Matthew - మత్తయి సువార్త 11 | View All

1. యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడనుండి వెళ్లిపోయెను.

2. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా?

3. అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను.
మలాకీ 3:1

4. యేసు వారిని చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి.

5. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
యెషయా 29:18, యెషయా 35:5-6, యెషయా 42:18, యెషయా 61:1

6. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను.

7. వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలు చున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?

8. సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా.

9. మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.

10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధ పరచును.
నిర్గమకాండము 23:20, మలాకీ 3:1

11. స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు.

12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.

13. యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుం డెను.

14. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
మలాకీ 4:5

15. వినుటకు చెవులుగలవాడు వినుగాక.

16. ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి

17. మీకు పిల్లనగ్రోవి ఊదితివిుగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు.

18. యోహాను తినకయు త్రాగకయువచ్చెను. గనుకవీడు దయ్యముపట్టిన వాడని వారనుచున్నారు.

19. మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.

20. పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను.

21. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు.
Ester 4 1, యెషయా 23:1-8, యోవేలు 3:4-8, ఆమోసు 1:9-10, యోనా 3:6, జెకర్యా 9:2-4

22. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
యెషయా 23:1-8, ఆమోసు 1:9-10, జెకర్యా 9:2-4

23. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
ఆదికాండము 19:24-28, యెషయా 14:13, యెషయా 14:15

24. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.

25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.

26. అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.

27. సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
సామెతలు 30:4

28. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
యిర్మియా 31:25

29. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
యిర్మియా 6:16

30. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.



బైబిల్ అధ్యయనం - Study Bible
11:1 యేసు... చాలించిన తర్వాత అనే మాటలు, గ్రంథ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైనవి. మత్తయి పరిచయంలోని “గ్రంథ నిర్మాణం" చూడండి. మండలం 

11:2-3 బాప్తిస్మమిచ్చే యోహాను ఇంతకు ముందు యేసే క్రీస్తు అనే విశ్వాసాన్ని వెలిబుచ్చాడు (3:14; యోహాను 2:29-37; 3:22-30). తాను చెరసాలలో ఎక్కువకాలం ఉండడం, “అగ్ని బాప్తిస్మం" ఇంకా జరగకపోవడం అనే నిరుత్సాహం ఇక్కడ యోహాను సందేహాలకు కారణం కావచ్చు (మత్తయి 3:11,12). యెషయా 61:1-3లో చెప్పబడిన ఆత్మాభిషిక్తుడు తానేనని యేసు గుర్తించుకున్నాడు. కానీ యెషయా 61:1లో, అభిషేకించబడినవాడు “చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి” ప్రకటించాలి. యోహాను బహుశా ఆ ప్రవచనాన్ని అక్షరార్థంగా వ్యాఖ్యానించుకొని చెరసాల నుండి అద్భుతమైన రీతిలో విడుదలను పొరపాటుగా ఆశించి వుండవచ్చు. 

11:4-5 తన అద్భుతకార్యాలు, కృపాకార్యములను బట్టి యేసు తానే క్రీస్తునని నిర్ధారించాడు (యెషయా 29:18-19; 35:5-6; 61:1). 

11:6 తన విషయమై అభ్యంతరపడకుండా, శ్రమపడడానికి ఇష్టపడేవారిపై యేసు ఆశీర్వాదాలను ప్రకటించాడు. అలా, శ్రమ పొందుతున్నప్పటికీ విశ్వాసంతో సహిస్తున్న వారికి యోహాను ఒక మాదిరిగా ఉన్నాడు.

11:7 గాలికి కదలుచున్న రెల్లు అనేది సరియైన ఒప్పింపులేక ప్రజల అభిప్రాయాన్ని బట్టి (1రాజులు 14:15; 2రాజులు 18:21) సులువుగా ఊగిసలాడేవానికి సాదృశ్యం. 

11:8-9 అబద్ద ప్రవక్తలకు భిన్నంగా తనకోసం అనుకూల ప్రవచనాలు చెప్పాలని ప్రవక్తలను కొనుక్కునే రాజుకు యోహాను లొంగలేదు (1రాజులు 22:13-28). 

11:10 బాప్తిస్మమిచ్చే యోహాను పరిచర్యను గూర్చి లేఖనాల్లో ముందుగానే చెప్పబడింది. 3:3 నోట్సు చూడండి.

11:11 యేసు మరణ, పునరుత్థానాల ద్వారా, ఆయన పాలన స్థాపించబడ డానికి ముందే, యోహాను చెరలో పెట్టబడి, చంపబడ్డాడు (అపొ.కా. 2:32-36; రోమా 1:2-7). ఆ విధంగా, ప్రస్తుతం క్రీస్తు పాలనలో సంతోషిస్తున్న శిష్యులు, యోహాను ఆశించి అనుభవించ లేకపోయిన ఆశీర్వాదాలలో సంతోషిస్తారు (మత్తయి 13:17). 1 పేతురు 1:10-12లో పా.ని. ప్రవక్తల వర్ణన, యోహాను అనుభవాన్ని సరిగ్గా చూపిస్తుంది. వీరు మెస్సీయ శ్రమలు, దాని వెంబడి వచ్చిన మహిమలను చూచేటంతవరకు జీవించలేదు.

11:12 యోహాను బంధింపబడి, చెరసాలలో ఉంచబడి, చివరికి చంప బడడం, యూదానాయకులు యేసును హింసాత్మకంగా వ్యతిరేకించడం, ఇవన్నీ పరలోకరాజ్యము బయల్పరచబడకుండా దాన్ని స్వాధీనం చేసుకుని పట్టుకోవడానికే జరిగాయి. యిప్పటివరకు అనే మాటలు, దేవునిరాజ్యము దాన్ని అడ్డుకుంటున్న వారి పట్టులోనుండి ఏదో ఒకరోజున స్వేచ్ఛను పొందుతుందని సూచిస్తుంది (వ. 13-15 నోట్సు చూడండి). 

11:13-15 దుష్టులకు దైవిక తీర్పును, దేవుని ప్రజలకు స్వస్థత సంతోషాన్ని కలుగజేసే ప్రభువుదినం రావడానికి ముందు ఏలీయా వస్తాడని మలాకీ 4:5 వాగ్దానం చేస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను ఈ పాత్రను నెరవేర్చాడని, అతని పరిచర్య ప్రభువుదినం ఆరంభమైనదని సూచిస్తుందని యేసు వివరించాడు. ప్రభువు దినమున దేవుని ప్రజల “పాదముల కింద దుర్మార్గులు ధూళివలె ఉందురు, మీరు వారిని అణగదొక్కుదురు” అని మలాకీ 4:3లో వాగ్దానం చేసాడు. దేవుని రాజ్యాన్ని హింసాత్మకంగా అణచివేసే సమయం త్వరలో ముగిసిపోతుందని ఇది సూచిస్తుంది (మత్తయి 11:12 నోట్సు చూడండి).

11:16-19 అవిశ్వాసులైన తన సమకాలికులను, తమ... ఇష్ట ప్రకారం జరగనప్పుడు అలిగి కూర్చునే గారాల పిల్లలుగా యేసు చిత్రించాడు. “సైమన్ చెప్పినట్లు” అనే ఒక ఆట ప్రాచీనరూపంలో, ఒక పిల్లాడు పిల్లనగ్రోవి ఊదుతున్నట్లు నటిస్తే, మిగతా పిల్లలు నాట్యమాడాలి. వాడు ప్రలాపించినట్లైతే
మిగతా పిల్లలు రొమ్ముకొట్టుకోవాలి.. అయితే ఏమాత్రం స్పందించని పిల్లల్లాగా, ఇశ్రాయేలీయులు బాప్తిస్మమిచ్చే యోహాను, యేసుల పరిచర్యలను ఏమాత్రం పట్టించుకోలేదు. జ్ఞానము చేసే క్రియలు పేర్కొనడం, మెస్సీయ క్రియలకు సమాంతరంగా ఉన్నాయి (వ.2), వ.4-6లో వర్ణించిన క్రియలను బట్టి యేసు చెప్పిన విషయాలు నిరూపించబడ్డాయని సూచిస్తున్నాయి. పా.ని. కాలానికి కొ.ని. కాలానికి మధ్య, యూదా వ్యాఖ్యాతలు సామె 8:32-36ను విస్తరింపజేసి, జ్ఞానము అనేది, లోకమును సృష్టించినపుడు దేవుని ప్రతినిధిగా పనిచేసిన ఒక నిత్యమైన వ్యక్తి అని నేర్పించారు. తానే ఆ జ్ఞానముగా వచ్చానని ప్రకటించిన యేసు, తండ్రి సమస్తమును ఏ నిత్యమైన వ్యక్తి ద్వారా సృష్టించాడో, అది తానేనని సూచన ఇచ్చాడు (యోహాను 1:3). 

11:20-24 సువార్తలు యేసు జీవితాన్నంతటినీ పూర్తిగా నమోదు చేయలేదని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. యేసు కొరాజీను... బేత్సయిదా... కపెర్నహోములలో అధికశాతం అద్భుతములు చేశాడు. అయినప్పటికీ కొరాజీనులో ఆయన చేసిన అద్భుతాలను సువార్తలు గ్రంథస్థం
(మార్కు 6:45; 8:22; లూకా 9:10), తక్కువ ప్రత్యక్షత వచ్చినవారిపై, వారి పాపానికైన దేవుని తీర్పు ఓర్వతగినదై ఉంటుంది. మరోవైపు, ఎక్కువ ప్రత్యక్షత
తీర్పు వస్తుంది. తూరు, సీదోనులను గురించి 15:21 నోట్సు చూడండి. సొదొమ గురించి ఆది 19:1-29 చూడండి. 

11:25-26 తాము సొంతగా నేర్చుకున్న దానిని అధికంగా ప్రేమించి, దేవుడు చెప్పే దానిని విశ్వసించనివారికి దేవుడు సత్యాన్ని మరుగుచేస్తాడు. 

11:27 యోహాను సువార్తలో తనకు ఆపాదించబడిన విషయాలను పోలినవి యేసు చెప్పాడు (యోహాను 7:29; 10:14-15; 17:25). యేసు రూపాన్ని గూర్చి యోహాను, సమదృక్పథ సువార్తీకులు గణనీయంగా ఎంతగా ఏకీభవించారో ఇది మనకు చూపుతుంది.

11:28-30 యేసు మాటలు, క్రీస్తుపూర్వం అనేక వందల సంవత్సరాల క్రితం, యూదుల లేఖనాలలో వ్యక్తిగా చూపబడిన జ్ఞానము చెప్పిన వ్యాఖ్యలను జ్ఞాపకం చేస్తాయి. మత్తయి 11:19తో కలిపి చూసినప్పుడు, యేసు తనను తాను, నిత్యం ఉనికి కలిగి, దేవుడైన యెహోవా పక్షంగా లోకాన్ని సృజించిన శరీరధారియైన జ్ఞానముగా చిత్రీకరించుకున్నాడని ఇది సూచిస్తుంది. (1కొరింథీ 1:24; మత్తయి 11:16-19 నోట్సు చూడండి). యేసు బోధ బరువైన, అణచివేసే రబ్బీల బోధకు భిన్నంగా (23:4; అపొ.కా. 15:10) సులువైన కాడిగా ఉంది. 


Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |