Isaiah - యెషయా 9 | View All

1. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.
మత్తయి 4:15-16

2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును.
లూకా 1:79, 2 కోరింథీయులకు 4:6, 1 పేతురు 2:9, మత్తయి 4:15-16

3. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.

4. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.

5. యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును.

6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
యోహాను 1:45, ఎఫెసీయులకు 2:14

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
లూకా 1:32, యోహాను 12:34

8. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది.

9. అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజల కందరికి తెలియవలసియున్నది.

10. వారుఇటికలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టుదము రండి; రావికఱ్ణతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు.

11. యెహోవా వానిమీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు.

12. తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరు తెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు.ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

13. అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు.

14. కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును.

15. పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.

16. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారిచేత మింగివేయబడు దురు.

17. వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి ¸యౌవనస్థులను చూచి సంతోషింపడు వారిలో తలిదండ్రులు లేనివారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

18. భక్తిహీనత అగ్నివలె మండుచున్నది అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును.

19. సైన్యముల కధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను. జనులును అగ్నికి కట్టెలవలె నున్నారు వారిలో ఒకనినొకడు కరుణింపడు.

20. కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు; ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకను తృప్తిపొందక యుందురు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును

21. మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను భక్షించును వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.



బైబిల్ అధ్యయనం - Study Bible
9:1 జెబూలూను... నఫాలి గోత్రాలు ఉత్తర రాజ్యంలోనివి. క్రీ.పూ. 733లో తిగతి లేరు ఆధ్వర్యంలో ఈ రెండు గోత్రాల మీద గట్టి దాడి జరిగింది. అదే సమయంలో అష్వూరు ఉత్తర రాజ్యంలోని భూభాగాన్ని కుదించడంతో బాటు, మరో మూడు క్రొత్త ప్రాంతాల్ని ఉత్తర రాజ్యంలోకి చేర్చింది. ఇవి మగిద్దు (గలిలయ), దూరు (సముద్ర ప్రాంతము), గల్-అజ (యొర్దాను అద్దరి). 

9:2 దేశం మీదకు అషూరు దాడి గొప్ప వినాశనాన్ని (చీకటి) తెచ్చింది. అయితే ప్రజలకు నిరీక్షణాస్పదమైనది ఒకటుంది (వెలుగు ప్రకాశించును). ఈ వచనంలోని క్రియాపదాలు ప్రవచనాత్మకంగా “అద్యతన భూతకాలీనం" లో ఉన్నాయి, అంటే ప్రవచనంలోని సంఘటనలు రాబోయే కాలంలో జరగబోయేవేయైనా అవి అప్పటికే జరిగిపోయినట్టుగా వర్ణించడమని అర్థం. మత్తయి 4:15-16 వచనాల్లో యేసు పరిచర్యను వర్ణించడానికి యెషయా 9:1-2 వచనాలు ఉటంకించబడ్డాయి. 

9:3 ప్రవచించబడిన సంఘటనలు ప్రజలకు గొప్ప ఆనందాన్నిస్తాయి. అది సమృద్ధిగా పంట పండినప్పుడు, దోపుడుసొమ్ము దొరికినప్పుడు కలిగే సంతోషంలాగా ఉంటుంది. 

9:4 ఈ ప్రకటన తెలియజేసే విమోచన అసాధ్యమన్నట్టుగా కనబడుతుంది, ఎందుకంటే అషూరు ప్రపంచాధిపత్యం గల దేశం. పైగా దేవుని ప్రజలు అల్పసంఖ్యాకులు, అణచివేతకు గురైనవారు. ఈ ప్రకారంగా, విద్యాను దినమున అనే పదజాలం న్యాయాధిపతులు 6-7 అధ్యాయాల్లో గిద్యోను
యుద్ధవీరుల సంఖ్య అల్పమైనా, దేవుని అధికశక్తితో తమను అణగదొక్కుతున్న మిద్యానీయుల్ని ఓడించి వారిని దేశంనుండి తరిమికొట్టిన సంఘటనల్ని సూచిస్తుంది. 

9:5 గ్యారీ స్మిత్ వివరణ: “రక్తంతో తడిచిన శత్రు సైనికుల వస్త్రాల్ని, జోళ్ళను కాల్చివేయడం... కొల్లసొత్తు దేవునికి ప్రతిష్ఠించి, శత్రువుల యుద్ద సాధనాలను అగ్నికి ఆహుతి చేసినట్టి పవిత్ర యుద్ధంలో విజయాన్ని సూచిస్తుంది” (యెహో 11:6,9; యెహె 39:9 లతో పోల్చండి). 

9:6-7 యెషయా గ్రంథంలోని ఈ విభాగంలో ఇప్పటికే రెండుసార్లు పిల్లల పుట్టుకకు ప్రవచనాత్మక ప్రాముఖ్యత కనబడుతుంది (7:14; 8:1-4). మూడవసారి, పాఠకులు భవిష్యకాలంలోని శిశువు పుట్టుక గురించి తెలుసుకుంటారు. ఈ వాక్యభాగం భవిష్యకాలంలో రాజవంశంలో పుట్టబోయే శిశువు శరీరరీత్యా దావీదు వంశంలో జన్మించనున్నాడనీ, అతడు రాజుగా ప్రకటించబడి దేవుని ప్రజల్ని నూతనమైన స్వేచ్ఛలోకీ సమృద్ధిలోకీ నడిపిస్తాడనీ కొంతమంది వ్యాఖ్యానకారుల వివరణ. ఈ శిశువు హిజ్కియా అనీ, యోషీయా అనీ గుర్తించినప్పటికీ, ఈ శిశువుకు ఉన్న నామాలు, ఆయన రాజ్యం గురించిన వర్ణన హిజ్కియాకు, యోషీయాకు మించినవి. ఈ శిశువు మెస్సీయ అనేది ఒకే ఒక సాధ్యమైన వివరణ. శిశువుకివ్వబడిన నామాలు శిశువు గుణలక్షణాల్ని వర్ణిస్తున్నాయి. అనూహ్యమైన, అపరిమితమైన జ్ఞానం (ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త), శాశ్వతమైన జీవం (నిత్యుడగు తండ్రి), సమాధానం (సమాధానకర్తయగు అధిపతి) ఈ రాజులో ఉంటాయి. అన్నిటికంటె అసాధారణమైన విషయం, హిజ్కియాతో యోషీయాతో ముడి పెట్టలేని విషయం ఆయన బలవంతుడైన దేవుడు (8:21 తో పోల్చండి). కొత్త నిబంధనలో యేసు దావీదు వంశంలో పుట్టినవానిగా, ఈ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చినవానిగా కనబడుతున్నాడు (మత్తయి 1:1,22-23).

9:8-10 దేవుని ప్రజల్లోని ముఖ్యమైన పాపం గర్వం, అతిశయం (అతిశయపడి గర్వముతో). వీటి గురించి ఇక్కడ మళ్లీ చెప్పబడింది. తాము బ్రతకడానికి, బాగుపడి వర్థిల్లడానికి తమకు దేవుడు అవసరం లేదని వారనుకున్నారు. తిర్లత్పిలేసేరు చేతుల్లో ఘోరమైన నాశనం అనుభవించినప్పటికీ ఇంకా వారు గర్వంతో అతిశయించడం జరిగింది. ఇంకా వారు మూర్ఖంగా తమను తాము పునర్నిర్మించుకొనగలమని, తమకున్న స్వంత వనరులతో తమ స్వంత బలముతో తమను తాము వృద్ధిచేసుకొనగలమని చెబుతున్నారు (ఇటీకలతో కట్టినదానికి బదులుగా చెక్కిన రాళ్లతో కట్టుదము... రావికజ్జతో కట్టినదానికి బదులుగా దేవదారు కట్టను వేయుదము). 

9:11 రెజీను సిరియా (అరాము) రాజు. అతనికి విరోధులైనవారు అషూరీయులు, అష్పూరు సామంతులు. 

9:12 ఈశాన్యంలో సిరియా (దీని రాజైన రెజీను ఇశ్రాయేలుతో పొత్తులో ఉన్నా, తన స్వప్రయోజనాల కోసం ఇశ్రాయేలును వాడుకొనే అవకాశం కోసం చూస్తున్నాడు), పడమరలో ఫిలిపీయులును ఇశ్రాయేలు చుట్టూ ఉన్నారు. ఈ వచనంలోని చివరి రెండు భాగాలు వ.17,21 లోను, 10:4 లోను పునరావృతం కావడం గమనార్హం.

9:13 దేవుడు తన ప్రజల్ని శిక్షించడం చెడుత్రోవల నుండి వారిని తప్పించి తన మార్గంలోకి వారిని తిరిగి చేర్చుకోడానికే, అయితే వారిలోని మందబుద్ది, వివేకశూన్యత వారిని దేవునికి స్పందించనివ్వడం లేదు. 

9:14 ఉత్తర రాజ్యం మీద అషూరు దాడి తర్వాత కూడా (క్రీ.పూ. 733), ఇశ్రాయేలు పాపపుమార్గాల్లోనే కొన సాగింది. దేవుడు ఇశ్రాయేలు మీదకు ఇంకా వినాశకరమైన తీర్పును రప్పించాడు (క్రీ.పూ.722). ఒక దేశంగా ఇశ్రాయేలు స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది. తలను తోకను తాటికమ్మను రెల్లును అనే పదజాలం దేశం పూర్తిగా పరాధీనమైందని తెలియజేస్తుంది (19:15).

9:15-16 ప్రజలు తప్పుమార్గాల్లో నడవడానికి ముఖ్యంగా బాధ్యత వహించవలసినవారు వారిని పరిపాలించే పెద్దలును ఘనులును... ప్రవక్తలైన నాయకులు. 

9:17 ఇశ్రాయేలు సమాజంలోని మతభ్రష్టత, నైతికపతనం ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ఘనులు, సామాన్యులు అందరూ దోషులే. 

9:18-19 దుష్టత్వానికి సహజపరిణామం వినాశనమే (భక్తిహీనత అగ్నివలె మండుచున్నది), దానితోబాటు సైన్యముల కధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను. పాపం మానవసంబంధాల్ని, చివరికి సహోదర ప్రేమను సైతం, భగ్నం చేస్తుంది. 

9:20 ప్రజల్లోని దురాశ, వారి స్వార్థం వారు తమకు కనబడిన వాటినన్నిటినీ కనబడిన వారినందరినీ భక్షించేలా చేశాయి. 

9:21 మనషే, ఎఫ్రాయిము గోత్రాలు ఉత్తర ప్రాంతంలోని పెద్ద గోత్రాలు. ఈ గోత్రాల మూలపురుషులైన మనషే ఎఫ్రాయిములు సోదరులు. వీరు యోసేపు కుమారులు (ఆది 41:50-52; 48:5). ఇప్పుడు ఈ గోత్రాలవారు ఒకరికొకరు విరోధులయ్యారు, సోదరులమనే విషయాన్ని సైతం మర్చిపోయి ఒకరిపట్ల ఒకరు దయలేనివారై ఒకరినొకరు భక్షించుకొనేవారయ్యారు (వ.19). ఈ రెండు గోత్రాలూ ఏకమై యూదా మీద పడుతున్నారు. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |