Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము.దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను
1. ee maaṭa aalakin̄chi nee mēlukoraku telisikonumu.daaniki yōbu iṭlani pratyuttharamicchenu
2. నా దుఃఖము చక్కగా తూచబడును గాకదాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులోపెట్టబడును గాక.
2. naa duḥkhamu chakkagaa thoochabaḍunu gaakadaani sarichoochuṭakai naaku vachina aapada traasulōpeṭṭabaḍunu gaaka.
3. ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.
3. aalaaguna chesinayeḍala naa vipatthu samudramula isukakanna baruvugaa kanabaḍunu. Anduvalana nēnu nirarthakamaina maaṭalu palikithini.
4. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెనువాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నదిదేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.
4. sarvashakthuḍagu dhevuni ambulu naalō cocchenuvaaṭi vishamunu naa aatma paanamucheyuchunnadhidhevuni bheekarakaaryamulu naathoo yuddhamu cheyuṭakai paṅkthulu theeruchunnavi.
5. అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా?
5. aḍavigaaḍida gaḍḍi chuchi ōṇḍra peṭṭunaa?Eddu mētha chuchi raṅkevēyunaa?
6. ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?
6. uppulēka yevaraina ruchilēnidaani thinduraa? Gruḍḍulōni telupulō ruchikaladaa?
7. నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.
7. nēnu muṭṭanollani vasthuvulu naaku hēyamulainanu aviyē naaku bhōjanapadaarthamulaayenu.
8. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాకనేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక
8. aahaa naa vinnapamu naaku neravērchabaḍunu gaakanēnu kōrudaanini dhevuḍu neravērchunu gaaka
9. దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక.
9. dhevuḍu thana yishṭaanusaaramugaa nannu nalupunu gaakacheyi jaaḍin̄chi aayana nannu nirmoolamu cheyunugaaka.
10. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదునుమరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును
10. appuḍu nēnu parishuddha dhevuni maaṭalanu oppukonakuṇḍa lēdani nēnu aadharaṇa pondudunumariyu nēnentha vēdhanapaḍuchuṇḍinanu daani baṭṭi harshin̄chudunu
11. నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?
11. naa balamu ēpaaṭidi? Nēnu kanipeṭṭukonuṭa yēla?Naa anthamu ēpaaṭidi? Nēnu thaaḷukonuṭa yēla?
12. నా బలము రాళ్ల బలమువంటిదా?నా శరీరము ఇత్తడిదా?
12. naa balamu raaḷla balamuvaṇṭidaa?Naa shareeramu itthaḍidaa?
13. నాలో త్రాణ యేమియు లేదు గదా.శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.
13. naalō traaṇa yēmiyu lēdu gadaa.shakthi nannu botthigaa viḍichipōyenu gadaa.
14. క్రుంగిపోయినవాడుసర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును.
14. kruṅgipōyinavaaḍusarvashakthuḍagu dhevuniyandu bhayabhakthulu maanukoninanu snēhithuḍu vaaniki dayachoopathagunu.
15. నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.
15. naa snēhithulu eṇḍina vaaguvalenumaayamai pōvu jalapravaahamulavalenu nammakooḍani vaarairi.
16. మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును
16. man̄chugaḍḍaluṇḍuṭavalananu himamu vaaṭilō paḍuṭavalananu avi murikigaa kanabaḍunu
17. వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
17. vēsavi raagaanē avi maayamai pōvunuveṭṭa kalugagaanē avi thama sthalamunu viḍichi aaripōvunu.
18. వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియులేకుండ అవి యింకిపోవును.
18. vaaṭi neeḷlu pravahin̄chudaari trippabaḍunu, ēmiyulēkuṇḍa avi yiṅkipōvunu.
19. సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.
19. samoohamugaa prayaaṇamucheyu thēmaa varthakulu vaaṭini vedakuduru shēba varthakulu vaaṭikoraku kanipeṭṭuduru.
20. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు.
20. vaaru vaaṭini namminanduku avamaanamonduduru vaaṭi cheruvaku vachi kalavarapaḍuduru.
21. అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు.
21. aṭuvale meeru lēnaṭṭugaanē yunnaaru meeru aapadanu chuchi bhayapaḍuchunnaaru.
22. ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా?
22. ēmaina dayacheyuḍani nēnu mimmu naḍigithinaa? mee aasthilōnuṇḍi naakoraku bahumaanamēmaina temmani yaḍigithinaa?
23. పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా?బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా?
23. pagavaanichethilōnuṇḍi nannu viḍipimpuḍani yaḍigithinaa?Baadhin̄chuvaari chethilōnuṇḍi nannu vimōchimpuḍani yaḍigithinaa?
24. నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి.
24. naakupadheshamu cheyuḍi, nēnu mauninai yuṇḍedanu ē vishayamandu nēnu thappipōthinō adhi naaku teliyajēyuḍi.
25. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?
25. yathaarthamaina maaṭalu enthoo balamainavi ayinanu mee gaddimpu dheniki prayōjanamu?
26. మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశ గలవాని మాటలు గాలివంటివే గదా.
26. maaṭalanu gaddin̄chudamani meeranukonduraa? Niraasha galavaani maaṭalu gaalivaṇṭivē gadaa.
27. మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు,మీ స్నేహితులమీద బేరము సాగింతురు.
27. meeru thaṇḍrilēnivaarini konuṭakai chiṭluvēyuduru,mee snēhithulameeda bēramu saaginthuru.
28. దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?
28. dayachesi naavaipu chooḍuḍi, mee mukhamu eduṭanēnu abaddhamaaḍudunaa?
29. అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.
29. anyaayamu lēkuṇḍa naa saṅgathi marala vichaarin̄chuḍi marala vichaarin̄chuḍi, nēnu nirdōshinigaa kanabaḍudunu.
30. నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?
30. naa nōṭa anyaayamuṇḍunaa?Durmaargatha ruchi naa nōru telisikonajaaladaa?