కీర్తన-128. ఈ కీర్తనను 127వ కీర్తనకు కొనసాగింపుగా పరిగణించవచ్చు. ఇది కుటుంబ వారసుల ప్రాముఖ్యతను నొక్కిచెప్పే కీర్తన. 16 శీర్షిక: యాత్రకీర్తన గురించి, కీర్తన 120 శీర్షిక నోట్సు చూడండి.
128:3 ఆది 49:22 లో యోసేపు గురించి ఫలించెడి కొమ్మ అనే వర్ణన ఉన్నట్లే, పిల్లలు అనే దీవెన ఉన్న భార్య వలన కుటుంబం విస్తరిస్తుంది. ఒలీవ మొక్క జీవసామర్థ్యానికి, అధికబలానికి, ఉత్పాదకశక్తికి, దీర్ఘాయుషుకు ప్రసిద్ధి చెందింది.
128:5-6 ప్రాచీన పశ్చిమాసియాలో భౌతిక దీవెన అంటే దేశం క్షేమముగా ఉండడం, దేశప్రజలు దీర్ఘాయువును, ఆరోగ్యవంతులైన పిల్లలను, పిల్లల పిల్లలను, సమాధానమును కలిగి ఉండడం.