్టమేమీ కాదు.
8:6 యెరూషలేము క్రైస్తవులకు కానుక పోగుచేయడానికి పౌలు దీర్ఘకాలంగా పని చేస్తున్నాడు. అందులో కొంత భాగానికైనా తీతును నిర్వాహకుడుగా నియమించాడనేది తెలిసిందే.... ఇవ్వడానికి కొరింథీయులు "సంవత్సరము" నుండి సిద్ధంగా ఉన్నారు. (9:2), కానీ ఆ పని పూర్తిచేయలేక పోయారు. దానికి పౌలు వేదనాకరమైన స్థితిలో కొరింథీయులను దర్శించి, వారికి కఠినమైన పత్రిక రాసేందుకు కారణమైన ఇటీవలి సమస్య, తప్పకుండా ఒక పెద్దకారణమే. ఇప్పుడు కొరింథీయులు పునరుద్ధరించబడ్డారు కాబట్టి ఆ పని పూర్తిచేసే సమయం వచ్చింది. అయితే అది దేవుని కృపను బట్టి
ప్రేరేపితమైతేనే సరిగ్గా జరుగుతుంది (వ.1).
8:7 కొరింథీయులు మాసిదోనియ వారికన్నా సమృద్ధి గలవారు. కాబట్టి వారు మరింతగా ఇవ్వగలరు. ఇలా జరుగుతుందని పౌలు ఆశించాడు (ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి).
8:8 మాసిదోనియ వారి దాతృత్వం ఇవ్వడం అనేదానికి ఒక సవాలుకరమైన ప్రమాణాన్ని ఏర్పరచింది. ఈ పరీక్షలో వారు ఉత్తీర్ణులు కావడానికి ఆయన కృపద్వారా దేవుని ప్రేమ మాత్రమే కొరింథీయులకు శక్తినిస్తుంది.
8:9 యేసు తనను తానే అర్పించుకోవడం ఇవ్వడంలో అత్యున్నత స్థాయిని సూచిస్తుంది. నరావతారమనే దారిద్ర్యానికి ఆయన ఇష్టపడి తన ఐశ్వర్యమంతటినీ దానితో మార్పిడి చేసుకున్నాడు.
8:10-11 కార్యమును... నెరవేర్చుడి గురించి వ.6 నోట్సు చూడండి. 8:12 రెండు కాసులు ఇచ్చిన విధవరాలిలాగా (లూకా 21:1-4) దేవునికి కావల్సింది ఎంత మొత్తం ఇస్తున్నారు అని కాదు ఎంత విలువైనది ఇస్తున్నారు.
8:13-14 నిర్గమ 16:18లో అనుదినం మన్నాను సమకూర్చుకున్న ఇశ్రాయేలీయుల మొదటి అనుభవం నుండి ఈ మాటలు పేర్కొన్నాడు. దేవుడు తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాకుండా, హెచ్చుగా కూర్చుకున్న వారికి మిగలకుండా చేశాడు. అరణ్యంలో దేవుడు ఈ సమానత్వ సూత్రాన్ని అమలుపరిచాడు (నిర్గమ 16:20). తమకు చాలినంత ఉంటుందని ఎరిగి, కొరింథీయులు దేవుణ్ణి నమ్మి స్వచ్చందంగా సమధర్మం పాటించాలని పౌలు పిలుపునిస్తున్నాడు.
8:15 ఇప్పుడు దాతృత్వం గల సంఘం, ఆ తరువాతి కాలంలో ఇతరుల నుండి సహాయం కోరేదిగా మారవచ్చు.
8:16-17 కొరింథీయుల వద్దకు వెళ్ళి, కానుకను పర్యవేక్షించడానికి తీతు స్వచ్చందంగా ముందుకు వచ్చాడు. మీయొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు అనే మాటలు, 2 కొరింథీ పత్రిక తీసుకొని వెళ్తున్నది తీతు అని పేర్కొంటున్నాయి.
8:18 ప్రసిద్ది చెందిన సహోదరుడు పేరు లేదు. బహుశా అతడు లూకా అయివుండవచ్చు.
8:19 నాయకత్వ నిర్ణయాలలో సంఘాలు పాల్గొనాలి. అపొ.కా. 20:4లో పౌలుతోపాటు ఈ కానుకను తీసుకొని వెళ్ళే సంఘ ప్రతినిధుల పేర్లన్నీ ఉన్నాయి. అపొ.కా.20:5-6 లో ఉన్న “మేము” లేక “మాకు” అనే మాటలను బట్టి లూకా కూడా అందులో ఉన్నాడు.
8:20-21 క్రైస్తవ్యం ఆరంభం నుండి, డబ్బును గురించిన వ్యవహారాలలో నిస్సందేహ యథార్థత చాలా ముఖ్యమైనదిగా ఉండింది. మనుష్యుల దృష్టి యందును అనే మాటలు ప్రజల యెదుట జవాబుదారీతనం కలిగి ఉండాలని సూచిస్తున్నాయి.
8:22 వ.18 లోని సహోదరుని వలె ఇతని పేరు కూడా ప్రస్తావించలేదు కానీ ప్రశంసించబడ్డాడు.
8:23 పాలివాడును... జతపనివాడు గురించి 2:12-13 నోట్సు లో తీతును గురించి మరిన్ని యోగ్యతలు చూడండి. సంఘముల దూతలు అంటే అక్షరార్థంగా “అపొస్తలులు". సంఘాలచే ఎంపిక చేయబడినవారు (వ. 19) మాత్రమే ఈ పనిని సరిగ్గా చేయగలరు. సువార్త ఏ విధంగా క్రీస్తు మహిమను చూపుతుందో (4:4 నోట్సు చూడండి), అదే విధంగా సువార్త చేత మారినవారు కూడా క్రీస్తు మహిమను కనపరుస్తారు.
8:24 తమ కానుకను సంపూర్తి చేయమని కొరింథీ విశ్వాసులకు ఇది మరొక విన్నపం (వ.7 నోట్సు చూడండి).