Proverbs - సామెతలు 20 | View All

1. ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.

మత్తు పానీయాలను మితం లేకుండా పుచ్చుకోవడం గురించి బైబిల్లో తరచుగా రాసి ఉండడం చూస్తాం. ఇది కీడుకూ శిక్షకూ దారి తీస్తుంది (సామెతలు 23:20-21, సామెతలు 23:29-30; సామెతలు 31:4-5; ఆదికాండము 9:1; కీర్తనల గ్రంథము 69:12; యెషయా 28:7; హబక్కూకు 2:5; రోమీయులకు 13:13; 1 కోరింథీయులకు 5:11; 1 కోరింథీయులకు 6:10; గలతియులకు 5:21; ఎఫెసీయులకు 5:18). వాటిని అసలు ముట్టుకోకపోవడం ఉత్తమం.

2. రాజువలని భయము సింహగర్జనవంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు

3. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.

4. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

5. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.

6. దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తట స్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?

కీర్తనల గ్రంథము 12:1; ప్రసంగి 7:28-29; మీకా 7:2. శాశ్వతమైన విశ్వసనీయత గల వాడొకడున్నాడు. ద్వితీయోపదేశకాండము 7:9; కీర్తనల గ్రంథము 36:5; కీర్తనల గ్రంథము 89:1; కీర్తనల గ్రంథము 92:2; యెషయా 11:50; యెషయా 25:1; విలాపవాక్యములు 3:23; 1 కోరింథీయులకు 1:9; 1 కోరింథీయులకు 10:13; 1 థెస్సలొనీకయులకు 5:24; 2 థెస్సలొనీకయులకు 3:3; హెబ్రీయులకు 2:17; 1 పేతురు 4:19; 1 యోహాను 1:9; ప్రకటన గ్రంథం 19:11. దేవుడు తన ప్రజలను నమ్మకస్థులుగా చెయ్యగల సమర్థుడు, చేస్తాడు కూడా – సంఖ్యాకాండము 12:7; నెహెమ్యా 7:2; మత్తయి 25:21; లూకా 16:10; 1 కోరింథీయులకు 4:2; 1 కోరింథీయులకు 7:25; ఎఫెసీయులకు 1:1; కొలొస్సయులకు 1:2, కొలొస్సయులకు 1:7; 1 తిమోతికి 1:12; 2 తిమోతికి 2:2; ప్రకటన గ్రంథం 2:10; ప్రకటన గ్రంథం 17:14.

7. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.

8. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.

9. నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?

ఈ భూమిపై అన్ని కాలాల్లోనూ జీవించిన వారందరిలోకీ నిజంగా ఈ విధంగా చెప్పగలిగినవాడు యేసుప్రభువు ఒక్కడే (యోహాను 8:46; 2 కోరింథీయులకు 5:21; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26; 1 పేతురు 2:22, 1 పేతురు 2:24; 1 యోహాను 3:5). మిగిలిన మనమంతా భ్రష్ట స్వభావంతో జన్మించి పాపాలు చేశాం (యోబు 14:4; కీర్తనల గ్రంథము 14:2-3; కీర్తనల గ్రంథము 51:5; రోమీయులకు 3:9, రోమీయులకు 3:23). అయితే దేవుడు మన పాపాలను కడిగివేసి మనలను పవిత్రులుగా చెయ్యగలడు (కీర్తనల గ్రంథము 51:2, కీర్తనల గ్రంథము 51:7, కీర్తనల గ్రంథము 51:10; యెషయా 1:18; జెకర్యా 13:1; తీతుకు 2:11-14; హెబ్రీయులకు 9:14; 1 యోహాను 1:9). 7వ వచనంలో చెప్పిన మచ్చలేని జీవనం సాగించేలా చెయ్యగలడు. 14,15 కీర్తనలు దగ్గర నోట్స్ చూడండి.

10. వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.

11. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.

12. వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.

13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండినయెడల ఆహారము తిని తృప్తి పొందుదువు.

14. కొనువాడుజబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును.

15. బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.

16. అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చు కొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము

17. మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.

పాప సంబంధమైన విలాసాలు తాత్కాలికమే.

18. ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.

19. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.

20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.

21. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.

లూకా 15:11-16 పోల్చి చూడండి.

22. కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.
1 థెస్సలొనీకయులకు 5:15

23. వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు.

వ 10.

24. ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?

సామెతలు 16:9; సామెతలు 21:1; యిర్మియా 10:23. దేవుని మార్గాలు మనకు అగమ్యగోచరాలు. మానవ జీవితాన్ని కూడా ఆయన అలాగే చేస్తాడు. ఏ మనిషీ అసలు తానెవరో, తాను చేసే పనులు ఎందుకు చేస్తాడో, తన జీవితానికి అర్థమేమిటో, అదంతా దేవుని సంకల్పాలతో ఎలా ముడిపడి ఉందో పూర్తిగా గ్రహించడం లేదు.

25. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును.

26. జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.

కీర్తన 101 నోట్స్.

27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.
1 కోరింథీయులకు 2:11

1 కోరింథీయులకు 2:11. మనిషిలోని ఆత్మ దేవుని దీపంలాంటిది. ఆయన మనుషుల్ని పరిశోధించడానికి, వారు తమలో జరుగుతున్న వాటిని గుర్తించేలా చేయడానికీ దాన్ని ఉపయోగిస్తాడు.

28. కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు కొనును.

29. ¸యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము

30. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును.

ఇంత మంచి ఫలితాలను ఇచ్చే దెబ్బలన్నిటికీ స్వాగతం! – కీర్తనల గ్రంథము 141:5; కీర్తనల గ్రంథము 66:10-12.Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |