Chronicles II - 2 దినవృత్తాంతములు 4 | View All

1. అతడు ఇరువది మూరలు పొడవును ఇరువది మూరలు వెడల్పును పది మూరలు ఎత్తునుగల యొక యిత్తడి బలిపీఠ మును చేయించెను.

2. పోతపోసిన సముద్రపు తొట్టియొకటి చేయించెను, అది యీ యంచుకు ఆ యంచుకు పది మూరల యెడము గలది; దానియెత్తు అయిదు మూరలు, దాని కైవారము ముప్పదిమూరలు,

3. దాని క్రిందితట్టున ఎద్దులు రూపింపబడియుండెను, అవి ఒక్కొక్క మూరకు పదేసియుండెను, అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను; ఎద్దులు రెండు వరుసలు తీరి యుండెను, అవి తొట్టితోకూడనే పోతపోయబడెను.

4. అది పండ్రెండు ఎద్దులమీద నిలువబడెను, మూడు ఎద్దులు ఉత్తరపుతట్టు మూడు పడమటితట్టు మూడు దక్షిణపుతట్టు మూడు తూర్పుతట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచ బడెను, వాటి వెనుకటి పార్శ్వములన్నియు లోపలికి తిరిగి యుండెను.

5. అది బెత్తెడు దళముగలది, దాని అంచు గిన్నెయంచువంటిదై తామర పుష్పములు తేల్చబడియుండెను; అది ముప్పది పుట్ల నీళ్లు పట్టును.

6. మరియు దహనబలులుగా అర్పించువాటిని కడుగుటకై కుడి తట్టుకు అయిదును ఎడమ తట్టుకు అయిదును పది స్నానపు గంగాళములను చేయించెను; సముద్రమువంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు.

7. మరియు వాటిని గూర్చిన విధి ననుసరించి పది బంగారపు దీపస్తంభములను చేయించి, దేవాలయమందు కుడి తట్టున అయిదును ఎడమ తట్టున అయిదును ఉంచెను.

8. పది బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టున అయిదును ఎడమ తట్టున అయిదును ఉంచెను; నూరు బంగారపు తొట్లను చేయించెను.

9. అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను.

10. సముద్రపు తొట్టిని తూర్పుతట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను.

11. హూరాము పాత్రలను బూడిదె నెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను; రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము దేవుని మందిరమునకు చేయ వలసిన పనియంతయు హూరాము సమాప్తిచేసెను.

12. దాని వివరమేమనగా, రెండు స్తంభములు, వాటి పళ్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పళ్లెములు, ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పుట కైన రెండు అల్లికలు,

13. ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు.

14. మట్లు, మట్లమీదనుండు తొట్లు,

15. సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు,

16. పాత్రలు, బూడిదె నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణ ములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను.

17. యొర్దాను మైదానమందు సుక్కో తునకును జెరేదాతాకును మధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోత పోయించెను.

18. ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను.

19. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటిని బంగారపు పీఠమును సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను,

20. వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,

21. పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.

22. మరియు మందిరద్వారము లోపలి తలుపులును అతి పరిశుద్ధ స్థలముయొక్క లోపలి తలుపులును దేవాలయపు తలుపులును అన్నియు బంగార ముతో చేయబడెను.



బైబిల్ అధ్యయనం - Study Bible
4:1 మందిర ప్రాంగణంలో సొలొమోను ఏర్పాటు చేసిన వివిధ ఉపకరణాలు కట్టడానికి వెలుపలి ఆవరణలో ఉన్నాయి. వీటిలో ఇత్తడి బలిపీఠము అత్యంత ప్రాముఖ్యమైనది. ముప్పది అడుగుల (ఇరువది మూరలు) పొడవు, ముప్పది అడుగుల (ఇరువది మూరలు) వెడల్పుతో ఇది అతి పరిశుద్ధ స్థలం కొలతలకు సమానంగా ఉంది. దాని ఎత్తు పదిహేను అడుగులు. (పది మూరలు) ఉన్నందున దానికి చాలా మెట్లు ఉన్నాయి. బల్యర్పణలు చెల్లించడానికి యాజకులు దాని పైకి ఎక్కివెళ్ళేవారు.

