Matthew - మత్తయి సువార్త 24 | View All

1. యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి.

2. అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

3. ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా

4. యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.

5. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.

6. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
దానియేలు 2:28, దానియేలు 2:45

7. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
2 దినవృత్తాంతములు 15:6, యెషయా 19:2

8. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.

9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.

10. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.
దానియేలు 11:41

11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;

12. అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.

13. అంతమువరకు సహించినవా డెవడో వాడే రక్షింపబడును.

14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.

15. కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక
దానియేలు 9:27, దానియేలు 11:31, దానియేలు 12:11

16. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను

17. మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు;

18. పొలములో ఉండు వాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు.

19. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.

20. అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.

21. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.
దానియేలు 12:1, యోవేలు 2:2

22. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.

23. ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి.

24. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
ద్వితీయోపదేశకాండము 13:1

25. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.

26. కాబట్టి ఎవరైననుఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి

27. మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.

28. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును.

29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును.
యెషయా 13:10, యెషయా 34:4, యెహెఙ్కేలు 32:7, యోవేలు 2:10, యోవేలు 2:31, యోవేలు 3:15, హగ్గయి 2:6, హగ్గయి 2:21

30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.
దానియేలు 7:13, దానియేలు 7:13-14, జెకర్యా 12:10, జెకర్యా 12:12

31. మరియు ఆయన గొప్పబూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.
ద్వితీయోపదేశకాండము 30:4, యెషయా 27:13, జెకర్యా 2:6

32. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.

33. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నా డని తెలిసికొనుడి.

34. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

35. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు.

36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు.

37. నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును.
ఆదికాండము 6:9-12

38. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి
ఆదికాండము 6:13-724, ఆదికాండము 7:7

39. జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.
ఆదికాండము 6:13-724

40. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును.

41. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును,ఒకతె విడిచిపెట్టబడును.

42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

43. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండిన యెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.

44. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.

45. యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?

46. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.

47. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

48. అయితే దుష్టుడైన యొక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని

49. తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె

50. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి,వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును.

51. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.



బైబిల్ అధ్యయనం - Study Bible
24:1-2 ఈ గొప్ప ప్రవచనం శిష్యులను ఆశ్చర్యచకితులను చేసివుంటుంది. దేవాలయం ముప్పై ఏడున్నర అడుగుల పొడవు, పన్నెండు అడుగుల ఎత్తు, పద్దెనిమిది అడుగుల వెడల్పు ఉన్న తెల్లసున్నపు రాళ్ళచేత కట్టబడిందని జోసీఫస్ రాశాడు. ఇంకా మిగిలివున్న పునాదిరాళ్ళు ఒక్కొక్కటి సుమారు 400 టన్నుల బరువుగలవి. రచనలు చేయడం 

24:3 వేర్వేరు ప్రశ్నలు అడగడాన్ని బట్టి, దేవాలయం నాశనం కావడం, యేసు రెండవ రాకడ రెండూ వేర్వేరు సంఘటనలు అని ఆయన శిష్యులు అర్థం చేసుకున్నారని సూచిస్తాయి.

24:4-14 ఈ వచనాలు యేసు ప్రవచనానికి, యుగాంతానికి మధ్య జరిగే సంభవాలను వర్ణిస్తాయి. విశ్వాసులు తప్పక సిద్ధపడి వుండాలి. మోసపుచ్చడా నికి అబద్ద క్రీస్తులు, అబద్ద ప్రవక్తలు లేస్తారు. క్రైస్తవులకు హింస పెరుగుతుంది. అక్రమము విస్తరిస్తుంది; ప్రేమ చల్లారిపోతుంది. కానీ ఈ రాజ్యసువార్త... లోకమందంతటను ప్రకటింపబడును. వ్యతిరేకత ఉన్నప్పటికీ, అది సువార్తను మాత్రం అడ్డుకోలేదు.

24:15-22 ఈ వచనాలు క్రీ.శ. 70లో జరిగిన దేవాలయం నాశనమైన సంఘటనలను వివరిస్తున్నట్లున్నాయి. అయితే, మత్తయి 24:29 ఈ కాలానికి యేసు రెండవ రాకడ కాలానికి దగ్గర సంబంధం ఉన్నట్లు చెబుతుంది. అంటే ఈ సంఘటనలు, యేసు రావడానికి ముందు జరిగే సంఘటనలకు సమాంతరంగా ఉన్నాయని సూచిస్తుంది (2థెస్స 2:3-4). దేవాలయం నాశనం అయిన దగ్గర్నుండి, క్రీస్తు తిరిగి రావడానికి ముందు జరిగే సంఘటనల వరకు ఉన్న కాలం, క్రీస్తు అనుచరులకు మహా శ్రమ కాలంగా చెప్పుకోవచ్చునేమో. నాశనకరమైన హేయవస్తువు అనేది దాని -9:27లో ముందుగా చెప్పినట్లు యెరూషలేము దేవాలయాన్ని అపవిత్రపరచే విగ్రహారాధనకు సంబంధించిన వస్తువు. ఆ వస్తువు, దేవాలయం నాశనం చేయడానికి అనేక సంవత్సరాల ముందు, పరిశుద్ధ స్థలంలో యాజకుల రక్తం చిందించబడడమే. అని జోసీఫస్ గుర్తించినప్పటికీ (మత్తయి 23:29-36 చూడండి), నాశనకరమైన హేయ వస్తువు దేవాలయంలో నిలుచుట అని యేసు వర్ణించినందున, అది ఒక సంఘటన కాదు గాని ఒక వస్తువు అని సూచిస్తుంది.

24:23-26 దేవుడు ఏర్పరచబడినవారి విశ్వాసమును కాపాడి, వారిని సంరక్షిస్తాడు. యేసును దేవునిగా, రక్షకునిగా, రాజుగా ఎవరైతే నిజంగా విశ్వసిస్తారో, వారి విశ్వాసం చివరివరకు సహిస్తుంది. ఈ 24:27 రెండవ రాకడలో క్రీస్తు దిగి వచ్చినప్పుడు అది భూమిమీద ఉన్నవారందరికీ కనబడేదిగా ఉంటుంది. ఆ 24:28 ఈ వచనం రోమా సైనికులు యెరూషలేమును నాశనం చేసినపుడు విడిచిపెట్టిన గద్దలను సూచిస్తుందని కొందరు వ్యాఖ్యాతలు నమ్ముతారు, కానీ తీర్పు సమయంలో పక్షుల గుంపు శవాల మీదకు రావడాన్ని గురించి ఇది సూచిస్తుండవచ్చు. (ద్వితీ 28:26; యోబు 39:30; యెహె 39:17-20). 

24:29 యేసు మాటలు, యెషయా 13:10 లోని బబులోను పతనం, యెషయా 34:4 లోని ఎదోము, ఇతర జనులపై తీర్పు రెండింటినీ కలిపి ఊహిస్తున్నట్లుంది. పా.ని. నేపథ్యంలో, పదాలు రూపకాలంకారంలో ఉంటాయి. తన పరిపాలనను వ్యతిరేకించే దేశాలు, జనాంగాలపై తీర్పు, నాశనాలను సాదృశ్యరూపంలో చూపించే మాటలను యేసు ఉపయోగించి వుండొచ్చు.

24:30. మనుష్యకుమారుని సూచన అనేది యుద్ధ ప్రారంభాన్ని సూచించే సైన్య ధ్వజాలను పోలి, క్రీస్తుకు చెందినవారందరూ - ఆయన చుట్టూ సమకూడాలని పిలుపునిస్తుంది. (యెషయా 13:2-4). అలాంటి సూచన, మత్తయి 24:31లోని బూర పనికి సమాంతరంగా ఉంది. అయితే, యెషయా 11:10 మెస్సీయను సైన్య ధ్వజపు సాదృశ్యానికి సమాంతరంగా గుర్తించింది కాబట్టి, ఆయన ప్రత్యక్షం కావడం, ఆయన చెప్పిన సూచన కావచ్చు. వారు పొడిచిన (సిలువవేసిన) వానికొరకై యూదులు రొమ్ము కొట్టుకొందురు అనే మత్తయి 24:30, జెకర్యా 12:10-14ను సూచిస్తుండవచ్చు. మనుష్యకుమారుడు... మేఘారూఢుడై వచ్చుట అనేది దానియేలు 7:13ను సూచిస్తుండవచ్చు. అది భూమిపై నిత్యపాలన స్థాపించడానికి పరలోకంనుండి యేసు రాజుగా రాబోతున్నాడని గుర్తిస్తుంది.

24:31 ఈ వచనం ద్వితీ 30:4; యెషయా 27:13; జెకర్యా 2:6 లను జోడిస్తుంది. మనుష్యకుమారుడు ఏర్పరచబడిన వారిని, మృతులైన, సజీవులుగా ఉన్న తన అనుచరులను భూమిమీదనుండీ, పరలోకంనుండీ సమకూర్చుతాడు. ఆ దూతలు తన దూతలు ఎందుకంటే ఆయనకు వారిపై సంపూర్ణ అధికారం ఉంది (4:10-11 నోట్సు చూడండి). 

24:32-34 ఈ సంగతులన్నియు అనేమాటలు యేసు రాకడకు ముందు రాబోయే శ్రమలను సూచిస్తున్నాయి, ఆయన రాకడను కాదు. ఆయన సమీపముననే అంటే క్రీస్తు ఏ క్షణంలోనైనా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. ఈ సంఘటనలు జరిగిన వెంటనే ఆయన రావాలని ఏమీ లేదు. ఈ సంఘటనలన్నీ యేసు తరములోనే జరిగాయి, ముఖ్యంగా క్రీ.శ. 70లో యెరూషలేము పతనమైన పరిస్థితుల చుట్టూ ఇవి జరిగాయి. ఆ విధంగా, క్రీస్తు అనుచరులు ఆయన రాకడకోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇతరులు “ఈ తరము" అనే మాటలు, యుగాంతానికి ముందు చివరి శ్రమ కాలంలో జీవించివుండేవారిని సూచిస్తున్నాయని వ్యాఖ్యానిస్తారు. 

24:35 యేసు మాటలు, పా.ని. అంత నమ్మదగినవి, నిలిచివుండేవి (5:18). 

24:36-44 లోకంలో జరిగే సంఘటనలను దగ్గరనుండి గమనించినంత మాత్రాన, క్రీస్తు రాకడ సమయాన్ని మనం ముందుగా చెప్పలేము. దానిబదు లుగా యేసు అనుచరులు ఎల్లప్పుడూ సిద్ధపడి వున్న స్థితిలో జీవించాలి. ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును అనే మాటలను క్రీస్తు వచ్చినపుడు కొందరు ఆయన దగ్గరకు చేర్చబడతారు, మిగిలినవారు విడిచిపెట్టబడతారు అని వ్యాఖ్యానిస్తారు. ఇతరులు దీనిని, కొందరు తీర్పుకు తీసికొనిపోబడుదురు, ఇతరులు క్రీస్తుతో విడిచి పెట్టబడుదురు అని అర్థం చేసుకుంటారు. మనుష్య కుమారుడు గురించి 8:18-20 నోట్సు చూడండి...

24:45-51 క్రీస్తు రాకడకు ఆలస్యం చేస్తున్నాడని మనం తేలిగ్గా తీసుకుని, పాపజీవితాన్ని జీవించకూడదు. దానిబదులుగా, ప్రతిరోజూ ఆయన రాకడ రోజే అన్నట్లుగా జీవించాలి.

Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |