5:1-4 మాదిరియైన, బాధ్యతగల సేవకులుగా ఉండమని పేతురు పెద్దలను హెచ్చరిస్తున్నాడు. "పెద్దలు" అనే పదం సంఘంలోని నాయకుల కాపరి పదవిని సూచిస్తుంది. ఈ పదం ఇక్కడ "కాపరులు/పాస్టర్లు" అనే పదంతో మార్పు చేసుకునేలా, మరొకచోట "పై విచారణ" చేసేవారికి ఉపయోగించాడు (తీతు 1:5,7). ఇక్కడ పేతురు చెప్పేది, తాను కూడా తోటిపెద్ద, క్రీస్తు శ్రమలకు సాక్షిననే దానిని ఆధారం చేసికొని ఉంది. ఇది తాను మాట్లాడుతున్న పెద్దలతో తనను తాను గుర్తించుకోవడానికి అతనికి సహాయపడి, అతడు చెప్పేదానికి మరింత బలమిచ్చింది. వారిని దేవుని మందకు కాపరులుగా ఉండమని అతడు వారికి ఆజ్ఞాపించాడు. అంటే వారు దేవుని ప్రజలపై ప్రభువులైనట్టుండక వారిని పోషించి, నడిపించి సంరక్షించాలి. నమ్మకంగా సేవచేసిన పెద్దలు, భూమిమీద శ్రమలు పొందినప్పటికీ, ప్రధాన కాపరియైన క్రీస్తు నుండి పరలోకంలో మహిమను కూడా పొందుతారు. పెద్దలు | అధ్యక్షులు / కాపరులకు ఉండాల్సిన యోగ్యతలను గూర్చి పౌలు 1తిమోతి 3:1-7; తీతు 1:5-9లో వివరించాడు.
5:5-7 ఇక్కడ పెద్దలు అనే మాట, పదవిని కాక, వయసును సూచిస్తుండవచ్చు. విశ్వాసులందరూ దీనమనస్సును ఆచరిస్తూ, వారి ప్రతి చింత విషయంలో దేవునిలో నమ్మిక ఉంచాలని పేతురు వారికి జ్ఞాపకం చేశాడు. దీనత్వం మనకు దేవుని యెదుట, తోటి మనుష్యుల యెదుట ప్రశంసను తెస్తుంది. ఇది అహంకారానికి, అహంభావానికి వ్యతిరేక ఫలితం.
5:8-9 సాతాను మోసపూరిత తంత్రాల విషయంలో జాగ్రత్తపడి, వానిని స్థిరంగా ఎదిరించమని పేతురు విశ్వాసులను హెచ్చరించాడు. అలాంటి ప్రవర్తన ఈ లోకంలో తాత్కాలిక నివాసం ఉండేవారికి సరిపోయేది. ఇతర క్రైస్తవులు కూడా శ్రమపొందుతున్నారు. అనే సమాచారంతో పేతురు. తన పాఠకులను బలపరచాడు.
5:10-11 భూమి మీద ఉన్నప్పుడు తమ విశ్వాసం కోసం శ్రమలను సహించేవారిని దేవుడు పరలోకంలో ఘనపరచి బలపరచును.
5:12-14 సిల్వా ను (లేక “సీల", అపొ.కా.15:22-32; 16:19-40; 17:1-15; 18:5; 2 కొరింథీ 1:19; 1థెస్స 1:1; 2థెస్స 1:1) ఈ ఉత్తరం రాయడంలో అతనికి కార్యదర్శిగా పేతురుకు సహాయం చేసి వుండవచ్చు ( రోమా 16:22తో పోల్చండి), కానీ ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళినవాడిగా ఉండే అవకాశాలు ఎక్కువ. రోమాలో ఉన్న సంఘం నుండి, అంటే బబులోనులో... ఆమెయు అంటూ తన పాఠకులకు పేతురు శుభములు తెలియజేశాడు. మార్కు పేతురుకు విశ్వాసంలో కుమారుడు, అతనికి పుట్టిన కుమారుడు కాదు. ప్రేమగల ముద్దు మొదటి శతాబ్దపు సంఘంలో సాంప్రదాయికంగా శుభములు చెప్పే విధానం. విశ్వాసులకు క్రీస్తుతో ఉన్న సంబంధాన్ని బట్టి ఉన్న క్షేమము, ధన్యతకు రూపం సమాధానము. ఈ ఆశీర్వాదం పత్రికకు సరైనది. ఎందుకంటే భూమిమీద క్రైస్తవులు హింసింపబడుతున్నప్పటికీ వారిలోనుండి పరలోక సమాధానం ఎన్నటికీ తీసివేయబడదు.