4:2-4 సముద్రపు తొట్టి వ్యాసం బలిపీఠం వెడల్పులో సగం. తమ విధులను నిర్వర్తించడానికి ముందు చేతులు, యాజకులు ఇక్కడే కాళ్ళు, చేతులు శుభ్రపరచుకునేవారు. (నిర్గమ 30:18-21). ఈ పెద్ద తొట్టి ఏడున్నర అడుగుల (ఐదు మూరలు) ఎత్తులో ఉంది. కాబట్టి నీటిని వాడుకోడానికి యాజకులకు సుళువుగా ఉండేందుకు దీని చుట్టూ మెట్లు ఉండి ఉంటాయి. బహుశా పండ్రెండు ఎద్దుల అలంకరణ ఈ మెట్ల కోసం ఏర్పాటు చేసినదే అయివుంటుంది.

4:5 పెద్ద తొట్టి అంచు కాల్చి వంచినదై ఉంటుంది.

4:6 సముద్రము వంటి తొట్టి యాజకులకు మాత్రమే కేటాయించారు, అయితే బల్యర్పణ పశువులను కడగడానికి పది చిన్న స్నానపు గంగాళములను ఏర్పాటు చేశారు. 

4:7-8 నూరు బంగారపు తొట్లు బహుశ ధూపద్రవ్యాలు, బొగ్గులు నిలవచేయడానికి ఉద్దేశించినవై ఉండవచ్చు.

4:9-10 ఇక్కడ ఉన్న అనేక వివరాలు బహుశ వెలుపల ప్రాంగణంలో ఉన్నవాటికి చెందినవై ఉంటాయి. వాటిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఇవి బహుశా యాజకులకు, సామగ్రి నిల్వచేసుకోడానికి ఏర్పరచిన వసతులై ఉంటాయి. 

4:11 చివరకు ప్రధాన శిల్పకారుడైన హూరాము పేరు ఇక్కడ కనబడుతుంది. నిజానికి అతడు కళాకృతులకు, అలంకరణలకు పర్యవేక్షకునిగా ఉన్నాడు (2:13-14). అయితే నిత్యం బలిపీఠం వద్ద ఉపయోగించే పాత్రలను, బూడిదనెత్తు చిప్పకోలలను, తొట్ల వంటి చిన్నచిన్న వస్తువులు చేయడంలో అతడు తన ప్రతిభ కనపరచాడు. ఈ పనులు పూర్తిచేసి, ఎందుకోసమైతే తనను నియమించారో ఆ పని హూరాము సంపూర్తి చేశాడు. 

4:12-16 హూరాము (హూరామబి) తయారుచేసిన ఈ వస్తువుల జాబితా ఇప్పటికే పేర్కొన్న వస్తువులను పునశ్చరణగా మరలా తెలియజేస్తుంది. అయితే ఈసారి వాటిని తయారుచేసిన ఖ్యాతి అతనికి లభించింది. 

4:17-18 ఇత్తడితో వస్తువులను తయారుచేసే సాంకేతికతలో, మట్టి అచ్చులు తయారు చేయడం, తరువాత ద్రవరూపంలోనికి కరిగించిన లోహంతో ఆ అచ్చులలో పోత పోయడం, లోహం చల్లబడిన తరువాత మట్టిని తొలగించడం వంటి ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రక్రియకు పుష్కలమైన నీరు అవసరం. అందుచేత నీరు సమృద్ధిగా లేని ప్రదేశంలో, అంటే నిర్మాణం జరుగుతున్న స్థలంలో ఈ ఆకృతులు తయారు చేయడం కన్నా వాటిని యొర్దాను నది ప్రక్కన తయారుచేసి యెరూషలేముకు రవాణా చేయడం చాలా సులభం.

4:19-22 మందిరం లోపల భాగంలో అలంకరణలు కూడా చాలా వరకు బంగారంతో తయారు చేశారు. ఈ బంగారపు పీఠము జంతువుల బల్యర్పణలు చెల్లించడానికి కాదు గానీ రోజుకు రెండుసార్లు ధూపం వేయడానికి ఉద్దేశించబడింది. అతి పరిశుద్ధ స్థలానికి ముందు తెర ఉన్నప్పటికీ, దాని ముందు, ఇంకా అసలు మందిరపు ప్రవేశ ద్వారానికి ముందు బంగారు తలుపులు ఉన్నాయి.


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |